ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ AT: సమీక్ష

Published On మే 28, 2019 By nabeel for ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021

కొత్త లుక్, అద్భుతమైన ఇంటీరియర్స్ మరియు కొత్త హృదయం ఎప్పటి నుండో ఉన్న ఈ ఎకోస్పోర్ట్ కి కావలసినంత సౌందర్యాన్ని అందిస్తాయా?

Ford EcoSport

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కి వయస్సు అనేది దానితో కలిసే పదం కాదు. ఈ కాంపాక్ట్ SUV భిన్నంగా ఉండడం కోసం తయారు చేయబడింది మరియు ప్రారంభించి 5 సంవత్సరాలు అయినా కూడా అంతే ఆసక్తిని కలిగించే విధంగా ఉంటుంది. కానీ ఇటీవలే వచ్చిన కార్స్ ట్రెండ్స్ మరియు ఫోర్డ్ యొక్క లక్ష్యం దాని యొక్క అన్ని కార్లకి ఒక ప్రత్యేకమైన లుక్ ని ఉండే విధంగా దీనిని తీర్చి దిద్దడం జరిగింది. మీరు ఇక్కడ వీక్షిస్తున్న చిత్రాలు ఏదో పైపైన మార్పులు చేసే విధంగా ఉండవు కానీ ఒక పూర్తిగా మారిపోయిన కారులాగా కనిపిస్తుంది మరియు బయట మాత్రమే కాకుండా లోపల కూడా ఇలాంటి మార్పులే కలిగి ఉంటూ సరికొత్త మరియు ఆసక్తి కలిగించే లక్షణాలతో కలిగి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మళ్ళీ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క స్థానాన్ని సుజుకి విటారా బ్రెజ్జా, హోండా WR-V, టాటా నెక్సాన్ మరియు కొత్త రెనాల్ట్ కాప్టర్ నుండి తీసుకొనేలా ఉంటాయా? మేము అయితే ఉంటాయని భావిస్తున్నాము.

బాహ్య భాగాలు:

Ford EcoSport

ఏ విభాగంలో అయితే ఒక స్థిరమైన డిజైన్ అంటూ ఉండకుండా మరియు ప్రతీ కారు దేనికి అదే భిన్నంగా ఉంటాయో అలాంటి విభాగంలో ఈ కొత్త ఎకోస్పోర్ట్ భిన్నంగా నిలుస్తూ ఒక రిచ్ ప్రీమియం లుక్ ని అందిస్తుంది. ఈ భిన్నంగా ఉండే తత్వానికి బదులుగా ఒక శుభ్రంగా ఉండేలాగ తీర్చిదిద్దారు. హెడ్‌ల్యాంప్ పెద్దగా ఉంటూ సరికొత్త ప్రొజక్టర్ లైటింగ్ తో LED లను కలిగి ఉంటుంది. దీనివలన ఆ యొక్క కాంతి మరింత దూరంగా మరియు కాంతివంతంగా ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి హెడ్‌ల్యాంప్స్ నుండి కొంచెం దూరంగా జరిపి వేయబడ్డాయి మరియు ఇప్పుడు అవి ఫాగ్ ల్యాంప్ లో భాగమయిపోయాయి. బంపర్ అనేది కొత్తగా ఉంటూ మరియు ఒక పెద్ద గ్రిల్ తో కలిగి ఉంటుంది,ఇప్పుడు ఇదంతా ఒక భాగం. ఈ ట్రెపిజాయిడల్ గ్రిల్ ఫోర్డ్ కి అచ్చి వచ్చిన డిజైన్ లక్షణంగా ఫోర్డ్ యొక్క ప్రతీ కారులో కనిపిస్తుంది.

Ford EcoSport

ప్రక్క భాగానికి వెళ్ళి చూస్తే గనుక మీరు ఒక కొత్త, స్పోర్టియర్ డిజైన్ కలిగి తక్కువ ప్రొఫైల్ టైర్లతో చుట్టిన పెద్ద 17 అంగుళాల అలాయి వీల్స్ ని పొందుతారు. ఒక మంచి లక్షణం ఏమైనా ఉంది అంటే అది సెన్సార్స్ అవి డోర్ హ్యాండిల్స్ లో అమర్చబడి ఉంటాయి. దీనిలో కీ గనుక జేబులో ఉంటూ మీరు కారు యొక్క డోర్ ని టచ్ చేస్తే గనుక అవి ఓపెన్ అయిపోతాయి. దాన్ని లాక్ చేయడానికి, హ్యాండిల్ కి వ్యతిరేకంగా మీ బొటన వేలును స్వైప్ చేయాలి. ఈ లక్షణాన్ని గనుక పబ్లిక్ లో మీరు వాడినట్లయితే చాలా మంది వాళ్ళ కళ్ళు ఎగరవేసి నోళ్ళు వెళ్ళబెడతారు. సైడ్ మరియు వెనకాతల భాగం అలానే ఉన్నాయి కేవలం పునఃరూపకల్పన చేయబడిన వీల్ కవర్స్ తప్ప.

Ford EcoSport

దీనిబట్టి మనకి ఏమి అర్ధం అయ్యింది అంటే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ముందు భాగంలోనే దృష్టి కేంద్రీకరించినట్లుగా కనిపిస్తోంది, ఎందుకంటే ప్రక్క భాగంలో మరియు వెనుక ప్రొఫైల్ లో ఎటువంటి లోపం లేనందున. మొత్తంమీద, ఈ కాంపాక్ట్ SUV కి ప్రీమియమ్ లుక్ అనేది జోడించడం జరిగింది.   

లోపల భాగాలు :

Ford EcoSport

ఎకోస్పోర్ట్ ఎక్కడ ఎక్కువ ప్రకాశిస్తుంది అంటే ముఖ్యంగా టెక్ డిపార్ట్మెంట్ లో అని చెప్పవచ్చు. దీని కొత్త డాష్ బోర్డ్ కొత్త సెంటర్ కన్సోల్ తో వస్తుంది, ఇది పెద్ద 10-అంగుళాల టచ్స్క్రీన్ యూనిట్ పైన ఉంటుంది. ఇది కేవలం టాప్ ఎండ్ వేరియంట్స్ అయిన టైటానియం మరియు  టైటానియం + వైవిధ్యాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికంటే క్రింద వేరియంట్స్ కి 6.5-ఇంచ్ స్క్రీన్ లభిస్తుంది, అలాగే బేస్ వెర్షన్ లో మీకు మీ స్మార్ట్‌ఫోన్ ని పెట్టుకోడానికి ఒక స్లాట్ లభిస్తుంది. దీని యొక్క పెద్ద డిస్ప్లే చూడడానికి చాలా సులువుగా ఉంటూ మరియు ఆ స్క్రీన్ కూడా డాష్బోర్డ్ నుండి బయటకి వచ్చినట్టు ఉంటూ మీరు దానిని ఆపరేట్ చేయడానికి మీ డ్రైవింగ్ సీట్ నుండి ఎటువంటి కష్టం లేకుండా మీరు దానిని సులువుగా వాడుకోవచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నావిగేషన్ ని మిస్ అవుతుంది కానీ, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే రెండింటినీ పొందుతుంది.  తాజా  SYNC 3 ఇంటర్ఫేస్ తో, కెపాసిటివ్ స్క్రీన్ కి ఒక మంచి స్ఫుటమైన అనుభూతిని కలిగి ఉంటూ మరియు తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ లలో ఎటువంటి ఇన్పుట్లకు అయినా ప్రతిస్పందన త్వరితంగా ఉంటుంది.  

Ford EcoSport

ఇన్స్టృమెంటల్ క్లస్టర్ కొత్తది,అలాగే ఇది ఒక పెద్ద యూనిట్ వృత్తాకార స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ రీడౌట్ల ద్వారా సెంటర్ లో ఒక డిజిటల్ డిస్ప్లేతో ఉంటుంది. ఒక చిన్న మోనోక్రోమ్ డిస్ప్లే తప్పఇది చూడడానికి కూడా చాలా రిచ్ గా ఉంటాయి, ఈ మోనోక్రోం డిస్ప్లే చిన్నదిగా ఉండడం వలన కన్సోల్ లో ఖాళీ స్థలం ఉన్నట్టుగా ఉంటుంది. ఇది డిస్ప్లే చేసిన సమాచారం కూడా తక్కువేమీ కాదు ఉదాహరణకు డిస్టెన్స్ టు ఎంప్టీ, ఇంధన సామర్ధ్యం మరియు వ్యక్తిగత చక్రాల మీద టైర్ ప్రజర్ దీనికిగానూ ఇంటిగ్రేటెడ్ టైర్ ప్రజర్ మోనిటరింగ్ వ్యవస్థకు కృతజ్ఞతలు చెప్పాలి. మేము అంతర్జాతీయ ఎకోస్పోర్ట్ లో అదే పెద్ద రంగు TFT స్క్రీన్ ని కలిగి ఉన్నమో అదే దీనిలో వచ్చి ఉండి ఉంటే బాగుండేది. ఫోర్డ్ ఫోకస్ నుండి తీసుకున్న కొత్త స్టీరింగ్ వీల్ మీద ఉన్న బటన్స్ ద్వారా ఈ మోడ్స్ అనేవి అటూ ఇటూ మార్చవచ్చు. ముందు దాని కంటే కొంచెం పెద్దగా ఈ స్టీరింగ్ అనేది కొంచెం దళసరిగా ఉండే రింస్ తో పట్టుకోడానికి కూడా బాగుంటుంది. అయితే బ్రేక్ మరియు యాక్సిలరేటర్ పెడల్స్ ఒక స్పోర్టి శాటిన్ అల్యూమినియం ఫినిషింగ్ ని పొందుతాయి. డోర్ ప్యానెల్లు కూడా క్రొత్తవి మరియు పవర్ విండో స్విచ్లు కోసం ప్యానెల్ పైన ఒక స్టెఫ్ పై ఎలివేటెడ్ ప్యానెల్ కలిగి ఉంటుంది. అవుట్గోయింగ్ ఎకోస్పోర్ట్ లానే మీరు కొంచెం ఎత్తులో కూర్చుంటారు.  ఇది చెబుతున్నప్పటికీ కనిపించే విధానం అనేది ఇంకా కొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది, ఎందుకంటే ఈ కారు యొక్క A-పిల్లర్స్ అనేవి కొంచెం వెడల్పుగా ఉండడం వలన ఒక టూ వీలర్ ని కూడా సులభంగా కనపడకుండా ఉండేలా చేస్తాయి.  

Ford EcoSport

కాబిన్ లోపల నిల్వ స్థలాలు మరియు క్యూబీ హోల్స్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ, స్థలం ప్రీమియం వద్ద ఉండటంతో, మీరు ఇక్కడ పెద్ద వస్తువులను నిల్వ చేయలేరు.  ఉదాహరణకు ఆర్మ్రెస్ట్ మరియు ఫ్రంట్ సీట్లకు మధ్యలో ఉండే స్టోరేజ్ స్పేస్ చాలా లోతుగా ఉంటూ సన్నగా ఓపెన్ అవుతుంది. సీట్లు కూడా పునరుద్ధరించబడ్డాయి, ముందు సీట్లు ఒక విస్తృత బ్యాక్ భాగాన్ని మరియు అదనపు కుషనింగ్ పొందుతాయి. అవి చాలా సౌకర్యంగా ఉంటాయి, కానీ చిన్నగా ఉంటాయి ముఖ్యంగా మనం తొడ క్రింద భాగానికి ఇచ్చే మద్దతుకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి, ఎందుకంటే ఆ సీటు మీ మోకాలు దాటాకే పూర్తవుతుంది. మధ్యస్థ సీటు దాని హెడ్ రెస్ట్ ని కోల్పోయింది, కానీ అది ఇప్పుడు కప్హోల్డర్స్ తో కలిగి ఉన్న ఫోల్డబుల్ ఆరంరెస్ట్ ఉంది. ఈ చర్య ఖచ్చితంగా ఎకోస్పోర్ట్ ని నాలుగు-సీట్ల వాహనంగా చేస్తుంది, కానీ మా బృందంలో కొంతమంది మధ్యస్థ సీటు ముందు దానికంటే సౌకర్యవంతంగా మారిందని, స్టాషెడ్ ఆరంరెస్ట్ మరియు మిస్ అయిన హెడ్ రెస్ట్ ఉన్నప్పటికీ ముందు కంటే మరింత సౌకర్యంగా మారిందని భావిస్తున్నారు. ఈ ఫ్రంట్ సీటు పొడవుగా ఉన్నప్పటికీ లెగ్‌రూం అనేది 5 అడుగుల 10 అంగుళాల  పొడవు ఉన్న వారికి ముందు మరియు వెనుక కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది.  

బూట్ స్పేస్ అదే 352 లీటర్లు కలిగి ఉంది, దీనిలో మనకి కావలసిన లక్షణాలు అయిన  మునుపటి దానిలో ఉన్న రోల్-బ్యాక్ కి బదులుగా కొత్త ఘనమైన పార్శిల్ షెల్ఫ్ ని కలిగి ఉంది. ఇది లాక్ చేయబడిన ఓపెన్ స్థితిలో ఉండటానికి అనుమతించే గీతని కలిగి ఉంది, కాబట్టి మీరు ఆందోళన లేకుండా అంశాలను లోడ్ చేయవచ్చు. మీరు మూడు స్థానాలకు సర్దుబాటు చేయగల కదిలే ఫ్లోర్ కూడా ఉంది. దాని గరిష్ట స్థానం మరియు వెనుక సీటు బ్యాస్ట్ ముడుచుకున్నప్పుడు, లోడ్ అనేది ఫ్లాట్ అవుతుంది. వెనకాతల సీటు కూడా పూర్తిగా ఫోల్డ్ చేస్తే మీకు 1178 లీటర్ల నిల్వ స్థలాన్ని పొందగలరు.

క్యాబిన్ చక్కగా ప్యాక్ చేయబడి మరింత ప్రీమియంగా మరియు పెద్దగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అక్కడ ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి ఇది మీకు మంచి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

పనితీరు:

ఈ సంవత్సరం, ఫోర్డ్ విమర్శకుల ప్రశంసలు పొందిన 1.0 ఎకోబాస్ట్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్లతో దూరంగా ఉంది. ఇవి కొత్త 1.5 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ మోటర్ చేత భర్తీ చేయబడ్డాయి. అలాగే కొత్త డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని భర్తీ చేసే కొత్త ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది.

Ford EcoSport

కొత్త పెట్రోల్ మోటర్ శుద్ధి చేయబడి మరియు మూడు సిలిండర్ల మోటారులకు ప్రత్యేకమైన వైబ్రేషన్లను తొలగించడం కోసం దృష్టి పెట్టడం జరిగింది. ఇది 6500rpm వద్ద 123Ps శక్తిని మరియు 4500Rpm వద్ద 150Nm టార్క్ ని అందిస్తుంది. ఇది ఒక శుద్ధి చేయబడిన యూనిట్, ఇది తక్కువ శ్రేణి నుండి మధ్యస్థ శ్రేణి RPM కు ఎక్కువ శక్తిని ఇస్తుంది.

మొదటి విషయం మీకు గుర్తు వచ్చేది ఏమిటంటే మోటార్ రిఫైన్మెంట్ మరియు అంతేకాక ఫోర్డ్ ఎంత లోపలికి ఆ శబ్ధాలు రాకుండా ఎంత బాగా ఇన్సులేట్ చేయగలదు అనే అంశం. క్యాబిన్ లోకి ప్రవేశించే ఇంజిన్ శబ్దం ఇక్కడ చాలా తక్కువగా ఉంది. వైన్రేషన్స్ అనేవి మనకి అసలు తెలియకుండా ఉంటాయి మరియు మీరు 3-సిలెండర్ మోటార్ నుండి వచ్చిన శబ్ధం వారు స్టార్ట్ చేసినపుడు మాత్రమే తెలుస్తుంది. ఇది మంచి తక్కువ స్పీడ్ లో ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేసే ఇంజన్.  ఈ మోటార్ మంచి రివల్యూషన్స్ ని అందిస్తూ 2000Rpm తరువాత మేలుకొని ఎకోస్పోర్ట్ కి 80Kmph అందించేందుకు సహాయపడుతుంది. ముందు ఎకో్‌బూస్ట్ యూనిట్ లా కాకుండా మీ సీటు లోపలికి మీరు వెళిపోకుండా ఆక్సిలరేటర్ మీద మీరు తొక్కినపుడు స్పీడ్ అనేది ఒకేసారి పెరగకుండా సరళంగా ఉంటుంది. ఇక్కడ పనితీరు అనేది ఇక్కడ అంత హైలైట్ ఔఇతే కాదు, ఇక్కడ రిఫైన్మెంట్ అనేది హైలైట్.

Ford EcoSport

పరీక్ష చేసినపుడు ఎకోస్పోర్ట్ 0-100Kmph 12.51 సెకెన్స్ లో చేరుకుంటుందని తెలుస్తుంది. ఇంజన్ మరియు గేర్బాక్స్ కలయికలో ఎకోస్పోర్ట్ చాలా మెప్పిస్తుంది అని చెప్పాలి, డ్రైవ్ మోడ్ లో గేర్ షిఫ్ట్స్ అనేవి చాలా బాగుంటాయి మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. 20-80Kmph యొక్క స్పీడ్ మనకి 7.57 సెకెన్స్ లో కవర్ చేస్తుంది, అటోమెటిక్ ట్రాన్స్మిషన్ లో ఇవి మంచి గణాంకాలు అని చెప్పవచ్చు.

తక్కువ స్పీడ్ లలో గేర్బాక్స్ అనేది ఎక్కువ గేర్స్ అందించడానికే ఇష్టపడుతుంది. ఇంజన్ 50Kmph కంటే తక్కువ స్పీడ్ లో 1500-2000rpm మధ్యలో ఉంచుతుంది. ఈ యొక్క Rpm అనేది ఇంజన్ ప్రతిస్పందించడానికి కనీసం ఉండాల్సిన Rpm, ప్రతీసారీ కదలాలి అన్నప్పుడు మామూలుగా కంటే కూడా ఎక్కువ త్రోటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీనివలన సిటీ లో ఇంధన సామర్ధ్యం చాలా తక్కువగా ఉంటుంది, మా పరీక్షలలో ఎకోస్పోర్ట్ 7.04Kmpl మైలేజ్ ఇస్తుందని తేలింది.

Ford EcoSport

గేర్బాక్స్ యొక్క పనితీరు సిటీలో బాగానే ఉంటుంది, ఈ యొక్క అధిక గేర్ కి షిఫ్ట్ అవ్వాలి అన్న ఆ అలవాటు మరియు చిన్న గేర్ కి డౌన్ షిఫ్ట్ అవ్వకుండా ఉండే ఆ స్వభావం వలన హైవే లో పనితీరు తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఓవర్టేక్ గనుక చేయాలనుకుంటే మీరు త్రోటిల్ ని కొంచెం గట్టిగా నొక్కాలి, ముందుకు వెళ్ళడం కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కానీ ఒక స్థిరమైన స్పీడ్ లో గనుక వెళ్ళినట్లు అయితే ఈ గేర్‌బాక్స్ మంచి ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది మరియు ఈ స్థిరమైన స్పీడ్ తో డ్రైవింగ్ అనేది ఓపెన్ రోడ్స్ మీద చాలా సులువు, ముఖ్యంగా ఈ క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ చేర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. హైవే మీద 17.12Kmpl వంటి మెరుగైన ఇంధన సామర్ధ్యం అందించింది.

స్పోర్ట్స్ మోడ్ విషయానికి వస్తే ఈ ప్రవర్తన అనేది చాలా భిన్నంగా ఉంటుంది, గేర్‌బాక్స్ మోటార్ కి హై గేర్ లో ఉంచుతూ కావలసిన రివల్యూషన్స్ ఇచ్చేలా చేస్తుంది, ఇంకా 5000Rpm లో కూడా గేర్స్ ని హోల్డ్ చేస్తుంది. దీనివలన అది గరిష్ట పవర్ లోనికి వెళిపోయి పవర్ అవుట్‌పుట్ అనేది తగ్గిపోతుంది. ఆ డెడ్ స్పాట్ కి రాకుండా ఉండాలంటే పాడిల్ షిఫ్ట్స్ ని ఉపయోగించుకొని మీరు దానిని పైకి మరియు క్రిందకి చేయవచ్చు. ఈ మోడ్ లో అప్షిఫ్ట్స్ అనేవి కొంచెం సమయం తీసుకుంటుంది, ముఖ్యంగా అధిక రివల్యూషన్స్ లో. డౌన్ షిఫ్ట్స్ అనేవి కొంచెం త్వరగా ఉంటాయి. స్పీడ్స్ తక్కువ ఉన్నప్పుడు అధిక గేర్ లోనికి షిఫ్ట్ చేయడానికి ఇది అనుమతించదు. మీరు అధిక గేర్ లో ఉన్నప్పుడు మరియు స్లో అయినప్పుడు గేర్స్ డౌన్ అయిపోతాయి. గేర్బాక్స్ సిటీ లో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ హైవేలో అంత బాగుండదు.

రైడ్ మరియు హ్యాండిలింగ్:

Ford EcoSport

ఈ ఇంజన్ మరియు ఇంటీరియర్స్ కి నవీకరించడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు కానీ సస్పెన్షన్ కి మాత్రం చిన్న చిన్న నవీకరణలు జరిగాయి. అయితే మొత్తం సెటప్ అనేది అలానే ఉంది, ఫోర్డ్ సంస్థ చక్కటి డ్యాంపింగ్ కోసం సస్పెన్షన్ ని నవీకరించింది. దీని ఫలితంగా మెత్తటి మరియు కుషనింగ్ ఫీల్ అనేది వస్తుంది. మీరు ఇప్పటికీ రోడ్డు మీద జరిగే శబ్ధాలను అనుభూతి చెందుతారు, కానీ ఇప్పుడు కొంచెం బెటర్ గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఇప్పటికీ కూడా పైకి క్రిందకి కదలడం అనేది ఎక్కువగానే ఉంటుంది, అయితే హార్డ్ ఎడ్జెస్ కానీ బంప్స్ కానీ వచ్చినపుడు అది క్యాబిన్ లోనికి తెలుస్తుంది.

ఈ సస్పెన్షన్ లో ఈ కదలిక అనేది ఖచ్చితంగా అధిక స్పీడ్ లో ఎక్కువ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు తెలుస్తుంది. కారు యొక్క ముందు భాగం అనేది పాత కారు కంటే కూడా క్రిందకి ఉండడం వలన మీకు ఈ పరిస్తితులన్నీ కొంచెం నాటకీయంగా అనిపిస్తాయి. ఇది చెబుతున్నప్పటికీ బ్రేకింగ్ అనేది బాగుంటుంది మరియు ABS కూడా బాగా పనిచేస్తుంది మరియు అత్యవసరమైన పరిస్తితులలో బాగా ఉపయోగపడుతుంది. మా పరీక్షలలో ఈ ఎకోస్పోర్ట్ 100kmph నుండి స్థిరమైన స్థానానికి 42.75m తీసుకుంటుంది.

Ford EcoSport

ఎకోస్పోర్ట్ ఎల్లప్పుడూ ఒక మంచి హ్యాండిలింగ్ చేసే కారులానే ఉంటుంది మరియు ఒక ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారుకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒకేఒక్క తేడా ఇప్పుడు ఉంది అది ఏమిటంటే ముందు దాని కంటే కొంచెం బాడీ రోల్ అవుతుంది. దీనివలన హై స్పీడ్ టర్న్స్ అవుతున్నప్పుడు ఎదురు డైరెక్షన్ లో ఊగుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటి సందర్భాలలో మీకు కావలసినట్టుగా ఉంచేందుకు స్టీరింగ్ కి చిన్న ఇంపుట్స్ అనేవి ఇవ్వడం అవసరం. దీని స్టీరింగ్ అన్ని ఫోర్డ్ కార్లలో ఉన్న విధంగానే ఉపయోగించుకోడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, దానికి గానూ దీని స్టీరింగ్ కి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇది ముందు దాని కంటే పెద్దదిగా ఉంది మరియు టర్న్ చేయడానికి చాలా తక్కువ శ్రమ అనేది అవసరం. ఇది చాలా సూటిగా మరియు ఖచ్చితమైనదిగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికీ వేగవంతమైన వేగంతో టర్న్స్ చుట్టూ వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి, అదే తక్కువ వేగంతో వెళ్ళేటప్పుడు బాగుంటుంది.

భద్రత మరియు లక్షణాలు:

Ford EcoSport

ఎకోస్పోర్ట్ యొక్క టాప్ వేరియంట్  టైటానియం+ 6 ఎయిర్‌బ్యాగ్ లను పొందుతుంది, అయితే ఇతర వేరియంట్స్ రెండు ఎయిర్‌బ్యాగ్ లను మాత్రమే పొందుతున్నాయి. ఈ వేరియంట్ ఆటోమేటిక్ ఆన్ / ఆఫ్ సిస్టమ్ తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ని కూడా పొందుతుంది. దీనిలో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అధనపు ఎడిషన్ గా ఉంది. అయితే అన్ని వేరియంట్స్ కూడా ABS తో వస్తున్నాయి, టాప్ వేరియంట్ మరియు ఆటోమెటిక్ ట్రెండ్+ వేరియంట్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ క్లైంబ్ అసిస్ట్ తో లభిస్తాయి.  

టైటానియం + వేరియంట్ 17 అంగుళాల వీల్స్ ని బ్రీజ్స్టోన్ నుండి తక్కువ ప్రొఫైల్ 205/50 R17 ఎకోపియా రబ్బరుతో జత చేయబడి కలిగి ఉన్నాయి. తక్కువ రోలింగ్ నిరోధక టైర్లు బాగా పని చేస్తాయి, పొడి పరిస్థితుల్లో  మంచి మొత్తంలో గ్రిప్ ని అందిస్తాయి మరియు అధిక వేగంతో తక్కువగా శబ్దం స్థాయిలు ఉంచడం జరుగుతుంది. మా బ్రేకింగ్ పరీక్షలు సమయంలో,వాహనం మరీ అంత కుదుపులు అవీ లేకుండా మాములుగా ఉంది మరియు వాహనం ట్రాక్ మీద వెళుతుంది మరియు స్పీడ్ ని వేగంగా వదిలించుకుంటుంది.

Ford EcoSport

మళ్ళీ, టాప్ వేరియంట్ మాత్రమే డైనమిక్ గైడింగ్ లైన్స్ తో రివర్స్ కెమెరాని పొందుతుంది. కెమెరా రెండు వీక్షణలు (సాధారణ మరియు టాప్ వీక్షణ) కలిగి ఉంది. రివర్స్ వెళుతుంటే, సెన్సార్లు టెయిల్ గేట్ లో విడిగా ఉన్న టైర్ ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది, అయితే ఇది కొంతవరకు వెసులుబాటును వదిలివేయడం ఉత్తమం మరియు వ్యవస్థ పూర్తిగా విశ్వసించదు.    

తీర్పు:

Ford EcoSport

10.99 లక్షల రూపాయల ధరకే, టాప్ స్పెక్ పెట్రోల్ ఎకోస్పోర్ట్ చాలా ఖరీదైన ప్రతిపాదనగా ఉంది, అయితే దానిలో ఉండే లక్షణాలు అనేవి పూర్తిస్థాయి సెగ్మెంట్ పైన ఉండే కార్లలోనే ఉంటాయి. కొత్త ఎకోస్పోర్ట్ పూర్తిగా మారలేదు, కానీ మరింత అధునాతనమైనదిగా ఒక సిటీలో తిరిగే కారులాగా మంచి లక్షణాలతో కలిగి ఉంది. ఇది చూడడానికి మంచి రగ్గెడ్ కాంపాక్ట్ మరియు సిటీ కి స్నేహపూర్వకంగా ఉండే ప్యాకేజీతో ఆటోమేటిక్ సౌలభ్యంతో ఒక ఆకర్షణీయమైన ఎంపికగా ఉంది.  

Ford EcoSport

కొత్త పెట్రోల్ మోటర్ ముఖ్యంగా నగర పరిస్థితుల్లో పొదుపుగా ఉండదు, అయితే ఆ స్టీరింగ్-మౌంటెడ్ పాడెల్స్ ఉపయోగించి మానవీయంగా మారుతున్న గేర్లు ద్వారా తక్కువ సామర్థ్యాన్ని పొందవచ్చు. ఈ ఇంజన్ కూడా బాగా రిఫైన్ అయ్యింది, కాబట్టి దీనికి ఎక్కువ ఫోర్సింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, సిటీలో తిరగడానికి సులభంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా నలుగురు పెద్ద వారిని మరియు చాలా సామాను ని తీసుకొని వెళ్ళాల్సి వస్తే గనుక ఇది మీకు సరైన కారు కాదు, కానీ ఇది పెద్ద గ్రౌండర్ వీల్స్ మరియు పెద్ద వీల్స్ ని కలిగి ఉండడం వలన ఇది ఖచ్చితంగా తృప్తి పరుస్తుంది. అయితే చివరిగా ఈ కారు నగరంలో తిరగడానికి బాగుంటుంది మరియు చాలా బాగా పనితీరుని అందిస్తుంది.  

ఫోర్డ్ ఎకోస్పోర్ట్

వేరియంట్స్

ఎక్స్-షోరూం, ధర న్యూ ఢిల్లీ

1.5 డీజిల్ ఏంబియంట్ (డీజిల్)

రూ. 8.43 లక్షలు

1.5 డీజిల్ ట్రెండ్ (డీజిల్)

రూ. 9.17 లక్షలు

1.5 డీజిల్ ట్రెండ్ ప్లస్ (డీజిల్)

రూ. 9.57 లక్షలు

1.5 డీజిల్ టైటానియం (డీజిల్)

రూ. 10.0 లక్షలు

సంతకం ఎడిషన్ డీజిల్ (డీజిల్)

రూ. 11.0 లక్షలు

1.5 డీజిల్ టైటానియం ప్లస్ (డీజిల్)

రూ. 11.05 లక్షలు

S డీజిల్(డీజిల్))

రూ. 11.89 లక్షలు

1.5 పెట్రోల్ ఏంబియంట్ (పెట్రోల్)

రూ. 7.83 లక్షలు

1.5 పెట్రోల్ ట్రెండ్ (పెట్రోల్)

రూ. 8.57 లక్షలు

1.5 పెట్రోల్ టైటానియం (పెట్రోల్)

రూ. 9.56 లక్షలు

1.5 పెట్రోల్ ట్రెండ్ ప్లస్ AT (పెట్రోల్)

రూ. 9.77 లక్షలు

సంతకం ఎడిషన్ పెట్రోల్ (పెట్రోల్)

రూ. 10.41 లక్షలు

1.5 పెట్రోల్ టైటానియం ప్లస్ (పెట్రోల్)

రూ. 10.53 లక్షలు

S పెట్రోల్ (పెట్రోల్)

రూ. 11.37 లక్షలు

1.5 పెట్రోల్ టైటానియం ప్లస్ AT (పెట్రోల్)

రూ. 11.37 లక్షలు

తాజా ఎస్యూవి కార్లు

రాబోయే కార్లు

తాజా ఎస్యూవి కార్లు

×
We need your సిటీ to customize your experience