హ్యుండై వారు విజన్ జీ కాన్సెప్ట్ కార్ తో ముందుకు రాబోతున్నారు
ఆగష్టు 14, 2015 11:51 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుండై వారు ఈమధ్య వారి తాజా కాన్సెప్ట్ కారు విజన్ జీ ని ప్రదర్శించారు. కాన్సెప్ట్ కూపే కి ఒక స్పోర్ట్ బ్యాక్ వంటి ఒక ఆకారం కలిగి ఉంది. ఈ కారు కి 420బీహెచ్పీ శక్తి గల 5.0 లీటరు వీ8 హ్యుండై ఇంజిను అమర్చబడుతుంది.
జైపూర్: విజన్ జీ డిజైను ముఖ్యంగా యూఎసే టీం ద్వారా నిర్మిణ్చబడింది మరియూ ప్రపంచ వ్యాప్తంగా డిజైన్ స్టూడియోల నుండి సలహాలను తీసుకున్నారు. మరియూ, హ్యుండై నుండి అధికారులు ఏమన్నారంటే, శక్తి ఈ కారు కి ప్రధానం కాదు. కేవలం శూరత్వమే.
కారు గురించి మాట్లాడుతూ, ఎటువంటి స్థంబాలు లేకుండా ఇది ఒక కళాఖంఢం. కూపే రూఫ్ గల ఈ కారు ఎంతో పొడుగుగా మరియూ ముందు ఒక ముచ్చిక తో ఉంటుంది. బ్యాడ్జింగ్ పై జెనెసిస్ మానికర్ అని ఉంటుంది. ఇది వేరియంట్ పేరుగా మారే అవకాశం ఉంది. ముందు వైపు అద్భుతమైన గ్రిల్లు ఉంటుంది, భారీ వీల్స్ ఉండి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
అంతర్ఘత ఫోటోలు చూస్తే గనుక లెదర్ మరియూ చెక్క తో పాటుగా ఆధునాతన సాంకేతికత కలిగిన డిస్ప్లే స్క్రీన్స్ ని కలిగి ఉంది. నలుగురు కూర్చునేందుకు గల చోటు ఉంది. సెల్ఫ్-ఓపెనింగ్ డోర్లు (వాటంతట అవే ఓపెన్ అయ్యే) కూడా ఉన్నాయి.
హ్యుండై కి సీఈఓ అయిన పీటర్ ష్రేయర్ మాటళ్ళో," విలాసవంతమైన కార్లలో అగ్ర స్థానం ఉండాల్సిన అవసరం లేదు," అన్నారు. హ్యుండై కి యూఎస్ డిజైన్ సెంటర్ హెడ్ అయిన క్రిస్ చాప్మ్యాన్ మాటళ్ళో," ఇది చూసే వాళ్ళ ఆనందం కోసం కాకుండా, దీనిని కొన్న వారి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కారు," అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ని వారే నడిపించారు.