ఈ సంవత్సరంలో వస్తున్న 5 అనూహ్యమైన కార్లు
జూన్ 24, 2015 11:01 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: 2015 సంవత్సరం అధిక పనితీరు కలిగిన ఆడి ఆర్ ఎస్7 స్పోర్ట్ బాక్ మరియు ఆర్ ఎస్6 అవంత్ వంటి కార్లను భారతదేశం లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఆడి ,బి ఎం డబ్ల్యూ కూడా ఎం3 మరియు ఎం4 వంటి కార్లను నవంబర్ 2014 లో మన ముందుకు తీసుకువచ్చారు. మరియు రాబోయే నెలలో అబర్త్ కూడా పరిచయం కానుంది. ఈ పనితీరు బ్రాండ్లు మాత్రమే కాకుండా, అపరిమితంగా ప్రీమియం కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని మన దేశంలో చేసినవి కూడా రంగప్రవేశం చేయనున్నాయి. ఇక్కడ ఐదు కార్ల జాబితా ఉంది వాటి చూడగానే మీ గుండె పరుగులు తీస్తుంది.
ఫోర్డ్ ముస్టాంగ్
ప్రపంచంలో మొత్తం దాని 'వన్ ఫోర్డ్ ప్లాన్' తరువాత, దేశం లేదా ఖండంతో సంబంధం లేకుండా ఫోర్డ్ ఒకే ప్రపంచ విధానంపై దృష్టి సారించింది. కంపెనీ భారత దేశ తీరాలకు దాని దిగ్గజం పోనీ కారు 'ముస్టాంగ్' ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఫోర్డ్ ను చూసినట్లైతే, ఈ కారు సుదీర్ఘ మార్గం ద్వారా వచ్చింది అని చెప్పవచ్చు. మరియు, ప్రాధాన్యంగా ఇప్పుడు ఇది భారత స్నేహపూర్వక ఇంజిన్ ఎంపికల తో అందుబాటులో ఉంది, ఒక 2.3 లీటర్ ఎకో బూస్ట్ ఇంజిన్ తో ఇది దాదాపు గా 13 కి.మీ/లీ మైలేజ్ ని అందిస్తుంది. వేగంగా మారుతున్న ఆటో మొబైల్ పరిశ్రమకు సరిపోయే విధంగా ఆధునీకరణ చేయబడి ముస్టాంగ్ అదే క్లాసిక్ సౌందర్యాన్ని మనకు అందిస్తుంది.
- బాహ్య స్వరూపాలు అదే దీర్ఘ హుడ్ తో జతకూడి ఏటవాలు ఫాస్ట్ బ్యాక్ డిజైన్ తో కలిసి ఉండడం వలన ఇది ఒక డైనమిక్ అప్పీల్ ను ఇస్తుంది.
- దీని ముందరి భాగం ఏటవాలుగా ఉండి ఒక ప్రత్యేకమైన హెడ్ ల్యాంప్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది.
- దీని పక్క భాగానికి వస్తే ఒక బోల్డ్ షోల్డర్ లైన్ రెండు వీల్ ఆర్చుల మధ్య ఉంటుంది.
- దీని వెనుక భాగంలో బ్లాక్ సర్ఫేస్ పైన ఐకానిక్ ట్రిపిల్ టైల్ లైట్ క్లస్టర్, ఒక స్పోర్టీ లోవర్ డిఫ్యూజర్ వింగ్ రెండు ఎగ్జాస్ట్ పోర్ట్ లతో అమర్చబడి ఉంటుంది.
లోపలివైపు, ఫోర్డ్ ఈ ఫాస్ట్ బ్యాక్ అంతర్భాగాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
- ఇది ఒక సౌష్టవమైన డాష్బోర్డ్ ను కలిగి ఉండి ఏసి లౌవెర్స్, టోగుల్ స్విచ్-వంటి బటన్లను దాని పైన పొందుపరచబడి ఉంటుంది.
- ఫోర్డ్ ఎస్ వై ఎన్ సి3 అనే ఆధునిక సమాచార వ్యవస్థతో రాబోతున్నది.
- ఇది నలుగురు వ్యక్తులు కూర్చునేలా విశాలంగా ఉంటుంది.
దీని హుడ్ కింద 2.3 ఎకో బూస్ట్ ఇంజిన్ కలిగియుండి 310 bhpఉత్పత్తి ని, మరియు సుమారు 433 నానో మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, అలాగే వి6 మరియు వి8 లలో కూడా ఈ రీతిలోనే అందించే అవకాశాలున్నాయి.
విడుదల అంచనా : నవంబర్ 2015
మెర్సిడెస్ బెంజ్ ఎ ఎం జి-జిటి
ఇది పోర్స్చే 911 సమాధానం చెప్పగల గొప్ప కారు. రెట్రో చూడడానికి ఒక తరం కారును జ్ఞాపకం చేస్తోంది. ఇది అందరికి నచ్చే విధంగా హంగులతో దాని సౌందర్యాన్ని అలపిస్తుంది. ఉదాహరణకు
- ఆయిల్ సంప్ కింద ఇంజిన్ అమర్చడం ద్వారా గురుత్వాకర్షణ శక్తిని పెంపొందించి కారు బాలెన్సింగ్ గా ఉండేలా చేస్తుంది.
- రెండు కామ్ షాఫ్ట్ ల మధ్య ట్విన్ టర్బోస్ ఉండడం వలన ఇంజిన్ మరింత అనువుగా పని చేయడానికి వీలు ఉంటుంది.
- గేర్ బాక్స్ వెనుక ఆక్సిల్ మీద నెలకొని ఉన్నది కాబట్టి దగ్గర దగ్గర 50:50 బరువు పంపిణీ సాధించడానికి అనువుగా ఉంటుంది.
- దీనిని దీనికి మరింత దృఢత్వం చేకూర్చేందుకు 4.0 లీటరు ఇంజిన్ ను వి8 లో ప్రవేశపెట్టనుంది. ఇది గరిష్టంగా 520 bhpఉత్పత్తిని మరియు 620 నానో మీటర్ టార్క్ ను విడుదల చేస్తుంది.
ఈ బ్రాండు లో, పైకప్పు పైన పెట్టబడిన కొన్ని నియంత్రణల తో, ఒక అంతరిక్షాన్ని మీకు గుర్తు చేస్తుంది. ఒక భవిష్యత్తుగల టచ్ ప్యాడ్ తో ఉన్న కేంద్ర సొరంగం, సంతకాల ఎసి లౌవెర్స్, రేసింగ్ సీట్లు మరియు ఒక ఆధునికత కలిగిన డ్రైవర్ సమాచార క్లస్టర్ ను కలిగి ఉన్నాయి.
విడుదల అంచనా : నవంబర్ 2015
జాగ్వార్ ఎక్స్ ఈ
ఈ బ్రిటీష్ ప్రీమియం కారు తయారీ దాని శ్రేణిలో పునరుద్ధరించడానికి ప్రణాళిక జరుగుతోంది. ఈ రాబోయే కొత్త ఎక్స్ ఈ, బీఎండబ్ల్యూ 3-సిరీస్, ఆడి ఎ4 మరియు మెర్సెడిస్ యొక్క సి-క్లాస్ లతో పోటీపడనుంది.
- ఈ జాగ్వార్ అదే రూపకల్పన ప్రేరకాలతో రాబోతుంది. అవి వరుసగా, ముందు గ్రిల్, ఫెలైన్ హెడ్ల్యాంప్స్, పెద్ద చక్రాలతో రాబోతుంది.
- ఈ వాహనం సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, గ్రాఫిక్ డిజైన్ తో మరియు లైన్ లను కలిగి ఉంటుంది.
- దీని వెనుక ఒక కాంపాక్ట్ బూట్ లిడ్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు చుట్టబెట్టిన టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంది.
లోపలివైపు, దీని ప్రతిబింబం ఎక్స్ జె యొక్క డాష్బోర్డ్ సరిహద్దులో లో ప్రసిద్దమైన లక్షణాలతో కనపడుతుంది. నావిగేషన్ వ్యవస్థ మరియు వినోదం కలిగించే విధులు టచ్స్క్రీన్ టీవీ వ్యవస్థ ద్వారా దీనిలో పొందుపరిచారు. దీనిలోనే కింద ఎక్స్ ఈ కొత్తగా అభివృద్ధి చేసిన 2.0 లీటర్ ఐ4 డీజిల్ వ్యవస్థను కలిగి దగ్గరగా 177 bhpశక్తి ని మరియు సుమారుగా 430 నానో మీటర్ పీక్ టార్క్ ను ఉత్పతి చేస్తుంది.
విడుదల అంచనా: 2016 మొదటి నెలలో
ఆడి క్యూ7
దీనిని జర్మన్ కారు దిగ్గజంగా పిలుస్తారు, ఇది ఈ సంవత్సరం క్యూ7 తరువాత తరం కారును మన ముందుకు తీసుకురాబోతున్నది. దీని ద్వారా ఇది గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఉత్పత్తిదారుడు ఈ ఎస్ యు వి లో భారీగా 325 కిలోల బరువును తగ్గించి దీనిని రూపొందించాడు. ప్రస్తుత వాహనాల కంటే 26% ఎక్కువ సామర్థ్యం కలిగిన ఈ ఎస్ యు వి భారీ విజయం సాధిస్తుంది. అంతేకాక, దీనిలో ఆడి తయారు దారుడి యొక్క ఆధునిక భావన కనబడుతోంది.
- దీని ముందుభాగం లో, అడాప్టివ్ హెడ్ల్యాంప్స్ మరియు క్రొత్త డి ఆర్ ఎల్ సెటప్ ని కలిగి ఉంటాయి.
- దీని ఇరు వైపులా ఉన్న ఒకే రకమైన రేఖల వలన ఆడి సొగసైన రూపంతో కనబడుతుంది.
- దీని యొక్క వెనుక భాగం యొక్క రూపం ప్రస్తుతం ఉన్న వాహనం లాగే ఉంది కానీ శైలిలో గణనీయంగా కొంచెం పెద్దదిగా ఉంది మరియు ఇప్పుడు పదునైనదిగా మరియు తక్కువ నిడివి ఉన్నదిగా కనబడుతుంది.
లోపలివైపు, చాలా విశాలంగా ఉండి అన్ని ఆధునిక గాడ్జెట్స్, నావిగేషనల్ సమాచారం మరియు ఆధునిక ఎం ఎం ఐ టీవీ వ్యవస్థ ను కలిగి ఉంది. డ్రైవర్ సమాచారం స్క్రీన్ పూర్తిగా డిజిటైజ్డ్ క్లస్టర్ తో ఉంది .దీని రూపాన్ని వివిధ రీతులు లో మార్చకోవచ్చు.
విడుదల అంచనా: నవంబర్ 2015
జీప్ గ్రాండ్ చెరోకీ
ఈ చెరోకీ భారతదేశం లో రంగప్రవేశానికి సిధ్ధంగా ఉంది, చాలా కాలంగా వింటున్న ఈ చెరోకీ విషయం ఇప్పటివరకు తెలియజేయలేదు. కానీ, అది చివరకు ఈ ఏడాది చివరినాటికి ఇక్కడ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రీమియం అమెరికన్ ఎస్యువి మంచి లుక్ తో రాబోతుంది మరియు ఇది ఆఫ్-రోడ్ సామర్ధ్యాలకు ప్రసిద్ధిచెందింది.
ఎస్యువి ఆకర్షితుల కోసం, ఈ వాహనం యొక్క బాహ్య భాగాలు ఆకట్టుకునేలా మరియు అన్ని హంగులతో రానుంది.
- ఈ వాహనం యొక్క ముందు గ్రిల్, సొగసైన ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో మరియు క్లాసిక్ సెవన్ స్లాట్ తో అలంకరించబడి రాబోతుంది.
- ఈ ఎస్యువి ఒక బాక్సీ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ మరియు దీని యొక్క అప్పీల్ ను మెరుగుపరుస్తుంది.
- సైడ్ ప్రొఫైల్ లో ఉండే వీల్ యొక్క ఆర్చులు దీర్ఘచతురస్రాకార ఆకృతి కలిగి ఉంటుంది, షోల్డర్ లైన్స్ మరియు ఒక డైనమిక్ సైడ్ విండ్స్క్రీన్ చుట్టుకొలత ఉంటాయి.
వీటి కొలతలు పరంగా చెపాలంటే, ఈ వాహనం యొక్క వెడల్పు 1943 మీ.మీ, పొడవు 4821 మీ.మీ, ఎత్తు 1730 మీ.మీ. చివరికి, అనేక నిల్వ ఖాళీలతో పాటు ఒక రూమీ క్యాబిన్ ను కలిగి ఉంటుంది. ఇంకా, అది లోపల మరియు ఎంచుకోవడానికి బహుశా 4x2 మరియు 4x4 ఎంపికలతో ఒక మంచి సమాచార వ్యవస్థ తో రాబోతుంది.
విడుదల అంచనా: నవంబర్ 2015