• English
  • Login / Register

మహీంద్రా, హ్యుందాయ్, మారుతి మరియు టొయోటా సేల్స్ పెరుగుదల; హోండా సంస్థ నవంబర్ అమ్మకాలలో తగ్గుదలను చూసింది

డిసెంబర్ 07, 2015 01:41 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

భారతదేశం లో ఆటోమొబైల్ రంగంలో పోటీ ఇప్పుడు గతంలో కంటే మరింత తీవ్రంగా ఉంది. ఈ సంవత్సరం కొత్త ప్రారంభాలు మరియు కాంపాక్ట్ SUV మరియు మినీ SUV ల ఆవిర్భావం పెరుగుతున్న రద్దీకి కారణాలు. పోటీతత్వపు ఖరీదు వలన మరియు చెరిగిపోతున్న వాహన విభాగాల తీరుతెన్నులు మరియు నవీకరణలు వలన ఈ సమాకలిన మార్కెట్ ను అందిపుచ్చుకోవడానికి వాహన తయారీదారులు విభిన్న వ్యూహాలతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది.

మహీంద్రా SUV సూత్రం వారు గత నెలలో 36% వృద్ధి నమోదు చేసుకొనేందుకు బాగా పనిచేసింది. హ్యుందాయ్ మరియు మారుతి కూడా వరుసగా 23% మరియు 9.7% అమ్మకాలు వృద్ధిని నమోదు చేసుకోగలిగారు. టొయోటా ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబర్ 2015 వరకు అమ్మకాలతో సమిష్ట 7% వృద్ధి సాధించింది. మరోవైపు, హోండా వారు ఈ ఏడాది నవంబర్ లో అమ్మకాల ద్వారా 3.6% క్షీణించింది.


 
మహీంద్రా అండ్ మహీంద్రా నవంబర్ నెలలో 36% అభివృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే నెలలో 14,473 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈ ఏడాది 19,662 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. నవంబర్ 2015 ఆటో అమ్మకాలు ప్రదర్శన గురించి, ప్రవీణ్ షా ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్), ఎం అండ్ ఎం లిమిటెడ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు " పండుగ సీజిన్ కారణంగా ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల శాతం పెరిగింది. వేగవంతమైన అమలు కారణంగా భారత ఆటో పరిశ్రమ యొక్క పోటీతత్వం మరింతగా పెరుగుతుందని నమ్ముతున్నాము. మహీంద్రా వద్ద, మేము మా కొత్త ఉత్పత్తి ప్రారంభాలు అయినటువంటి TUV300 అలాగే బొలేరో, స్కార్పియో మరియు XUV500 వంటి ప్రస్తుత ఉత్పత్తుల ఉత్సాహంతో వృద్ధి వేగాన్ని పెంచుకోగలిగాము. మా ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక 28% సంచిత వృద్ధి సాధించాయని చాలా ప్రోత్సహకరంగా ఉన్నాము. నవంబర్ 2015 చివరి నాటికి ధనాత్మక వృద్ధితో చాలా సంతోషంగా ఉన్నాము."
 
మహీంద్రా XUV500 ఆన్ రోడ్ ధర

హ్యుందాయ్ ఇండియా ప్రకారం, ఈ ఆర్ధిక సంవత్సరం సమిష్టి నికర అమ్మకాలు 43,651 కాగా, ఈ నెలతో 54,290 యూనిట్లు సాధించి 23% వృద్ధి రేటుని నమోదు చేసుకుంది. అయితే, భారతీయ డిమాండ్ బాగా పెరిగినప్పటికీ ఎగుమతులు మాత్రం తగ్గిపోయి గత సంవత్సరం 18,779 యూనిట్లతో పోలిస్తే, ఈ సంవత్సరం 14,010 యూనిట్లతో ఎగుమతులు మాత్రం 25.4% తగ్గుదలను చూశాయి. హెచ్ఎంఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ ఇలా అన్నారు " హ్యుందాయ్ క్రెటా , ఐ 20, గ్రాండ్ ఐ 10 మరియు పండుగ సీజిన్ కారణంగా హ్యుందాయి సంస్థ ఈ ఆర్ధిక సంవత్సరం సమిష్టి నికర అమ్మకాలు గత సంవత్సరం తో పోలిస్తే 43,651 యూనిట్లతో ఈ నెలకు గానూ 23% వృద్ధిని సాధించింది."

హ్యుందాయ్ ఎలీట్ ఐ 20 ఆన్ రోడ్ ధర

మారుతి సుజుకి ఇండియా కూడా నవంబర్ మొత్తం అమ్మకాలలో 9.7% వృద్ధిని సాధించింది. గత ఏడాది నవంబర్ లో అమ్మిన 1,10,147 యూనిట్లు అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది వారు నవంబర్ లో 1,20,824 అమ్మకాలు చేశారు.

మారుతి బాలెనో ఆన్ రోడ్ ధర

టొయోటా కూడా ఇదే కాలంలో గత సంవత్సరంలో 121,038 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబర్ 2015 వరకు 129,373 యూనిట్ల అమ్మకాలతో సమిష్ట 7% వృద్ధి సాధించింది.

అమ్మకాల గురించి సేల్స్ అండ్ మార్కెటింగ్, డిరెక్టర్ మరియు సీనియర్ వైస్ - ప్రెసిడెంట్, మిస్టర్ ఎన్ రాజా వ్యాఖ్యానిస్తూ " మేము సంవత్సరం చివరలో వెళ్లినట్లయితే జనవరి నుంచి నవంబర్ 2015 వరకు అమ్మకాలలో 7% వృద్ధిని చూసిన సాక్ష్యాదారులం. ఎతియోస్ సిరీస్ కూడా గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 2015 వరకూ అమ్మకాలలో 9% సంచిత పెరుగుదల అందుకుంది. మేము పండుగ సీజన్లో కొత్త లివా పరిచయం చేసిన కారణంగా వినియోగదారుల నుండి అందుకున్న అపూర్వమైన స్పందనతో మేము మా విశ్వసనీయ వినియోగదారులు మా కృతజ్ఞత మరింత విస్తరింపజేయాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా క్యామ్రీ అమ్మకం ఇప్పటికే ఈ సంవత్సరం అమ్మిన మోడల్ 1000 పైగా యూనిట్లు పెరగటం కొనసాగింది. ఈ ఉత్పత్తుల ప్రతి విజయం ఈ నెలలో మా సంచిత వృద్ధి రేటు పెరుగుదలకు కారణమయ్యింది." అని వ్యాఖ్యానించారు.
 
టయోటా కరోల్ల ఆల్టిస్ ఆన్ రోడ్ ధర

నవంబర్ లో హోండా ఇండియా యొక్క అమ్మకాలు 3.6% తగ్గాయి. సంస్థ నవంబర్ 2014 లో 15,263 యూనిట్లు అమ్మగా ఈ సంవత్సరం గత నెల 14,712 యూనిట్లు విక్రయించింది. మొత్తంగా, హోండా 2014 లో ఇదే కాలంలో పోలిస్తే ఏప్రిల్ నుంచి నవంబర్ కు 1,32,095 యూనిట్ల అమ్మకాలతో 13% సంచిత పెరుగుదల చూస్తుంది.

హోండా సిటీ ఆన్ రోడ్ ధర

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience