హోండా బిఆర్- వి ప్రమోషన్ వీ డియో విడుదల | లక్షణాల సమగ్ర వివరణ
హోండా బిఆర్-వి కోసం manish ద్వారా డిసెంబర్ 04, 2015 02:25 pm ప్రచురించబడింది
- 27 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హోండా బి ఆర్ - వి, ఇటీవల ఇండోనేషియా మార్కెట్ లో ప్రారంబించబడింది. ఈ ప్రారంభం తరువాత, ఇండోనేషియా యొక్క అనుబంధ సంస్థ అయిన జపనీస్ ఆటో తయారీదారుడు, ఈ కాంపాక్ట్ ఎస్యువి యొక్క అన్ని లక్షణాల సమగ్ర వివరణను, ఒక ప్రచార వీడియో ద్వారా విడుదల చేశాడు. మొబిలియో ఆధారిత ఎస్యువి, సుమారు రూ 10.93 లక్షల (ఐ డి ఆర్ 226.5 మిలియన్) ధర ట్యాగ్ వద్ద ప్రారంబించబడింది. ఈ బి ఆర్ - వి ప్రచార వీడియో, "దైర్యాన్ని మాత్రమే" ట్యాగ్లైన్ చేపడుతుంది. అంతేకాకుండా, ఈ వాహనం డి ఆర్ ఎల్ ఎస్, ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్లు, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, మడత వేయగల మూడవ వరుస, టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, వెనుక ఏసి వెంట్ లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, విధ్యుత్తు తో సర్ధ్యుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు, వెనుక పార్కింగ్ కెమెరా మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది.
హుడ్ క్రింది విషయానికి వస్తే, ఈ హోండా బి ఆర్ వి యొక్క ఇండోనేషియన్ వేరియంట్, 1.5 లీటర్ ఐ విటెక్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 6600 ఆర్ పి ఎం వద్ద 120 పి ఎస్ పవర్ ను అదే విధంగా 4600 ఆర్ పి ఎం వద్ద 145 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, ప్రామాణిక 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షనల్ గా అందించబడుతుంది. ఈ క్రాస్ ఓవర్ ఎస్యువి, ఎఫ్ డబ్ల్యూడి డ్రైవ్ టైప్ తో మాత్రమే వస్తుంది. భద్రతా లక్షణాల విషయానికి వస్తే, ఈ బి ఆర్ వి వాహనం ఎయిర్బాగ్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ఏబిఎస్ తో ఈబిడి వంటి అంశాలను అందించడం జరిగింది. ఈ కారు వచ్చే సంవత్సరం, ఫిబ్రవరి లో జరగనున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో రంగప్రవేశం అవుతుంది అని భావిస్తున్నారు. ఈ బి ఆర్ వి వాహనం, రాజస్థాన్ లో ఉన్న తపుకర ప్లాంట్ వద్ద తయారు చేయబడుతుంది. మరోవైపు ఈ వాహనం, మారుతి ఎస్ క్రాస్, హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ నిస్సాన్ యొక్క డస్టర్ మరియు టెర్రినో వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.
ఇంకా చదవండి: