ఫోర్డ్ ఎకోస్పోర్ట్ -విశ్వసనీయత నివేదిక
Published On జూన్ 06, 2019 By prithvi for ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021
- 0 Views
- Write a comment
న్యూఢిల్లీలోని 11 వ ఆటో ఎక్స్పోలో ఫోర్డ్ మొదటిసారిగా ఎకోస్పోర్ట్ ని ప్రదర్శించినప్పుడు, సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV కొత్త అంచనాలను తీసుకొచ్చింది. దీని యొక్క ఆన్ లైన్ లో ప్రీ-లాంచ్ మరియు బహిరంగ ప్రమోషన్లు ఈ అమెరికన్ ఆటోమేకర్ తమ యొక్క మార్క్ ని అందరూ కనుగొనేలా చేసింది మరియు తమ యొక్క బ్రాండ్ ని కూడా అందరూ గుర్తించే విధంగా ఉండేలా చేసింది. దీని యొక్క జనాధరణ మరియు ఉత్సుకత వలన వినియోగదారులు దీని డెలివరీ తీసుకోడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వచ్చేది, ముఖ్యంగా ఎవరైతే డీజిల్ మోడల్ యొక్క టైటానియం వేరియంట్ కోసం వెళ్ళలనుకొనేవారో వారు ఇంకా దీర్ఘకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. చెప్పాలంటే పైన చెప్పిన డీజిల్ మోడల్ ఖచ్చితంగా ఉండాలి, కానీ ఫోర్డ్ తమ యొక్క 1 లీటరు ఎకోబూస్ట్ ఇంజిన్ ని ప్రోత్సహించడం వలన మేము ఈ విధంగా ఒక అప్డేట్ ని ఇవ్వాలని అనుకున్నాము.
ప్రోటోటైప్ నుండి ప్రొడక్షన్ వరకూ ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క విస్తరణ అనేది మనకి చాలా స్పూర్తిని ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అర్బన్ SUV తన యొక్క డిజైన్ అంశాలతోనే ఉంటూ వచ్చింది. దీని యొక్క దూకుడు స్టైలింగ్ మరియు నవీకరించబడిన లుక్స్ ఎంట్రీ స్థాయి కాంపాక్ట్ SUV విభాగంలో అత్యంత శక్తివంతమైన SUV లలో ఒకటిగా చేస్తుంది. దీని ప్రముఖ క్రోమ్ హైలైట్ చేసిన గ్రిల్, దీనికి తోడు దీని యొక్క సన్నగా ఉండే హెడ్ల్యాంప్స్ క్లస్టర్స్ ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశాలలో ఒకటిగా ఉంది.
ఒక చెక్కిన బోనెట్, ఫ్లేరెడ్ వీల్ ఆర్చ్లు, 16 అంగుళాల అలాయ్ వీల్స్, సిల్వర్ రూఫ్ రెయిల్స్ అన్ని కూడా దానికి స్పోర్టి లుక్ ని ఇస్తాయి. వెనకాతల అమర్చబడిన స్పేర్ వీల్ బాగా అమర్చబడి టెయిల్ ల్యాంప్స్ తో పాటూ అందంగా ఆ డిజైన్ లోనికి ఇమిడిపోతాయి. కుడివైపు ఉన్న టెయిల్ లైట్ అనేది మనం దగ్గర నుండి చూసినట్టు అయితే చిన్న బటన్ ఉంటుంది, ఇది బూట్ ఓపెనర్ క్రింద పని చేస్తుంది. ఈ ఆలోచన అనేది ఈ SUV కి ఒక మంచి లక్షణంగా ఉంది అని చెప్పవచ్చు.
ఒకేలా పోలి ఉండే ఇంటీరియర్స్ యొక్క వినియోగం అనేది ఒక సాధారణ అంశం క్రింద మారింది, అందువలన ఎకోస్పోర్ట్ అనేది ఫోర్డ్ ఫియస్టా వలె ఇదే క్యాబిన్ ని పంచుకుంటుంది. అయినప్పటికీ, దీనిలో ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంది. అందువలన, ఎకోబూస్ట్ మోడల్ యొక్క టైటానియం ట్రిమ్ వేరియంట్ కి కీలెస్ ఎంట్రీ, స్టార్ట్ స్టాప్ ఫంక్షన్, లెథర్ అప్హోల్స్టరీ, క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ కోసం ఎత్తు సర్దుబాటు, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు మరియు మైక్రోసాఫ్ట్ యొక్క SYNC ఇంటర్ఫేస్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు అన్నీ కలిపి మరియు దీని యొక్క అంతర్భాగాలు కూడా జత కలిసి మంచి బాగా అందమైన ఇంటీరియర్స్ ని అందిస్తాయి, కానీ బోర్డుపై ప్లాస్టిక్ నాణ్యత అనేది ఒకరు ఇష్టపడిన విధంగా అంత ఆకట్టుకునేదిగా ఉండదు. అయితే, ఇది ఇలా ఉన్నప్పటికీ మొత్తం ధరకు మంచి విలువను మరియు సౌకర్యం అందిస్తూ దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి మంచి సౌకర్యాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. ముందరి వరుసలో లెగ్, షోల్డర్ మరియు హెడ్‌రూం పుష్కలంగా అందిస్తుంది, అంతేకాక డ్రైవర్ కోసం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగపడడానికి సెంటర్ ఆరంరెస్ట్ అందించడం జరిగింది. తొడ మద్దతు ముందర మరియు వెనుక భాగంలో చాలా బాగుంది. అయినా కూడా ముగ్గురిని వెనకాతల కూర్చోబెట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే షోల్డర్ రూం చాలా తక్కువగా ఉంది కాబట్టి. మిగిలిన హెడ్‌రూం మరియు లెగ్‌రూం అనేది పర్వాలేదు బాగానే ఉంటుంది, ముందర సీట్లు మొత్తం వెనక్కి జరిపినా కూడా అవి బాగుంటాయి. 60/40 రేర్ స్ప్లిట్ మరింత అదనపు 750 లీటర్ల స్థలాన్ని నిర్ధారిస్తుంది.
పదునైన పంక్తులను ప్రదర్శిస్తూ, ముందు డాష్ లో ఆడియో మరియు వాహన నియంత్రణల కోసం ఒక సమాచార ప్రదర్శన వలె పనిచేసే 3.5 MFD స్క్రీన్ ఉంటుంది. దాని యొక్క సెల్ ఫోన్ లాంటి కీప్యాడ్ ద్వారా ప్రేరేపించబడ్డ సెంటర్ కన్సోల్ అనేది దాని సిల్వర్ సరౌండిస్ తో బోర్డు మీద సంగీత వ్యవస్థ నియంత్రణలు ఉంటాయి; అది అధునాతనంగా కనిపిస్తుంది, కానీ వాడుతుంటే బాగుంటుంది. వాయిస్ కమాండ్ తో SYNC ను చేర్చడం క్యాబిన్ అనుభవాన్ని మరింత పెంచుతుంది, కేవలం కేవలం ఒక కమాండ్ ద్వారా మ్యూజిక్ ట్రాక్లను మార్చగలదు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి లాంగ్ డ్రైవ్స్ లో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఇది మరొక ప్రయోజనంగా చెప్పవచ్చు. దూరపు ప్రయాణాలలో మనకి స్టోరేజ్ అనేది ముఖ్యమైన అంశం క్రింద మారుతుంది, ఎందుకంటే లగేజ్ పెట్టడానికి మరియు చిన్న చిన్న సామాను ఉంచడానికి బాగుంటుంది. అందువల్ల, ఎకోస్పోర్ట్ మనకి ముందర మరియు వెనుక భాగాలలో కావలసినన్ని కప్ హోల్డర్స్ ని అందిస్తుంది, దీనితో పాటూ మంచి పరిమాణం గల గ్లవ్ బాక్స్ ని కూడా అందిస్తుంది. 346 లీటర్ల అసలు బూట్ స్పేస్ ఈ వాహనం యొక్క సామాను మోయగల సామర్థ్యాన్ని అందిస్తుంది, ఇది సబ్ 4 మీటర్ కారులో దాని మొత్తం పరిమాణం పరిగణిస్తే గనుక చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు.
భద్రత పరంగా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం), డ్రైవర్ & కో ప్యాసెంజర్ ఎయిర్బాగ్స్, ఎమర్జెన్సీ అసిస్ట్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్బాగ్స్, రియర్ పార్కింగ్ సెసార్స్, ఎమర్జెన్సీ బ్రేక్ హాజార్డ్ వార్నింగ్, ఇమ్మోబిలైజర్ సిస్టం వంటి కొన్ని పేర్కొన్న ప్రామాణిక లక్షణాలను కలిగి ఉంది.
దాని ఆకర్షించే బాహ్య భాగాలు మరియు అంతర్గత లక్షణాలు ఉన్నప్పటికీ, ఫోర్డ్ నిజంగా గర్వంగా చెప్పుకొనే విషయం ఏదైనా ఉంది అంటే అది దాని యొక్క పెట్రోల్ వేరియంట్ ని పవర్ చేసే ఇంజన్. "ఎకోబోస్ట్" గా పిలవబడే, ఈ వేరియంట్ 1.0 లీటరు ఇంజిన్ ని హుడ్ క్రింద కలిగి ఉంటుంది మరియు ఇది ఒక మంచి పనితీరుని మనకి అందిస్తుంది. దీని 999 క్యూబిక్ సామర్ధ్యం యూనిట్ 6000rpm వద్ద 123bhp గరిష్ట శక్తి ఉత్పత్తి చేస్తుంది, అలాగే 1400-4500rpm వద్ద 170Nm టార్క్ ని అందిస్తుంది. పేపర్ మీద చూస్తే గనుక పేర్కొన్న గణాంకాలు కొంచెం తక్కువగా కనిపిస్తాయి, కానీ చక్రం వెనక ఒకసారి మీరు చూస్తే గనుక ఈ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV యొక్క అసలైన గణాంకాలు మీరు అనుభూతి చెందుతారు.
ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ రెండింటి నుండి శుద్ధీకరణ స్థాయి చాలా బాగుంది. చెప్పాలంటే ఈ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఏదైతే ఉందో ఇది గేర్ షిఫ్ట్స్ విషయానికి వస్తే సిటీ మరియు హైవే లో చాలా బాగా అందంగా పని చేస్తుందని చెప్పవచ్చు.
5.3 మీటర్ల ఒక టర్నింగ్ వ్యాసార్థంతో, ఎకోస్పోర్ట్ అనేది చాలా రద్దీగా ఉండే స్థలాలలో మరియు చిన్న చిన్న స్థలాలలో కూడా సులభంగా వెళ్ళగలదు. దీని పొడవు మొత్తంగా 3999mm , వెడల్పులో 1765mm మరియు ఎత్తులో 1708mm ఉంటూ ఖచ్చితంగా పైన చెప్పిన అంశాలను ఇంకా బలపరుస్తుందని చెప్పవచ్చు. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిమీ గా ఉంటూ దాని యొక్క ఆన్ మరియు ఆఫ్ రోడ్డు సామర్ధ్యాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. కానీ దీనిలో 4 వీల్ డ్రైవ్ వ్యవస్థ అనేది లేకపోవడం అనేది దీనిలో కొంచెం లోపం అని చెప్పవచ్చు.
డ్రైవర్ దృక్పథంలో చూసుకున్నట్లయితే, డ్రైవింగ్ స్థానం అనేది మాన్యువల్ అడ్జస్టబుల్ సీటుతో బాగుంటుంది, ఇది త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ యొక్క అనుభూతితో నిజంగా స్పోర్టిగా ఉంటుంది. కాయిల్ స్ప్రింగ్ తో ఉండే ఈ ఇండిపెండెంట్ మక్ ఫెర్సొన్ స్ట్రట్ మరియు యాంటీ రోల్ బార్ దీనికి ఫాలో అయిన ట్విన్ గ్యాస్ తో ఉండే సెమీ-ఇండిపెండెంట్ ట్విస్ట్ బీం మరియు వెనుక భాగంలో ఆయిల్ తో నిండిన షాక్ అబ్సార్బర్స్ మంచి సస్పెన్షన్ సెటప్ క్రింద ఉంటాయి. ఈ రెండు కలయిక వలన ఎకోస్పోర్ట్ గతకలు, చెడు రహదారులను సునాయాశంగా దాటేస్తుంది, హైవే మీద కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి.
దీని యొక్క హ్యాండిలింగ్ అనేది చాలా బాగుంటుంది, అధిక స్పీడ్స్ లో బ్రేక్స్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం బాడీ రోల్ అనేది ఉంటుంది. కార్నర్స్, మరియు టర్నింగ్స్ లో ఇది సులభంగా నిర్వహించగలుగుతుంది. మిగిలిన విషయాలకు వస్తే ముందు భాగంలో వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ మరియు వెనక భాగంలో డ్రం బ్రేక్స్ సమర్థవంతమైన బ్రేకింగ్ ని అన్ని సమయాల్లో అందిస్తుంది. ఇది విశ్వసనీయత నివేదిక కాబట్టి, ఈ పరీక్షలో అతి ముఖ్యమైన అంశం ఇంధనంగా చెప్పవచ్చు. 700 కిలోమీటర్ల డ్రైవింగ్ చేస్తే(నగరం మరియు రహదారి) పై ఫోర్డ్ ఎకోస్పోర్ట్ తిరిగి ఎంత అందిస్తుంది అనుకుంటున్నారు? ఇది కేవలం 1000CC కావడంతో SUB 12.5 Kmpl ఇంధన సామర్ధ్యాన్ని హైవేలో అందించింది మరియు నగరంలో 10.5 Kmpl మైలేజ్ ని ఇచ్చింది.
తీర్పు:
ఎకోస్పోర్ట్ రూపంలో ఫోర్డ్ యొక్క తాజా సమర్పణ భారతీయ మార్కెట్ లో బాగానే ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీని ధర మస్క్యులర్ బాహ్య డిజైన్ తో మరియు సౌకర్యవంతమైన అంతర్గత భాగాలతో దాని ధర ప్రభావము పోటీలో మంచి ప్రభావం చూపిస్తుంది అని చెప్పవచ్చు. మా పరిశీలనకు వస్తే ఎకోబూస్ట్ అనేది ఇంజన్ లో బాగా తెలివైనది అని చెప్పవచ్చు, అలాగే మంచి రిఫైన్మెంట్ మరియు మంచి పనితీరుని మనకి అందిస్తుంది, కానీ ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే ఇది 1 లీటర్ కావడం వలన కొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే డ్రైవింగ్ అనుభూతి చాలా బాగుంటుంది మరియు ఈ SUV నగరం మరియు హైవేలో మంచి పనితీరుని అందిస్తుందని చెప్పవచ్చు.
ఫోర్డ్ ఎకోస్పోర్ట్
వేరియంట్స్ |
* ఎక్స్ షోరూమ్ ధర న్యూఢిల్లీ |
1.5 డీజిల్ అమ్బిన్టే (డీజిల్) |
Rs. 8.43 లక్షలు |
1.5 డీజిల్ ట్రెండ్ (డీజిల్) |
రూ. 9.17 లక్షలు |
1.5 డీజిల్ ట్రెండ్ ప్లస్ (డీజిల్) |
రూ. 9.57 లక్షలు |
1.5 డీజిల్ టైటానియం (డీజిల్) |
రూ. 10.0 లక్షలు |
థండర్ ఎడిషన్ డీజిల్ (డీజిల్) |
రూ. 10.68 లక్షలు |
సిగ్నేచర్ ఎడిషన్ డీజిల్ (డీజిల్) |
రూ. 11.0 లక్షలు |
1.5 డీజిల్ టైటానియం ప్లస్ (డీజిల్) |
రూ. 11.05 లక్షలు |
S డీజిల్ (డీజిల్) |
రూ. 11.89 లక్షలు |
1.5 పెట్రోల్ ఆంబిన్టే (పెట్రోల్) |
రూ. 7.83 లక్షలు * |
1.5 పెట్రోల్ ట్రెండ్ (పెట్రోల్) |
రూ. 8.57 లక్షలు |
1.5 పెట్రోల్ టైటానియం (పెట్రోల్) |
రూ. 9.56 లక్షలు |
థండర్ ఎడిషన్ పెట్రోల్ (పెట్రోల్) |
రూ. 10.18 లక్షలు |
1.5 పెట్రోల్ ట్రెండ్ ప్లస్ AT (పెట్రోల్) |
రూ. 9.77 లక్షలు |
సిగ్నేచర్ ఎడిషన్ పెట్రోల్ (పెట్రోల్) |
రూ. 10.41 లక్షలు |
1.5 పెట్రోల్ టైటానియం ప్లస్ (పెట్రోల్) |
రూ. 10.53 లక్షలు |
S పెట్రోల్ (పెట్రోల్) |
రూ. 11.37 లక్షలు |
1.5 పెట్రోల్ టైటానియం ప్లస్ AT (పెట్రోల్) |
రూ. 11.37 లక్షలు |