US స్టడీ గ్రూప్: ఢిల్లీ ఆడ్-ఈవెన్ ట్రయల్ పీరియడ్ 18% కాలుష్య తగ్గించింది
దేశ రాజధానిలో చేసిన ఆడ్-ఈవెన్ విధాన ప్రయత్నం ఒక వారం పూర్తి చేసుకుంది. గాలి నాణ్యత మెరుగుపడడడం లెక్కించడానికి అధ్యయనాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి, అయితే ట్రాఫిక్ రద్దీ చాలా వరకూ తగ్గుతూ ఉంది. ఇటీవల US ఆధారిత సమూహం నిర్వహించిన స్టడీ ప్రకారం, ఢిల్లీ ట్రయిల్ కాలంలో కాలుష్యం 18% తగ్గుదల గమనించవచ్చు.
చికాగో విశ్వవిద్యాలయంలో ఎనర్జి పాలసీ ఇన్స్టిట్యూట్ (EPIC) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, గడిచిన సంవత్సరం 2015 డిసంబర్ తో పోలిచి చూస్తే ఈ ఏడాది జనవరి 2016 యొక్క మొదటి 15 రోజులలో మొత్తం కాలుష్యం స్థాయి పెరగగా ఈ ఆడ్ - ఈవెన్ పాలసీ వలన 18% కాలుష్యం తగ్గి ప్రయోజనం చేకూర్చింది. ఈ విదేశీ బృందం ప్రకారం, వాతావరణంలో కాలుష్యం మధ్యానం 12 గంటల సమయానికి గణనీయంగా తగ్గుతోంది. అయితే డిసెంబర్ 2015 తో పోల్చి చూస్తే మొత్తం కాలుష్యం పెరిగినా NCRయొక్క ఇతర ప్రాంతాలతో పోలిస్తే తులనాత్మకంగా కాలుష్యం తగ్గింది.
ఈ అధ్యయనం ముఖ్యంగా ఢిల్లీ కి మరియు దాని చుటు పక్కల ప్రాంతాలకు పోల్చుతూ చేయబడుతుంది. ఇది ముఖ్యంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు IndiaSpend అని పిలవబడే ఒక ప్రైవేట్ పోర్టల్ నుండి చేయబడుతుంది. భారతదేశం యొక్క EPIC డైరెక్టర్, అనంత్ సుదర్శన్ ప్రెస్ ట్రస్ట్ తో మాట్లాడుతూ " ఈ అంశాలు సగటున 10-13 శాతం తగ్గింది (అంటే మొత్తం 24 గంటలు) మరియు (ఉ. 8 గంటల నుండి రాత్రి 8 మధ్య) జరిగే ఈ అమలులో సగటున 18 శాతం తగ్గింది."
ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానం యొక్క భవిష్యత్తు కోసం చాలా ఆశావహంగా ఉంది. పరిష్కరించాల్సిన చిన్న చిన్న సమస్యలు కాకుండా ప్రభుత్వం సమీప భవిష్యత్తులో ఈ ప్రణాళిక యొక్క పూర్తి అమలు కోసం ఎదురు చూస్తూ ఆశావాహకంగా ఉంది.
ఇంకా చదవండి