• English
  • Login / Register

2015 మారుతీ సుజూకీ ఎర్టిగా ఫేస్లిఫ్ట్ విడుదల అక్టోబరు 10న

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం cardekho ద్వారా సెప్టెంబర్ 29, 2015 01:13 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: భారతదేశం యొక్క అతి పెద్ద 4-వీలర్ తయారీదారి అయిన మారుతీ సుజూకీ ఎర్టిగా ఫేస్లిఫ్ట్ వెర్షన్ ని అక్టోబర్ 10న విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

కొత్త భారతీయ మోడలు గైకిండో ఇండొనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో ఈ ఏడాది ఆగస్టు లో ప్రదర్శితం అవ్వనుంది. మూడు ఏళ్ళ క్రితం 2012 లో విడుదల అయిన కొన్ని నెలలలో ఈ ఎర్టిగా ంప్వ్ కంపెనీకి మంచి అమ్మకాలు తెచ్చి పెట్టింది. 

జిగ్ వీల్స్ నివేదిక ప్రకారం ఎర్టిగ కి కొన్ని సౌందర్య పునరుద్దరణలు అధికంగా వచ్చాయి. అనధికారకంగా ఈ ంప్వ్ యొక్క బుకింగ్స్ డీలర్షిప్స్ లలో ప్రారంభం అయ్యాయి అని ఈ నివేదిక తెలుపుతోంది. ఇంతకు మునుపు నివేదికలు ప్రకారం ప్రస్తుత ఎర్టిగా ఇప్పటికే అమ్ముడుపోయాయి. 


ఈ 2015 మారుతీ ఎర్టిగా కి ఒక ధుడుకైన మూడు పలకల ముందు వైపు గ్రిల్లు, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోము మరియూ వెనక వైపు నంబర్ ప్లేటు పై క్రోము కలిగి ఉంటుంది. ఈ కారులో కొత్త మరియూ ఎక్కువ ధుడుకైన బంపర్ మరియూ పునరుద్దరణ చెందిన 10-స్పోక్ 15-అంగుళాల అల్లోయ్ వీల్స్, కొత్త టెయిల్-ల్యాంప్ క్లస్టర్ తో కొత్త రిఫ్లెక్టర్ ఉంటాయి.

లోపల, ఇంజిను స్టార్ట్/స్టాప్ బటన్, కొత్త అప్‌హోల్స్టరీ, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, కీలెస్ ఎంట్రీ మరియూ స్మార్ట్ ప్లే ఇంఫొటెయిన్మెంట్ సిస్టము, రేర్ పార్కింగ్ క్యామెరా, బ్లూటూత్ ఆడియో, పార్కింగ్ సెన్సర్స్, 50:50 స్ప్లిట్ మూడవ వరుస సీటు, రేర్ యాక్ససరీ సాకెట్ లభ్యం అవుతాయి. 


కొత్త ఎర్టిగా పెట్రోల్ లో మరియూ డీజిలులో కూడా అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ కి 1.4-లీటర్ 95PS/130Nm మోటరు ఉంటుంది మరియూ డీజిలు కి 1.3-లీటరు 90PS/200Nm ఇంజిను ఉంటుంది. డీజిలు వేరియంట్ కి ష్వ్స్ వస్తుంది సియాజ్ హైబ్రీడ్ కి వచ్చినట్టుగానే. ఈ SHVS కి డీసెలరేషన్ ఎనర్జీ రీజెనరేషన్ సిస్టము - పనికిరాని శక్తిని నిలువకి ఎలక్ట్రికల్ సిస్టములోకి పంపుతుంది. గవర్నమెంటు ఇప్పుడు హైబ్రీడ్ టెక్నాలజీ ఉన్న కార్లకి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. తద్వారా మారుతీ ఎర్టిగా SHVS పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గి కారు ధర కూడా తగ్గుతుంది.


మారుతీ ఎర్టిగా ఫేస్లిఫ్ట్ రూ. 7 నుండి 9 లక్షల (ఎక్స్-షోరూం) ధరకి విడుదల ఉండవచ్చు. ఈ 2015 మారుతీ ఎర్టిగా 6 రంగులలో - సుపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రనైట్ గ్రే, సెరీన్ బ్లూ, పర్ల్ బ్లూ బ్లేజ్ మరియూ రేడియంట్ బేజ్ లలో లభ్యం అవుతుంది. 

was this article helpful ?

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience