Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

త్వరలోనే ప్రారంభం కానున్న భారత్ కొత్త కార్‌ల విశ్లేషణ కార్యక్రమం

ఆగష్టు 23, 2023 03:43 pm rohit ద్వారా ప్రచురించబడింది

సరికొత్త భారత్ కొత్త కార్‌ల విశ్లేషణ కార్యక్రమాన్ని(BNCAP) భారత ప్రభుత్వం అక్టోబర్ 1, 2023 నుండి ప్రారంభించనుంది

భారతదేశంలో విక్రయిస్తున్న కొత్త మరియు ప్రస్తుత కార్‌ల క్రాష్ టెస్ట్ؚలను నిర్వహించి, భద్రత రేటింగ్ؚలను అందించడానికి భారత ప్రభుత్వం తన సొంత సంస్థను ఏర్పాటు చేయనుంది, కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల (MoRTH) మంత్రి శ్రీ. నితిన్ గడ్కారీచే భారత్ NCAP (కొత్త కార్‌ల విశ్లేషణ కార్యక్రమం) కొత్తగా మరియు అధికారికంగా పరిచయం చేయబడింది.

భారత్ NCAP అవసరం

భారత ప్రభుత్వం, సొంతగా సరికొత్త క్రాష్-టెస్టింగ్ ఏజెన్సీని ప్రారంభించింది, ఇది గ్లోబల్ NCAP, యూరో NCAP, ఆస్ట్రేలియన్ NCAP మరియు లాటిన్ NCAP వంటి అంతర్జాతీయంగా స్థాపించబడిన సౌకర్యాలకు సమానంగా ఉంటుంది.

స్థానికంగా క్రాష్ టెస్ట్ؚలను నిర్వహించడం ద్వారా, దేశీయ కారు తయారీదారులు తమ వాహనాలను పరీక్షించేందుకు ప్రపంచ సంస్థల వద్దకు పంపించవలసిన అవసరం ఉండదు, తద్వారా ఆదా చేయవచ్చు. ఒక కారు మోడల్‌ను పరీక్షించడానికి అంతర్జాతీయ సంస్థల వద్ద అయ్యే ఖర్చు రూ.2.5 కోట్లుగా ఉందని, కారు తయారీదారులు భారత్ NCAPను ఎంచుకుంటే అయ్యే ఖర్చు రూ.60 లక్షలకు తగ్గుతుంది అని భారత్ NCAP కార్యక్రమంలో గడ్కారీ వెల్లడించారు. అంతేకాకుండా, ఇక్కడ క్రాష్ టెస్టింగ్ రేటింగ్ؚలను ప్రత్యేకించి భారతదేశంలో అందుబాటులో ఉన్న మోడల్‌లపై నిర్వహిస్తారు కాబట్టి, భారత్ NCAP అందించే రేటింగ్‌లు, భారతీయులు తమ కారు కొనుగోలు చేసే సమయంలో మరింత అవగాహనాపూర్వక నిర్ణయాన్ని తీసుకునే వీలు కల్పిస్తుంది.

ప్రతి సంవత్సరం భారతదేశంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలు, ప్రధానంగా ఈ మెరుగైన భద్రత అవసరాన్ని తెలియచేస్తుంది. అభివృద్ధి చెందిన దేశం కావాలనే భారతదేశ దీర్ఘకాలిక మార్గదర్శక ప్రణాళిక కోసం అత్యధిక సగటు మోటారింగ్ వేగాలను కలిగి ఉండటం అవసరం మరియు ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా వాహనాలు సురక్షితంగా ఉండాలి. అంతేకాకుండా, ఇటువంటి కఠినమైన భద్రత పరీక్షలు భారతదేశంలో తయారు అయ్యే అధిక-పనితీరు మోడల్‌లను ప్రపంచం మార్కెట్‌లకు ఎగుమతి చేయగలిగే సామర్ధ్యాన్ని కూడా విస్తృతం చేస్తుంది.

ఇది కూడా చూడండి: ముసుగుతో ప్రొడక్షన్‌కు సిద్దంగా ఉన్న Mahindra BE.05-సునిశిత పరిశీలన

ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు?

ఫ్రంటల్ ఆఫ్‌సెట్, సైడ్ ఇంపాక్ట్ మరియు సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షల వంటి అనేక క్రాష్ టెస్ట్ؚలను గ్లోబల్ NCAP వంటి పైన పేర్కొన్న సంస్థలు నిర్వహించడం మీరు చూసి ఉంటారు. భారత్ NCAP కూడా ఇవే పరీక్షలను నిర్వహిస్తుంది.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ పరీక్ష 64kmph వద్ద నిర్వహించబడుతుంది, సైడ్ ఇంపాక్ట్ మరియు సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టులు వరుసగా 50kmph మరియు 29kmph వద్ద నిర్వహించబడతాయి. వాహన నిర్మాణ సమగ్రత మరియు అందించే భద్రత పరంగా సాంకేతికతలు కూడా ఈ టెస్ట్ స్కోర్ؚను ప్రభావితం చేస్తాయి.

పరీక్షల వివరాలు మరియు ఆశించిన పనితీరు ప్రమాణాలు AIS-197లో సూచించబడ్డాయి, ఇవి భారత్ NCAP నుండి కారు అందుకునే తుది స్కోర్ؚను కూడా నిర్ణయిస్తాయి.

రేటింగ్ సిస్టమ్

పరీక్షించిన అన్నీ కార్‌లు, క్రింది పారామితులపై ఆధారపడి, ఆడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) రేటింగ్ؚలను పొందుతాయి.

AOP

COP

స్టార్ రేటింగ్

స్కోర్

స్టార్ రేటింగ్

స్కోర్

5 స్టార్ؚలు

27

5 స్టార్ؚలు

41

4 స్టార్ؚలు

22

4 స్టార్ؚలు

35

3 స్టార్ؚలు

16

3 స్టార్ؚలు

27

2 స్టార్ؚలు

10

2 స్టార్ؚలు

18

1 స్టార్

4

1 స్టార్

9

మూడు లేదా అంతకంటే ఎక్కువ స్టార్ؚల స్కోర్ؚను పొందిన కార్‌లకు మాత్రమే పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ؚను నిర్వహిస్తారు.

ఏ కార్‌లను పరీక్షిస్తారు?

భారత్ NCAP స్వచ్ఛందంగా కార్‌ల క్రాష్ టెస్టింగ్ؚను నిర్వహిస్తుంది. M1 విభాగం క్రింద వచ్చే ఏదైనా వాహనం (డ్రైవర్ కాకుండా ఎనిమిది మంది కూర్చుండే సామర్ధ్యం కలిగినవి) ఈ టెస్ట్ؚలకు అర్హత పొందుతాయి. అంతేకాకుండా, ఎంచుకున్న వాహనం బరువు 3.5 టన్నులు లేదా 3500కిలోల కంటే తక్కువ ఉండాలి.

ప్రాధమిక స్థాయి భద్రతా సామగ్రిని కలిగి ఉన్న, ప్రజాదరణ పొందిన మోడల్‌లు (గత సంవత్సరంలో 30,000 యూనిట్లను విక్రయించిన ఏదైనా కారుగా నిర్వచిస్తారు) బేస్ వేరియెంట్ؚను ఇది పరీక్షిస్తుంది. ఎంచుకున్న మోడల్ స్థానంలో త్వరలోనే కొత్త వర్షన్ రాబోతున్నట్లయితే, నవీకరించిన మోడల్ పై పరీక్షలను నిర్వహించవలసిందిగా కారు తయారీదారులు భారత్ NCAP అధికారులను అభ్యర్ధించవచ్చు.

కారు మార్కెట్ ఫీడ్ؚబ్యాక్ మరియు విశ్లేషణ ఆధారంగా, రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ (MoRTH), భారత్ NCAP ప్రోటోకాల్స్ؚకు అనుగుణంగా ఉన్న మోడల్‌లను సిఫార్సు చేస్తుంది. అంతేకాకుండా, భారత ప్రభుత్వం – అవసరమైతే – ప్రజల భద్రతా ప్రయోజనాల కోసం ఏదైనా వేరియెంట్ؚను విశ్లేషణ కోసం ఎంచుకోవలసిందిగా సంస్థను అభ్యర్ధించవచ్చు.

ఇది కూడా చదవండి: 2023ను మరింత హరితంగా చేసిన 6 ఎలక్ట్రిక్ కార్‌లు

త్వరలోనే ప్రారంభం కానున్న భారత్ NCAP

భారత క్రాష్-టెస్టింగ్ సంస్థ అక్టోబర్ 1, 2023 నుండి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర