• English
  • Login / Register

చాలా పెద్దగా, మంచిగా మరియు మరింత అద్భుతంగా ఉండబోతున్న "ఆటో ఎక్స్-పో -ది మోటార్ షో ,2016"

డిసెంబర్ 10, 2015 05:27 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: 

"ఆటో ఎక్స్-పో  -ది మోటార్ షో ,2016" కార్యక్రమాన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్), ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ఇండియా (ఏసీఎంఏ) మరియు  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ  కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆటో ఎక్స్-పో-2016 ప్రదర్శన  2016 ఫిబ్రవరి 5వ తేది నుంచి ప్రారంభమై 9వ తేదీ వరకు జరగనుంది. ట్యాగ్-లైన్ సూచించినట్లుగా  ఆటో ఎక్స్-పో  మోటార్ షో ఈ సారి చాలా పెద్దగా, మంచిగా మరియు మరింత అద్భుతంగా ఉండబోతోంది . 2016 లో జరగబోయే  ఆటో ఎక్స్-పో కి  ఇంకా రెండు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. కొన్ని ఆకర్షణలతో ఈ ఆటో ఎక్స్-పో  కార్యక్రమాన్ని మరింత గొప్పగా నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

సియామ్ డెప్యుటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ మాట్లాడుతూ," ఆటో ఎక్స్-పో యొక్క ఈ ఎడిషన్ దీని స్థానాన్ని మరింత   పైస్థాయి కి తీసుకెళ్తుంది. స్టాక్ హోల్డర్స్, నిర్వాహకులు, ప్రదర్శనకారులకు మరియు సందర్శకులకు పెద్ద, మంచి మరియు మరింత ఉత్తేజకరమైన అనుభూతిని, మెరుగైన సేవలను అందించడానికి అన్ని వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి చాలా కృషి చేస్తున్నాం. ఈ షోలో నిమగ్నమయిన ప్రజల అంచనాలను అందుకోగలమని చాలా నమ్మకంగా ఉన్నాము. "

2016 లో జరగబోయే "ఆటో ఎక్స్-పో  -ది మోటార్ షో ,2016" కోసం ఇండియన్ ఎక్స్-పో మార్ట్ లిమిటెడ్ (ఇఎంల్) ఒక భారీ మేక్ఓవర్ ని ఇచ్చింది. ప్రదర్శన యొక్క మునుపటి ఎడిషన్ ఇండోర్ ప్రదర్శన స్థలం 62,000 చదరపు అడుగుల  నుండి  రాబోయే ఎడిషన్ 68,000 చదరపు అడుగులకు పెంచబడినది. ప్రదర్శన  వేదిక ఆరు పెద్ద హాల్స్ తో మరియు ఎయిర్ కండిషనింగ్ మరియు తగినంత విద్యుత్ సరఫరా కేబ్లింగ్ తో అదనంగా  37240 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతాన్ని కలిగి అపారమైన నిర్మాణం చెందింది.  గత ప్రదర్శన వేదిక గతంలో కేవలం 8 శాశ్వత మందిరాలతో 27,648  చదరపు అడుగులుగా ఉంది. దీనిని 2014  లో తాత్కాలిక హాంగర్లులో పెట్టి 32,400 చదరపు అడుగులకు పెంచడం జరిగింది.

త్వరలో జరగనున్న 2016 ఢిల్లీ ఆటో  ఎక్స్-పో-ది మోటార్ షోను 6 లక్షల మంది సందర్శించవచ్చని  నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రదర్శన గత ఎడిషన్  కంటే దాదాపు 20% ఎక్కువగా ఐదు పబ్లిక్ రోజులలో జరగనుంది. మునుపటి ప్రదర్శన కార్యక్రమం 55 వాహన ప్రదర్శనకారులు కలిగి ఉండగా,  రాబోయే ఎడిషన్ ఇప్పటికే 65 వాహన ప్రదర్శనకారులను కలిగి ఉంది. "ఆటో ఎక్స్-పో  -ది మోటార్ షో ,2016" ప్రదర్శన వాహన తయారీదారులైన అశోక్ లేల్యాండ్, ఆడీ ఇండియా, బి ఎం డబ్ల్యూ  ఇండియా, డాట్-సన్, ఫియాట్ ఇండియా, ఫోర్డ్ ఇండియా, జనరల్ మోటర్స్, హోండా కార్స్ ఇండియా, హ్యుందాయ్ మోటర్ ఇండియా, ఇసుజు మోటర్స్ ఇండియా, జ్యాగ్వార్ లాండ్ రోవర్, మహీంద్రా & మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, నిస్సాన్ మోటర్ ఇండియా, రెనో ఇండియా, స్కానియా కమర్షియల్ వెహికల్స్ ఇండియా,ఎస్ ఎం ఎల్ ఇసుజు , టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్  మోటర్, వి ఈ కమర్షియల్ వెహికల్స్, వోక్స్వ్యాగన్  ఇండియా ....వంటి వాటిని మరియు ద్విచక్రవాహన విభాగంలో, హీరో మోటోకార్ప్ ఇండియా, యమహా, మహీంద్రా 2 వీలర్స్, పియాజ్జియో వెహికల్స్, సుజుకి మోటర్‌సైకల్ ఇండియా, ట్రైయుంఫ్ మోటర్‌సైకల్స్ ఇండియా, టీవీఎస్ మోటార్ కంపెనీ వంటి పరిశ్రమలు తమ తమ ఉత్పత్తులను మరియు సాంకేతికతలను ప్రదర్శించడం జరుగుతుంది.

పైన తెలిపిన బ్రాండ్‌లు కాకుండా ఈ ఎడిషన్ లో కొన్ని కొత్త బ్రాండ్లు కూడా రాబోతున్నాయి. వాహన తయారీదారులతో  పాటు, అబార్థ్, బి ఎం డబ్ల్యూ మోటొర్రాడ్, జీప్, డి ఎస్ కె  బేనేల్లి, ఇండియన్ మోటార్ సైకిల్ మొదలగు కొత్త బ్రాండ్లు ప్రవేశిస్తున్నాయి. ఆటో ఎక్స్-పో  -ది మోటార్ షో 2016 చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. ఆటోమొబైల్ కంపెనీలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆటో భీమా సంస్థలు, మరియు మీడియా & ఆటో పోర్టల్స్ / పబ్లికేషన్స్ కోసం ఇంజినీరింగ్, ఐటీ , హై ఎండ్ సైకిళ్ళు, టైర్స్ మరియు ట్యూబ్స్, ఆయిల్ కంపెనీలు, ఆటోమోటివ్ డిజైన్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలు అందుబాటులో ఉంటాయి. గతంలో మాదిరి గానే ఈసారి కూడా పాతకాలపు వింటేజ్ కార్లు మరియు బాహ్య కార్యకలాపాలైన సేఫ్టీ రైడింగ్, డ్రైవింగ్ సిమ్యులేటర్ వంటి ఇవెంట్స్ తో అందుబాటులో ఉండబోతోంది . ఈ ప్రదర్శన ఆటో-మోటారు ప్రియులకు ఒక గొప్ప రోజుగా ఉంటుంది. అన్ని సందర్శకుల రుచిని సంతృప్తి పరిచే విధంగా వివిధ ఆహార బ్రాండ్లు తమ తమ ఉత్పత్తులను అందించనున్నాయి.

ఈ ప్రదర్శన వేదికను ఎక్కువ సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసం కమిటీ ఉచిత షటిల్ సేవలను కూడా అందిస్తోంది.  ఢిల్లీ ఎన్సీఅర్ లో వివిధ ప్రాంతాలు మరియు నోయిడాలో ఎంపిక మెట్రో స్టేషన్స్ మరియు బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్, వేదిక నుండి సమీపంలో ఉన్నమెట్రో స్టేషన్ నుండి నిరంతరం ఉచిత షటిల్ బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ఇంతకు ముందు ఎడిషన్ లో లాగానే ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీసీటి ) బస్సులు ఈ ఇవెంట్ ఘన విజయంలో ఒక ప్రధాన పాత్ర పోషించనున్నాయి. సందర్శకుల వివిధ రుచులకు, అలవాట్లకు తగినట్లుగా ప్రఖ్యాతమైన ఆహారం అందించే విక్రేతలకు గొప్ప  వేదికగా నిలవనుంది. తాజ్ మరియు రడిస్సోన్ హొటెల్స్ నుండి మొత్తం నాలుగు రెస్టారెంట్లు అందుబాటులో ఉంటున్నాయి.  అంతర్జాతీయ దిగ్గజాలు కె ఎఫ్ సీ  నుండి మరియు బీటీ డబ్ల్యూ (బిట్టు టిక్కివాలా) వంటి స్థానిక జెయింట్స్ వరకు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు సర్విస్ చేయబోతున్నాయి. ఆహార కోర్ట్ ప్రాంతం అంతా 1000 చదరపు మీటర్లు పెంచబడినది. ఆటో ఎక్స్-పో  -ది మోటార్ షో ,2016 టికెట్లు ఇప్పుడు  బుకింగ్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. టిక్కెట్లు  www.autoexpothemotorshow.in మరియు www.bookmyshow.com వెబ్ సైట్ ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారపు రోజులలోని బిజినెస్ అవర్స్ ( ఉదయం 10నుండి 1వరకు)లలో టిక్కెట్ల ధరలను రూ.650 గా మరియు వారపు రోజులలోని జనరల్ పబ్లిక్ గంటల సమయంలో ( మధ్యాహ్నం 1నుండి సాయంత్రం 6 వరకు) రూ.300గా , వారంతపు  రోజులలో (ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు)రూ.400 గా నిర్ణయించారు.

ఒకవేళ మీరు డిసెంబర్ 31,2015 లోపు 3 (మూడు) నుండి  10 (పది)టిక్కెట్లను బుక్ చేసుకుంటే సందర్శకుల సౌలభ్యం కోసం  టిక్కెట్లను మీకు ఉచితంగా డెలివెరీ చేయబడుతుంది. అలా కానీ యెడల, మీరు 25 జనవరి 2016 లోపు బుకింగ్ చేసుకొని  హోమ్ డెలివెరీ ని ఎంచుకుంటే ప్రతి బుకింగ్ పై రూ.75 హోమ్ డెలివరీ ఛార్జ్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హోమ్ డెలివెరీని వద్దనుకుంటే టిక్కెట్లు గ్రేటర్ నోయిడాలో వేదిక సమీపంలో పార్కింగ్ వద్ద ఉన్న టికెట్ కౌంటర్ల లోని ఎక్స్‌చేంజ్ కౌంటర్ల నుండి పొందాల్సి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience