• English
  • Login / Register

కార్దేఖో మరియు కవర్‌ఫాక్స్ గట్టి వ్యూహాత్మక భాగస్వామ్యం

అక్టోబర్ 28, 2015 04:24 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూఢిల్లీ: ఒక ఆన్లైన్ పంపిణీ ప్లాట్‌ఫార్మ్ గా కవర్‌ఫాక్స్ మరియు భారతదేశం యొక్క నం 1 ఆటో పోర్టల్ కార్దేఖో.కాం నేడు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం కింద, కార్దెఖో.కాం కొనసాగుతున్న సమగ్ర సమాచారం మరియు సేవలను అందించే క్రమంలో దాని వినియోగదారులకు కవర్‌ఫాక్స్ నుండి భీమా అందిస్తుంది. 

ఇది కాకుండా, వినియోగదారులు నేరుగా కార్దేఖొ.కాం నుండి భీమా ఎంపికలు యాక్సెస్ చేయగలరు, ఈ భాగస్వామ్యంతో కార్దేఖో.కాం అమ్మకాల వద్ద వినియోగదారుల కోసం కవర్‌ఫాక్స్ నుండి భీమా బుక్ చేసుకొనే సౌలభ్యాన్ని చేకూరుస్తుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా కార్దేఖో.కాం వాడిన కార్ల కోసం భీమా కొనుగోలు చేసే క్రమంలో వ్రాతపనిని తగ్గించి సాధారణ ఉచిత ప్రక్రియ అందిస్తుంది. 

దీని గురించి కార్దేఖొ.కాం సిఇఒ అమిత్ జైన్ మాట్లాడుతూ " కార్దేఖొ కారు యొక్క జాబితా పోర్టల్ కంటే ఎక్కువ; ఎవరైతే మా వెబ్ సైట్ లో సులభంగా వారి కారు ఎంచుకుంటారో అటువంటి మా వినియోగదారుల కొరకు 360-డిగ్రీ అనుభవాన్ని సృష్టించాలనేదే మా ఉద్దేశం. కానీ వారు వారి వాహనాల భీమా కొరకు చాలా సమయం నిరీక్షించవలసి వచ్చేది. ఇప్పుడు మా కవర్‌ఫాక్స్ యొక్క భాగస్వామ్యంతో ఉపయోగించిన కారు డీలర్స్ కోసం మరియు వినియోగదారుల కోసం వారి భీమా కొనుగోలు అవసరాలకు త్వరితంగా సహాయం అందిస్తుంది." అని తెలిపారు. 

ఉపయోగించిన కారు మార్కెట్ భారతదేశం లో కొత్త కారు మార్కెట్ ని అధిగమించింది. ఒక పరిశ్రమ సర్వే ప్రకారం భారతదేశంలో 100 కొత్త కార్లు అమ్ముడైన ప్రతీసారి 110 వాడిన కార్లు అమ్మకాలు జరుగుతున్నాయి. వాడిన కార్లు మార్కెట్ ప్రతీ యేటా 20-25% అభివృద్ధి చెందగా, మరో నాలుగు సంవత్సరాలలో దానికి 4 రెట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే, కొత్త ప్యాసింజర్ వాహనాల మార్కెట్ 2015 లో ఉన్న 3.2 మిలియన్ నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2020లో 10 మిలియన్లకు పెరుగుతుందని అంచనా . 

కవర్ ఫాక్స్ యొక్క స్థాపకుడు మరియు సిఇఒ వరుణ్ దువా, మాట్లాడుతూ " కొత్త కారు లేదా వాడిన కారు కొనుగోలు చేసినా భీమా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కార్దేఖో సహకారంతో ఖచ్చితమైన మరియు విశ్వసనీయ పద్ధతిలో త్వరితంగా భీమా ఎంపిక చేయడానికి వినియోగదారులకు తోత్పడుతుంది." అని తెలిపారు. 

నేడు ప్రకటించిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది కవర్‌ఫాక్స్ మరియు కార్దేఖో.కాం రెండూ కూడా వేగంగా పెరుగుతున్న మార్కెట్ లో వినూత్న ఉత్పత్తులు మరియు సేవలను తీసుకువచ్చి వినియోగదారుల అనుభవాన్ని పెంచేందుకు సహాయపడతాయి. 

ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు, కొనుగోలు చేయడం మరియు అవలీలగా భీమా నిర్వహించడంలో పారదర్శక మరియు సులభంగా చేసి ఇండియన్ ఇన్సూరెన్స్ మార్కెట్ అంతరాన్ని భర్తీ చేయడానికి కవర్‌ఫాక్స్ యొక్క కీలకమైన ప్రణాళికలు. కార్దేఖో.కాం భాగస్వామ్యం ద్వారా ఇది వినియోగదారులకు కొత్త మరియు వాడిన కార్లు రెండిటినీ, వారి తదుపరి కారు కొనుగోలుకు ఒక స్మార్ట్ భీమా ఎంపిక మరియు భీమా కొనుగోలు సమయంలో అంతకు మునుపు లేని అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience