కార్బే ను మలేషియా & థాయిలాండ్ లో ప్రారంబించిన కార్దేకొ

జూలై 28, 2015 05:43 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇప్పుడు మలేషియా & థాయిలాండ్ లో అవార్డు-గెలుచుకున్న ఉత్పత్తి 

జైపూర్, భారతదేశంలో ఆటో పోర్టల్ రంగంలో అత్యంత అభివృద్ధిని సాధించంటువంటి గిర్నార్ సాఫ్ట్ వేర్ సంస్థ యొక్క కార్దేకొ పోర్టల్ ఇప్పుడు మలేషియాలో CarBay.my అనే ఒక కొత్త పోర్టల్ ను మరియు థాయిలాండ్ లో Thailand.CarBay.com అను పోర్టల్ ను ప్రారంభించింది. ఈ రెండు వెబ్ సైట్లు కూడా భారతదేశంలోని CarDekho.com యొక్క న్యాయకత్వంలో స్థాపించినటువంటి పోర్టల్స్, ఇది భారత ఉపఖండంలో ఎన్నో గౌరవప్రదమైన పోటీల మధ్య కూడా గత 4 సంవత్సరాల నుండి వరుసగా 3 సార్లు "వెబ్ సైట్ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది. ఇది వారి యొక్క విజయానికి గుర్తుగా మనం గుర్తించవచ్చు. 

థాయిలాండ్ దేశ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా Thailand.CarBay.com వెబ్ సైట్ ను ఇంగ్లీష్ మరియు థాయ్ భాషలలో అందుబాటులో ఉంdi. కార్బే, కారు కొనుగోలుదారులకు కావలసిన ఆటోమొబైల్ ప్లాట్ ఫామ్ యొక్క స్పష్టమైన సమాచారాన్ని అందజేస్తుంది. వినియోగదారులు వెబ్ సైట్ ను సందర్శించి దేశంలో అందిస్తున్న వారికి కావలసిన విభాగంలో కావలసిన కారు మోడళ్లను బ్రౌజ్ చేసుకోవచ్చు. కారు కొనుగోలుదారులు వారి అవసరాల ప్రకారం బ్రాండ్, మోడల్ మరియు ధర ఎంపికల ద్వారా వారి ఎంపికను శోధించవచ్చు.

మలేషియా మరియు థాయ్లాండ్ రెండు కూడా నిశ్చలమైన జిడిపి పెరుగుదలను చూపించాయి. ఇవి 2.5% కు మించి మరియు ఒకొక్క కెపిటా లో చాలా ఎక్కువ పెరుదలను చూపించాయి. అంతేకాకుండా, రానున్న 5-6 సంవత్సరాలలో 10% వరకు పెరుగుదలను ఈ రెండు ఆసియా దేశాల నుండి చూపించే అవకాశాలున్నాయని చెప్పారు. అంతేకాకుండా, ఇది ఖచ్చితంగా కార్ల కొనుగోలుదారులకు & అమ్మకాల ప్రక్రియ ను సులభతరం చేయడానికి మరియు తన ఒప్పందం మీద పూర్తి నియంత్రణను వినియోగదారులకు అందించడానికి కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

మార్కెట్ కోసం కార్బే ను ప్రారంభిస్తున్నప్పుడు, ఆసియా-పసిఫిక్ సి ఇవో అయిన మోహిత్ యాదవ్ కార్బే వద్ద మాట్లాడుతూ, ""మా దృష్టి ఎల్లప్పుడూ పూర్తిగా కారు కొనుగోలుదారులకు & అమ్మకాల ప్రక్రియ ను సులభతరం చేయడానికి మేము దీనిని ఇక్కడ ప్రారంబించాము అని అన్నాఉ. అంతేకాకుండా, మేము కొన్ని వినూత్న ఉత్పత్తులను ప్రారంభించాము. అంతేకాకుండా భారతదేశం లో ఉపకరణాలు, మలేషియా మరియు థాయిలాండ్ వంటి మార్కెట్లలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు మార్కెట్లు ఒకదానిని ఒకటి పోలి ఉంటాయి. అంతేకాకుండా, మేము కూడా డీలర్స్ కోసం సి ఆర్ ఎం సాధనాలను కూడా అభివృద్ధి చేశాము. దీని వలన వినియోగదారులకి మంచి అనుబవన్ని అందించే సామర్ధ్యంతో పాటు మొత్తం డీలర్ ల యొక్క లాభదాయకత కూడా పెరుగుతుంది" అని వ్యాఖ్యానించారు. 

2015 జనవరి లో జరిగిన బి సిరీస్ రౌండ్ వద్ద 300 మిలియన్ డాలర్ల నిధులను హాంగ్ కాంగ్ ఆధారిత హిల్ హౌజ్ కాపిటల్, టైబోర్నె కాపిటల్ మరియు ప్రపంచవ్యాప్త సీక్వోయా కాపిటల్ వంటి ప్రముఖ పెట్టుబడిదారులు గిర్నార్ సాఫ్ట్ కి పెట్టుబడిదారులుగా నిలిచారు.

కార్దేకొ.కామ్ ఇప్పుడు ఒక గొప్ప ఖ్యాతితో నిలిచింది. ఇది ఇప్పుడు ఏ మూల నుండి అయినా సరే కార్ల యొక్క సమాచారాన్ని అందిస్తూ, మనకి కార్ల గురించి కావలసిన ప్రతి విషయాన్ని తెలియపరుస్తుంది మరియు ఇటీవలే ఇది బ్రెజిల్, యుఏఈ, సౌదీ అరేబియా వంటి ప్రపంచ మార్కెట్లలో కూడా తమ పోర్టల్ ను ప్రారంభించింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience