• English
  • Login / Register

డైరెక్టర్ స్ట్రాటజీ గా శోభిత్ మాథుర్ ని నియమించడం ద్వారా తన యొక్క స్థానాన్ని బలపరుచుకున్న గిర్నార్‌సాఫ్ట్ సంస్థ

డిసెంబర్ 01, 2015 12:52 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మాజీ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అసోసియేట్ డైరెక్టర్ ని లీడర్ షిప్ టీం లోనికి తీసుకువచ్చారు

జైపూర్: 

భారతదేశం యొక్క ప్రముఖ ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్ కార్దేఖో.కాం యొక్క మాతృ సంస్థ గిర్నార్‌సాఫ్ట్, తన డైరెక్టర్ (స్ట్రాటజీ) గా శోభిత్ మాథుర్ నియామకం తో నాయకత్వ జట్టుకు బలం చేకూర్చుకుంది. శోభిత్, మాజీ అసోసియేట్ డైరెక్టర్, PWC ఇప్పుడు గిర్నార్‌సాఫ్ట్ సంస్థలో అంతటా వ్యూహాత్మక కార్యక్రమాలు మరియు కొత్త బిజినెస్ తో తన రోల్ ని కొనసాగించనున్నారు.

శోభిత్ మాతుర్ తన ఉన్నత ప్రొఫైల్ తో గిర్నార్‌సాఫ్ట్ తో అనుసంధానించబడ్డ గొప్ప వ్యక్తి. ఇతని తో పాటూ దీపాలి గులాటీ మరియు అమిత్ అగర్వాల్ OLX నుండి, అలానే రవి గుప్తా మరియు అనిరుధ్ సింగ్ స్నాప్ డీల్ నుండి వీరు కూడా సంస్థలో మాసివ్ టాలెంట్ ఎక్విజిషన్ స్ప్రీ లో భాగంగా చేరారు.   

ఈ నియామకం గురించి గిర్నార్‌సాఫ్ట్ సిఇఒ మరియు సహ వ్యవస్థాపకుడు అమిత్ జైన్, మాట్లాడుతూ " శోభిత్ తను మునుపటి  పని చేసిన సంస్థ వలన ఆయనకి మంచి నైపుణ్యం ఉంది. మా యొక్క ఈ బిజినెస్ ప్రయాణంలో శోభిత్ లాంటి ఉన్నత వ్యక్తిని చేర్చుకోవడం మా దీర్ఘ కాల వృద్ధి వ్యూహానికి అనుగుణంగా ఉంది. శోభిత్ యొక్క నైపుణ్యత మరియు సహకారం వలన మా సంస్థ ఉన్నత శిఖరాలను అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాము." అని వివరించారు.

"గిర్నార్‌సాఫ్ట్ సంస్థ ఉన్నతమైన సాంకేతిక వేదిక మరియు ఆలోచన నాయకత్వంతో శక్తివంతమైన వ్యవస్థాపక భూభాగం. ఈ సంస్థలో చేరడం వలన భారత మార్కెట్ లో మొదటగా చేరి మరియు ఒక సంపూర్ణ  వ్యవస్థాపకతతో ఉన్న వ్యాపార పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేయడానికి నాకు అవకాశం లభించింది. " అని శోభిత్ పేర్కొనారు.      

శోభిత్  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిల్లీ నుండి  బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (సివిల్ ఇంజినీరింగ్) మరియు మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ ని కలిగి ఉన్నాడు. గిర్నార్‌సాఫ్ట్ లో చేరక ముందు ఆయన PWC లో కాపిటల్ ప్రాజెక్ట్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ - అసోసియేటివ్ డైరెక్టర్ గా చేసే వారు.  

అతను  ఎర్నెస్ట్ అండ్ యంగ్ వద్ద ఒక సీనియర్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా తన సేవలు అందించారు మరియు హైదర్ కన్సెల్టింగ్, సింక్లైర్ నైట్ మెర్జ్, SMEC ఆస్ట్రేలియా లిమిటెడ్, ఇండియన్ రైల్వేస్ లో ఒక సివిల్ ఇంజనీర్ గా  వివిధ హోదాల్లో పనిచేశారు.

గతంలో శోభిత్ గ్లోబల్ 'బిగ్ ఫోర్' లో రెండు సంబంధిత సంస్థలు అయిన,  ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ మరియు ఎర్నెస్ట్ & యంగ్ అను సంస్థలలో పని చేసారు. వ్యాపార విద్య లో భాగంగా  ప్రాజెక్ట్ మరియు కార్యక్రమ నిర్వహణ, పరిపాలన నిర్మాణం మరియు ఫ్రేమ్ వర్ఖ్, ఇంటర్ఫేస్ నిర్వహణ, ప్రయోజనాలు నిర్వహణ, ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ , బిజినెస్ ఇంటలిజెన్స్, వ్యాపార విశ్లేషణ అలాగే నాణ్యత హామీ కోసం డేటా విశ్లేషణలుతో  శోభిత్ తన యొక్క వ్యాపార సలహా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience