టయోటా పుష్పానికి Altis

` 14.3 - 19.5 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టయోటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టయోటా పుష్పానికి Altis వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
టి కె ఎం పి ఎల్(టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రెవేట్ లిమిటెడ్) తన ఆధినిక వెర్షన్ అయిన కొరెలా ఆల్టిస్ ని మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఈ విభాగంలో ఇతర స్కోడా ఆక్టావియా, హ్యుందాయ్ ఎలంట్రా, వోక్స్వ్యాగన్ జెట్టా వంటి వాటితో పోటీ పడుతున్నది. ఇది 11 వ తరం మోడల్ మరియు నావిగేషన్ సిస్టమ్, ఇ సి ఒ డ్రైవింగ్ సూచిక మరియు క్రూయిజ్ నియంత్రణ ఫంక్షన్ తో పాటూ ఒక 7.1-అంగుళాల టచ్ స్క్రీన్ ఆడియో వ్య్వస్థతో అందుబాటులో ఉంది. కారు తయారీదారుడు పుష్ బటన్ తో పాటూ ఒక స్మార్ట్ ఎంట్రీ వ్యవస్థను డ్రైవర్ సౌలభ్యం కోసం అందించారు. ఈ వాహనం యొక్క బాహ్య స్వరూపాలు మరియు అంతర స్వరూపాలు చాలా మార్పులు చేయబడి ఆకర్షణీయమైన లుక్ తో కనిపిస్తాయి. బాహ్య స్వరూపాల పరంగా, ఎల్ ఇ డి డే టైం రన్నింగ్ లైట్స్ తో అమర్చబడి ఉన్న హెడ్లైట్ క్లస్టర్ ని కలిగి ఉంది. దీనిలో బేస్ వేరియంట్ కి తప్ప మిగిలిన వాటికి అత్యాధునిక మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ సమితి అందించడం వలన మరింత స్టయిలిష్ గా కనిపిస్తుంది. ఇది 100mm వీల్బేస్ కారణంగా తగినంత లెగ్ స్పేస్ ని మరియు షోల్డర్ స్పేస్ ని కలిగి ఉంది. ఇది డ్రైవర్ ని అప్డేట్ చేయడానికి డిజిటల్ టాకో మీటర్, బహుళ ట్రిప్ మీటర్, తక్కువ ఇంధన హెచ్చరిక కాంతి, స్పీడోమీటర్, డోర్ అజార్ హెచ్చరిక, డిజిటల్ గడియారం మరియు ఇతర నోటిఫికేషన్లను కలిగి ఉంది. ఇంకా ఇది సర్దుబాటు చేయగల హెడ్ రెస్ట్రైన్స్ ని కలిగియున్నటువంటి కుషన్ సీట్లతో అందుబాటులో ఉంది. జె ఎస్ మరియు జి ఎల్ వేరియంట్లు యొక్క సీట్లు ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. దీనితో పాటుగా దీనిలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ అందుబాటులో ఉండి అనధికార ఎంట్రీ ని తొలగించేందుకు సహాయపడుతుంది. వీటితో పాటు ఇది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డ్రైవర్ సీటు బెల్ట్ నోటిఫికేషన్ మరియు డోర్ అజార్ వార్నింగ్ వంటి ఇతర భద్రతా అంశాలను కూడా కలిగి ఉంది. దీనిలో పెట్రోల్ వేరియంట్లు 1.8 లీటర్ 2 జెడ్ ఆర్ ఎఫ్ ఇ ఇంజిన్ పవర్ ప్లాంట్ 1798cc స్థానభ్రంశాన్ని అందించడంతో పాటూ 6400rpm వద్ద 138.08bhp శక్తిని మరియు 4000rpm వద్ద 173Nm టార్క్ ని అందిస్తుంది. దీని డీజిల్ వేరియంట్ 1.4 లీటర్ డి-4డి ఇంజన్ తో అమర్చబడి 1364cc స్థానభ్రంశాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా 3800rpmవద్ద 87.2bhp శక్తిని మరియు 1800 నుండి 2800rpm వద్ద 205Nm టార్క్ ని అందిస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్ సిస్టమ్ తో అమర్చబడి ఉంటాయి. దీని రెండు పెట్రోల్ వేరియంట్లు సి వి టి ఐ, 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో అమర్చబడి ఉంటాయి. ఇది 3-సంవత్సరాల లేదా 100000 కిలోమీటర్లు ప్రామాణిక వారంటీతో అందుబాటులో ఉంది. వినియోగదారులు అధనపు ఖర్చు ద్వారా వారంటీని పొడిగించుకోవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీనిలో పెట్రోల్ వేరియంట్లు ఇ ఎఫ్ ఐ సరఫరా వ్యవస్థ ను కలిగియున్న 1798cc ఇంజన్ తో అమర్చబడి ఉంది. ఇది నగర పరిధిలలో 9.5kmpl మైలేజ్ ని, అలానే హైవేస్ లో 14.53kmpl మైలేజ్ ని ఉత్తమంగా అందిస్తుది. అయితే దీనిలో ఆటోమెటిక్ వేరియంట్లు గరిష్టంగా 13.5kmpl మైలేజ్ ని అందిస్తాయి. మరోవైపు, డీజిల్ వెర్షన్ 1364cc ఇంజిన్ తో అమర్చబడి, కామన్ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థచే సంఘటితం చేయబడింది. దీని వలన ఈ సెడాన్ సిటీ రోడ్లపై 18.4kmpl మైలేజ్ ని అలానే పెద్ద రోడ్లపై 21.43kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఈ విషయం ఏఆర్ఏఐ (భారతదేశం ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్) సంస్థ ద్వారా ఆమోదం చేయబడింది. దీని ఇంధన టాంక్ సామర్ధ్యం పెట్రోల్ వేరియంట్ కి 55 లీటర్లు మరియు డీజిల్ వేరియంట్ కి 50 లీటర్లు. దీని వలన ఈ వాహనం దూరపు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

శక్తి సామర్థ్యం:


దీనిలో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 6400rpm వద్ద 138.08bhp శక్తిని మరియు 4000rpm వద్ద 173Nmటార్క్ ని గరిష్టంగా అందిస్తుంది. అదే సమయంలో, డీజిల్ వేరియంట్లు టర్బోచార్గింగ్ యూనిట్ తో అమర్చబడియున్న 1.4 లీటర్ డి-4డి ఇంజిన్ ని కలిగి ఉన్నాయి. ఈ ఇంజన్ 3800rpmవద్ద 87.1bhp శక్తిని మరియు 1800 నుండి 2800rpm వద్ద 205Nm టార్క్ ని అందిస్తుంది. ఈ వాహనం నగరం రోడ్ పరిస్థితులు కోసం అనుకూలంగా ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనంలో 1.8లీటర్ పెట్రోల్ ఇంజిన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వ్యవస్థ తో అమర్చబడి 190kmph గరిష్ట వేగం వరకూ చేరుకోగలదు. ఇది 11 నుండి 13 సెకన్ల పరిధిలో 100kmph వేగం వరకూ చేరుకోగలదు. దీనిలో ఆటోమెటిక్ వేరియంట్లు 7-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో 10.42 సెకన్లలో 0 నుండి100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలవు మరియు గరిష్టంగా 205kmph వేగాన్ని చేరుకుంటాయి. ఈ విభాగంలో ఇది ఒక అత్యుత్తమమైన విషయం. దీనిలో డీజిల్ వెర్షన్ 1.4 లీటర్ ఇంజన్ శక్తితో మరియు 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వ్యవస్థతో అమర్చబడినవి. ఇది 13 నుంచి 14 సెకన్లలో 0 నుండి 100kmph వేగాన్ని చేరుకోగలవు. అదే సమయంలో, ఈ సెడాన్ గరిష్టంగా 160 కు 170 కిలోమీటర్ల పరిధిలో వేగం వరకూ వెళ్ళగలదు.

వెలుపలి డిజైన్:


2014 వెర్షన్ స్టైలిష్ లక్షణాలు మరియు ఒక ఏరోడైనమిక్ శరీర నిర్మాణం కలిగియుండి ఒక కొత్త బ్రాండ్ లుక్ ని ఇస్తుంది. ఈ సెడాన్ యొక్క ముందరి ముఖ భాగం అత్యంత ఆకర్షణీయంగా రూపొందింపబడి ఒక జత అంతరాయ వైపర్స్ ని కలిగియున్నటువంటి పెద్ద విండ్స్క్రీన్ తో అమర్చబడి ఉంది. అలానే అగ్ర శ్రేణి వేరియంట్లు ఆటోమేటిక్ వర్షం సెన్సింగ్ వైపర్లను పొంది ఉన్నాయి. బోల్డ్ రేడియేటర్ గ్రిల్ కొన్ని క్రోమ్ స్లాట్లతో బిగించబడి సెంటర్ లో కంపెనీ లోగో తో చిత్రించబడి ఉంటుంది. ఇంకా ఇది హాలోజన్ లైట్లు మరియు సైడ్ టర్న్ ఇండికేటర్లతో అమర్చబడియున్న ఆకర్షణీయమైన హెడ్లైట్ క్లస్టర్ తో రూపొందించబడింది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లు ఆటోమేటిక్ ఎల్ ఇడి హెడ్ల్యాంప్స్ మరియు డే టైం రన్నింగ్ లైట్లను కలిగియున్నాయి. దీని బంపర్ శరీర రంగులో ఉండి విస్తృతంగా గాలి తీసుకొనే విభాగాన్ని ఇంజిన్ ని చల్లపరిచేందుకు కలిగి ఉంటుంది. ఇంకా ఈ బంపర్ శరీర రంగు అండర్ గార్డ్ ని కలిగి ఉంటుంది. దీనిలో ఎయిర్ డ్యాం ఒక జత ప్రకాశవంతమైన ఫాగ్ ల్యాంప్స్ ని కలిగి ఉంటాయి. బేస్ వేరియంట్లో ఈ లక్షణం లేదు. దీని ముందర భాగం చాలా వరకూ క్రోమ్ చేరికలతో ఉండి డీసెంట్ గా కనిపిస్తుంది. దీని పక్క ప్రొఫైల్ బలమైన క్యారెక్టర్ లైన్స్ తో మరియు నల్లని రంగుతో ఫినిషింగ్ చేయబడిన విండో సిల్ తో అందించబడుతోంది. దీని డోర్ హ్యాండిల్స్ మరియు బయట వైపు వెనుక వ్యూ మిర్రర్స్ శరీర రంగులో అందించబడుతున్నవి. దీని బాహ్య వింగ్ మిర్రర్స్ సైడ్ టర్న్ బ్లింకర్స్ ని కలిగియుండి విద్యుత్ తో సర్దుబాటు చేయగలిగే లక్షణంతో అందుబాటులో ఉంది. జె మరియు జె ఎస్ వేరియంట్లు వీల్ క్యాప్స్ తో అమర్చబడినటువంటి స్టీల్ వీల్ సమితితో బిగించబడి ఉంటాయి. అయితే, ఇతర వేరియంట్లు బహుళ-స్పోక్ అల్లాయ్ వీల్స్ సమితితో అమర్చబడి పక్క ప్రొఫైల్ లుక్ ని పెంచుతాయి. దీని వెనుక ప్రొఫైల్ కొత్త టెయిల్ లైట్ క్లస్టర్ మరియు క్రోమ్ చేరికలతో తిరిగి రూపొందించబడిన బూట్ లిడ్ తో చాలా మార్పు ని పొందింది. ఇది మోడల్ బ్యాడ్జ్, తో పాటు క్రోమ్ పూత గల కంపెనీ తెలిపే చిహ్నంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని శరీర రంగు బంపర్ ఒక జత రెఫ్లెక్టర్స్ తో అందించబడి ఉంటుంది. దీని పెద్ద విండ్స్క్రీన్ డీఫాగర్ మరియు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ తో అమర్చబడి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


దీని వీల్ బేస్ భారీగా 2700mm ఉండడం వలన క్యాబిన్ లోపల పుష్కలమైన లెగ్ స్పేస్ ఉంటుంది. దీని యెుక్క కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 175mm ఉంటుంది. దీని రెండు బాహ్య వెనుక వీక్షణ అద్దాలతో కలిపి మొత్తం పొడవు 4620 mm ఉంటుంది మరియు మొత్తం ఎత్తు 1475mm మరియు 1775 mm తగు వెడల్పుతో అందించబడుతుంది. ఇది 470 లీటర్ల విశాలమైన బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంది. దీని వెనుక సీట్ మడవటం ద్వారా మరింత పెంచవచ్చు. దీని స్టీరింగ్ వీల్ 5.4 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్థానికి మద్దతునిస్తుంది.

లోపలి డిజైన్:


ఈ సిరీస్ అంతర్గత క్యాబిన్ ఒక డ్యుయల్ రంగు (లేత గోధుమరంగు మరియు బ్లాక్) పథకంతో రూపొందించబడి మరియు క్రోమ్ పూతతో అలంకరించబడి ఉంటుంది. దీని ఆకర్షణీయమైన డాష్బోర్డ్ ఏ.సి వెంట్లు, సమాచార వ్యవస్థ, పెద్ద గ్లోవ్ బాక్స్ మరియు బహుళ-ఫంక్షనల్ స్విచ్లు మరియు సిల్వర్ చేరికలు కలిగియున్నటువంటి లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ ని కలిగి ఉన్నాయి. దీనితో పాటుగా ఇది ఒక మార్పు చేయబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది. ఇది డ్రైవర్ ని అప్డేట్ చేయడానికి డిజిటల్ టాకొమీటర్, బహుళ ట్రిప్ మీటర్, తక్కువ ఇంధన హెచ్చరిక కాంతి, స్పీడోమీటర్, డోర్ అజార్ హెచ్చరిక, డిజిటల్ గడియారం మరియు ఇతర నోటిఫికేషన్లను కలిగి ఉంది. ఇంకా ఇది సర్దుబాటు చేయగల హెడ్ రెస్ట్రైన్స్ ని కలిగియున్నటువంటి కుషన్ సీట్లతో అందుబాటులో ఉంది. జె ఎస్ మరియు జి ఎల్ వేరియంట్లు యొక్క సీట్లు ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. దీని అగ్ర శ్రేణి వేరియంట్లు ప్రీమియం లెథర్ సీట్లను కలిగి ఉంటాయి. దీని డ్రైవర్ సీటు లంబర్ సపోర్ట్ తో పాటూ 8 విదాలుగా సర్దుబాటు చేసుకోగలిగే విద్యుత్ అడ్జస్టబుల్ ఫంక్షన్ తో అందుబాటులో ఉంది. దీని అంతర్గత కాబిన్ చాలా వరకూ క్రోమ్ చేరికలతో వస్తుంది. ముఖ్యంగా, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ మరియు ఆన్ డోర్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా క్రోమ్ చేరికలతో అందించబడి కాబిన్ ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఇది విద్యుత్ పవర్ స్టీరింగ్, ఇ సి ఒ డ్రైవర్ ఇండికేటర్, రీడింగ్ ల్యాంప్స్ మరియు వెనుక సన్ షేడ్ వంటి ఇతర అంశాలతో కూడా అందుబాటులో ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఈ సెడాన్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు ప్రయాణికుల కొరకు అనేక సౌకర్య లక్షణాలతో అందించబడి వారి ప్రయాణాన్ని సుఖమయం చేస్తాయి. ఇది డి విడి ప్లేయర్ తో పాటూ ఆధునిక ఇన్- డాష్ 5.8 అంగుళాల టచ్స్క్రీన్ ఆడియో ప్రదర్శన, యు ఎస్ బి పోర్ట్ మరియు నాలుగు స్పీకర్లు ( బేస్ వేరియంట్)తో ఆక్స్-ఇన్ సాకెట్ మరియు ఇతర వేరియంట్లలో 6 స్పీకర్లను కలిగి ఉంటుంది. దీనిలో అగ్ర శ్రేణి వి ఎల్ వేరియంట్ నావిగేషన్ సిస్టమ్ తో పాటూ 7.0 అంగుళాల టచ్స్క్రీన్ ప్రదర్శనను కలిగి ఉంది. దీనిలో బేస్ వేరియంట్ మాన్యువల్ హెచ్ ఎ వి సి యూనిట్ తో అమర్చబడి ఉండగా, ఇతర వేరియంట్లు క్యాబిన్ ని తొందరగా చల్లపరిచేందుకు ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్ ని కలిగి ఉంటాయి. దీనిలో ఏ.సి వెంట్లు దీర్ఘ చతురస్రాకారంలో ఉండి డాష్బోర్డ్ కి రెండు చివరలా అమర్చబడి మంచి గాలి ప్రసరణను అందిస్తాయి. ఈ క్రూయిజ్ నియంత్రణ ఫంక్షన్ అగ్ర శ్రేణి వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. సంస్థ ఈ వేరియంట్ కి ముందర నిల్వ స్థలం, వెనుక కప్ హోల్డర్, డోర్ మాప్ పోకెట్ మరియు పెద్ద గ్లోవ్ బాక్స్ వంటి అనేక నిల్వ అంశాలను అందించింది. ఇంకా దీని సెంటర్ కన్సోల్ లో 12వి పవర్ సాకెట్ ముబైల్ ఫోన్ చార్గింగ్ కొరకు అందించడం జరిగింది. దీనిబహుళ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఆడియో, క్రూయిజ్ మరియు కాల్ నియంత్రణ బటన్లను అమర్చబడి ఉంటుంది. వీటితో పాటూ టిల్ట్ మరియు టేలీస్కోపిక్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ చాలా సౌకర్యవంతమైన నిర్వహణ కొరకు అందించడం జరుగుతుంది. వీటితో పాటూ ఇది నాలుగు పవర్ విండోస్ తో పాటూ డ్రైవర్ వైపు ఆటో డౌన్ ఫంక్షన్, డ్రైవర్ సీట్ ఎత్తు అడ్జెస్టర్, యాంటీ గ్లేర్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్, రెమోట్ ఫ్యుయల్ లిడ్, టెయిల్ గేట్ ఓపెనర్, విద్యుత్ సర్దుబాటు గల బాహ్య రేర్ వ్యూ మిర్రర్, సిగరెట్ లైటర్, సన్ గ్లాస్ హోల్డర్, వెనుక డీఫాగర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి అధనపు సౌకర్య లక్షణాలు చేర్చబడినవి.

లోపలి కొలతలు:


ఈ మోడల్ సిరీస్ మెరుగైన లెగ్ షోల్డర్ మరియు హెడ్ స్పేస్ తో భారీ క్యాబిన్ ను కలిగి ఉంది. కార్ల తయారీ సంస్థ దీని వీల్ బేస్ ను 100mm పెంచడం ద్వారా ఇప్పుడు మొత్తం వీల్ బేస్ 2700mm ఉంది. దీనివలన క్యాబిన్ లో పుష్కల లెగ్ స్పేస్ అందించడం జరిగింది. ఇది ఒక విశాలమైన బూట్ కంపార్ట్మెంట్ కలిగి ఉంది. దీనిని వెనుక సీట్ మడవటం ద్వారా బూట్ సామర్ధ్యాన్ని మరింత పెంచవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


దీని పెట్రోల్ వేరియంట్స్ డ్యుయల్ వి విటి-ఐ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఒక శక్తివంతమైన 1.8 లీటర్ పవర్ ప్లాంట్ కలిగి ఉన్నాయి. ఇది డి ఒహెచ్ సి ఆధారిత వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లు మరియు 16-వాల్వులతో అమర్చబడి ఉంది. ఇది 1798cc స్థానభ్రంశాన్ని అందించడంతో పాటూ 6400rpm వద్ద 138.08bhp శక్తిని మరియు 4000rpm వద్ద 173Nm టార్క్ ని అందిస్తుంది. దీని పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ సూపర్ సివిటి-ఐ సీక్వెన్షియల్ షిఫ్ట్ మెటిక్ ప్రసార గేర్బాక్స్ సిస్టమ్ తో అమర్చబడి దీని ముందు చక్రాలకి శక్తిని అందిస్తుంది. దీని డీజిల్ వేరియంట్ 1.4 లీటర్ డి-4డి ఇంజన్ తో అమర్చబడి 1364cc స్థానభ్రంశాన్ని అందిస్తుంది. ఇది టర్బోచార్జర్ మరియు ఇంటర్ కూలర్ తో అమర్చబడి మన్నికను మెరుగుపరుస్తుంది. ఇది 3800rpmవద్ద 87.2bhp శక్తిని మరియు 1800 నుండి 2800rpm వద్ద 205Nm టార్క్ ని అందిస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్ సిస్టమ్ తో అమర్చబడి ఉంటాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


తయారీదారుడు దీనికి సిడి / ఎం పి3 ప్లేయర్, రేడియో మరియు ఆక్స్-ఇన్ పోర్ట్ మరియు యు ఎస్ బి సాకెట్లు కోసం కనెక్టివిటీ అందించే ఒక ఆధునిక సమాచార వ్యవస్థను తాజాగా అందించారు. ఇది వినియోగదారుల సౌలభ్యం కొరకు బ్లూటూత్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. దీనిలో బేస్ వేరియంట్లు 5.8-అంగుళాల ఎల్ ఇ డి టచ్స్క్రీన్ ని కలిగియుండగా, ఇతర వేరియంట్లు నావిగేషన్ సిస్టమ్ కలిగియున్న 7.1-అంగుళాల టచ్స్క్రీన్ ఆడియో సిస్టమ్ ని కలిగి ఉన్నాయి. దీనిలో అగ్ర శ్రేణి వేరియంట్లు రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో పాటు వెనుక వీక్షణ కెమెరా తో అందించబడి పార్కింగ్ సమయంలో డ్రైవర్ యొక్క శ్రమను తగ్గించేందుకు సహాయపడతాయి. దీని బేస్ వేరియంట్లలో చాలా లక్షణాలు అందుబాటులో లేవు. కానీ కొనుగోలుదారులు శక్తివంతమైన సీటు కవర్లు, ప్రీమియం నాణ్యత లెథర్, ఫ్లోర్ మ్యాట్స్, రియర్ పార్కింగ్ కెమెరా, నావిగేషన్ సిస్టమ్, మట్టి గార్డు కవర్లు, శరీరం గ్రాఫిక్స్ మరియు అల్లాయి వీల్స్ వంటి ఉత్తేజకరమైన అంశాలను అనుకూలీకరించవచ్చు.

వీల్స్ పరిమాణం:


కారు తయారీదారుడు దీని అగ్ర శ్రేణి వేరియంట్ కి స్టైలిష్ 16 అంగుళాల మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ సమితిని అందించారు. ఈ వీల్స్ 205/55 R16 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉన్నాయి. దీనిలో జె మరియు జె ఎస్ వేరియంట్ పూర్తి వీల్ క్యాప్స్ తో కప్పబడియున్న 15 అంగుళాల స్టీల్ చక్రాల సమితితో అమర్చబడి ఉన్నాయి. అయితే దీనిలో ఇతర వేరియంట్లు 15 అంగుళాల అలాయ్ వీల్స్ సమితితో అమర్చబడి ఉంటాయి. తదుపరి వీటి రిమ్స్ 195/65 R15 పరిమాణంగల టెరియన్ సామర్థ్యం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉండి వాహనాన్ని మరింత సమర్ధవంతంగా చేస్తున్నాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


తయారీదారుడు ఈ ఆధునిక వెర్షన్ కి సమర్ధవంతమైన బ్రేకింగ్ మెకానిజం ని అందించారు. దీని ముందరి చక్రాలు వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లు సమితితో బిగించబడి ఉండగా, దీని వెనుక చక్రాలు సంప్రదాయ డిస్క్ బ్రేక్లు సమితితో అమర్చబడి ఉంటాయి. ఇది మరింత ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ సెడాన్ స్థిరత్వం పటిష్టం చేసేందుకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో అమర్చబడి ఉంది. ఇక సస్పెన్షన్ వ్యవస్థ విషయానికి వస్తే, చాలా ప్రభావవంతమైనది మరియు వాహనాన్ని చాలా సమతుల్యంగా ఉంచుతుంది. దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో అమర్చబడి ఉండగా దీనికి వెనుక ఆక్సిల్ టార్షన్ బీమ్ తో అందించబడుతుంది. ఈ విధానం రోడ్లపై కలిగే అన్ని ఒడిదుడుకులను తగ్గిస్తుంది మరియు ఒక సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఒక అత్యుత్తమ పవర్ స్టీరింగ్ ని కలిగి ఉండి 5.4 మీటర్ల టర్నింగ్ వ్యాసార్ధాన్ని అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ మోడల్ సిరీస్ ప్రాయాణికుల రక్షణ కొరకు అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది. దీనిలో డ్రైవర్ కి మరియు సహ డ్రైవర్ కి కూడా ఎయిర్బాగ్స్ అందుబాటులో ఉండి ప్రమాదాల నుండి రక్షించేందుకు సహాయపడతాయి. ఇది ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని కలిగి ఉండి వాహనాన్ని స్థిరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీనితో పాటుగా దీనిలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ అందుబాటులో ఉండి అనధికార ఎంట్రీ ని తొలగించేందుకు సహాయపడుతుంది. వీటితో పాటు ఇది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డ్రైవర్ సీటు బెల్ట్ నోటిఫికేషన్ మరియు డోర్ అజార్ వార్నింగ్ వంటి ఇతర భద్రతా అంశాలను కూడా కలిగి ఉంది.

అనుకూలాలు:


1. పెరిగిన వీల్ బేస్ వలన క్యాబిన్ స్పేస్ మెరుగుపడింది.
2. సౌకర్యవంతమైన లక్షణాలు అందించడంలో ఇతర పోటీదారులతో సమానంగా ఉంది.
3. విలాసవంతమైన లోపలి డిజైన్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
4. పెట్రోల్ ఇంజిన్ యొక్క ప్రదర్శన అద్భుతమైనదిగా ఉంది.
5. సొగసైన మరియు ప్రకాశవంతమైన బాడీ లైన్ దానికి ప్రయోజనాన్ని జతచేస్తుంది.

ప్రతికూలాలు:


1. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల యొక్క ఇంధన సామర్థ్యం ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఉంది.
2. ఇంకా కొన్ని లక్షణాలను జోడించాల్సిన ఆస్కారం ఉంది.
3. ఇచ్చిన ఏ ఇంజిన్ కి కూడా నవీకరణలు చేయలేదు.
4. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంది.
5. ప్రైస్ ట్యాగ్ కూడా అంత పోటీ తత్వంగా లేదు.