2020 టాటా నెక్సాన్ BS6 ఫేస్‌లిఫ్ట్ జనవరి 22 న లాంచ్ కానున్నది

సవరించబడిన పైన Jan 24, 2020 12:09 PM ద్వారా Rohit for టాటా నెక్సన్

  • 28 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా BS 6 రూపంలో ఉన్నప్పటికీ అదే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను అందిస్తుంది

2020 Tata Nexon BS6 Facelift Launch On January 22

  •  నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కొద్దిగా సవరించిన ఫ్రంట్ మరియు రియర్ ఫేసియా ను పొందుతుంది.
  •  మునుపటిలాగే అదే 6-స్పీడ్ MT తో పాటు 6-స్పీడ్ AMT ఎంపికలతో వచ్చే అవకాశం ఉంది.
  •  ఊహించిన విధంగానే ఫీచర్ నవీకరణలలో సన్‌రూఫ్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్ ఉన్నాయి.
  •  ఇది హ్యుందాయ్ వెన్యూ మరియు రాబోయే రెనాల్ట్ HBC వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.

టాటా మోటార్స్ నెక్సాన్ EV ని గతేడాది డిసెంబర్ 19 న ఆవిష్కరించింది, మాకు నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ యొక్క  ప్రివ్యూ ఇచ్చింది. ఫేస్‌లిఫ్టెడ్ సబ్ -4m SUV  BS6 పవర్‌ట్రైన్‌లతో జనవరి 22 న పూర్తి అవుతుందని ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. ఇంకా ఏమిటంటే, టాటా తన సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌ తో పాటు అదే రోజు టియాగో మరియు టిగోర్ ఫేస్‌లిఫ్ట్‌లను కూడా విడుదల చేయనుంది.

ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ల BS 6-కంప్లైంట్ వెర్షన్లతో వస్తుంది. రెండు ఇంజన్లు ప్రస్తుతం 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMT ఎంపికతో అందుబాటులో ఉన్నాయి. ఈ యూనిట్ల ప్రస్తుత అవుట్పుట్ గణాంకాలు వరుసగా 110PS / 170Nm మరియు 110PS / 260Nm వద్ద ఉన్నాయి. అయితే, BS 6 అప్‌గ్రేడ్ కారణంగా ఇవి మారవచ్చు.

Tata Nexon EV

నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ యొక్క అధికారిక చిత్రం నుండి, ఇది దాని ఎలక్ట్రిక్ అవతార్‌తో చాలా పోలికలు కలిగి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇది రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, కాంట్రాస్ట్ ఇన్సర్ట్‌లతో ఫాగ్ ల్యాంప్స్ కి కొత్త హౌసింగ్, కొత్త గ్రిల్, రివైజ్డ్ హెడ్‌ల్యాంప్స్, కాంట్రాస్టింగ్ ఇన్సర్ట్‌లతో కొత్త ఎయిర్ డ్యామ్ మరియు అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్‌ ను పొందుతుంది. ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ వెనుక భాగం కనిపించనప్పటికీ, ఇది అప్‌డేట్ చేసిన టెయిల్ లాంప్స్ మరియు ఇతర అప్‌డేట్స్‌లో రివైజ్డ్ రియర్ బంపర్‌ను కలిగి ఉంటుంది.

లక్షణాల విషయానికొస్తే, టాటా సంస్థ  నెక్సాన్ EV లో చూసినట్లు గా కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, సన్‌రూఫ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే వంటి అదనపు ఫీచర్లతో ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ ను టాటా అందిస్తుందని భావిస్తున్నాము.   

Tata Nexon

(ప్రస్తుత టాటా నెక్సాన్ అమ్మకానికి ఉంది)

టాటా ఇప్పటికే నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్‌లను అంగీకరిస్తోంది. ప్రస్తుత మోడల్‌ తో పోలిస్తే ఇది స్వల్ప ప్రీమియంతో వచ్చే అవకాశం ఉంది, దీని ధర రూ .6.73 లక్షల నుంచి రూ .114 లక్షలకు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది. లాంచ్ తర్వాత, ఇది మారుతి సుజుకి విటారా బ్రెజ్జా,  హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రాబోయే రెనాల్ట్ HBC మరియు  కియా QYI లతో దాని పోటీని తిరిగి పుంజుకుంటుంది.

దీనిపై మరింత చదవండి: నెక్సాన్ AMT

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన టాటా నెక్సన్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?