• English
  • Login / Register

ఎర్టిగా సుజుకి స్పోర్ట్ (ఇండోనేషియా) వర్సెస్ మారుతి ఎర్టిగా: ప్రధాన బేధాలు

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం dinesh ద్వారా మే 21, 2019 02:00 pm ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఎర్టిగా సుజుకి స్పోర్ట్, ప్రామాణిక ఎర్టిగా కంటే స్పోర్టియర్ వెర్షన్ గా కనిపిస్తుంది

  • ఎర్టిగా సుజుకి స్పోర్ట్ ఇండోనేషియాలో ప్రారంభించబడింది.

  • ప్రామాణిక ఎర్టిగా ఇప్పటికే ఇండోనేషియాలో అమ్మకానికి ఉంది.

  • ఎర్టిగా సుజుకి స్పోర్ట్ ఒక బాహ్య కిట్ మరియు ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ తో వస్తుంది.

  • ఇది సుజుకి స్పోర్ట్ డివిజెన్ కిందకి వస్తుంది.

  • ప్రామాణిక ఎర్టిగా లో ఉండే అదే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా అందుబాటులో ఉంది.

  • ఎర్టిగా సుజుకి స్పోర్ట్, 7 సీట్ల ఎంపివి, ఇది 6 సీటర్ కాదు.

ఎర్టిగా ఇండోనేషియాలో సుజుకి స్పోర్ట్ ట్రీట్మెంట్ ను పొందింది. పేరు సూచించినట్లుగా, ఎర్టిగా సుజుకి స్పోర్ట్ 7 సీట్ల ఎంపివి అంతేకాకుండా ఇది స్పోర్టీగా కనిపిస్తుంది, ఇది భారతదేశంలో విక్రయించబడుతోంది. మారుతి సుజుకి దాని ప్రీమియమ్ నెక్స్ ఔట్లెట్స్ కింద ఎర్టిగా యొక్క ప్రీమియమ్ వెర్షన్ను అందిస్తోందని చెప్పవచ్చు. ఇప్పుడు, భారతదేశంలో అందుబాటులో ఉన్న ఎర్టిగాను, ఎర్టిగా సుజుకి స్పోర్ట్ తో సరిపోల్చండి మరియు ప్రధాన వ్యత్యాసాలను కనుగొనండి.

• మారుతి కొత్త ఎంపివిని 2019లో ప్రారంభించనుంది. ఎర్టిగా ఆధారంగా రాబోతుంది

కొలతలు:

 

సుజుకి ఎర్టిగా స్పోర్ట్

మారుతి ఎర్టిగా

పొడవు

4470 మీమీ (+ 75 మీమీ)

4395 మీమీ

వెడల్పు

1735 మీమీ

1735 మీమీ

ఎత్తు

1690 మీమీ

1690 మీమీ

వీల్బేస్

2740 మీమీ

2740 మీమీ

  •  పెరిగిన పొడవును మినహాయిస్తే, ఎర్టిగా సుజుకి స్పోర్ట్- ప్రామాణిక ఎర్టిగాకు సమానంగా ఉంటుంది.
  •  ఎర్టిగా సుజుకి స్పోర్ట్, ముందు మరియు వెనుక బంపర్లు పునఃరూపకల్పన చేయబడ్డాయి.

ఎక్స్టీరియర్స్

1. కొత్త గ్రిల్: ఎర్టిగా స్పోర్ట్ యొక్క ముందు గ్రిల్ మీద మెష్ నమూనా పొందుపరచబడి ఉంటుంది. ఇది ఒక స్పోర్టి వెర్షన్ అయినప్పటికీ, గ్రిల్ పై క్రోమ్ ఇన్సర్ట్లను అందించడం జరిగింది. ఎర్టిగా సుజుకి స్పోర్ట్ తో పోల్చితే భారతదేశంలో ఉన్న ప్రామాణిక ఎర్టిగా సమాంతర స్లాట్లను మరియు భారీ క్రోమ్ ఇన్సర్ట్ లను గ్రిల్లో అందించడం జరిగింది. ముందున్న ఇతర మార్పులలో భారత-స్పెక్స్ ఎర్టిగాలో కనిపించే క్షితిజ సమాంతర స్లాట్లకు బదులుగా సెంటర్ ఎయిర్ డాం పై మెష్ గ్రిల్ పొందు పరచబడి ఉంది.

2. డే టైం రన్నింగ్ లైట్స్: ఎర్టిగా సుజుకి స్పోర్ట్ వాహనంలో ఫాగ్ లాంప్స్ హౌసింగ్ పై భాగంలో ఎల్ఈడి డిఆర్ఎల్ లను కలిగి ఉంటుంది; మరోవైపు స్టాండర్డ్ ఎర్టిగా లో కూడా స్పోర్ట్ వాహనం మాదిరిగానే రూపకల్పన చేయబడుతుంది.

3. బాడీ కిట్: ఎర్టిగా సుజుకి స్పోర్ట్ వాహనంలో ముందు మరియు వెనుక భాగంలో అండర్ బాడీ స్పాయిలర్లను, సైడ్ బాడీ స్కిర్టింగ్ మరియు టైల్ గేట్ స్పాయిలర్ లను పొందుతుంది.

4. ద్వంద్వ టోన్ 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ (ప్రామాణిక ఇండోనేషియా ఎర్టిగాలో ఉన్న వాటికి సమానంగా): మారుతి సుజుకి ఎర్టిగాలో 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి, కానీ ఇవి ద్వంద్వ టోన్ కాదు. ఎర్టిగా సుజుకి స్పోర్ట్ వాహనంలో 7 స్పోక్ అల్లాయ్ చక్రాలు భారతదేశంలో అందించే వాటి కంటే మరింత స్పోర్టి లుక్ తో అందించబడతాయి.

5. రంగులు: భారత స్పెక్ ఎర్టిగా ఐదు రంగులలో లభిస్తుంది - ఎరుపు, బూడిద, నీలం, తెలుపు మరియు సిల్వర్. మరోవైపు, ఇండోనేషియా- స్పెక్స్ ఎర్టిగా సుజుకి స్పోర్ట్ మూడు రంగులలో లభిస్తుంది - తెలుపు, బూడిద రంగు మరియు నలుపు.

ఇంటీరియర్:

ఇండియా స్పెక్ ఎర్టిగా ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్స్ తో బీజ్ బ్లాక్ అంతర్గత థీమ్ పొందుతుంది అయితే, ఎర్టిగా సుజుకి స్పోర్ట్ ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్స్ తో బ్లాక్ ఫినిషింగ్ ను పొందుతుంది. అయినప్పటికీ, ఎర్టిగా సుజుకి స్పోర్ట్ కూడా 7 సీటర్ ఎంపివి మాదిరిగా మన భారతదేశంలో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి నుంచి రాబోయే ప్రీమియం ఎంపివి 6 సీట్లను కలిగి ఉంటుంది. ఈ వెర్షన్ ఎర్టిగా సుజుకి స్పోర్ట్ చే ప్రేరణ పొందగలదని మేము నమ్ముతున్నాము.

ఎర్టిగా స్పోర్ట్ లో, సుజుకి వెనుకభాగంలో ఉన్న స్పోర్టింగ్ కెమెరా రూపంలో అదనపు ఫీచర్ ను ప్రవేశపెట్టింది, అది ప్రామాణిక ఇండోనేషియా స్పెక్స్ ఎర్టిగాలో అందుబాటులో లేదు. అయితే భారత్-స్పెక్ ఎర్టిగాలో ఇప్పటికే రివర్స్ కెమెరా ను అమర్చారు. ఇది 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ కోసం ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ లకు మద్దతు పొందుతుంది, ఇది ఇండోనేషియా మార్కెట్లో ఆఫర్ లేదు.

ఇంజిన్:

మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఎర్టిగా స్పోర్ట్ కేవలం కాస్మెటిక్ నవీకరణ పొందింది. అందువల్ల భారతదేశంలో అందుబాటులో ఉన్న ఎర్టిగాలో ఉన్న ఇంజన్ మాదిరిగానే, ఇండోనేషియాలో ఎర్టిగాకు కూడా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ను అందించడం జరిగింది. ఈ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 105 పిఎస్ శక్తిని మరియు 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ లను విడుదల చేస్తుంది మరియు ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు భారతదేశంలో 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో కూడా జత చేయబడుతుంది. ఇక్కడ అమ్ముడుపోతున్న ఎర్టిగా, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ తో లభిస్తుంది, ఇది గరిష్టంగా 90 పిఎస్ పవర్ ను మరియు 200 ఎన్ఎమ్ గల టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది, ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడింది.

• 2018 మారుతి ఎర్టిగా (ఎల్డిఐ) బేస్ డీజిల్ వేరియంట్ త్వరలో నిలిపివేయబడుతుంది

ధర:

ఎర్టిగా సుజుకి స్పోర్ట్స్ యొక్క ధరలను సుజుకి ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ, ప్రామాణిక ఎంపివి పై కొంచెం ప్రీమియంతో అందరిని ఆకర్షించడం సాధ్యమవుతుంది, దీని ధర సుమారు ఆర్పి 196 మిలియన్ల నుండి ఆర్పి 240 మిలియన్ (రూ 9.52 లక్షల నుంచి 11.66 లక్షల రూపాయలు) వరకు ఉంటుంది. భారతదేశంలో, ఎర్టిగా పెట్రోల్ ధర రూ 7.44 లక్షల నుంచి రూ 9.95 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ధరతో అందుబాటులో ఉంది.

అలాగే చదవండి: మారుతి సుజుకి భారతదేశం లో టయోటా కి సియాజ్ మరియు ఎర్టిగాలను సరఫరా చేయనుంది.

మరింత చదవండి: మారుతి ఎర్టిగా డీజిల్

was this article helpful ?

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience