బీఎండబ్ల్యూ X6M మరియూ X5M అక్టోబర్ 15న విడుదల కానున్నాయి
బిఎండబ్ల్యూ ఎక్స్5 2014-2019 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 07, 2015 10:13 am ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మీకు బీఎండబ్ల్యూ X6M మరియూ X5M యొక్క ప్రత్యేక చిత్రాలను జులై లో అందించాము. ఇప్పుడు అవి అక్టోబరు లో విడుదలకి సిద్దంగా ఉన్నాయి. రెండు కార్లు రూ. 1.5 కోట్ల ఖరీదు ఉందవచ్చు. ఇతర జర్మన్ కారు తయారీదారులు కూడా ఆడీ RS7, మెర్సిడేజ్ S63 AMG కూపే, ఆడీ 6 అవాంత్ ఇంకా మరిన్ని కార్లను భారతదేశంలో అందించారు.
రెండు కార్లకి 4.4-లీటర్ ట్విన్ టర్బో 8 ఇంజిను ఉండి ఇవి 575bhp శక్తి ఇంకా 750Nm టార్క్ ని అందిస్తాయి. దీనికి 8-స్పీడ్ ఆటోమాటిక్ తో ప్యాడల్ షిఫ్టర్స్ ని బీఎండబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డరైవ్ సిస్టం కి జత చేసి అందించబడుతుంది.
లోపల వైపు సున్నితమైన మార్పులు ఉంటాయి ఇంకా బయటి వైపున ముందు మరియూ వెనక వేర్వేరు బంపర్లు, పెద్ద అల్లోయ్ వీల్స్, ట్విన్-క్వాడ్ ఎగ్జాస్ట్ అంచులు ఇంకా అంతటా M బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది.
విడుదల అయినప్పుడు, ఈ రెండు కార్లు కూడా మెర్సిడేజ్-బెంజ్ G63 AMG కి మరియూ పోర్షే కయేన్ టర్బో కి పోటీగా నిలవనుంది.