ఢిల్లీలో డీజిల్ కార్ల నిషేధం తరువాత వాడిన ఎస్యువి లకు పెరిగిన డిమాండ్ : కార్దేఖో నివేదిక
డిసెంబర్ 24, 2015 05:31 pm cardekho ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
స్కార్పియో, ఎక్స్యువి500, ఎండీవర్ మరియు ఫార్చ్యూనర్ వంటి ప్రధాన ఎస్యువి వాహనాల కోసం కొత్త కారు విచారణ
న్యూఢిల్లీ: 2000 సిసి పైగా సామర్ధ్యం కలిగిన డీజిల్ కార్లపై సుప్రీం కోర్టు విధించిన నిషేధం తరువాత, భారతదేశం యొక్క ప్రముఖ ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్ అయిన కార్ధెఖో ఇటీవల ఢిల్లీ- ఎన్సిఆర్ వినియోగదారులకు ఆటోమొబైల్ కొనుగోలు ప్రవర్తన న తీర్పు ప్రభావంపై ఒక సర్వే నిర్వహించింది. విధించిన ఈ నిషేదం తరువాత, వెంటనే ఈ నివేదికను పాటించాల్సి ఉంది అని వారం ముందు ప్రకటించింది. దీని తరువాత, ఈ వాహనాలను వారం పాటు అంటే (డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 15) వరకు అలాగే (డిసెంబర్ 16 నుండి డిసెంబర్ 20) వరకు పాటించాల్సి ఉంది అని సుప్రీం కోర్టు నిషేద కాలాన్ని ఆదేశించింది. ఈ నిషేదం సర్వే కారణంగా, అగ్ర ఆటోమొబైల్ బ్రాండ్ల పై డిమాండ్ తగ్గే అవకాశం ఉంది అని వెల్లడించారు.
ఈ అద్భుతమైన రీతిలో, వినియోగదారులు అందరూ ఉపయోగించిన కార్ల మార్కెట్లో వారికి ఇష్టపడే డీజిల్ కార్లను శోదిస్తున్నారు. అంతేకాకుండా వినియోగదారులు ఎవ్వరూ కూడా ఈ డీజిల్ నిషేదం కారణంగా కొత్త వాహనాల కోసం బూక్ చేసుకోవడం లేదు. ఈ నిషేధం ఎక్కువ వ్యవధి కొనసాగితే, ఈ విభాగంలో ఉపయోగించిన కార్లకు డిమాండ్ మరింత పెరగడం చూడాల్సి ఉంటుంది.
సర్వే ప్రకారం, ఈ డీజిల్ నిషేదం కారణంగా ఈ విభాగంలో ఉండే కొత్త డీజిల్ కార్లకు 27 శాతం క్షీణత అందించబడింది. ఇది ఇలా ఉండగా, ఈ విభాగంలో ఉండే వాడిన కార్లకు 17 శాతం వృద్ది రేటు రావడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. దాదాపు ఈ విభాగంలో ఉండే అన్ని ప్రదాన ఉత్పత్తులు అయిన ఆడి, మహింద్రా, ఫోర్డ్, బిఎండబ్ల్యూ, హ్యుందాయ్, టాటా మరియు టయోటా వంటి కార్లకు, గణనీయమైన క్షీణత అందించబడింది. ప్రధానంగా ప్రభావితం అయిన నమూనాలు వరుసగా, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ ఏ క్లాస్, ఫోర్డ్ ఎండీవర్ మరియు పోర్స్చే కయేన్ వంటి వాహనాలు డీజిల్ బేన్ కారణంగా బాగా ప్రభావితం అయ్యాయి అని చెప్పవచ్చు. అయితే ఈ వాహనాలు, ఈ విభాగంలో వాడిన కార్లు దృష్ట్యా ఎక్కువ వృద్ది రేటును సాదించాయి.
నిషేదం తరువాత డిమాండ్ |
కొత్త కారు |
వాడిన కారు |
ఆడి క్యూ7 |
-36% |
167% |
బిఎండబ్ల్యూ 7 సిరీస్ |
-32% |
150% |
చెవ్రోలెట్ కాప్టివా |
-33% |
13% |
చెవ్రోలెట్ ట్రైల్ బ్లాజర్ |
-10% |
33% |
ఫోర్డ్ ఎండీవర్ |
-55% |
88% |
జాగ్వార్ ఎక్స్ ఎఫ్ |
-42% |
7% |
రేంజ్ రోవర్ ఈవోక్యూ |
-23% |
50% |
మహింద్రా శాంగ్యాంగ్ రెక్స్టన్ |
-23% |
13% |
మహింద్రా స్కార్పియో |
-10% |
32% |
మహింద్రా ఎక్స్యువి 500 |
-23% |
17% |
మెర్సిడెస్ ఏ క్లాస్ |
-61% |
75% |
మెర్సిడెస్ ఈ క్లాస్ |
-9% |
68% |
మెర్సిడెస్ జి ఎల్ క్లాస్ |
-24% |
67% |
పోర్చే కేయన్ |
-51% |
13% |
టయోటా ఫార్చ్యూనర్ |
-66% |
56% |
* సోర్స్- కార్దేఖో ఎనలిటిక్స్ జట్టు
** ప్రాంతం ఢిల్లీ ఎన్సి ఆర్