హ్యుందాయ్ క్రెటా: పాతది vs కొత్తది
నవంబర్ 04, 2019 11:51 am dhruv ద్వారా సవరించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ యొక్క క్రెటా ఒక నవీకరణ కోసం ఉంది మరియు చైనాలో ఇటీవల వెల్లడించిన ix25 భారతదేశం కోసం తరువాతి జనరేషన్ క్రెటా యొక్క ప్రివ్యూ
హ్యుందాయ్ నెక్స్ట్-జెన్ క్రెటా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2020 ఆటో ఎక్స్‌పోలో మనకి ప్రదర్శించబడనున్నది. అయినప్పటికీ, హ్యుందాయ్ చైనాలో ix25 ప్రదర్శన ద్వారా ఇది ఎలా ఉంటుందనే దానిపై మాకు ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయి. Ix25 క్రెటా యొక్క చైనీస్ కజిన్. ఇది ప్రస్తుత-తరం క్రెటాకు ఇది ఎలా భిన్నంగా ఉంటుందో చూద్దాం.
బాహ్య భాగాలు
Ix25 యొక్క ఫ్రంట్ ఎండ్ డిజైన్ ప్రస్తుత క్రెటా కంటే షార్ప్ గా ఉంటుంది. ఇది వెన్యూ లాగా కనిపిస్తుంది, సొగసైన LED DRL లతో హెడ్‌ల్యాంప్‌లు మనకి కనిపిస్తాయి. మొత్తం గ్రిల్ డిజైన్ ఇతర హ్యుందాయి ల మాదిరిగానే అదే కాస్కేడింగ్ స్టయిల్ తో ఉంటూ దీనికి చుట్టూరా తెల్లని అవుట్‌లైన్ మనకి కనిపిస్తుంది మరియు ఈ గ్రిల్ లో ఉండే హనీ కోంబ్ ఎలిమెంట్స్ అనేవి వెన్యూ లో ఉండే దాని కంటే పెద్దదివిగా కనిపిస్తాయి. ప్రస్తుత క్రెటా తో గనుక పోల్చినట్లయితే క్రెటా కి ముఖ భాగం మీద హారిజాంటల్ స్లాట్స్ అనేవి ఉంటాయి.
హెడ్‌ల్యాంప్ అసెంబ్లీ ఇప్పుడు చాలా ప్రస్తుత SUV ల మాదిరిగానే బంపర్ క్రిందకి మార్చబడింది. ప్రస్తుత క్రెటాలో, విస్తృత హెడ్‌ల్యాంప్‌లు గ్రిల్ కి దగ్గరగా కలిగి ఉంటాయి.
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ix25 ప్రస్తుత క్రెటా కంటే తక్కువ లైన్స్ ని కలిగి ఉంది. అయితే, మొత్తం ఆకారం సమానంగా ఉంటుంది. Ix25 లోని అల్లాయ్ వీల్స్ వెన్యూ వంటి కొత్త హ్యుందాయ్ మోడళ్ల మాదిరిగానే ఉంటాయి.
వెనుక వైపు, డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది. Ix25 టెయిల్ గేట్ వైపు ఒక జిగ్-జాగ్ కట్ ని కలిగి ఉంది మరియు ఇక్కడ ప్రధాన ఆకర్షణ బూట్ అంతటా నడుస్తున్న LED లైట్ బార్. ఇవన్నీ ప్రస్తుత క్రెటాలో లేని అంశాలు మరియు దీని వలన ix25 మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: 2020 హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రివ్యూ చైనా-స్పెక్ ix25 కి దగ్గరగా ఉంది
ఇంటిరీయర్
బయట భాగాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి అని అనుకొనే ముందు మీరు లోపల భాగాలలో క్యాబిన్ కూడా చూడండి. డాష్‌బోర్డ్ చక్కటి డిజైన్‌ను కలిగి ఉంది, పెద్ద వర్టికల్ టచ్‌స్క్రీన్ సెంటర్ కన్సోల్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇండియా-స్పెక్ క్రెటాకు చేరుతుందా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. లోపలి భాగంలో నలుపు మరియు తెలుపు రంగులతో అలంకరించబడి ఉంటుంది. ఇది ప్రస్తుత క్రెటా నుండి భిన్నంగా ఉంటుంది, ప్రస్తుత క్రెటా లో స్క్రీన్ క్రింద సెంటర్ కన్సోల్ కంట్రోల్స్ ఉంటాయి. Ix25 యొక్క లోవర్ వేరియంట్స్ డాష్‌బోర్డ్‌లో తేలియాడే టచ్‌స్క్రీన్ ని కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.
మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ లివర్‌కు బదులుగా, ix25 లో ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది.
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ix25 లో కూడా పునర్నిర్మించబడింది మరియు ఇది ఇప్పుడు LED ఫైటర్ జెట్-స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంది, ఇది ప్రస్తుత క్రెటా యొక్క రౌండ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కు చాలా భిన్నంగా ఉంది.
ఇంజిన్లు
ప్రస్తుత క్రెటా 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో మరియు 1.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లభిస్తుంది. భారతదేశం విషయానికి వస్తే, న్యూ-జెన్ క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లను మరియు కియా సెల్టోస్ నుండి 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది.