దాపరికం లేకుండా గూడచర్యం అయిన 2016 టయోటా ఫార్చ్యూనర్
టయోటా ఫార్చ్యూనర్ 2016-2021 కోసం akshit ద్వారా జూలై 13, 2015 04:16 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ:
కొత్త టయోటా ఫార్చ్యూనర్ వచ్చే 17 న, అధికారికంగా బహిర్గతం కానుంది. దీనికి ముందే, కొత్త టయోటా ఫార్చ్యూనర్ యొక్క స్పష్టమైన చిత్రాలను థాయిలాండ్ లో లెక్కలేనన్ని సంఖ్యలో ఫోటోలు తీశారు. టయోటా యొక్క ఇంటర్నేషనల్ మల్టీ-పర్పస్ వెహికల్ (ఆధారంగా ఐఎంవి) ఈ కొత్త ఫార్చ్యూనర్ ఇప్పుడు అవుట్గోయింగ్ మోడల్ కంటే అనేక మార్పులతో మరియు తక్కువ బుచ్ తో రాబోతుంది.
ఈ కొత్తగా రాబోయే టయోటా ఫార్చ్యూనర్, పెద్దగా కోం కలిగిన రేడియేటర్ గ్రిల్ మరియు క్రోం స్ట్రిప్ తో రాబోతుంది. అంతేకాకుండా, ముందరి భాగం మరింత అందంగా కనిపించడం కోఅసం ఎల్ ఈ డి డీఅరెలెస్ కలిగిన హెడ్ల్యాంప్స్ మరియు హెచ్ ఐ డి ప్రొజెక్టార్ హెడ్ల్యాంప్స్ తో రాబోతుంది. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొత్త బ్లాక్ సిల్వర్ అల్లాయ్ వీల్స్ మరియు ఓ ఆర్ వి ఎం ల పై టర్న్ ఇండికేటర్స్ ను కలిగి ఉంటుంది. వెనుక భాగం విషయానికి వస్తే, ప్రస్తుత మోడల్ ను పోలి రాబోతుంది. కానీ, వెనుక భాగంలో కూడా చాలా ఎక్కువ మొత్తం లో క్రోం ను ఉపయోగించడం జరిగింది. దీని వలన ఒక మంచి లుక్ ను కగి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో, ఈ కొత్త ఫార్చ్యూనర్ ఒక పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వాటి పేర్లు వరుసగా, 2.4 లీటర్ టర్బోచార్జెడ్, 4 సిలండర్ ఇంజన్, అత్యధికంగా 150 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 343 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. రెండవది 2.8 లీటర్ టర్బోచార్జెడ్,4 సిలండర్ ఇంజన్, అత్యధికంగా 177 bhp పవర్ ను ఉత్పత్తి చేయగా, 420 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. మరోవైపు ఇదే ఇంజన్, వేరే వాహనమ లో 450 Nm గల టార్క్ అవుట్పుట్ ను ఆప్షనల్ గా విడుదల చేస్తుంది. మూడవది, 2.7 లీటర్ ఫోర్ పాట్ వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్, అత్యధికంగా 122 bhp పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 245 Nm గల పీక్ టార్క్ అవుట్పుట్ ను విడుదల చేస్తుంది.
భారతదేశానికి సంబంధించినంతవరకు, ప్రస్తుత టయోటా ఫార్చ్యూనర్, 3.0 లీటర్ మరియు 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగిన రెండు ఇంజిన్లతో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ రెండు ఇంజన్ లను, పైన చెప్పిన రెండు ఇంజన్ లు భర్తీ చేయనున్నాయి. అయితే, పైన చెప్పిన పెట్రోల్ ఇంజన్, భారతదేశంలో కి రాదనే భావిస్తున్నారు.