మారుతి Baleno

` 5.2 - 8.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్‌లు

 
*Rs

మారుతి Baleno వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు


ఫిబ్రవరి 22, 2016: మారుతి సుజుకి సంస్థ, సుజుకి బాలెనో యొక్క మొదటి బ్యాచ్ వాహనాలను జపాన్ కి చెందిన టోయోహషి పోర్ట్ వద్ద కు చేరిందని ప్రకటించింది. ఇన్ని సంవత్సరాలలో, భారతదేశం నుండి జపాన్ కు ఎగుమతి చేయబడిన మొదటి కారు ఇదే మరియు ఈ బాలెనో, మారుతి సుజుకి యొక్క మనేసర్ ప్లాంట్‌లో తయారు చేయబడింది. ఈ ఆటో సంస్థ, భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసింది కానీ, ఇప్పటి వరకు ఎన్నడూ జపాన్ కు ఎగుమతి చేయలేదు. గతం లో జరిగిన ఆటో ఎక్స్పో నుండి, ఒక స్పోర్టియర్ వెర్షన్ ను 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద ఆవిష్కరించారు. దాని యొక్క నామం, బాలెనో ఆర్ ఎస్. ఈ మారుతి సుజుకి బాలెనో వాహనం, ఇదే విభాగం లో ఉండే వోక్స్వాగన్ పోలో జిటి టిఎస్ ఐ మరియు విడుదల తరువాత అబార్త్ పుంటో వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ వాహనానికి, 1.0 లీటర్ మూడు సిలండర్ల టర్బో చార్జెడ్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 110 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 170 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

అవలోకనం


పరిచయం


బాలెనో అంటే అర్ధం ఏమిటంటే, ఇటాలియన్ లో ఫ్లాష్ ఆఫ్ లైటింగ్ అని అర్ధం మరియు ఇది, నిజానికి సంపూర్ణ సరైన వాహనం అని చెప్పవచ్చు. మారుతి సుజుకి భారతదేశం లిమిటెడ్ నుండి విడుదల అయిన ఈ ఉత్పత్తి, ఖచ్చితంగా దాని కొత్త డైనమిక్ లుక్ తో మరియు ఆకట్టుకునే లక్షణా లతో ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సాదించనుంది. కార్ధెఖో వద్ద వ్యక్తిగతంగా గమనించినట్లైతే ఈ బ్రాండ్ లో ఉన్న ఇతర వాహనాలతో పోలిస్తే ఈ వాహనం బిన్నంగా కనిపిస్తోంది. ఈ వాహనానికి గొప్ప పోటీదారుడు ఎవరు అంటే, హ్యుందాయ్ ఎలైట్ ఐ 20. ఇదే విభాగంలో కొంత కాలం ముందు వరకు అంటే, బాలెనో ప్రారంభం కాక ముందు వరకు రాజుగా ఈ విభాగంలో నిలచింది. తరువాత దాని స్థానాన్ని బాలెనో బర్తీ చేయనుంది. మరోవైపు ఈ వాహనం, ఇదే విభాగంలో ఉండే వోక్స్వాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ వాహనం గురించి అన్వేషించండి మరియు ఈ అద్భుతమైన హాచ్బాక్ వాహనం యొక్క చమత్కారాలు అలాగే ప్రతికూలతలను వీక్షించండి.

 

అనుకూలాలు 1. స్మార్ట్ లుక్ ను కలిగి ఉన్న హ్యాచ్‌బ్యాక్ లను చూసినట్లైతే, మారుతి నుంచి ఏ ఇతర మోడల్ వలే కాకుండా, ఈ వాహనం గుంపులో ఖచ్చితంగా ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది.
 2. భద్రతా లక్షణాలు అయిన ద్వంద్వ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ మరియు ఈబిడి వంటి అంశాలు, ఈ మోడల్ లైనప్ మొత్తం అంతటా ప్రామాణికంగా అందించబడతాయి.
 3. ఈ వాహనం, యూజర్ ఫ్రెండ్లీ క్యాబిన్ ను కలిగి ఉంటుంది మరియు ఇది, చాలా విశాలమైనది గా, సులభంగా ఐదు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశాన్ని కల్పిస్తోంది..

 

ప్రతికూలాలు 1. నిర్మాణ నాణ్యత విషయానికి వస్తే, మారుతి సంస్థ ఈ విభాగంలో ఆధునీకరణ ను ఉంచవలసిన అవసరం ఉంది.
 2. వెనుక ఎసి వెంట్లు లేకపోవడం అనేది ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు ఎందుకంటే, ఇప్పటికే ఉన్న దాని పోటీదారులు ఈ వెనుక ఏసి వెంట్ లతో అందుబాటులో ఉన్నాయి.
 3. నెక్సా అవుట్లెట్ ద్వారా మాత్రమే దాని అమ్మకాల పరిధిని పరిమితం చేస్తుంది.
 
 

అత్యద్భుతమైన లక్షణాలు 1. టచ్‌స్క్రీన్ ద్వారా మీ ఐఫోన్ ను ఉపయోగించడానికి అనుమతించే ఆపిల్ కార్ ప్లే ఫంక్షన్ తో పాటు స్మార్ట్ ప్లే టీవీ వ్యవస్థ ను ఈ వాహనానికి అందించడం జరిగింది.
 2. సివిటి గేర్ బాక్స్, మంచి డ్రైవరబిలిటీ ను ఇవ్వడమే కాకుండా ఈ కొత్త తరం వ్యవస్థ, అద్భుతమైన ప్రదర్శన ను ఇస్తుంది.
 
 

అవలోకనం


ఈ మారుతి బాలెనో వాహనం, స్విఫ్ట్ వాహనం కంటే అధునాతన లుక్ ను కలిగి ఉంటుంది. ఈ మారుతి బాలెనో నిస్సందేహంగా అది మొదటి ప్రదర్శించ బడిన సమయం నుండి అనేక మంది మనస్సును ఆకట్టుకుంది. ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ బాలెనో వాహనాన్ని, మెటల్, రే బ్లూ నుండి మొదలుకొని గ్రానైట్ గ్రే వరకు అనేక వివిధ రంగు ఎంపికలతో అందించాడు. అంతేకాకుండా ఈ వాహనాన్ని, సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా అను నాలుగు ట్రిమ్ లెవెల్స్ లో అందించాడు. ఈ ఆర్ ఎస్ కాన్సెప్ట్ అనేది, యొక్క మారుతి బాలెనో యొక్క పనితీరు ఆధారిత వెర్షన్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది, ఇటీవల 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబడింది. ఈ వాహనం రాబోయే నెలల్లో ప్రారంభం కానుంది. ఈ వాహనానికి, ఒక కొత్త 1.0 లీటర్ బూస్టర్ జెట్ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 112 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 175 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ రాబోయే వాహనం, రాబోయే హ్యుందాయ్ ఐ 20 ఎన్ స్పోర్ట్, వోక్స్వాగన్ పోలో జిటి ఐ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వనుంది. మరోవైపు ఈ మోడల్ సిరీస్ యొక్క ఇప్పటికే అందుబాటులో ఉన్న వాహనాలు, రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడుతున్నాయి. అవి వరుసగా, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ అలాగే ఇవి, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా సిలండర్లను మరియు వాల్వ్ లను కలిగి ఉంటాయి. ఈ రెండు ఇంజన్లు, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. అదే పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక కూడా అందించబడుతుంది. మారుతి కొరకు, భద్రత అతి ముఖ్యం అని చెప్పవచ్చు మరియు ఈ వాహనం, ప్రయాణికులకు అలాగే వాహనానికి గరిష్ట స్థాయిలో రక్షణ కల్పించేందుకు అనేక రక్షిత అంశాలను కలిగి ఉంది. ఆ భద్రతా అంశాలు వరుసగా, ముందు రెండు ఎయిర్బాగ్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ, సుజుకి బాడీ టెక్ట్ బాడీ వంటిది వాహనానికి అత్యధిక భద్రత నిబంధనలను అందిస్తుంది. వీటన్నింటితో పాటు ఈ వాహనానికి, సమాచార వ్యవస్థ, బహుళ సమాచార ప్రదర్శన, డోర్ల కొరకు యూవి కట్ గ్లాస్, ఎల్ ఈ డి ల్యాంప్‌లు మరియు అనేక ఇతర అంశాలు అందించబడ్డాయి.
 
 

బాహ్య భాగం


ఈ బాలెనో వాహనానికి, మారుతి ఆధారిత "లిక్విడ్ ఫ్లో డిజైన్," ఆధారంగా దాని శరీరం అత్యంత గీతలు మరియు ఒక తక్కువ ప్రవహించే సిల్హౌట్ లతో ఆకట్టుకునే స్టైలింగ్ ను కలిగి ఉంది. ఒక శక్తివంతమైన దృక్పథము మరియు వినూత్న అంశాలతో ఈ వాహనం, ఇతర వాహనాల మధ్య ఒక ప్రత్యేకమైనది గా కనిపిస్తుంది.
 
  Image1

ఈ బాలెనో వాహనం యొక్క బాహ్య కొలతలు గురించి మాట్లాడటానికి వస్తే, ఈ హాచ్బాక్ ఇతర పోటీ దారులతో పోలిస్తే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. ఎత్తు గురించి మాట్లాడటానికి వస్తే, ఈ బాలెనో వాహనం కంటే, హోండా జాజ్ 44 మిల్లీ మీటర్ల ఎక్కువ ఎత్తు ను అలాగే ఎలైట్ ఐ 20 వాహనం 5 మిల్లీ మీటర్ల ఎక్కువ ఎత్తును కలిగి ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే, ఈ వాహనం హ్యుందాయ్ తో సమంగా ఉంటుంది అదే హోండా మరియు వోక్స్వాగన్ లతో పోలిస్తే వెనుక బడి ఉంటుంది. మరోవైపు వీల్‌బేస్ విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క వీల్‌బేస్, పోలో వాహనం కంటే 51 మిల్లీ మీటర్ల ఎక్కువ వీల్‌బేస్ ను కలిగి ఉంది. అదే జాజ్ మరియు ఎలైట్ ఐ 20 వాహనాల విషయానికి వస్తే, ఈ విభాగంలో అగ్ర స్థానంలో నిలుస్తాయి.
 
  Table1

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, మందపాటి లుక్ ను కలిగి ఉంటుంది. క్రోం ట్రీట్మెంట్ తో కూడిన పెర్ఫోరేటెడ్ రేడియేటెడ్ గ్రిల్, వాహనం యొక్క ముందు భాగానికి మంచి లుక్ ను ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్ నుండి హెడ్ లైట్ క్లస్టర్ వరకు ఒక మందపాటు క్రోం స్ట్రిప్ బిగించబడి ఉంటుంది. దీని వలన వాహనానికి, ఒక అధునాతన లుక్ అందించబడుతుంది.
 
  Image2

ఈ వాహనం యొక్క గ్రిల్ కు ఇరువైపు లా ఒక జత హెడ్ లైట్ క్లస్టర్లు విలీనం చేయబడి ఉంటాయి. ఈ హెడ్ లైట్ క్లస్టర్ లలో, టర్న్ సూచికలు మరియు డే టైం రన్నింగ్ లైట్ల తో కూడిన ఒక అధునాతన హెడ్ లైట్ క్లస్టర్ అందించబడుతుంది. అంతేకాకుండా ఈ హెడ్ లైట్ క్లస్టర్ ను, స్విఫ్ట్ వాహనం లో కూడా చూడవచ్చు.
 
  Image3

ఈ గ్రిల్ క్రింది భాగం విషయానికి వస్తే, కారు శరీర రంగులో ఉండే బంపర్ అందించబడుతుంది. అంతేకాకుండా ఈ బంపర్ కు, ఒక బారీ ఎయిర్ ఇంటేక్ సెక్షన్ మరియు ఈ బంపర్ కు ఇరువైపులా ఒక జత ఫాగ్ ల్యాంప్‌లు అందించబడతాయి.
 
  Image4

అందమైన వక్రతలు మరియు విండో ఫ్రేమ్ లు ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ ను చాలా ఆకట్టుకునే విధంగా చేస్తాయి. సైడ్ ప్రొఫైల్ లో ఉండే విండో సిల్, క్రోం తో అలంకరించబడి ఉంటుంది. అదే పిల్లార్ల విషయానికి వస్తే, నలుపు ఫినిషింగ్ తో అలంకరించబడి ఉంటాయి. మరో కీలకమైన విషయం ఏమిటంటే, ఈ తరగతిలో మొదటి సారిగా డోర్లకు యువి కట్ గ్లాస్ అందించబడుతుంది. దీని వలన యూవి రేస్ మనల్ని డైరెక్ట్ గా దరిచేరవు.
 
  Image5

ఈ వాహనానికి చక్కదనాన్ని జోడించడం కోసం, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు, కారు యొక్క శరీర రంగులో అలంకరించబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ మిర్రర్ లకు టర్న్ సూచికలు విలీనం చేయబడి ఉంటాయి.
 
  Image6

ఈ మోడల్ సిరీస్ యొక్క ముందు రెండు అగ్ర శ్రేణి వేరియంట్ లలో, అధునాతన సెట్ గల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. ఈ వాహనం యొక్క రింల విషయానికి వస్తే, 16 అంగుళాల అధిక పనితీరు కలిగిన 195/55 R16 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్ లతో కప్పబడి ఉంటాయి. అదే మిగిలిన వేరియంట్ ల విషయానికి వస్తే, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రామాణికంగా అందించబడతాయి.
 
  Image7

వెనుక భాగం విషయానికి వస్తే, విండ్ స్క్రీన్ కు మరియు బూట్ లిడ్ కు మధ్య భాగంలో క్రోం స్ట్రిప్ బిగించబడి ఉంట్నుది దీని వలన వాహనం పొట్టిగా కనిపిస్తుంది. అంతేకాకుండా వాహనానికి స్పోర్టీ లుక్ ను ఇవ్వడం కోసం హై మౌంట్ స్టాప్ ల్యాంప్ తో కూడిన స్పాయిలర్ అందించబడుతుంది.
 
  Image8

వీటన్నింటితో పాటు బూట్ లిడ్ కు ఇరువైపులా అధునాత టైల్ లైట్ క్లస్టర్లు విలీనం చేయబడి ఉంటాయి మరియు దీనిలో, ఎల్ ఈ డి ల్యాంప్‌లు అలాగే టర్న్ సూచికలు అందించబడతాయి. దీని వలన వెనుక భాగం మరింత అందంగా కనబడుతుంది.
 
  Image9

బూట్ కంపార్ట్మెంట్ విషయానికి వస్తే, ఈ వాహనం 339 లీటర్ల లగేజ్ సామర్ధ్యం తో వస్తుంది. అంతేకాకుండా ఇది, జాజ్ కంటే 15 లీటర్ల తక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ, దాని ఇతర వ్యతిరేక వాహనాలతో పోలిస్తే మంచి సామర్ధ్యాన్ని కలిగి ఉంది అని చెప్పవచ్చు.
 
  Table2

అంతర్గత భాగం


బాలెనో లోపలి భాగం విషయానికి వస్తే, ఆకర్షణీయమైన నలుపు రంగు పధకం అందించబడుతుంది. కంటికి మరింత అందంగా కనిపించడం కోసం మొత్తం రూపకల్పన మరియు యాంబియంట్ లైటింగ్ తో రూపొందించబడింది. అంతేకాకుండా లోపలి భాగానికి ఖరీదైన లుక్ ను ఇవ్వడం కోసం, అనేక అంశాలపై లోహ చేరికలు అందించబడతాయి.
 
  Image10

డాష్‌బోర్డ్ గురించి చెప్పడానికి వస్తే, అనేక అధునాతన పరికరాలతో ఒక ప్రత్యేక లుక్ ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ తో టచ్ స్క్రీన్ ప్రదర్శన వంటివి కారు యొక్క వినోదాన్ని మరింత పెంచుతాయి. ఈ యూనిట్, స్మార్ట్ ఫోన్ మీడియా మరియు బ్లూటూత్ కనెక్టవిటీ తో పాటు నావిగేషన్ వ్యవస్థ మరియు వాయిస్ కమాండ్స్ వంటి అనేక అంశాలను కలిగి ఉంది.
 
  Image11

మూడు స్పోక్ల బహుళ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ అనేది మరొక అద్భుతమైన యూనిట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ స్టీరింగ్ వీల్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ సర్ధుబాటు సౌకర్యాలను కలిగి ఉంది. వీటన్నింటితో పాటు డ్రైవర్ యొక్క నిర్వహణ ను సులభతరం చేయడానికి అనేక ఆడియో మరియు కాల్ ఫంక్షనల్ స్విచ్చులు దీనిపై అందంగా పొందుపరచబడి ఉంటాయి.
 
  Image12

ఎర్గనామికల్ సీటింగ్ అమరిక విషయానికి వస్తే, ఇది మరొక కీలకమైన అంశం అని చెప్పవచ్చు. ఈ వాహనాన్ని ఎంపిక చేసుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. క్యాబిన్ లో ఉండే డ్రైవర్ సీటు, ఎత్తు సర్ధుబాటు ఫంక్షన్ తో వస్తుంది మరియు ముందు అలాగే వెనుక సీట్లకు సర్దుబాటయ్యే హెడ్ రెస్ట్లు అందించబడతాయి. వీటన్నింటితో పాటు, వెనుక వైపు బెంచ్ సీట్లు అందించబడుతుంది. ఇది, వెనుక లగేజ్ కంపార్ట్మెంట్ సామర్ధ్యాన్ని మరింత పెంచడం కోసం మడత సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.
 
  Image13

వీటన్నింటితో పాటు, ఈ వాహనానికి ఎయిర్ కండీషనింగ్ యూనిట్, నిల్వ సామర్ధ్యం తో కూడిన ముందు సెంటర్ ఆర్మ్ రెస్ట్, ప్రకాశవంతమైన గ్లోవ్ బాక్స్, లోపలి వైపు డోర్ హ్యాండిళ్ళకు మెటల్ ఫినిషింగ్ మరియు వానిటీ మిర్రర్ లతో కూడిన సన్ వైజర్లు వంటి అనేక అంశాలు అందించబడతాయి.
 
 

పనితీరు


పెట్రోల్ ఇంజన్


ఈ మోడల్ సిరీస్ యొక్క పెట్రోల్ వాహనాలు, 1.2 లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా ఇదే ఇంజన్ లను, స్విఫ్ట్, డిజైర్ మరియు అతి చిన్న వాహనం అయిన రిట్జ్ వంటి వాహనాలలో కూడా చూడవచ్చు. ఈ ఇంజన్ యొక్క పవర్ ఉత్పత్తుల విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 6000 ఆర్ పి ఎం వద్ద 83.1 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 115 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్యాక్ లో నాయకుడు అయిన హోండా జాజ్ వాహనంలో ఇదే ఐ విటెక్ ఇంజన్ ను అందించడం జరిగింది ఈ ఇంజన్ అత్యధికంగా 89 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
 
  ఈ పెట్రోల్ వెర్షన్, 5- స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ట్రాన్స్మిషన్ అను రెండు ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో అందించబడుతుంది. ఈ విషయంలో మారుతి బయపడవలసిన అవసరం లేదు చాలా సంతొషించవలసిన అవసరం ఎందుకంటే, ఇది ఏ ఎం టి ట్రాన్స్మిషన్ తో కూడా అందించబడుతుంది. మాన్యువల్ గేర్ బాక్స్ చాలా మృదువుగా ఉంటుంది మరియు సివిటి గేర్ బాక్స్ అందించే అవకాశం ఉంది.
 
  ఐ ఏ ఆర్ ఐ ప్రకారం, ఈ వాహనం యొక్క ఇంధన సామర్ధ్యం 21.4 కె ఎం పి ఎల్ వద్ద నిలుస్తుంది. అదే ఐ20 మరియు జాజ్ వాహనాల విషయానికి వస్తే, ఈ బాలెనో వాహనం తో పోలిస్తే 3 కె ఎం పి ఎల్ తక్కువ మైలేజ్ ను అందిస్తాయి. మరోవైపు పోలో వాహనం విషయానికి వస్తే, 16.5 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. ఈ ఇంధన సామర్ధ్యం ప్రకారం ఈ వాహనం గట్టి పోటీ ను ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రమగా, ఎలైట్ ఐ 20 వాహనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను కలిగి లేదు మరియు బాలెనో వాహనం, జాజ్ వాహనం కంటే 3 కె ఎం పి ఎల్ ఎక్కువ మైలేజ్ ను అందిస్తుంది అంటే 17.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
 
  మరోవైపు పనితీరు ఆధారిత వెర్షన్ విషయానికి వస్తే, మారుతి బాలెనో ఆర్ ఎస్, ఇటీవల జరిగిన 2016 ఆటో ఎక్స్పో వద్ద బహిత్గతం అయ్యింది. అంతేకాకుండా ఈ వాహనం, 1.0 లీటర్ బూస్టర్ జెట్ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ తో అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 112 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 175 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కొత్త మోటార్ కూడా, ఈ మోడల్ సిరీస్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వాహనాల మాదిరిగా అసాధారణమైన ప్రదర్శన తో వినియోగదారుల మనస్సును ఆకట్టుకోవాలని ఆశిద్దాం.
 
  Maruti Baleno_Table3

డీజిల్


బాలెనో యొక్క 1.3 డీజిల్ మిల్లు గురించి మళ్ళీ తిరిగి పరిచయం చేయవలసిన అవసరం లేదు. అదే ఇంజన్ వేర్వేరు పవర్ ఉత్పత్తులను విడుదల చేసే విషయాన్ని మనం గమనించవచ్చు మరియు ఇదే విషయాన్ని, మారుతి మరియు టాటా వాహనాలలో చూడవచ్చు. ఈ ఇంజన్ అత్యధికంగా, 4000 ఆర్ పి ఎం వద్ద 74 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 2000 ఆర్ పి ఎం వద్ద 190 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే జాజ్ వాహనం లో ఉండే ఐ డిటెక్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే అత్యధికంగా 99 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా ఐ 20 వాహనం లో ఐ డి టెక్ డీజిల్ ఇంజన్, 89 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. వాహనం యొక్క బరువు తక్కువగా ఉంది కానీ ఇది కూడా ఈ విషయంలో సహాయపడుదు ఎందువలన అంటే, ఈ ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. మారుతి సంస్థ నుండి మరింత శక్తివంతమైన మరియు ప్రీమియం ను కావాలనుకుంటున్నారా? మరింత శక్తివంతమైన 1.6 డి డి ఐ ఎస్ వేరియంట్ ను అందిస్తున్న ఎస్- క్రాస్ వాహనం వద్ద చూడవచ్చు.
 
  ఈ ఇంజన్, ఇక్కడ కూడా శబ్దం స్థాయిల తో కొనసాగుతోంది. ఈ ఇంజన్, ఖచ్చితంగా స్విఫ్ట్ వాహనం కంటే మంచి అనుభూతిని అందిస్తుంది కారణం ఏమిటంటే ఈ బాలెనో వాహనం చాలా తేలికగా ఉంటుంది. ఇది తక్కువ ఆర్ పి ఎం ల వద్ద ఒక సాధారణ డీజిల్ టర్బో- లాగ్ ను కలిగి ఉంది, కానీ కదలికలో మంచి పంచ్ ను కలిగి ఉంది. డీజిల్ ఇంజన్ ను, పెట్రోల్ ఇంజన్ తో పోలిస్తే కొంచెం ఎక్కువ పంచ్ ను అందిస్తుంది, ఈ డీజిల్ కట్టర్ తో క్యాబిన్ లో శబ్దాన్ని ఎక్కువగా అందిస్తుంది.
 
  Maruti Baleno_Table4

రైడ్ మరియు హ్యాండ్లింగ్


స్పష్టంగా, బాలెనో సస్పెన్షన్ యొక్క అమలు ఒక నగరం పరంగా ట్యూన్ చేయబడింది. ఇది, రోడ్ల పై ఉండే గుంతలను అలాగే కఠినమైన రహదారుల పై ఉండే గతుకులను శోషించుకుని మంది రైడ్ ను అందిస్తుంది. అధిక వీల్‌బేస్, తక్కువ చురుకైనది గా చేస్తుంది. కానీ, వినియోగదారులు పెద్ద క్యాబిన్ స్పేస్ కోసం అదనపు రుసుము ను చెల్లించవలసిన అవసరం ఉంది. ఈ వాహనం యొక్క నిర్వహణ, నిజంగా ఊహాజనితంగా ఉంది అలాగే మరో విషయం ఏమిటంటే, క్యాబిన్ లో ఉండే స్టీరింగ్ వీల్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ స్టీరింగ్ వీల్, తక్కువ వేగం వద్ద తేలికగా అలాగే ఎక్కువ వేగం వద్ద అధిక బరువు తో ఉంటుంది. అంతేకాకుండా, జాజ్ మరియు ఐ 20 వాహనాలలో ఉండే స్టీరింగ్ వీల్ తో పోలిస్తే, ఈ బాలెనో వాహనం లో స్టీరింగ్ వీల్ అధిక వేగం వద్ద తేలికగా ఉంటుంది.
 
    సంస్థ యొక్క తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అన్నివేళలా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉండటం కోసం నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని అందించాడు. ఈ వాహనం యొక్క ముందు చక్రాలకు, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ లను అలాగే వెనుక చక్రాలకు డ్రం బ్రేక్ లను అందించాడు. ఇవి ఈ విభాగంలో ప్రామాణికం అని చెప్పవచ్చు. అదే ఐ20 వాహనం విషయానికి వస్తే, ముందు అలాగే వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్ లు అందించబడతాయి. ఈ విషయంలో తాజా అవతార్ అయినటువంటి ఎలైట్ వాహనానికి అధిక ధర ను చెల్లించవలసిన అవసరం లేదు. ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడానికి, ఏబిఎస్ మరియు ఈ బిడి (యాంటీ లాక్ బ్రేకింగ్ మెకానిజం మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి అంశాలను అందించడం జరిగింది. ఈ బాలెనో వాహనానికి, మారుతి సంస్థ లో ఉండే అదే సస్పెన్షన్ మెకానిజాన్ని అలాగే స్టీరింగ్ యూనిట్ ను అందించడం జరిగింది. రైడ్ మరియు నిర్వహణ, నగర డ్రైవింగ్ పరిస్థితులకు అనుకూలం అని చెప్పవచ్చు అదే రహదారి పరిస్థితుల విషయానికి వస్తే అప్పుడప్పుడు అనుకూలం అని చెప్పవచ్చు.
 
 

భద్రత


వాహనానికి అలాగే ప్రయాణికులకు ప్రమాద సమయంలో గరిష్ట భద్రతను ఇవ్వడానికి, ఈ వాహనాన్ని సుజుకి టి ఈ సి టి శరీర నిర్మాణం తో రూపొందించడం జరిగింది. లక్షణాల గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వాహన సిరీస్ యొక్క సిగ్మా వేరియంట్, యాంటీ థెఫ్ట్ భద్రతా వ్యవస్థ, ఏబిఎస్ తో ఈబిడి, డ్యూయల్ హార్న్, హెడ్ ల్యాంప్ లెవలింగ్ పరికరం, డ్యూయల్ ఎయిర్బాగ్లు, ముందు సీటుబెల్ట్ ప్రీటెన్సినర్, సీటు బెల్ట్ ఫోర్స్ లిమిటర్ మరియు డ్రైవర్ సీటు బెల్ట్ రిమైండర్ వంటి నిత్యవసర అంశాలను కలిగి ఉంది. డెల్టా వేరియంట్ విషయానికి వస్తే, పించ్ గార్డ్ పవర్ విండో, వెనుక డిఫోగ్గర్, వెనుక వైపర్ తో వాషర్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి అంశాలను అందించడం జరిగింది. తదుపరి ఇన్ లైన్ వెర్షన్ అయిన జెటా వేరియంట్ విషయానికి వస్తే, ముందు ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఆటో హెడ్ ల్యాంప్‌లు వంటి భద్రతా అంశాలు ప్రామాణికంగా అందించబడ్డాయి. మరోవైపు ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, కార్నర్స్ లో పార్కింగ్ ను సులభతరం చేయడానికి రివర్స్ పార్కింగ్ కెమెరా ను ప్రామాణికంగా అందించడం జరిగింది.
 
  Table5

వేరియంట్లు


ఈ హాచ్బాక్, పెట్రోల్ & డీజిల్ ఇంజన్ లతో 4 వివిధ రకాల వేరియంట్ లతో అందించబడుతుంది. పెట్రోల్ సివిటి ఆటోమేటిక్, డెల్టా వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది. దీని అర్ధం ఏమిటంటే, ఆటోమేటిక్ అవతార్ లో ఎల్ ఈ డి డి ఆర్ ఎల్ ఎస్ లు, ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్‌లు, రివర్సింగ్ కెమెరా మరియు స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ వంటి అంశాలు అందించబడవు.
 
  మరోవైపు ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన సిగ్మా వేరియంట్ విషయానికి వస్తే, వెనుక పవర్ విండోలను మరియు వినోద వ్యవస్థ లను కలిగి లేదు. చాలా మంది ప్రజలు, ప్రీమియం హాచ్బాక్ లో ఇటువంటి లక్షణాల కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి దీనిని ఎంపిక చేసుకోవడమా లేదా అనేది పూర్తిగా మీ పై ఆధారపడి ఉంటుంది. తదుపరి వేరియంట్ అయిన డెల్టా వాహనం విషయానికి వస్తే, అనేక అంశాలను ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది గొప్ప విలువలను అందిస్తుంది మరియు అనేక లక్షణాలను కలిగి ఉంది. అవి వరుసగా, ఆడియో వ్యవస్థ, కీ లెస్ ఎంట్రీ మరియు పవర్ విండోల కొరకు స్టీరింగ్ వీల్ పై అనేక స్విచ్చులను కలిగి ఉంది. ఈ మోడల్ సిరీస్ లో, ఈ ఒక్క వేరియంట్ మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అందించబడుతుంది. ఈ వేరియంట్ విషయంలో ఒక నిరాశ ఉంది అది ఏమిటంటే, ఒక వాహనం ఆటో గేర్ బాక్స్ తో అందించబడుతుంది అంటే ఈ వాహనానికి కొన్ని అనుకూలతలు మరియు ప్రతికూలతలు కూడా అందించబడతాయి.
 
  ఈ మోడల్ సిరీస్ యొక్క తదుపరి వేరియంట్ అయిన జీటా వాహనం విషయానికి వస్తే, ఎల్ ఈ డి డి ఆర్ ఎల్ ఎస్ లు, అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్‌లు మరియు స్టార్ట్ స్టాప్ బటన్ వంటి అంశాలు అందించబడతాయి. ఈ వేరియంట్, అది కలిగి ఉన్న లక్షణాలు పరంగా, నిజమైన ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఎవరి కళ్ళు అయితే బాలెనో వాహనం గురించి ఎదురు చూస్తున్నాయో వారికి ఈ వేరియంట్ సరైనది అని చెప్పవచ్చు.
 
  ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఆల్ఫా వాహనం విషయానికి వస్తే, రివర్సింగ్ కెమెరా, ఆపిల్స్ స్మార్ట్ ప్లే వ్యవస్థ మరియు ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్‌లు వంటి అంశాలు అందించబడతాయి. ఈ లక్షణాలు అన్నియూ కూడా నిత్యవసరమైనవి ఎమి కావు మరియు బాలెనో వాహనానికి వ్యతిరేకంగా ఉన్న వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వడానికి మాత్రమే ఈ లక్షణాలు అవసరం.
 
  Table6

తుది విశ్లేషణ


బాలెనో వాహనాన్ని, దాని షోరూమ్ ఉండే ఇతర కార్ల తో పోలిస్తే మంచి అమరిక ను మరియు ఫినిషింగ్ ను కలిగి ఉంది. ఈ వాహనం బాహ్య భాగం పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది అయితే అంతర్గత భాగం పరంగా అంత ఆకర్షణీయంగా లేదు. ఈ వాహనం యొక్క డీజిల్ ఇంజన్ తక్కువ పవర్ ను విడుదల చేస్తున్నప్పటికీ, ఒక తేలికపాటి శరీరం మరియు అద్భుతమైన ఇంధన సామర్ధ్యం వలన ఒక ప్రత్యేక స్థానం లో నిలచింది. మారుతి ఎల్లప్పుడూ పర్యాయపదంగా మారింది. పనితీరు పరంగా, ఈ వాహనం ఈ విభాగం లో మధ్యలో నిలుస్తుంది మరియు ఈ కారును నగర పరిస్థితులలో నడపడం సులభతరం అని చెప్పవచ్చు. బాలెనో కలిగి ఉన్న అతి పెద్ద ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, అసాధారణ అమ్మకాల తరువాత సేవా నెట్ వర్క్ ను కలిగి ఉంది. ఈ వాహనం లో, స్విఫ్ట్ లో ఏ అంశాలు అయితే అందించబడతాయో అవన్ని చూడవచ్చు మరియు ఒక అడుగు ముందే ఉంది అని చెప్పవచ్చు. ఎవరైతే స్విఫ్ట్ వాహనం కంటే ఎక్కువ అంసాలను కావాలి అనుకుంటారో వారికి ఈ మారుతి సుజుకి సంస్థ నుండి ఉత్పత్తి అయిన బాలెనో వాహనం సరైనది అని చెప్పవచ్చు.