• English
  • Login / Register

ఎలియో మోటార్స్లో 35.7kmpl మైలేజ్ ఇస్తున్న కారు.

జూన్ 11, 2015 12:27 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ : ఎలియో మోటర్స్ అమెరికన్ ఆటోమొబైల్ ఔత్సాహికుడు పాల్ ఎలియో చే స్థాపించబడినది. అతను ఐదవతరం వాహనం పై పని ప్రారంభించారు. ఇది అద్భుతంగా  35.7kmpl ఇంధన సామర్ధ్యాన్ని అందించగలదని పేర్కొంటున్నారు. ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ అద్భుతమైన కారు దాదాపు $6,800(సుమారు 4.34 లక్షల మినహాయించి కస్టమ్స్ మరియు విధులు) ధర ఉంటుంది. ఈ కారు సాధారణంగా P5 అని పిలబడుతుంది. ఇది ఒక మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో 900CC 3-సిలిండర్ల ఇంజన్ కలిగి ఉంది. 

ఈ సంస్థ 2016 మధ్యలో అమెరికాలో కారు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుందని, మేము ఎప్పటినుంచో ప్రారంభించిన అనేక ముఖ్యమైన వ్యూహాత్మక కార్యక్రమాలు పరాకాష్టకు చేరుకుని P5 ఉత్పత్తి మార్చిలో ముందుకు అడుగులు వేయబోతున్నదని ఎలియో మోటార్స్ వ్యవస్థాపకుడైన పాల్ ఎలియో  తెలిపారు. "మా ఇంజిన్ నమూనా యొక్క పూర్తి నిర్మాణాన్ని గుర్తింపు పొందిన పెట్టుబడిదారులకు మరియు పురోగతి యొక్క అద్భుతమైన ఉదాహరణలు అయినటువంటి మా ఇటీవలి సరఫరాదారునికి సమర్పిస్తున్నామని పేర్కొన్నారు ".  

క్రొత్త  P5 దాని మునుపటి పునరుక్తాలకి వ్యతిరేకంగా, మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం మరింత స్టైల్ గా తీర్చిదిద్దన్నున్నారని, ఇంకా వీటిలో రెండు ముఖ్యమైన ప్రధాన చేర్పులు ఏమిటంటే ఇంజిన్ మరియు ప్రసార అమరికలు. మూడు చక్రాల ఎలియో వాహనం తగినంత శక్తి మరియు సామర్థ్యం కోసం  చాలా జాగ్రత్తగా ఎంపిక చేయడం అవసరం. ఎలియో మోటార్స్ గత 60 సంవత్సరాలలో మునుపెన్నడూ సాదించనటువంటి విధంగా  సొంతంగా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ సృష్టించి  స్టేట్స్ లో  ప్రారంభించబడుతున్న మొదటి వాహనం.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience