మహీంద్రా ఎక్స్ యువి500

` 11.9 - 17.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మహీంద్రా ఇతర కారు మోడల్లు

 
*Rs

మహీంద్రా ఎక్స్ యువి500 వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
భారతదేశంలో అతి పెద్ద యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా , ఇది దేశంలో దాని లగ్జరి ఎస్యూవి యొక్క నవీకృత వర్షన్ ఎక్స్ యు వి 500 ను ప్రారంభించింది. దీనిని మొదట 2011 సంవత్సరం లో ప్రవేశపెట్టింది. ఈ ఎస్యూవి అమ్మకాల పరంగా చాలా బాగా ప్రసిద్ధి చెందింది. ఒక సుదీర్ఘ విరామం తరువాత, అది బాహ్య పరంగా మరియు అంతర్గతంగా కొన్ని కాస్మెటిక్ నవీకరణలను పొందింది. సాంకేతికంగా ఇది దాని అవుట్గోయింగ్ మోడల్ వలె హుడ్ కింద ఒక 2.2-లీటర్ ఎమ్ హాక్ డీజిల్ మోటార్ ను కలిగి ఉంది. ఇది ఫ్రంట్ వీల్స్ కి టార్క్ అవుట్పుట్ ను బదిలీ చేసేందుకు ఒక 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ తో అనుసంధానించబడి ఉంటుంది. అయితే, దాని టాప్ ఎండ్ వెర్షన్ లో, అవుట్పుట్ నాలుగు వీల్స్ కి వ్యాపిస్తుంది. మరోవైపు, ఈ కొత్త ఎస్యూవి తన కార్ల శ్రేణిలో తమ బ్రాండ్ కొత్త వేరియంట్ ను పరిచయం చేసింది. దీనికి డబ్ల్యూ10 అని నామకరణం చేసారు. ఇది ఇప్పుడు డబ్ల్యూ8 టాప్ ఎండ్ వేరియంట్ కంటే ముందు స్థానంలో ఉంది. ఇది ఇప్పుడు ఎఫ్ డబ్ల్యూ డి మరియు ఎ డబ్ల్యూ డి డ్రైవ్ ఫార్మాట్లలో, మనకి ఎంచుకోవడానికి ఒక ఎంపికతో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బ్రాండ్ లో కొత్తగా వచ్చిన దానితో కలిపి 6 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టాప్ ఎండ్ ట్రిమ్ ఒక డివిడి ప్లేయర్ తో పాటు ఒక టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ తో సహా అధిక నాణ్యత గల సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి అనేక అంశాలను దీనిలో అమర్చారు. ఇది ఒక వాయిస్ మెసేజ్ వ్యవస్థ, డోర్ ఓపెనింగ్ నోటిఫికేషన్ మరియు సీటు బెల్ట్ అలర్ట్ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంది. అంతర్గత నవీకరణల విషయానికి వచ్చినట్లయితే, ఈ కొత్త వెర్షన్ ఒక ఖరీదైన అప్పీల్ ను అందించే ఒక మెరుగైన గోధుమరంగు రంగు స్కీమ్ తో వస్తుంది. అయితే, డిజైన్ మాత్రం దాని మునుపటి వెర్షన్ లాగే ఉంది. బాహ్య స్వరూపాల పరంగా చూస్తే, ఈ వాహనం కొత్త రేడియేటర్ గ్రిల్, హెడ్ లైట్లు మరియు బంపర్ పూర్తిగా పునరుద్ధరించిన ముందు భాగంతో కనబడుతుంది. దీని హెడ్ లైట్ క్లస్టర్ ఇప్పుడు ఒక 'ఎస్ ' ఆకారంలో ఉండే ఎల్ఈడి డిఆర్ఎల్స్ తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో పాటు వస్తుంది.

దాని మునుపటి మోడల్ వలె కాకుండా, దాని గ్రిల్ నాగరీకంగా కనిపిస్తోంది. దాని కోసం ఉపయోగించిన నిగనిగలాడే బ్లాక్ మెటీరియల్ మరియు క్రోమ్ అసెంట్స్ ద్వారా దీనికి అంతటి లుక్ వచ్చింది. దీని ఫ్రంట్ బంపర్ కూడా క్రోం చేరికలతో పాటుగా కొత్తగా రూపొందించిన ఫాగ్ ల్యాంప్ కన్సోల్ ను కలిగి ఉంది. అదనంగా, ఈ తాజా వెర్షన్ రెండు కొత్త బాహ్య ఎంపికలతో ఉంది అవి పెర్ల్ వైట్ మరియు సన్సెట్ ఆరెంజ్ఈ రెండూ కూడా కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలను అందజేస్తాయి. సైడ్ మరియు వెనుక లక్షణాల విషయానికొస్తే దాని అల్లాయ్ వీల్స్ మాత్రమే కొత్త డిజైన్ ను కలిగిఉండి సంస్థ యొక్క చిహ్నం తో పొందుపరచబడ్డాయి. ఈ విభాగంలో మొట్టమొదటి సారి, ఈ వాహనం ప్రత్యేకంగా కనబడేలా దాని అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ కి దీని యొక్క చిహ్నం, ప్రొజెక్షన్ ల్యాంప్స్ ను కలిగి ఉంది. పైన పేర్కొన్న లక్షణాలు కాకుండా, అన్ని ఇతర లక్షణాలు దాని మునుపటి వెర్షన్ లో లాగే ఉంచబడతాయి. తయారీదారుడు దాని మోనోకోక్యూ బాడీ నిర్మాణాన్ని పాత వాహనం లాగే తయారుచేశాడు. ఇది ప్రయాణికుల భద్రతను మరియు స్వచ్ఛమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంలో దోహదపడుతుంది. ఇది కొన్ని ముఖ్యమైన భద్రతా లక్షణాలైన సిక్స్ ఎయిర్బ్యాగ్స్ , ఏబిఎస్ తో పాటు ఈబిడి మరియు రోల్ ఓవర్ మిటిగేషన్ ఫంక్షన్ వంటి లక్షణాలు కలిగి ఉంది. ఇవి ఆక్రమితులను పరిరక్షించడం కోసం చాలా అవసరం. అదనంగా, ఇది, బోష్ వారిచే రూపొందించిన ఒక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ 9 తో అనుసంధానించబడింది, ఇది బ్రేకింగ్ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఈ వాహనం ఇపుడు 3 సంవత్సరాల వారంటీ లేదా 100000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో (ఏది ముందు వస్తే అది) అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు, టయోటా ఫార్చ్యూనర్, టాటా సఫారి స్ట్రోం మరియు ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో రెనాల్ట్ డస్టర్ వంటి వాహనాల మాదిరిగా ఉంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఇంజన్ లో కానీ దాని సాంకేతికత్వంలో కానీ ఎలాంటి మార్పులు చేయలేదు, కానీ దాని మొత్తం ఇంధన సామర్థ్యంను అభివృద్ధి చేశారు. ఇది కూడా అభివృద్ది చెందిన బ్రేక్ ఎనర్జీ పునరుత్పత్తి వ్యవస్థ ఫలితంగా వస్తుంది. ఇది 2.2-లీటరు ఎమ్ హాక్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్ వ్యవస్థతో శక్తిని అందించి గరిష్టంగా 16 kmpl మైలేజ్ ను ఉత్పత్తి చేస్తుంది.

శక్తి సామర్థ్యం:


దీని ఇంజిన్ 4 సిలిండర్లు మరియు 16 వాల్వ్స్ తో 2179cc స్థానభ్రంశం సామర్థ్యంను కలిగి ఉంది. ఈ మిల్లు దాని ఐదవ తరం వేరియబుల్ జ్యామితి టర్బోచార్జర్ తో పొందుపరచబడి ఉంటుంది, ఇది దాని మొత్తం శక్తి ఉత్పత్తి మెరుగుపరుస్తుంది. ఇది గరిష్టంగా 140bhp శక్తిని దానితోపాటుగా 330Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను విడుదల చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఎమ్ హాక్ ఇంజిన్ యొక్క ప్రసరణ విధులు ఒక 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి. ఆ వాహనం సుమారు 190 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, దాని 2 డబ్ల్యూడి వెర్షన్ 100 kmph వేగాన్ని అవరోదించడానికి 11 సెకన్ల కాలం పడుతుంది. అయితే, ఏడబ్ల్యూడి వెర్షన్ కి కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది.

వెలుపలి డిజైన్:


మహీంద్రా ఎక్స్యువి 500 2015 వెర్షన్, ఒక కొత్తదనంతో ముందు భాగంలో ఒక గొప్ప రూపాన్ని కలిగి ఉంది. అయితే, సైడ్ మరియు వెనక లక్షణాలలో మాత్రం ఎమాత్రం మార్పు చేయలేదు. దీనిలో ఉన్న ఒక పెద్ద నవీకరణ ఏమిటనగా అధిక వివరణలతో బ్లాక్ వర్టికల్ స్లాట్లతో పాటు ఒక ఫెర్ఫోరేటెడ్ మెష్ తో కూడిన రేడియేటర్ గ్రిల్ ను అందించడం మీరు గమనించవచ్చు. ఇంకా, వారు సెంటర్ లో కంపెనీ చిహ్నం ను తెలిపే క్రోమ్ యాకెంట్స్ తో పాటుగా దీనిని అలంకరించారు. దీని హెడ్లైట్ క్లస్టర్ ను కూడా ఆధునికీకరించారు, ఇది ఇప్పుడు 'ఎస్ ' ఆకారంలో డే టైమ్ రన్నింగ్ లైట్లతో అమర్చబడి ఉంది. ఫ్రంట్ బంపర్ కూడా కొద్దిగా పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు సవరించిన ఫాగ్ ల్యాంప్ కన్సోల్ తో ఒక కొత్త డిజైన్ ను కలిగి ఉంది. ఇంకా, అవి ముందు భాగాన ఒక క్లాస్సి అప్పీల్ అందించే క్రోమ్ యాకెంట్స్ కారకంతో ఉన్నాయి. దీని పైన ఉన్న బోనెట్ తో దాని దూకుడు వైఖరిని కనబరిచే విధంగా ఒక గొప్ప డిజైన్ ను జతచేసారు. దాని సైడ్ విభాగం అలాగే ఉంది కానీ మధ్య భాగంలో మాత్రం క్రోమ్ పూతతో కనబడుతుంది. అదే సమయంలో,దాని ఫెండర్లు ఇప్పుడు కొత్త అల్లాయ్ వీల్స్ సెట్ తో బిగించబడి ఉంటాయి మరియు అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ క్యాప్స్ లోగో ప్రొజెక్షన్ ల్యాంప్లతో పొందుపరచబడ్డాయి. అయితే, పలు రకాల ప్రీమియం లక్షణాలు హై ఎండ్ వేరియంట్లలో మాత్రమే ఇస్తారు. వెనుక భాగాల విషయానికొస్తే, ఈ వాహనం బ్లాక్ రంగు పిల్లర్స్ తో, మస్కులైన్ బంపర్ మరియు పెద్ద టెయిల్ గేట్ తో దృఢమైన బాడీ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇప్పుడు దీని వెనక డోర్లు ప్రత్యేకమైన క్రోమ్ అప్ప్లిక్ తో బ్రాండ్ యొక్క లోగోతో పాటు అలంకరించబడి ఉంది.

వెలుపలి కొలతలు:


దాని ముందు వచ్చిన వెర్షన్ లాగానే , ఈ 2015 కొత్త వెర్షన్ కూడా అవే బాహ్య కొలతలతో వస్తుంది. ఇది 4585mm పొడవుతో పాటు 1890mm వెడల్పు (ఓఆర్విఎం క్యాప్స్ మినహాయించి) ను కలిగి ఉంటుంది. దీని ఎత్తు 1785mm ఉంది మరియు ఇది 2700mm వీల్బేస్ ను కలిగి చాలా పొడవుగా కనబడుతుంది.

లోపలి డిజైన్:


అంతర్గత డిజైన్ లో ఎలాంటి నవీకరణలు చేయలేదు కానీ కలర్ స్కీమ్ మెరుగుదల మాత్రం ఒక అప్ మార్కెట్ అప్పీల్ ను చూపిస్తుంది. దాని డాష్బోర్డ్ ఇప్పుడు ఒక డ్యూయల్ టోన్ నలుపు మరియు లేత గోధుమరంగుకలర్ స్కీమ్ తో అలంకరించబడిందిఇది విస్తృతమైన క్రోమ్ అలంకరణలతో హైలైట్ గా నిలుస్తుంది. దబ్ల్యూ4 మరియు డబ్ల్యూ6 వేరియంట్లలో సీట్లు ఫాబ్రిక్ తోలుతో తయారు చేసారు. అయితే, డబ్ల్యూ8 మరియు డబ్ల్యూ10 వేరియంట్స్ లో సీట్లు మాత్రం లెదర్ తోలుతో తయారు చేయబడ్డ వాటిని అమర్చారు. బేస్ ట్రిమ్ కాకుండా మిగతా వేరియంట్స్ లోపలి భాగాలను ఐసి బ్లూ లాంజ్ లైటింగ్ తో అందజేసారు ఇది చాలా ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంది. అన్ని ట్రిమ్స్ కూడా క్రోమ్ స్కఫ్ ప్లేట్స్ తో అనుసంధానించబడి ఉన్నాయి. అయితే, టాప్ ఎండ్ వెర్షన్ మాత్రం ప్రకాశవంతమైన ఫంక్షన్ తో అందించబడుతుంది. హై ఎండ్ డబ్ల్యూ10 వేరియంట్ కూడా యాంటీ పించ్ తో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో జత చేయబడి ఉంటుంది ఇది మరింతగా ఖరీదైన లుక్ ని ఇస్తుంది. అదే సమయంలో, ఈ ట్రిమ్ లో మరింత సౌలభ్యం కోసం డాష్బోర్డ్ మీద ఒక ఇంజిన్ స్టార్ట్ బటన్ ను అందిస్తున్నారు. దీని ముందు వర్షన్ కంటే దీనిలో క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉంది. ఇది కనీసం ఏడుగురు ప్రయాణికులకు అనుగుణంగా ఉంటుంది. దాని బేస్ వెర్షన్ ను ఇప్పుడు ఒక 6వే పవర్ సర్దుబాటు గల డ్రైవర్ సీట్ తో అమర్చారు. ఇది ఖచ్చితంగా ఈ విభాగంలో వాటితో పోటీ పడనుంది.

లోపలి సౌకర్యాలు:


ఈ సంస్థ ఆటోమొబైల్ తయారీదారుడు అన్ని వాహనాలకు ఆసక్తికరమైన లక్షణాలను అనుసంధానం చేసి తయారు చేసాడు. ఇది అన్ని సౌకర్యవంతమైనవిగా కూడా ఉంటాయి. ఈ మోడల్ సిరీస్ కూడా అనేక సౌకర్యవంతమైన లక్షణాలతో నిండిపోయింది. ఇది దాని ప్రయాణికులకు అధిక స్థాయిలో సౌలభ్యాన్ని అందిస్తుంది. కొత్తగా జోడించిన వేరియంట్ వాయిస్ మెసేజింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది, వాయిస్ ప్రాంప్టును ఉపయోగించి ఒకవేళ హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ లో ఉంటే లేదా డోర్ తెరిచి ఉంటే డ్రైవర్ ను హెచ్చరిస్తుంది. ఈ ట్రిమ్ మెయిన్ హైలెట్ యాంటీ పించ్ ఫంక్షన్, ఇది విద్యుత్ సన్ రూఫ్ తో వస్తుంది. ఇంతేకాకుండా, ఇది దాని అన్ని లోపలి మూడు వరుసలలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు కలిగి, ప్రయాణికులకు వారి మొబైల్ చార్జింగ్ సులభంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాని అన్ని విండోస్ పవర్ ద్వారా నిర్వహించబడతాయి, అయితే డ్రైవర్ సైడ్ ఎక్స్ ప్రెస్ డౌన్ ఫంక్షన్ టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఇది ఒక రేర్ వ్యూ కెమెరా తో వస్తుంది, ఇది డ్రైవర్ సురక్షితంగా కారును పార్క్ చేయడంలో సహాయపడుతుంది. ఇది మ్యానువల్ గా 8 విధాలుగా డ్రైవర్ సీటును సర్దుబాటు చేసుకోవచ్చు. మొదటి మరియు రెండవ వరుసలలో రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. డబ్ల్యూ4 ట్రిమ్ తప్ప, మిగతా అన్ని వేరియంట్లు కూడా పూర్తిగా ఆటోమేటిక్ ఉష్ణోగ్రత నియంత్రణ యూనిట్ తో జతచేయబడి ఉంటాయి. ఒక గ్లవ్ బాక్స్ కంపార్ట్మెంట్ అనేక వస్తువులను నిల్వచేసుకోవడానికి ఉపయోగపడుతుంది మరియు ఇది అదనంగా ల్యాప్ టాప్ హోల్డర్ ను కూడా కలిగి ఉంది. వీటితోపాటు, ఇది రిమోట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ మరియు వెనుక విండ్స్క్రీన్ డిమిస్టర్, వైపర్ మరియు వాషర్ ఫంక్షన్ లను కలిగి ఉంది. డ్యాష్బోర్డ్ మీద ఉన్న వెంట్స్ వలన మొత్తం కాబిన్ లో చల్లని గాలి వ్యాపిస్తుంది. అయితే, దీనిలో ఉన్న క్రూజ్ కంట్రోల్ నియంత్రణ వ్యవస్థ ఒక స్థిరమైన వేగంతో వాహన వేగాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది డ్రైవర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఇంకా, ఇల్యుమినేటేడ్ కీ రింగ్స్ , అంబ్రెల్లా హోల్డర్, హోమ్ హెడ్ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్, నిష్క్రియాత్మక కీలెస్ ఎంట్రీ , స్మార్ట్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, లేతరంగుగల సోలార్ రిఫ్లెక్టెడ్ గ్లాస్, కన్వర్జేషన్ మిర్రర్, డిజిటల్ ట్రిప్ మీటర్ వంటి కొన్ని ఇతర లక్షణాలను సౌకర్యస్థాయిని పెంపొందించేందుకు దీనిలో అమర్చారు.

లోపలి కొలతలు:


దీనిలో అంతర్గత భాగంలోని భారీ ఖాళీ స్థలం ఈ వాహనం యొక్క ప్రధాన ప్రయోజనాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది ఏడుగురు ప్రయాణికులకు సౌకర్యవంతమైన గొప్ప సౌలభ్యాన్ని అందిస్తుంది. ముందు మరియు వెనుక లెగ్రూం చాలా యోగ్యకరంగా ఉంది దీని ఎత్తు కారణంగా హెడ్ స్పేస్ కూడా తగినంతగా సరిపోతుంది. దీనిలో ఒక పెద్ద బూట్ కంపార్ట్మెంట్ ను రెండవ మరియు మూడవ వరుసలోని సీట్లను మడవడం ద్వారా ఈ స్పేస్ ను పెంచవచ్చు. మరోవైపు, ఇది 70 లీటర్ల డీజిల్ ను నిలుపుకునే సామర్థ్యం కలిగిన ఒక పెద్ద ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సరికొత్త వెర్షన్ దాని సాంకేతిక వివరణల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. దాని అవుట్గోయింగ్ మోడల్ ను పోలి ఉండి అది రెండు వీల్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ ఎంపికలతో అందించబడుతుంది. ఈ శక్తివంతమైన ఎస్యూవిలో అదే 2.2-లీటర్, ఎమ్ హాక్ డీజిల్ ఇంజన్ ను పొందుపరిచారు. ఇది ఐదవ తరం వేరియబుల్ టర్బోచార్జర్ ను కలిగి మరియు మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని ఆధారంగా పని చేస్తుంది. దీని మొత్తం స్థానభ్రంశ సామర్థ్యం 2179cc ఉంటుంది. ఇది ఒక డబుల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ మీద ఆధారపడి నాలుగు సిలిండర్ల్లు మరియు 16 వాల్వ్స్ తో అనుసంధానించబడింది. ఈ మోటార్ 140bhp పీక్ శక్తి ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది మరియు 330Nm టార్క్ ను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, ఇది ఒక 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో సిస్టమ్ తో వస్తుంది. ఇది సులభంగా గేర్ మార్పులు చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ మోటార్ యొక్క ప్రసరణ ఇంజిన్ పవర్ దాని ముందు వైపు లేదా నాలుగు చక్రాలకు వేరియంట్ల డ్రైవ్ ని బట్టి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ ఫేస్లిఫ్ట్ లో కంపెనీ కొన్ని కాస్మెటిక్ మార్పులు మాత్రమే చేయలేదు. దీని మోడల్ లైన్-అప్ లో ఒక కొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది, దానినే డబ్ల్యూ10 గా పేర్కొనడం జరిగింది. ఈ రెండు కొత్త డబ్ల్యూ8 ట్రిమ్లు ఒక ఆధునిక ఆడియో యూనిట్ తో అందజేయబడ్డాయి. ఇది ఒక 7-అంగుళాల డిస్ప్లే స్క్రీన్ తో వస్తుంది, ఇది జిపిఎస్ నావిగేషన్, ఐపాడ్ కనెక్టివిటీ మరియు చిత్ర దర్శిని వంటి అంశాలను కలిగి ఉంది.ఇది జూం ఫంక్షన్ తో కూడిన రివర్స్ కెమెరా స్క్రీన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్, ఎస్ ఎం ఎస్ బయటకు చదవడానికి, మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్ కూడా ఈ వేరియంట్లలో అందించబడతాయి. అయితే దాని డబ్ల్యూ6 ట్రిమ్, యూఎస్బి తో కూడిన ఒక 6 అంగుళాల మోనోక్రోమ్ సమాచార వ్యవస్థ డిస్ప్లేతో, బ్లూటూత్ ఆడియో తో, మరియు హ్యాండ్స్ ఫ్రీ కాల్ ఎంపికలతో అమర్చబడి ఉంది. దీనిలో డిస్ బిల్ట్ సంగీత వ్యవస్థ కలిగి ఉంది, ఇది ఒక సిడి, ఎంపి3 అలాగే రేడియో ట్యూనర్ వంటి విలక్షణ అంశాలతో విలీనమై ఉంది. ఈ స్విచ్లు యూనిట్ ఆపరేటింగ్ కోసం ఉద్దేశించబడి స్టీరింగ్ వీల్ మీద అమర్చబడి ఉంటాయి. వీటితోపాటు, డాష్బోర్డ్ మీద రెండు ట్విట్టర్లను కలిగి ఉంది మరియు ఒక అసాధారణమైన సౌండ్ అవుట్పుట్ కోసం నాలుగు స్పీకర్లను అమర్చారు. ఇది ప్రయాణికులకు అత్యుత్తమమైన విని ఆనందించే సౌలభ్యాన్ని కలిగిస్తుంది. మరోవైపు, తయారీదారుడు కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొన్ని పరికరాలను దీనిలో అందించారు. ఈ జాబితాలో ఫ్లోర్ మ్యాట్స్, రూఫ్ రెయిల్స్, సైడ్ స్టెప్పర్, బాడీ గ్రాఫిక్స్ మరియు ఇతర కొన్ని లక్షణాలను దీనిలో అందించారు.

వీల్స్ పరిమాణం:


కారు యొక్క సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే, వీల్ ఆర్చ్లు బాగా ఏర్పరచబడి ఉంటాయి మరియు ఇవి వేరియంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. అయితే, ఇవి ఒక స్టీల్ మరియు అల్లాయ్ వీల్స్ సెట్ తో బిగించబడి వస్తున్నాయి. బేస్ మరియు డబ్ల్యూ6 ట్రిమ్స్ మినహాయించి, ఇతర రెండు వేరియంట్లు 17 అంగుళాల అలాయ్ వీల్స్ తో ఒక అందమైన సెట్ ను కలిగి ఉంటాయి. సంస్థ దీనిని మరింతగా F235/65R17 పరిమాణంగల రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లతో కవర్ చేయబడి ఉంచింది. ఇది ఎలాంటి రంధ్రాలు పడకుండా నియంత్రిస్తుంది అలాగే, అన్ని రకాల రోడ్లపైన అద్భుతమైన పట్టును అందిస్తుంది. దీనిలో 17 అంగుళాల స్టీలు చక్రాల సమితిని దాని ప్రవేశ స్థాయి ట్రిం లో పూర్తి వీల్ క్యాప్స్ తోపాటు ఉపయోగిస్తారు. మరోవైపు, యజమానులకు అనుకూలంగా దాని బూట్ కంపార్ట్మెంట్ లో అమర్చిన పూర్తి పరిమాణం గల అదనపు చక్రాన్ని గమనించవచ్చు. ఇది కొంత వరకు ముఖ్యమైన టూల్స్ తో అందించబడుతుంది. వీటిని సాధారణంగా ఫ్లాట్ టైర్ మార్చుతున్న సమయంలో ఉపయోగించవచ్చు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దీని నిర్వహణను సులభతరం చేసేందుకు స్పీడ్ సెన్సిటివ్ శక్తి సహాయక స్టీరింగ్ వ్యవస్థను దీనిలో అనుసంధానం చేశారు ఇది ఒక అసాధారణమైన స్పందనను అందిస్తుంది. ఇది టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ ను కలిగి ఉంది దీనివలన పీక్ ట్రాఫిక్ కండీషన్ లో కూడా డ్రైవింగ్ ని సులభతరం చేస్తుంది. మరొక కారకం ఏమిటనగా వాహనం ఒక మృదువైన మరియు బంపర్ ఫ్రీ రైడ్ కోసం ఒక స్వతంత్ర సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఒక మక్ఫెర్సొన్ స్ట్రట్ ను దాని ముందు ఆక్సిల్ కి ఫిక్స్ చేసి ఉంచుతారు. అయితే ఒక మల్టీ లింక్ టైప్ వ్యవస్థ వెనుక భాగానికి జోడించబడి ఉంటుంది. ఇది యాంటీ రోల్ బార్లని కూడా కలిగి ఈ యంత్రాంగాన్ని మరింత మెరుగుపరచడానికి సహయపడుతుంది. బ్రేకింగ్ పరంగా, దాని ముందు అలాగే వెనుక చక్రాలు కూడా కాలిపర్సు ను కలిగి ఉన్న ఒక బలమైన డిస్క్ బ్రేక్ల సెట్ తో బిగించబడి ఉంటాయి. ఈ వ్యవస్థ మరింతగా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కలిసి ఉంటుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ అగ్రెస్సివ్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం దాని అనేక భద్రత కోణాల ద్వారా దాని ప్రయాణీకులకు ఉత్తమ రక్షణను అందిస్తుంది. దాని బాడీ నిర్మాణ విషయానికొస్తే, అది చాలా దృఢంగా ఉంటుంది మరియు క్రంపుల్ జోన్లతో అలాగే ఇంపాక్ట్ బీమ్స్ వంటి రక్షణ కవచాలతో కూడి ఏవైనా ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రభావాన్ని చూపుతాయి. ఇదిఒక నమ్మకమైన డిస్క్ బ్రేకింగ్ యంత్రాంగంతో వస్తుంది, ఇది మరింతగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో కూడి ఉంటుంది. దానికితోడు, దాని టాప్ ఎండ్ వేరియంట్స్ కూడా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో సహ రోల్ ఓవర్ మిటిగేషన్ ను కలిగి ఉంటాయి. దీనిలో మరో కీలక అంశం ఏమిటనగా, ఇంజిన్ ఇమ్మొబిలైజర్. ఇది ఏ అనధికార యాక్సెస్ కు గురి కాకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. సంస్థ దీనిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ కూడా అందించింది. ఇది ఒక గొప్ప మేరకు దాని ముందు సీట్లలో ఉండే యజమానులకు రక్షణను ఇస్తుంది. అంతేకాక, సైడ్ కి కర్టెన్ ఎయిర్బ్యాగ్స్ కూడా అందించారు ఇది ఒక ప్లస్ పాయింట్. వీటితోపాటు, హిల్ హోల్డ్ సంతతి నియంత్రణ వ్యవస్థ దీనిలో మరొక ముఖ్యమైన అంశం, ఇది ఎలాంటి రోడ్లపైనా అయినా లేదా కొండలపై న అయినా పటుత్వాన్ని కలిగి సమర్థవంతంగా పని చేస్తుంది. దీనిలో కొత్తగా జత చేసిన మెసేజింగ్ సర్వీస్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కారు యొక్క డోర్లు తీసి ఉంటే మరియు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఒక నోటిఫికేషన్ అందిస్తుంది. వీటన్నింటితో పాటుగా, సెంట్రల్లో ఉన్న ఇంధన ట్యాంక్, స్మార్ట్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్, డైనమిక్ రివర్స్ పార్కింగ్ కెమెరా సహాయత, డోర్ అజార్ ల్యాంప్స్ మరియు కొన్ని ఇతర రైడ్ సురక్షిత అంశాలను కలిగి ఉంది.

అనుకూలాలు:


1. యాంటీ పించ్ ఫీచర్ తో దాని ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆసక్తికరమైనదిగా ఉంది.
2. యాక్సిలరేషన్ మరియు పికప్ యుక్తకరంగా ఉంది.
3. మొత్తం పొడవు మరియు వీల్ బేస్ కొలతలు కూడా మంచిగా ఉన్నాయి.
4. విశిష్టమైన బాహ్య డిజైన్ తో అనేక ముఖ్యమైన లక్షణాలతో కూడి ఉంది.
5. వాయిస్ మెసేజింగ్ సిస్టమ్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది.

ప్రతికూలాలు:


1. ఇంజన్ యొక్క శబ్దం మరియు వైబ్రేషన్ తగ్గించవలసి ఉంది.
2. దాని ఇంధన పరిధి ఇంకా మెరుగుపరచవలసి ఉంది.
3. రేర్ హెడ్ స్పేస్ కూడా కొద్దిగా మెరుగుపరచడం అవసరం.
4. మరికొన్ని భద్రత ఫీచర్లను జోడించవలసిన ఆస్కారం ఉంది.
5. పెట్రోల్ ఇంజిన్ ఎంపికను కూడా అందించవలసి ఉంది.