కెమెరాకు చిక్కిన 2015 ఆడి ఏ4 మరియు 2016 క్యూ7
జూలై 20, 2015 05:27 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: భారతదేశంలో విడుదల కావలసిన 2015 ఆడి ఏ4 మరియు 2016 ఆడి క్యూ7 మళ్ళీ కేమెరాకు చిక్కింది. కేమెరాలో చిక్కిన ఫోటోలలో కార్లు ఎటువంటి పరదాలతో లేవు మరియూ నలుపు రంగులో దర్శనమిచ్చాయి. చండీగఢ్ రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ, రెండు ఏ4 లు, ఒక టీఎఫెసై మరియు ఒక టీడీఐ, ఇంకా ఒక క్యూ7 కనిపించాయి. అంతకుముందు ఈ వాహనాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చాటుగా అగుపించినా కానీ ఉత్తర ప్రాంతంలో ఇదే మొదటి సారి.
ఇలా రోడ్లపై ఈ కార్లు కనిపించడం వారి తాత్కాలిక తేదీలు కంటే ఈ వాహనాలు ముందుగానే విడుదల అయ్యే అవకాశాన్ని సూచిస్తుంది. కార్లు జర్మన్ తాత్కాలిక నంబర్ ప్లేట్ ధరించి వుండటంతో ఈ అనుమానం మరింతగా బలపడుతోంది. వాహనాలు పరీక్ష వాహనం కాకుండా ఉత్పత్తి వాహనాలు అయి ఉండవచ్చు.
అయితే సాధారణంగా, ఆడీ వారు కఠినమైన భారతదేశం రోడ్ల వాతావరణంలో నడపటానికి పరీక్ష వాహనాలను వాడటానికే ఇష్టపడుతుంది. క్యూ7 మరియు ఏ4 రెండు ముందు విదేశీ మార్కెట్లలో వెల్లడి అయి ఉండటం వలన బహుశా ఆడి వీటిని దాచి పెట్టదలచలేదేమో.