చెన్నై వరదలు: లగ్జరీ కార్లు నామమాత్రపు ధర వేలం వేయబడుతున్న వైనం
జనవరి 08, 2016 11:29 am saad ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- 37 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
దక్షిణ భారత వరదలు నవంబర్-డిసెంబర్ 2015 లో సంభవించాయి. ఈ ఎదుర్కోలేని దెబ్బ ప్రజల జీవితాల్లో మాత్రమే కాకుండా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఆటోమొబైల్ పరిశ్రమ తమిళ రష్ట్రాలలో అతి దారుణమైన పరిస్థితులని చోటు చేసుకుంది మరియు ఇప్పటికీ ఆ దెబ్బ నుండి అవి కోల్కుంటునే ఉన్నాయి. ప్రభావితమయిన చాలా మంది కారు యజమానులు, భీమా సంస్థలు, బ్యాంకర్లు మరియు డీలర్స్ ఇప్పుడు వారి వరద బాధిత కార్లను కొనుక్కోమని అభ్యర్థన పంపుతున్నారు. ఈ వరద ప్రభావిత కార్లలో హ్యాచ్బ్యాకుల నుండి లగ్జరీ సెడాన్ మరియు SUV ల వరకూ ఉన్నాయి.
యు.ఎస్- ఆధారిత వేలంపాట సంస్థ యొక్క సబ్సిడరి అయిన కోపార్ట్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్ తన యొక్క శ్రీపెరంబుదూర్ వద్ద వరద బాధిత కార్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆ కార్ల ని వాటి యొక్క ఆన్-రోడ్ థర కంటే పది రెట్లు తక్కువ థర కి రోజూ వేలం వేస్తున్నామని మరియు ఈ కార్లు అన్ని 2015 మోడల్ అయినప్పటికి ఒక నామమాత్ర థర కి అమ్ముతున్నట్లు మిస్టర్ రాజీవ్ కపూర్, మేనేజింగ్ డైరెక్టర్, కొపార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వెల్లడించారు.
బుదవారం నాటి ఆక్షన్ లో ఆడి ఎ4 సిరీస్ కార్లు సాధారణంగా రూ. 33.5 లక్షల నుండి రూ.41.7 లక్షల(ఎక్స్-షోరూమ్, చెన్నై) ధర కలిగినటువంటివి ఆ రోజు రూ.3.4 లక్షల ధరకి అందించబడతాయి. అదేవిధంగా బిఎండబ్లు 3 సిరీస్ సెడాన్ సాధారణంగా రూ.35.5 నుండి 44.7(ఎక్స్-షోరూమ్, చెన్నై) ధర ఉండగా ఆ రోజు రూ.6 లక్షల ధరకి అందించబడుతుంది. ఇంకా, 2012 పోర్స్చే కయేన్ మోడల్ కేవలం రూ.5 లక్షల బేస్ ధర వద్ద అందుబాటులో ఉంది.
సంస్థలు కారు కి సంబంధించిన డాక్యుమెంట్లు మరియు కారుని మాత్రమే అందిస్తానని, కానీ దానికి సంబందించిన మరమ్మత్తులు మరియు పనితీరుపై ఎటువంటి హామీ అందివ్వనని తెలిపాయి. గత వారం, ఆన్లైన్ వేలం పోర్టల్ రోజువారీ బేసిస్ లో 10 కార్లు వేలం వేసింది. ఆసక్తి గల కొనుగోలుదారులు వెబ్ సైట్ లో తిరిగి వాపసు చేసుకోగల డబ్బుతో భద్రతా రిజిస్టర్ చేసుకోవాలి.
వేరె ఆక్షన్ పోర్టల్స్ అయిన సెలెక్ట్ ఆటో మార్ట్ వద్ద 10,000 వరద భాదిత కార్లు అమ్మకానికి ఉండగా వాటిలో 5,000 కార్లు కేవలం 20 రోజుల్లోనే వేలం వేయబడ్డాయి.
ఇంకా చదవండి