కార్దేఖో వారు ట్రక్దేఖో.కాం ని విడుదల చేశారు

ఆగష్టు 12, 2015 12:42 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

 జైపూర్:  భారతదేశం యొక్క నంబర్.1 వెబ్సైట్ అయిన కార్దేఖో.సాం వారు ఇప్పుడు ట్రక్దేఖో.కాం ని విడుదల చేయనున్నారు. కార్దేఖో ఎలాగో, ఈ వెబ్సైట్ లో కూడా కమర్షియల్ వెహికల్స్ కి సంబంధించి మొత్తం సమాచారాన్ని, ధర నుండి, వెరైటీల నుండి,  ట్రక్ కి సంబందించి పూర్తి సమగ్ర సమాచారాన్ని అందించడం జరుగుతుంది. విడుదల సమయంలో, ట్రక్స్దేఖో.కాం లో 13 రకాల బ్రాండ్ కి సంబంధించి 800 కు పైగా వాహనాల యొక్క లక్షణాలు, ధరలు, పోలికలు మరియూ సమీక్షలు  అందించడం జరిగింది.  60 ట్రక్ బాడీ మేకర్స్ మరియూ 2000 డీలర్ల సమాచారాన్ని కూడా అందించడం అయ్యింది. కార్దేఖో యొక్క విన్నింగ్ ప్రాడెక్ట్ డిజైన్ అయిన సమగ్ర సోధనా పద్ధతినే ఈ వెబ్సైట్ లో కూడా, సమాచారాని కి, బ్రోషర్స్ కి, సమీక్షలకి, అన్నిటికీ ఒకటే చోటుగా అందించడం జరుగుతోంది.    

లాంచ్ గురించి మాట్లాడుతూ, కార్దేఖో యొక్క సంస్థాపకుడు/సీఈఓ అయిన అమిత్ జైన్ అమి అన్నారంటే, " ఒక ఆలోచన కి కార్య రూపం ఇవ్వాలంటే, మొత్తం ఆ ఇండస్ట్రీ యొక్క పూర్ణ అవగాహన్ ఉండటం ఎంతో అవసరం. ఈ ట్రక్స్దేఖో అటువంటి ఒక ఆలోచనే. కమర్షియల్ వాహనాల మార్కెట్ గత దశాబ్దంగా ఎంతో వృద్ది చెందింది మరియూ 16% పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం.  ఈ మా ప్రయత్నం, ఆ ఎదుగుతున్న మార్కెట్ లో భాగం కావడమే. అందుకు ట్రక్స్ మరియూ కమర్షియల్ వాహనాల కోనుగోలుకై మేము కస్టమర్లకు సహాయంగ నిలవాలని తలచాము. " కమర్షియల్ మార్కెట్ 1.6 మిలియన్ల యూనిట్లను 2016-17 కి పెరుగుతుంది. ఇందులో టాటా మోటర్స్ వారి భాగం(47% మార్కెట్ షేరు), తరువాత మహింద్ర & మహింద్ర (25% మార్కెట్ షేరు) మరియూ అశోక్ లేల్యాండ్ ది (15% మార్కెట్ షేరు) గా ఈ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. 

బిజినెస్ డేవెలప్మెంట్ మరియూ స్ట్రాటెజీ విభాగానికి వైస్ ప్రెసిడేంట్ అయిన రాబిందర్ గౌబా గారు," 2016 ఆర్ధిక సంవత్సరం నుండి మేము ట్రక్స్ యొక్క డిమాండు ఘనణీయంగా పెరుగుతుంది అని అనుకుంటున్నాము. దీని కారణంగా ఈ రంగంలో పోటీ నెలకొని, మరింతగా కస్టమర్లకి ఎలక్ట్రానిక్ మాధ్యమం విధంగా వాహనాల కొనుగోలు కై సహాయం ఎంతగానో అవసరం పడుతుంది. కాబట్టి, ట్రక్స్దేఖొ వంటి వెబ్సైట్లు ఈ తరుణంలో ఎంతో అవసరం. ఈ మధ్య కాలంలో, అనుసంధానమై పనిచేయడం మరియూ షిప్పింగ్ రేట్లు ఎక్కువైంది. ఇది ట్రాన్స్పోర్టర్లపై ఎంతో భారాన్ని తీసివేస్తుంది." ధరలు, ఈ ఎం ఐ క్యాలుకులేటరు, ఈవెంట్ కవరేజీలు, ఫైనాన్స్ మరియూ డీలర్ ఆఫర్లు లాంటి అనేక లక్షణాల కు సంబంధించి సమగ్ర సమాచారం కలిగిన డిజైన్ తో ఇది తయారు చేయబడింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience