కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ S : ఫస్ట్ డ్రైవ్ సమీక్ష
Published On మే 28, 2019 By alan richard for ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021
- 0K View
- Write a comment
ఫోర్డ్ యొక్క ఆరు సార్లు ఇంటర్నేషనల్ ఇంజిన్, 1.0 ఎకోబోస్ట్, తిరిగి 6-స్పీడ్ గేర్బాక్స్ తో పాటు ఎకోస్పోర్ట్ S గా మన ముందుకు వచ్చింది. మేము దీనిని డ్రైవ్ చేశాము, ఈ S బ్యాడ్జ్ వీకెండ్ థ్రిల్ కోసమా లేదా రోజూ డ్రైవ్ చేయడానికా అని తెలుసుకోడానికి.
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ S అనేది టైటానియం + నవీకరించిన ఎకోస్పోర్ట్ శ్రేణి యొక్క వైవిధ్యతపై ఆధారపడింది మరియు దాని తోబుట్టువుల నుండి భిన్నంగా ఉండేలా చేయడానికి కొన్ని సౌందర్య మార్పులు చేసి మరియు సన్రూఫ్లను అందిస్తుంది. పెట్రోల్ S లో యాంత్రిక మార్పులు కూడా ఉన్నాయి మరియు ఇది ఒక కొత్త ఇంజిన్ 1.0 ఎకోబోస్ట్ ఇంజన్ ఇండియాలో-తయారైన డ్రాగన్ శ్రేణి 1.5 లీటర్ యూనిట్ స్థానంలో అమర్చడం జరిగింది. ఇది కొత్త 6-స్పీడ్ మాన్యువల్ తో జత కలిసి ముందు వచ్చిన 5-స్పీడ్ స్థానాన్ని భర్తీ చేయడం జరిగింది. ఇది కొత్త 6-స్పీడ్ మాన్యువల్ తో సరిపోతుంది, అది ముందు ఉండే 5-స్పీడ్ ని భర్తీ చేసి దీనిని పెట్టడం జరిగింది. డీజిల్ S ముందు ఉండే 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అదే 1.5 లీటర్ డీజిల్ ని కలిగి ఉంటుంది. ఎకోస్పోర్ట్ పరిధిలో మరొక కొత్త ఎడిషన్ ఏమిటంటే సిగ్నేచర్ ఎడిషన్ ట్రిం ప్యాకేజీ ఇది ఎకోస్పోర్ట్ ఫ్యామిలీ ని మరింత విస్తరిస్తుంది. అవును ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ దీని వివరాలు క్రింద చదివి తెలుసుకోండి.
బాహ్యభాగాలు
ఈ S అనేది ఆ ఫ్యామిలీ లో భిన్నంగా నిలిచేందుకు చిన్న చిన్న మార్పులను పొందింది. మీరు గమనించే మొట్టమొదటి విషయం ఏమిటంటే దీనిలో క్రోమ్ అనేది కనిపించదు, దాని స్థానంలో డార్క్, మాట్-ఫినిషింగ్ ఉపరితలాలు ఉంటాయి. ఇది గ్రిల్ ముఖంపై మరియు హెడ్లైట్లు మరియు ఫాగ్ లాంప్స్ చుట్టూ ప్రముఖంగా ఉంటుంది. ఈ హెడ్లైట్లు కూడా ప్రకాశవంతమైన HID యూనిట్లకు అప్డేట్ చేయబడ్డాయి, ఇందులో స్మోక్డ్ లెన్సులు ఉంటాయి. రూఫ్ మరియు రూఫ్ రెయిల్స్ నలుపు రంగులో పెయింట్ చేయబడ్డాయి మరియు కొత్త 17 అంగుళాల మిశ్రమాలు కూడా స్మోక్డ్ బూడిద రంగులో ఉంటాయి, ఇది SUV కి అనుకూలమైన రూపాన్ని ఇచ్చేలా చేస్తుంది.
లోపల భాగాలు
లోపల S లో మార్పులు చాలా తక్కువగా ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ పానెల్ మరియు సీట్లుకి ఆరెంజ్ కలర్ యాక్సెంట్స్ అనేవి వస్తాయి, ఇవి ఒక మంచి ఫీల్ ని మనకి అందిస్తూ ఆ మొత్తం నల్లటి ఇంటీరియర్ ని విడగొడుతూ అందంగా కనిపిస్తాయి. SYNC3 టచ్‌స్క్రీన్ డాష్బోర్డును అధిగమిస్తుంది మరియు పురాతనమైన ఫోర్డ్ అంతర్గత భాగంలో పెద్ద మెరుగుదలను కలిగి ఉంది. డ్రైవర్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త 4.3 అంగుళాల డిస్ప్లే తో ఆధునికమైనదిగా అనిపిస్తుంది. విస్తృత ముందు సీట్లు మరియు మంచి కుషనింగ్ మనకి మంచి సౌకర్యాన్ని అందిస్తాయి, కానీ వెనకాతాల ఆర్మ్రెస్ట్ అనేది కొద్దిగా తక్కువగా మడవబడుతుంది మరియు పొడవైన ప్రయాణీకులకు అంతగా ఉపయోగపడేది కాదు.
Technology
టెక్నాలజీ
ఈ S అద్భుతమైన 8-అంగుళాల SYNC3 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని పొందుతుంది. ఈ స్క్రీన్ ప్రకాశవంతమైన మరియు ప్రతిస్పందించే మరియు ఫోర్డ్ యొక్క మూడవ తరం SYNC ఇంటర్ఫేస్ సహజమైనదిగా ఉంటుంది మరియు ఆపరేట్ చేయడం అనేది సులభం. ఇది ప్రస్తుతం విధిగా పనిచేసే ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలను కలిగి ఉంది. డ్రైవర్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చిన్న సమాచార ప్రదర్శన గురించి మనం కొంచెం పిర్యాదు చేసే వాళ్ళము కానీ ఇప్పుడు ఈ సమస్య పెద్ద 4.3 అంగుళాల యూనిట్ తో పరిష్కరించబడింది. మీరు వెళుతున్నప్ప్పుడు చూడడం చాలా సులభం మరియు కొన్ని లక్షణాలు అయిన హిల్ అసిస్ట్, ఆటో హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉంటుంది మరియు టైర్ ప్రజర్ మోనిటరింగ్ వ్యవస్థ లేదా TPMS నుండి టైర్ ప్రజర్ ను డిస్ప్లే కూడా చేస్తుంది, ఇప్పుడు ఈ లక్షణం అనేది టైటానియం+ వేరియంట్ లో లేదు.
రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్ పాటు S లో టైటానియం+ యొక్క అద్భుతమైన కీలెస్ ఎంట్రీ వ్యవస్థని దీనిలో పెట్టడం జరిగింది, ఇది మాకు బాగా నచ్చింది. టైటానియం+ వేరియంట్ లో ఇంకొక అద్భుతమైన లక్షణం ఏమిటంటే సన్‌రూఫ్. అవును ఫోర్డ్ కస్టమర్ డిమాండ్లకు అనుగుణంగా మరియు ఎగ్జిక్యూటివ్ వినియోగదారులకు ఇష్టపడే లక్షణాలతో అమర్చినట్లు మరింత ఎయిర్బ్యాగ్స్ వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉందని ఫోర్డ్ అంగీకరించింది.
సిగ్నేచర్ ఎడిషన్ ఎవరికోసం?
ఇంకా ఎకోస్పోర్ట్ కుటుంబాన్ని విస్తరించడానికి సిగ్నేచర్ ఎడిషన్ ఉంది. ఇది గత ఏడాది ప్రారంభించిన ఎకోస్పోర్ట్ యొక్క టైటానియం ట్రిమ్ ఆధారంగా ఉంది. ఇది టైటానియం + ఎడిషన్ కంటే తక్కువగా ఉంది మరియు ఫోర్డ్ యొక్క మై కీ, SYNC3 మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి లక్షణాలను మిస్ అవుతుంది మరియు డ్రైవర్ మరియు ప్రయాణీకుల ఎయిర్ బాగ్స్ తో మాత్రమే వస్తుంది. ఆశ్చర్యకరంగా, ఈ సిగ్నేచర్ ఒక స్పాయిలర్ తో వస్తుంది మరియు S కి రాదు! ఇది S మీద మాట్టే నల్లటి ఫినిషింగ్ కి బదులుగా క్రోమ్ ని ధరిస్తుంది మరియు 17 ఇంచ్ అలాయ్స్ ని విభిన్న డైమండ్-కట్ డిజైన్ లలో కూడా పొందుతుంది.
లోపల భాగంలో సీట్లపై నీలం రంగు స్టిచ్చింగ్ మరియు డాష్బోర్డ్ మీద నీలం రంగు యాక్సెంట్స్ ని పొందుతుంది. అలాగే ఇది దాని సొంత 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ని కలిగి ఉంటుంది, ఇది టాప్ శ్రేణి S కంటే పెద్దది, కానీ ఇది ఫ్లై ఆడియో చేత తయారు చేయబడుతుంది. ఇది SYC3 ఇతివృత్తాన్ని అనుకరించింది కానీ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే లో విధిగా కలిగి ఉంది. 85,000 రూపాయల ప్రీమియం కోసం టైటానియం వేరియంట్ లో సిగ్నేచర్ వెర్షన్ ఆప్ష్నల్ కిట్ లాగా లభిస్తుంది, ఇది కొత్త సన్రూఫ్ ని కూడా కలిగి ఉంది. ఎవరైతే టైటానియం+ మరియు S అందించే అధనపు లక్షణాలు వద్దు అనుకొని కేవలం సన్‌రూఫ్ కావాలి అనుకుంటారో వారికి ఈ వేరియంట్ అని చెప్పవచ్చు.
ఇంజిన్ మరియు ప్రదర్శన
ఎకోస్పోర్ట్ S పెట్రోల్ ప్రమోట్ చేసిన 1.0 లీటర్ ఎకోబోస్ట్ టర్బో పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉంటుంది. ఇది 6000Rpm వద్ద 125Ps శక్తిని మరియు 1500-4500Rpm మధ్య 170Nm టార్క్ ని అందిస్తుంది. ఎకోబూస్ట్ అనేది దేనిలో విశేషమైనది అంటే దాని శుద్ధీకరణలో: ఇది స్థిరంగా ఉన్నప్పుడు మరియు నిరంతర త్రోటిల్ వద్ద ఇది చాలా తక్కువ ఇంజిన్ శబ్దం లేదా తక్కువ కంపనాలు క్యాబిన్ లోనికి వస్తాయి. కానీ ఇది త్రోటిల్ లో అడుగు పెడితే మీరు గరుకుగా ఉండే ఇంజిన్ నోట్ తో పలకరించబడతారు, కొంతమంది దీనిని ఇష్టపడతారు మరియు కొంతమంది దీనిని ఇష్టపడరు. వ్యక్తిగతంగా, నేను ఈ చిన్న మూడు సిలిండర్ల ఇంజన్ యొక్క శబ్ధాన్ని ఇష్టపడతాను.
పట్టణం లో డ్రైవ్ చేయడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే పవర్ అనేది తక్కువ ఆక్సిలరేషన్స్ లో కూడా మనకి అందిస్తుంది కాబట్టి, అలాగే త్రోటిల్ 3వ లేదా 4వ గేర్ లో వెళుతున్నప్పుడు కూడా 1600Rpm లో కూడా మంచి ఆక్సిలరేషన్ ని 4వ గేర్ లో కూడా అందిస్తుంది. డ్రైవింగ్ విషయానికి వస్తే ఉత్సాహంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు విషయాలు చిన్నగా మారిపోతాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏదైనా ఉంది అంటే అది స్పోర్టి ఇంజిన్ యొక్క లక్షణాలలో ఒకటి దాని టాప్-ఎండ్ పవర్ డెలివరీ మరియు ఎకోబూస్ట్ కిక్ కి మంచి పవర్ మరియు టార్క్ 5000Rpm తరువాత అలా తగ్గుతూ వస్తుంది, దీని వలన మీరు గేర్ షిఫ్ట్ అనేది సులభంగా చేయవచ్చు. మీ యొక్క మూడ్ ని కొద్దిగా ఇది పాడు చేస్తుంది, ఎందుకంటే మీరు ఓపెన్ రోడ్ లో S ని తీసుకొని వెళ్ళాలి అంటే గేర్ మార్చి వెళ్ళాలి కాబట్టి కొంచెం మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఈ కొంచెం త్వరగా ఉండే షిఫ్ట్స్ వలన కొంచెం నిరుత్సాహకరమైన డ్రైవింగ్ ని పొందుతారు. ఇది చెబుతున్నప్పటికీ ఈ ఇంజన్ అనేది చాలా పరిస్తితులలో పని చేస్తుంది మరియు ఇది ఎక్కువ మంది కొనుగోలుదారులకు నచ్చే విధంగా ఉంటుంది. ఫోర్డ్ ఇది 18Kmpl మైలేజ్ ని అందిస్తుందని ప్రకటించింది, అలాగే 15 శాతం వరకూ ఎమిషన్స్ ని తగ్గిస్తుందని ప్రకటించింది.
కొత్త గేర్ బాక్స్ అనేది వాడడానికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది, ఈ షిఫ్ట్స్ అనేవి చాలా స్మూత్ గా ఉంటూ మరియు తేలికైన క్లచ్ యాక్షన్ తో బాగా జత కలసి ఉంటాయి. ఇది చెబుతున్నప్పటికీ ఈ టార్కబుల్ మోటార్ ఏదైతే ఉందో దీని వలన మీరు గేర్బాక్స్ ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండడు మరియు నేనే చాలా సార్లు ఆ రేషియో లో గేర్లు డ్రైవబిలిటీ ఆప్షన్ ఉపయోగిస్తూ మార్చకుండా వదిలేసాను.
డీజిల్ లో S యొక్క 1.5 లీటర్ డీజిల్ మోటార్ ముందు లానే 100Ps శక్తిని మరియు 205Nm టార్క్ ని అందిస్తుంది మరియు ప్రతీ రోజూ ప్రయాణానికి బాగుంటుంది. పవర్ డెలివరీ సరళంగా ఉంటుంది మరియు పవర్ సడెన్ గా పెరిగిపోవడాలు అటువంటివి జరగవు కాబట్టి బాగుంటుంది. టర్బో కూడా ఈ మిడ్ రేంజ్ లోనే కిక్ అవుతుంది, ఈ 2017 లో క్లైయిం చేసిన గణాంకాలు అన్నీ అదే 23Kmpl వద్ద మైలేజ్ సంఖ్యలు ఉంటాయి, ఇది ప్రీ-ఫేస్లిఫ్ట్ కంటే కూడా 3Kmpl ఎక్కువ.
రైడ్ మరియు హ్యాండ్లింగ్
మనకి ఉన్న అంచనాల పరంగా ఫోర్డ్ సంస్థ తన యొక్క సస్పెన్షన్ సెటప్ లేదా ఎకోస్పోర్ట్ S యొక్క డైనమిక్స్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఫోర్డ్ సెటప్ మరింత గట్టిగా చేసేందుకు చూస్తున్నారు, దీనివలన రైడ్ క్వాలిటీ అన్ని రోడ్స్ పై తట్టుకోలేని విధంగా ఉంటుందని మనం భావించవచ్చు. దీనికోసం మనం వాళ్ళని నిందించలేము, ఎందుకంటే ఇదే సెటప్ నవీకరణతో 2017 లో వస్తే మనం దానిని ఇష్టపడ్డాము. ఇది ఇప్పటికీ గట్టి సెటప్ కానీ ముందు-ఫేస్లిఫ్ట్ కారు నుండి క్రాషీనెస్ అనేది దీనిలో అదృశ్యమయ్యాయి. దీనిలో పెద్ద షార్ప్ బంప్స్ కానీ రోడ్డు లెవెల్ యొక్క మార్పులు కానీ అవి మాత్రమే క్యాబిన్ లోనికి తెలుస్తాయి మరియు చిన్న చిన్నవి అంతగా తెలియవు. మేము కొత్త ఎకోస్పోర్ట్ యొక్క నిశ్శబ్దమైన క్యాబిన్ ప్రశంసిస్తున్నాము మరియు క్రూజింగ్ అయితే నిశ్శబ్ద ఎకోబూస్ట్ తో వేగంగా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటుందని మేము భావిస్తున్నాము.
మంచి బరువున్న స్టీరింగ్ పట్టణ ప్రాంతాలలో చాలా బాధ్యత వహిస్తుంది, కానీ ఊహించిన విధంగా, హైవే స్పీడ్ లలో వేగంగా లేన్ మార్పులు తీసుకొనే సమయంలో పొడవైన బాలుడు డిజైన్ వలన కొంత బాడీ రోల్ అనేది ఉంటుంది, ఇది మమ్మల్ని ఆలోచింపజేస్తుంది, అదేమిటంటే ఒకవేళ ఫోర్డ్ గనుక రైడ్ ఎత్తును తొలగించాలని నిర్ణయించుకుంటే, బ్రిడ్జ్స్టోన్ ఎకోపియా 205/50 R17 లకు బదులుగా కొంత స్టిక్కీ టైర్లను జోడించి, మరియు మనకి ఒక కొత్త RS వెర్షన్ ఇస్తే గనుక ఏమి అవుతుందా అని?
తీర్పు
కొత్త లక్షణాలు మరియు కొన్ని ట్వీక్స్ తో ఫోర్డ్ S వెర్షన్ కి మంచి గణనీయమైన విలువను కలిగి ఉందని చెప్పవచ్చు, ఇది కాకపోయినా సరే వారాంతంలో ఏదైతే థ్రిల్ మెషిన్ ని ఊహిస్తున్నామో అలాంటి థ్రిల్ మెషిన్ ఇది. కొత్త ఎకోస్పోర్ట్ ఎస్ టర్బో పెట్రోల్ కోసం రూ. 11.37 లక్షలు, టర్బో డీజిల్ కోసం రూ. 11.89 లక్షలు ధరని కలిగి ఉంది. ఈ రెండూ టైటానియం+ కంటే కూడా రూ.85,000 తక్కువకి అమ్ముడుపోతుంది. ఎకోబూస్ట్ ని ఎంచుకోవడం మీరు మంచి మరియు శుద్ధి పెట్రోల్ ట్రావెలింగ్ లో చాలా బాగుండే ఆప్షన్ మనకి లభిస్తుంది. అలాగే డీజిల్ చాలా బాగుంటుంది మరియు సన్రూఫ్ యొక్క ధర, HID హెడ్ల్యాంప్లు మరియు కొత్త ఇన్స్ట్రుమెంటేషన్ రెండు కార్లు కోసం ధర ప్రీమియంను సమర్థించాలి. మీరు నిజంగా ఆకాశాన్ని రూఫ్ ద్వారా చూడాలి అనుకుంటున్నారా ఈ విషయంలో సిగ్నేచర్ ఎడిషన్ టాప్-ఎండ్ వేరియంట్ ప్రజలచేత ఈలలు వేయించుకొని తక్కువ ధర వద్ద ఒక సన్రూఫ్ ని అందిస్తుంది.