హ్యుందాయ్ క్రెటా సమీక్ష | 1.6 VTVT మరియు 1.6 CRDi నడిపాము

Published On మే 11, 2019 By arun for హ్యుందాయ్ క్రెటా 2015-2020

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

మనకి ఈ కొత్త హ్యుందాయి క్రెటా కలిగిలించిన ఆసక్తి మరి ఏ కొత్త కారు కూడా కలిగించలేకపొయిందని చెప్పవచ్చు. మొట్టమొదటి టెస్ట్ ని ఎప్పుడైతే చూడగలిగామో అప్పటి నుండి ఆటోమోటివ్ పోర్టల్స్ లో మరియు వెబ్‌సైట్లలో దీని గురించి రకరాకాల చర్చలు పెరిగాయి. ఈ వాహనం ఇంత అద్భుతంగా అవ్వడానికి కారణం ఏమిటనేది ఒక ప్రశ్న? ఇది అంత అద్భుతంగా భిన్నంగా ఉందా? కాదు. కానీ మరి ఎందుకు ఇంత చర్చ?   

మీరు చూస్తే, హ్యుండాయ్ యొక్క బ్రాండ్ విలువ సంవత్సరాలు పెరుగుతున్న కొలదీ ఇంకా పెరుగుతునే ఉంది. ఈ తక్కువ ఖరీదు కారు తయారీదారులలో ఒకటైన హ్యుందాయ్ 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ కారుని కూడా తయారుచేస్తుంది. అది పూర్తిగా పట్టుదల వలన సాధ్యపడుతుంది. హ్యుందాయి యొక్క మొదటి తరం టస్కోన్ మరియు టెర్రాకాన్ భారీ వైఫల్యాలు. నెమ్మదిగా లేకపొతే వారి యొక్క ఆటను మరింత ముందుకు తీసుకెళ్ళి , హుండాయ్ భారతీయ ప్రజలను సులభంగా ఒప్పించగలిగింది, ఎందుకంటే ఇది ఎక్కువ ఖరీదు గల కార్లను హుందాగా తయారుచేయగలదు.

అది భారతదేశపు జనాలకి ఒప్పించిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారీగా ఉండే చిన్న SUV లాంటి కార్లను కూడా రోజూవారి వాడుకకు అందించగలదు అని. ఇందులో మొట్టమొదట చెప్పుకోవాలంటే డస్టర్ అని చెప్పవచ్చు, ఇప్పటికి కూడా డస్టర్ ఆ విభాగంలో ప్రధమమైనది అని కూడా చెప్పవచ్చు. డస్టర్ యొక్క స్పష్టమైన ప్రత్యర్థి ఏదీ అంటే ఫోర్డ్ యొక్క ఎకోస్పోర్ట్. ఈ రెండు కార్లు ఎందుకు అంతాగా అమ్ముడుపోతున్నాయాంటే, ఈ రెండూ కూడా ఒకటే డిజైన్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతాయి 'ష్రింక్ ద SUV' అనే సూత్రాన్ని ఫాలో అవ్వడం వలన ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. హ్యుందాయి ఈ పోటీలో క్రెటా తో ఒక పెద్దగా ఉండే బ్రానీ కాంపాక్ట్ SUV తో ఈ విభాగంలోనికి అడుగుపెట్టి అందరిని తన వైపు తలలు తిప్పేలా మరియు సరికొత్త రికార్డు సృష్టించేలా ఉంటుంది. ఇది విజయవంతం అయ్యిందా? చదివి తెలుసుకోండి.

బాహ్యభాగాలు:

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి అది ఏమిటంటే ఇది ఖచ్చితంగా భిన్నంగా కనిపిస్తుంది. క్రెటా దాని విభాగంలో అత్యుత్తమంగా కనిపించే వాహనం అని చెప్పుకోవచ్చు. దీని యొక్క లుక్స్ అనేవి ఎవరి దృష్టి నుండి వారికి ఉంటాయి కానీ దీని యొక్క క్లీన్ ప్రొఫైల్, కారు మీద ఫ్లో అయ్యే లైన్స్ నచ్చకపోవడం అంటూ ఏమీ ఉండదు. క్రెటా కారు, హ్యుందాయ్ యొక్క ఫ్లూయిడ్ స్కల్ప్చర్ 2.0 ఫిలాసఫీ మీద ఆధారపడింది. ఇది సమయం గడిచేకొద్దీ పరిపక్వం చెందుతూ వచ్చింది. మీరు కారు మీద ఎక్కడ చూసినా సరే అవసరం లేని వంపులు గానీ మెరుపులు గానీ ఏమీ లేవు. కేవలం చూడడానికి అందంగా మరియు సరైన రీతిలో అన్నీ అమర్చబడి షార్ప్ లైన్స్ తో ఉంది.

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

దీనిలో మీ దృష్టిని ఆకర్షించే మొదటి వాటిలో ఒకటి ఏమిటంటే దాని యొక్క  టాప్-స్పెక్ SX (O) వేరియంట్ లో ఉండే  బ్రహ్మాండమైన 17 ఇంచ్ డైమండ్ కట్ వీల్స్. దీని డిజైన్ మరియు ఫినిషింగ్ చాలా క్లాసీ లుక్ తో ఉంటూ మరియు ఈ వీల్స్ ని ఫిల్ చేసే విధంగా ఉంటుంది. డైమండ్ కట్ వీల్స్ నీడలో ఉన్నా కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి, ఈ క్రమంలో ఇది బాగా దృష్టిని ఆకర్షిస్తుంది. మిగిలిన హ్యుందాయి కార్ల మాదిరిగానే, క్రెటా కూడా కొంచెం ఎత్తైన మధ్య భాగాన్ని కలిగి ఉంటుంది మరియు అది టెయిల్ ల్యాంప్స్ చుట్టూ ఉంటుంది. అది వెనకాతల ఉండే విండో యొక్క స్పేస్ తో తలపడుతూ ఆ విండో సైజ్ ని ఇంకా తగ్గించి అందరూ నచ్చని విధంగా చేసింది. వెనుక విండో ఉండాల్సిన దాని కన్నా చిన్నదిగా కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి ఈ విభాగంలో ఒక సాధారణ అంశంగా అనిపించేవి రూఫ్ రెయిల్స్ యొక్క జత, ఇది లేకపోయినా కూడా పెద్ద సమస్య ఏమీ ఉండదని మేము భావిస్తున్నాము. ఈ రూఫ్ రెయిల్స్ వలన కొన్ని అధనపు మిల్లీమీటర్ల ఎత్తు దీనికి రావడం జరుగుతుంది.

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

దీని ముందర భాగం పెద్ద ప్రొజక్టర్ ల్యాంప్స్ తో ఉంటూ చాలా దృఢంగా ఉంటుంది. దీనికి హెడ్‌లైట్ యొక్క బేస్ దగ్గర డే టైం రన్నింగ్ లైట్స్ కూడా ఉంటాయి. ఈ క్రెటా ట్రేడ్‌మార్క్ హెక్సాగొనల్ హ్యుందాయి గ్రిల్ ని హారిజాంటల్ క్రోం స్లాట్స్ తో కలిగి ఉంటుంది. అవి సరిగ్గా బోనెట్ యొక్క చివరి అంచులో అమర్చబడి ఉన్నాయి. బోనెట్ అనేది దీనిలో ఎక్కువ ముడతలు లేదా మరియు ఎక్కువ బల్జింగ్ ఉండడం అవేం లేకుండా హెడ్ల్యాంప్స్ యొక్క కొన నుండి తేలికపాటి లైన్స్ తో ఉంటాయి. ఈ పెద్ద బంపర్  ట్రాపెజోయిడల్ క్లస్టర్ లో ఉంచబడిన స్ట్రైట్ గా ఫాగ్‌ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటుంది.  

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

వెనకాతల భాగం అందరికీ అంత రుచించదు.  ఈ డిజైన్ ప్రారంభం అయితే బాగా ఆయింది కానీ అందం గురించి చెప్పాలంటే ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డిజైన్ అంతా C-పిల్లర్ ని దాటి ఉంది. స్పిల్ట్ టెయిల్ ల్యాంప్స్ చిన్న డిజైన్ ని కలిగి ఉండి మరియు చక్కగా కనిపిస్తాయి. ఈ సూక్ష్మ స్పాయిలర్ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, మనకి అంతగా నచ్చని విషయం ఏమిటంటే నంబర్ ప్లేట్ పైన ఉన్న క్రోం స్ట్రిప్ మరియు ఆ ప్రాంతం అంతా కూడా. ఇది టెయిల్-గేట్ లో ఉండి చూడడానికి అంత బాలేదు మరియు అదే బంపర్ మీద ఉండి ఉంటే చాలా బాగుండేది. అవును, అది బ్లాక్ క్లాడింగ్ ని కారు యొక్క క్రింద భాగంలో కలిగి ఉంటూ దానితో పాటూ డల్ గా సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ని ముందు మరియు వెనుక కూడా కలిగి ఉంటుంది.

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

ఇప్పుడు క్రెటా రెనాల్ట్ డస్టర్ లాగా బచ్ లుక్ అయితే కలిగి ఉండదు, అలాగే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వలె మృదువైనది కాదు. క్రెటా మరీ అంత అందమైనదీ కాదు, అలా అనీ బాగోకుండా కూడా ఏమీ ఉండదు. దీనిలో ఖచ్చితంగా ఒకటి నచ్చే అంశం ఉంది అది ఏమిటి! ఇది 'లవ్ ఆర్ హేట్ ఇట్' అనే కాన్సెప్ట్ తో ఉంటుంది, మీరు ఈ డిజైన్ ని విస్మరించలేరు'. ఇది ముందు నుండి చూడడానికి కుదించిన శాంటా ఫే పరిమాణంలో కనిపిస్తుంది, ఇది తప్పితే క్రెటా దాని సొంత లుక్ ని అది చూపించుకోగలదు.

అంతర్భాగాలు

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

ఇది లోపల భాగానికి వస్తే సాధారణ హ్యుందాయ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీని అంతర్భాగాలు ప్రధానంగా నలుపుగా లేత గోధుమ రంగులో ఉంటూ ప్రీమియం టచ్ ని జోడిస్తుంది. మాకు దీనిలో బాగా నచ్చిన అంశం ఏమిటంటే ఈ బీజ్ కలర్ డోర్ పాడ్ నుండి డోర్ పాడ్ వరకూ అందంగా ఉంటూ ఆ వెళుతున్న క్రమంలో డాష్‌బోర్డ్ యొక్క సెంటర్ నుండి కూడా పాస్ అవుతూ వెళుతుంది. ఈ డాష్‌బోర్డ్ కూడా చాలా కట్స్ మరియు క్రీజ్ లతో చాలా బిజీగా కనిపిస్తుంది. అయినప్పటికీ, ఫిట్ మరియు ఫినిషింగ్ విషయానికి వస్తే మనకి ఎటువంటి పిర్యాదులు ఉండవు. క్రెట్టా లోపల భాగాలన్నీ కూడా ప్రీమియమ్ గా ఉంటాయి, డస్టర్ తో పోల్చి చూస్తే దాని కంటే ఎక్కువ ప్రీమియమ్ గా ఉంటుంది. చాలా ఆధునిక హ్యూండై కార్లలో ఉన్నట్టుగానే, అంతర్గత భాగాలు చాలా సదుపాయంగా ఉంటుంది.

ఇది ఏమి టెక్నాలజీ అందిస్తుందనేది మనం చూసే ముందు ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పాలి, అది ఏమిటంటే క్రెటా అనేది ఈ విషయంలో మంచి మార్కులు సంపాదిస్తుంది. గేర్ లెవెర్ ముందు భాగంలో చిన్న ఖాళీ ఉంది మరియు హ్యాండ్‌బ్రేక్ కు పక్కన కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ ఆర్ర్రెస్ట్ లోపల మరింత స్టోరెజ్ స్పేస్ ఉంది మరియు డోర్ బిన్స్ 1 లీటరు సీసా మరియు కొన్ని ఫోల్డ్ చేయబడిన మ్యాగజైన్స్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. దీనిలో బాగా ఆలోచించి కొన్ని అమర్చడం జరిగింది, ఉదాహరణకు మ్యాప్ లైట్స్ క్రింద ఉండే సన్ గ్లాస్ హోల్డర్ మరియు వెనకాతల హ్యాండిల్స్ దగ్గర కోట్స్ ని పెట్టుకోడానికి హుక్స్ ఉన్నాయి. ఇంకా దీనిలో కప్-హోల్డర్లతో రేర్ ఆరంరెస్ట్లు, ఇది బేస్ వెర్షన్ ని మినహాయించే మిగతా ట్రిం లెవెల్ అంతటా ప్రామాణికంగా లభిస్తుంది. 60:40 స్ప్లిట్ సీటు హ్యుందాయ్ యొక్క డీజిల్ ఆటోమాటిక్ వేరియంట్ లో అందుబాటులో ఉంది.  

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

క్రెటా లో సెంటర్ కన్సోల్ యొక్క మధ్య భాగంలో నావిగేషన్ తో టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిష్టం ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్ యొక్క మ్యూజిక్ సిష్టం 6 స్పీకర్లతో (ముందర 2 ట్వీట్ల తో సహా) ఉంటుంది. అయితే బేస్ క్రెటా CD, USB, మరియు AUX ఎంపికలతో ప్రామాణికంగా 2 DIN మ్యూజిక్ సిస్టంతో వస్తుంది. బేస్ ట్రిమ్ లో బ్లూటూత్ లేదు, అయితే టాప్-స్పెక్ SX (O) వేరియంట్ CD ప్లేయర్ ని కలిగి ఉండదు. టచ్‌స్క్రీన్ అనేది ఇన్పుట్ కి చాలా ప్రతిస్పందిస్తుంది మరియు నిజంగా చెప్పాలంటే XUV 5OO లో ఉన్నట్టుగా నిరాశ పరచదు. ఇది ఉపయోగించడానికి చాలా సహజంగా ఉంటుంది మరియు ఈ వ్యవస్థ పనిని అర్ధం చేసుకోడానికి అంత తెలివి కూడా అవసరం లేదు.

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లేదా FATC (ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్) హ్యుందాయ్ చెప్పినట్టు ఉపయోగించడం చాలా సులభంగా ఉంటుంది,పెద్దగా డిస్ప్లే తో  మరియు సరిగ్గా సమర్థవంతంగా ఉంటుంది. మేము 40 డిగ్రీల ఉష్ణోగ్రతలను తాకినప్పుడు కూడా ఎయిర్-కాన్ యొక్క ప్రభావాన్ని పరీక్షించాము. క్యాబిన్ ని సాపేక్షంగా త్వరగా చల్లబరుస్తుంది.   

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

వెనుక ఎయిర్ కండీషనింగ్ అన్ని వేరియంట్లలో ప్రామాణికమైనది మరియు క్రెటా యొక్క పెద్ద కాబిన్ ని త్వరగా చల్లబరుస్తుంది. నిలువుగా అమర్చిన సెంట్రల్ A.C వెంట్స్ ని హుండాయ్ కలిగి ఉండడం అంత ఉత్తమమైనది కాదు అనిపిస్తుంది. స్క్రీన్ యొక్క కుడివైపున ఉండేది, స్టీరింగ్ వీల్ ని బాగా చల్లబరుస్తుంది. స్టీరింగ్ వీల్ ని దాటి ఆ గాలి ప్రవాహం డ్రైవర్ ని చేరుకోడానికి కొంత సమయం పడుతుంది. ఇది ఒక మూడ్ మార్పు బార్ ను కూడా పొందుతుంది, ఇది ఒక లైట్ యొక్క స్ట్రిప్ అని చెప్పవచ్చు, ఇది సరిగ్గా ఎయిర్-కాన్ నియంత్రణ పైన ఉంటుంది మరియు టెంపరేచర్ మారుతున్నప్పుడు ఆ కలర్ అనేది మారుతూ ఉంటుంది.

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

క్రెటా లో ఉండే సీట్లు లెథర్ అపోలిస్ట్రీ లేదా ఫ్యాబ్రిక్ తో ఉంటాయి, అది మీరు ఎంచుకున్న వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ లెథర్ చాలా ఖరీదైన ఎలన్ట్రాలో ఉపయోగించే లెథర్ కి సమానంగా ఉంటుంది మరియు చాలా రిచ్ గా అనిపిస్తుంది. ఇదే విధమైన మెటీరియల్ ని డోర్ పాడ్స్ మరియు ఆర్మ్రెస్ట్ ల మీద కూడా మీరు చూడవచ్చు. దీని ముందర సీట్లలో కూర్చోవడం చాలా బాగుంటుంది. నిజంగా ముందరి సీట్ తో మాకు ఏ ఫిర్యాదులు లేదు, అది నా 6 అడుగుల శరీరానికి కూడా చక్కగా సపోర్ట్ చేసింది. హెడ్ రూం ఉదారంగా ఉంది, మరియు మీరు సౌకర్యవంతమైన స్థితిలోకి రావడానికి సీట్లు తగినంత చక్కగా ఉంటాయి. నేను ఏదైనా ఎత్తి చుపాలి అంటే మాత్రం షోల్డర్ రూం అని చెప్పవచ్చు, ఇది కొంచెం ఏవరేజ్ గా ఉంది.

దీనిలో వ్యూ అనేది కమాండింగ్ గా ఉంటుంది  మరియు సీటు అక్కడ చాలా సౌకర్యవంతమైన వాటిలో ఒకటిగా ఉంటుంది. డ్రైవర్ ఫాక్స్ లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటాడు. ఈ యూనిట్ ఎలైట్ i20 లో ఏ విధంగా అయితే ఉంటుందో దీనిలో కూడా అలానే ఉంటుంది. బేస్ ట్రిమ్ కాకుండా, అన్ని ఇతర వేరియంట్స్ స్టీరింగ్ మౌంట్ చేయబడిన ఆడియో మరియు కాల్ కంట్రోల్స్ ని పొందుతాయి. దీని స్టీరింగ్ అనేది లైట్ గా మరియు  త్వరగా కదిలే విధంగా ఉంటుంది.

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

క్రెటా లో వెనకాతల కూర్చొనే ప్యాసింజర్స్ కొంచెం ఇరుకుగా ఫీల్ అవుతారు. డార్క్ ఇంటీరియర్ తో హై విండో లైన్ ఉండడం వలన క్యాబిన్ లోనికి అంత గాలి వస్తుందని భావించలేము. స్పేస్ గురించి పిర్యాదు చేయడానికి అంతగా ఏమీ ఉండదు కానీ వెనుక బెంచ్ లో కొంచెం కుషనింగ్ అనేది ఉండి ఉంటే బాగుండేది. ఈ సీటు రిక్లైనర్ లాగ కూడా ఉంటుంది, ఇలా ఉండడం వలన చక్కగా రిలాక్స్ అవ్వచ్చు మరియు కప్‌హోల్డర్స్ ఒక సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఇక్కడ కప్ హోల్డర్స్ తో అందించబడుతుంది. దూరపు ప్రయాణాలు  చేసేటప్పుడు నడుము క్రింద భాగంలో కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు, కానీ మరీ అంత పిర్యాదు చేసే విధంగా ఏమీ ఉండదు.

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

దీనిలో బూట్ స్పేస్ 402 లీటర్ల వద్ద చక్కగా ఉంది. ఈ లోడింగ్ ఏరియా బాగుంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది మరియు గ్రౌండ్ నుండి కూడా అంత ఎత్తుగా ఏమీ ఉండదు. వారం కి సరిపడా లగేజ్ తీసుకొని వెళ్ళడం పెద్ద సమస్య అయితే కాదు.

క్రెటా కారు హ్యుందాయి యొక్క గుర్తింపు తెచ్చిన లక్షణాలు అయినటువంటి కూలెడ్ గ్లోవ్ బాక్స్, ఆటో హెడ్ల్యాంప్స్ మరియు ఆటో వైపర్స్ వంటి లక్షణాలను కోల్పోతుంది. ధరల తగ్గింపు అనేది టాప్ స్పెక్ పెట్రోల్ లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది,ఎందుకంటే దీనిలో గేర్ నాబ్ బేస్ హ్యుందాయ్ గ్రాండ్  i10 నుండి తీసుకోబడింది మరియు స్టీరింగ్ వీల్  చాలా ప్లాస్టిక్ గా ఉంటుంది మరియు తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే, సూపర్ విజన్ క్లస్టర్ (డ్రైవర్ ఇన్ఫో / MID) వంటి లక్షణం కూడా హ్యుందాయి టాప్ స్పెక్ పెట్రోల్ క్రెటా లో ఇవ్వడం జరిగలేదు. టాప్-డీజిల్ క్రెటా లో పెట్రోల్ లా మీకు చిన్న మార్పు లేకుండా అయితే ఉండదు. పైన చెప్పిన లక్షణాలు ఏమీ కూడా డీల్ బ్రేకర్లు అయితే కావు, కానీ వారు మీరు 1.5 మిలియన్ పెట్టి కొన్న కారుకి ఇవన్నీ ఉండాలి అనుకుంటారు. దానికితోడు, క్రెటా ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చే విధంగా ఏమీ ఉండదు.

డ్రైవ్

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

ఇంజన్ ఎంపికలలో పవర్ అవుట్‌పుట్స్ మరియు మిగిలిన గణాంకాలలోనికి వెళ్ళే ముందు క్రెటా యొక్క రైడ్ క్వాలిటీ గురించి ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఈ కారు యొక్క సస్పెన్షన్ అనేది బంప్స్ మరియు గతకలను ఈ కారు ఎలా తెలియకుండా చేస్తుంది అంటే దీని యొక్క పై విభాగంలో ఉన్న కారు కూడా ఆ విధంగా చేయలేదు. ఆ పరిమాణంలో ఉన్న వాహనాన్ని కూడా అది బాగా ఫ్లాట్ గా వెళ్ళేలా చేస్తుంది. బాడీ రోల్ బాగా నియంత్రణలో ఉటుంది మరియు కార్నర్స్ లో టర్న్ తీసుకోనటపుడు కూడా అది కంట్రోల్ లో ఉంటుంది. ఈ సస్పెన్షన్ అనేది ఏదైనా టర్న్స్ అవి వచ్చినపుడు ఒక ఆయుధంగా పని చేస్తుందని చెప్పలేము కానీ, మీరు నిజంగా దీనిని ఎంచుకున్నట్లయితే ఇది మిమ్మల్ని నిరాశపరచదు అని ఖచ్చితంగా చెప్పగలము.

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

స్టీరింగ్ కి చాలా మంది మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు, అది దృష్టిలో ఉంచుకొని దీనిని ఇంకా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అమ్ముడుపోతున్న హ్యుందాయ్ కార్లలో చాలా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ స్టీరింగ్ తక్కువ వేగంతో వెళ్ళినపుడు తేలికగా ఉంటూ వేగం పెరుగుతున్న కొలదీ బరువు సమపాళ్ళలో ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే ఈ తేలికైన స్టీరింగ్ అనేది ముంబాయి ట్రాఫిక్ లో ఒక దన్నుగా నిలిచింది, ఎందుకంటే రోజంతా అలసిపోయి ఉన్నప్పుడు చేతికి తక్కువ పని చెప్పడం మాకు కావలసినది ఆ విషయంలో ఇది బాగా సహాయపడుతుంది అని చెప్పవచ్చు. ఈ లైట్ స్టీరింగ్ క్రెటా కారుని పార్క్ చేస్తున్నపుడు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనిని తిప్పడం గానీ లేదా చిన్న ప్రదేశంలో దీనిని టర్న్ చేసేటపుడు కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ స్టీరింగ్ పెరుగుతున్న వేగంతో పాటూ బరువు పెరగకుండా ఉంది, ఈ హ్యుందాయి స్టీరింగ్ వింతగా ప్రవర్తిస్తుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించడంలో సరైన దిశలో చర్యలు తీసుకుందని మేము సురక్షితంగా చెప్పగలం.      

క్రెటా 3 ఇంజిన్ ఎంపికలతో అందించబడుతున్నది. అన్ని ఇంజన్లు కూడా హ్యుందాయ్ వెర్నా సెడాన్ నుండి తీసుకోబడ్డాయి. ఇది  1.6 లీటర్ పెట్రోల్, 1.6 లీటర్ డీజిల్ మరియు ఒక 1.4 లీటరు డీజిల్ ఇంజన్లను కలిగి ఉంది. 1.6 లీటరు డీజిల్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ను పొందుతుంది, అయితే ఇతరులు 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్సులతో ఉన్నాయి. నేను టాప్ స్పెక్ 1.6 డీజిల్ మరియు పెట్రోల్ మీద నా చేతులు వేసాను. డీజిల్ ఇంజన్ గురించి తెలుసుకుందాం, వివరాలలోనికి వెళ్దామా?

1.6 CRDi

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

ప్రారంభించాలంటే డీజిల్ క్రెటా లో ఉండే ఈ NVH లెవెల్స్ ఆహ్లాదకరమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు ప్రారంభించిన తరువాత ముందుగా ఉండే ఇంజన్ నుండి వచ్చే శబ్ధం అవన్నీ కూడా కొద్ది సేపటికే తగ్గిపోయి స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రిఫైన్మెంట్ లెవెల్స్ ఖచ్చితంగా చర్చించుకోదగినవి. ఈ తక్కువ NVH లెవెల్స్ డస్టర్ లా కాకుండా బాగా భిన్నంగా ఉండేలా చేస్తుంది, ఎందుకంటే డస్టర్ లో ఉండే డీజిల్ క్లాటర్ అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఈ మోటార్ 128Ps శక్తిని మరియు ఒక ఆరోగ్యకరమైన 260Nm టార్క్ ని అందిస్తుంది.

మీ అడుగులు సరిగ్గా గేర్ మీద పడినట్లయితే ఈ వెర్నా నుండి తెచ్చుకున్న మోటార్ క్రెటా యొక్క అధనపు బరువు ని కూడా మనకి మరిపించేలా చేస్తుంది.  చాలా హ్యుందాయి కార్ల మాదిరిగా దీనిలో కూడా టర్బో లాగ్ అనేది 1900rpm వద్ద స్పష్టంగా కనిపిస్తుంది, దాని తర్వాత పవర్ డెలివరీ మృదువుగా ఉంటుంది. ఈ టార్క్ ఎక్కువ ఉండడం వలన ఒక గేర్ ఎక్కువ లోనే మిమ్మల్ని ఉంచుతూ ఇబ్బంది కలగకుండా తీసుకెళుతుంది. క్రెటా కారు కి తరుచుగా డౌన్ షిఫ్ట్స్ అనేవి అవసరం లేదు. ఉదాహరణకు ఇంజిన్ ఇబ్బంది పడకుండా, సులభంగా 2 వ గేర్ లో 15 కిలోమీటర్ల వేగంతో వెళిపోవచ్చు. ఇంకా, తక్కువ రివల్యూషన్స్ లో డీజిల్ మోటర్ లో వచ్చే ఆ పుల్లింగ్ అనేది బాగుంటుంది.  

క్లచ్ చాలా తేలికగా మరియు చక్కగా ఉంటుంది, దూరపు ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటుంది. క్లచ్ యొక్క పుష్ మరియు విడుదల అనేది ఒక ఒక సమస్య కానే కాదు, కానీ బంపర్ నుండి బంపర్ ట్రాఫిక్ లో కేవలం ఇబ్బంది ఉండవచ్చు. నగరం లోపల లాగ్ అనేది చిరాకుగా ఉంటుంది, మీరు అనుమతించే ట్రాఫిక్ లో ఆ చిన్న గ్యాప్ లో వెళ్ళేందుకు అనుమతించదు.  మీరు నగరం పరిమితుల్లోనే డీజిల్ క్రెటా తో కొంచెం ఓపికగా ఉండాలి.     

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

ఇదిలా చెబుతున్నప్పటికీ హైవేస్ లో క్రెటా డీజిల్ దూసుకొని వెళుతుందని చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా రోజంతా మూడంకెల సంఖ్య గల వేగంతో వెళ్ళగలదు. ఇది నిజంగా అలా వెళ్ళగలదు. అయితే ఎలన్ట్రా మరియు వెర్నా వంటి కార్లు ఇలాంటి వేగంతో వెళ్ళగలిగినప్పటికీ, డ్రైవర్ కి మాత్రం అంత నమ్మకాన్ని అందించవు. అయితే క్రెటా దృఢంగా ఉన్నట్టు ఉంటుంది మరియు ఊగుతూ ఉన్నట్టుగా అలా ఏమీ అనిపించదు.

1.6 VTVT

క్రెటా పెట్రోల్ యొక్క టాప్-స్పెఫ్ వేరియంట్ SX +. దీనికి తెలియని వారి కోసం ఇది చెప్పడం జరుగుతుంది, అది ఏమిటంటే డీజిల్ క్రెటా యొక్క టాప్-స్పెక్ SX (O) కన్నా ఒక ట్రిమ్ స్థాయి తక్కువ. ఇందులో మనకి చాలా సౌకర్య లక్షణాలు తీసేసినప్పటికీ సస్పెన్షన్ మరియు రైడ్ నాణ్యత డీజిల్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. కాబట్టి, కేవలం హుడ్ కింద ఉన్న వాటిపై దృష్టి పెట్టండి.

1.6 లీటర్ పెట్రోల్ మోటార్ 123Ps శక్తిని మరియు 151Nm టార్క్ ని అభివృద్ధి చేస్తుంది.  మీకు దీనిని ఒక గేర్ తక్కువ లోనే నడిపితే బాగుంటుంది అనిపిస్తుంది, అప్పుడు ఆహ్లాదకరమైన డ్రైవింగ్ ని పొందగలరు. మోటార్ అనేది కొంచెం బద్దకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది 1500rpm దగ్గర కొంచెం నెమ్మది అయినట్టు అనిపిస్తుంది, అటువంటప్పుడు ఇంజన్ లేపాలి అంటే మీ కుడికాలి పాదానికి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు మోటార్ అనేది ఎక్కువ బర్న్ అవుతున్నపుడు ఓవర్‌టేక్ చేయాలి.  ఇంకా చెప్పలంటే ఒక గేర్ తగ్గించి చేస్తే ఇంకా బాగా ఓవర్‌టేక్ చేయగలరు. మీ లేన్ నుండి బయటకి వెళ్ళి ఆక్సిలరేషన్ తొక్కడానికి అవ్వదు. మీరు ఇంజన్ ని రివల్యూషన్స్ పెంచుతున్నప్పటికీ, ఇంజిన్ ధ్వని అనేది కొంచెం క్యాబిన్ లోనికి వస్తుంది, ముఖ్యంగా 3500 rpm దాటాక ఇంకా వస్తుంది. ఇది బోనెట్ క్రింద ఇన్సులేషన్ లేకపోవడం అనేది దీనికి ఒక కారణమని చెప్పవచ్చు. అయితే, ఈ ధ్వని అనేది చాలా సమయాల్లో ఆనందకరంగా ఉంటుంది. అది కాకుండా సామర్ధ్యం విషయానికి వస్తే క్రెటా యొక్క పెట్రోల్ కూడా అంత ఉత్తమమైనది కాదు. ఈ హ్యుందాయి మేము పరీక్షిస్తున్నపుడు లీటర్ కి 11 కిలోమీటర్లు ఇస్తుంది. హ్యుందాయి ఏదైతే మైలేజ్ ని అందిస్తుందని ప్రకటించిందో అది హైవే మీద రావచ్చు.

భద్రత

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

దీనిలో భద్రతా లక్షణాలు కూడా ఏమీ తక్కువ లేవు, చాలా ఉన్నాయి. టాప్ వేరియంట్ SX (O) యాంటీలాక్ బ్రేక్లు, ఆరు ఎయిర్ బాగ్స్, వెహికెల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్(VSM) మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి లక్షణాలను అందించింది. డీజిల్ క్రెటా కొనుగోలుదారులందరికీ మంచి లక్షణాలు అందించినప్పటికీ, పెట్రోల్ క్రెటా కొనుగోలుదారులకు అందించే లక్షణాలు ఏదో సవతి తల్లి పిల్లలకి ఇచ్చినట్టు అందించింది. ఇది డ్రైవర్ కి సంబందించి కొన్ని లక్షణాలు మిస్ చేసింది, కానీ డ్రైవర్ మరియు ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగ్ మాత్రమే కలిగి ఉంటుంది. పెట్రోల్ SX(O) కూడా అన్ని అవసరమైన బాక్స్ లు టిక్ చేసుకొని ఉంటే బాగుండేది.  

మొత్తం మీద, మీరు దానిని డ్రైవ్ చేసినప్పుడు క్రెటా అయితే నిరాశ పరచదు. ఇది సిటీ లో తిరగడానికి మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ ట్రిప్స్ చేయడానికి కూడా బాగుంటుంది. సస్పెన్షన్ మరియు రైడ్ నాణ్యత విషయానికి వస్తే యూరోపియన్లు కూడా చాలా మెచ్చుకున్నారు, ఇదే మనకి ప్రశంస అని చెప్పుకోవచ్చు. స్టీరింగ్ నుండి కొంచెం ఎక్కువ ఫీడ్‌బ్యాక్ వస్తే మేము ఇష్టపడతాము, కానీ హ్యుందాయ్ ప్రయత్నించినందుకు గానూ దీనికి పూర్తి మార్కులు ఇవ్వాలి.  

తీర్పు

Hyundai Creta Review | 1.6 VTVT and 1.6 CRDi Driven!

ఏది మీరు కొనుగోలు చేయాలి? మీ క్రొత్త క్రెటాను అప్పుడప్పుడు ఉపయోగించాలని మీరు ప్లాన్ చేస్తే, పెట్రోలు ని కొనండి.  ఇది నగరంలో మంచి కాంపాక్ట్ SUV. ఒకవేళ రన్నింగ్ గణనీయంగా అధికంగా ఉంటే మరియు ఇంట్రాసిటీ డ్రైవులు ఎక్కువగా చేయాలనుకుంటే డీజిల్ AT ఎంచుకోండి. అయితే, మా అభిమాన క్రెటా ఏంటంటే డీజిల్ MT SX(O) స్పెక్.

ఇక్కడ హ్యుందాయి ఏం చేసిందో అది చాలా ప్రశంసనీయం, ఇక్కడ అన్ని రకాల ఉపయోగానికి మరియు అన్ని రకాల ధరలలో అందించబడుతుంది. నేను వేసిన మొదటి ప్రశ్నకి వెళ్దాము, ఇది ఆ రూల్స్ ని మళ్ళీ తిరగ రాస్తుందా మరియు ఈ సెగ్మెంట్ లో కారు కొనుక్కొనే వాళ్ళకి తలలు తిప్పుకోనేలా చేస్తుందా? చెప్పాలంటే హ్యుందాయి తన ఇండియా లో ఉండే డిమాండ్స్ ని తీర్చడానికి తన యొక్క ఎగుమతి కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది,  ఇది ఉత్పత్తిని పెంచినా కూడా వెయిటింగ్ పిరియడ్ అనేది నెలలలో ఉంది. ఇది ఉత్పత్తిని పెంచినా కూడా వెయిటింగ్ పిరియడ్ అనేది నెలలలో ఉంది. క్రెటా ఖచ్చితంగా విభాగంలో నిప్పు రగిలించింది.

తాజా ఎస్యూవి కార్లు

రాబోయే కార్లు

తాజా ఎస్యూవి కార్లు

×
We need your సిటీ to customize your experience