ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

Published On జూన్ 06, 2019 By alan richard for ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ తిరిగి ఒక కొత్త ముఖంతో వచ్చింది, కానీ ఈ మార్గదర్శక కాంపాక్ట్ SUV యొక్క పునరుజ్జీవనంలో కీలకమైనదిగా నిరూపించదగినదిగా ఉంది.

Ford EcoSport Facelift

కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఒక తేలికపాటి ఫేస్లిఫ్ట్ ను అందుకుంటుంది మరియు దీని క్రింద ఉండే మార్పులు ప్యాకేజీలో గణనీయమైన తేడాలు గా ఉండబోతుంది. ఈ అవార్డ్ విన్నింగ్  1.0 ఎకోబోస్ట్ ఇంజన్ పై ఈ భారతీయ వినియోగదారులు అంతగా మొగ్గు చూపడం లేదు. ఇతర 4 సిలిండర్ల పెట్రోల్ కూడా తొలగించబడింది మరియు దాని స్థానంలో ఒక కొత్త 1.5 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ తేలికైన మరియు మరింత సమర్థవంతంగా వాగ్దానంగా వచ్చింది. కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా పెట్రోల్ కొనుగోలుదారులకు సిటీ లో మంచి డ్రైవ్ ని అందిస్తుందని హామీ ఇస్తుంది. ఫోర్డ్ కూడా ఈ విభాగంలోని తక్కువ ధరని కలిగి ఉంటుందని హామీ ఇస్తుంది మరియు 2013 లో ఆరంభమైనప్పుడు ఏదైతే అగ్ర స్థానాన్ని కోల్పోయిందో దానిని స్థానాన్ని తిరిగి పొందడానికి ఇది దోహద పడవచ్చు అని మేము భావిస్తున్నాము.

Ford EcoSport Facelift

బాహ్య భాగాలు

Ford EcoSport Facelift

ఈ సమయంలో, సాంకేతికంగా ఇది ఎకోస్పోర్ట్ యొక్క మిడ్ లైఫ్ ఫేస్‌లిఫ్ట్ కాబట్టి ఈ విభాగంలో సమీక్షలో దీని గురించి రాయడానికి పెద్దగా ఏమీ లేదు. ఈ సన్నగా ఉండే స్లాట్ ఏదైతే బోనెట్ క్రింద ఉందో అది తొలగించబడింది మరియు ఆ గ్రిల్ ఇప్పుడు కొద్దిగా ఎత్తుగా ఎకోస్పోర్ట్ యొక్క ముఖానికి కొంచెం పై భాగంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ తరం యొక్క ఎండీవర్ మరియు ఇతర ఫోర్డ్ ఫ్యామిలీ కార్ల మాదిరిగా ఫోర్డ్ లోగో ఇప్పుడు గ్రిల్ యొక్క సెంటర్ కి మారింది.

Ford EcoSport Facelift

హెడ్ల్యాంప్స్ పెద్దవిగా ఉంటాయి మరియు క్రింది రౌండ్ ఫాగ్ లాంప్స్ ని పెద్ద త్రిభుజాకార యూనిట్లు భర్తీ చేస్తున్నాయి. దిగువన స్పిల్టర్ కూడా ఒక తేలికపాటి పునఃరూపకల్పన పొందింది మరియు టాప్ వేరియంట్ టైటానియం ప్లస్ మోడల్ 17 అంగుళాల అలాయ్స్ ని పొందుతుంది. ఎకోస్పోర్ట్ యొక్క ప్రక్క భాగాలు మరియు వెనుకవైపు ఒకేలా ఉన్నాయి. ఎకోస్పోర్ట్ ఎప్పుడూ చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఫోర్డ్ ఈ డిజైన్ కి ఎటువంటి మార్పులు చేయలేదు, ఎందుకంటే ఇది ఇప్పటికీ బాగుంది కాబట్టి.

Ford EcoSport Facelift

లోపల భాగాలు

Ford EcoSport Facelift

ఎకోస్పోర్ట్ 2013 లో ప్రారంభించబడిన దగ్గర నుండి దానిలో మారనటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏదైనా ఉంది అంటే, అవి ఇంటీరియర్స్ మరియు ఫోర్డ్ దీనిని ఖచ్చితంగా ఈ నవీకరణతో సమాధానం ఇచ్చింది అని చెప్పవచ్చు. 8-అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే ద్వారా నేతృత్వం వహించిన కొత్త-నలుపు అంతర్భాగాలు, డాక్టర్ ఆదేశించినదే అందించింది. అంతర్జాతీయ ఫోర్డ్ ఫోకస్ నుండి తీసుకోబడిన గ్లోస్ బ్లాక్ ఇన్సర్ట్స్ మరియు సెంటర్ డిస్ప్లే తో కొత్త ఇన్స్టృమెంటల్ క్లస్టర్ ఉంది, అలాగే ఒక కొత్త స్టీరింగ్ వీల్ (AT మోడల్ లో పెడల్ షిఫ్టులతో) కూడా ఉంది.   

Ford EcoSport Facelift

ముందు సీట్లు మెరుగైన సైడ్ బోల్టింగ్ మరియు సున్నితమైన కుషనింగ్ తో ఈ సీట్లు అనేవి బాగా వెడల్పుగా ఉన్నాయి. వెనుక భాగం, ముందరి లాగా మెరుగ్గా అభివృద్ధి చెందింది. అలాగే వెనకాతల కప్ హోల్డర్స్ తో డ్రాప్ డౌన్ ఆరంరెస్ట్ అనేది ఉంది. మొత్తంమీద, సీట్లు మంచి మద్దతు అందిస్తాయి మరియు సౌకర్యవంతమైనవిగా ఉంటాయి, మేము ఒక రోజంతా కారులో కూర్చున్నాక చెబుతున్న మాట ఇది.  

Ford EcoSport Facelift

బూట్ స్పేస్ 346 లీటర్లకే ఉంటుంది, కానీ ఫోర్డ్ కొత్త మూడు స్థాన ఫ్లోర్ తో బూట్ కోసం కొన్ని మార్పులు చేసింది. బాగా క్రింద ఉండే స్థానం మనకి ఎక్కువ స్పేస్ ని అందిస్తుంది, అలాగే రెండవ పొజిషన్ రెండున్నర అంగుళాల ఎత్తుగా ఉంటూ  నేల కింద ఒక చిన్న కంపార్ట్మెంట్ ని విడిచిపెట్టింది, ఇది ఫోర్డ్ చెప్పినట్టు ఎవరికీ కనిపించకుండా ల్యాప్‌టాప్ లు అవీ పెట్టుకోడానికి బాగుంటుంది. కొంచెం యాంగిల్ లో ఉన్న మూడవ స్థానం ఫ్లోర్ వెనుక సీటు యొక్క వెనుకభాగం యొక్క ఎత్తుకి సరిపోయేలా చూసుకుంటుంది, అవి వెనక్కి మడిస్తే మీకు ఒక ఫ్లాట్ ఉపరితలం ఇవ్వబడుతుంది. ఈ స్థానంలో, మీరు ఉదారంగా 1178 లీటర్ల స్థలాన్ని కలిగి ఉంటారు.

Ford EcoSport Facelift

టెక్నాలజీ

Ford EcoSport Facelift

ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ముఖ్యమైన అంశాలలో టెక్నాలజీ ఒకటి. ఇది హోండా WR-V, మారుతి విటారా బ్రజ్జా మరియు టాటా నెక్సన్ వంటి కొత్త పోటీదారులతో ఫోర్డ్ దాని ఆటను మరింత పెంచుకోవాలి. ఎకోస్పోర్ట్ యొక్క కొత్త టచ్ స్క్రీన్ ఈ విషయంలో సరైన స్థానంలో ఉంచుతుందని చెప్పవచ్చు. ఈ 8 అంగుళాల స్క్రీన్ ప్రకాశవంతమైన మరియు ప్రతిస్పందించినది మరియు ఫోర్డ్ యొక్క SYNC ఇంటర్ఫేస్ యొక్క తరం సున్నితమైనది మరియు ఆపరేట్ చేయడం సులభంగా కూడా ఉంటుంది. ఇది ప్రస్తుతం విధిగా పనిచేసే ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలను కలిగి ఉంది. దీనిలో మనకి 12V సాకెట్ తో పాటు, మీ వ్యక్తిగత టెక్ ని ఛార్జ్ చేయటానికి కేంద్రంలో రెండు USB పోర్టులు కూడా ఉన్నాయి.

Ford EcoSport Facelift

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కొత్తగా ఉంది, కానీ దీని యొక్క సమాచార ప్రదర్శనన చూడడానికి కొంచెం ఎబెట్టుగా ఉంటుంది. అది సౌందర్యం పరంగా ఇంకా మెరుగైనదిగా ఉంటే బాగుంటుంది, ఇది మీకు అవసరమైన అన్ని సమాచారాలను అందిస్తుంది మరియు టైర్ ప్రజర్ మోనిటరింగ్ వ్యవస్థ కోసం ఒక ప్రదర్శనను కూడా కలిగి ఉంటుంది. ఎకోస్పోర్ట్ కూడా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు ఆటోమేటిక్ హెడ్ల్యాంప్లు కూడా కలిగి ఉంటాయి, కానీ సన్రూఫ్ లేదా వెనుక ఎయిర్ కాన్ వెంట్స్ లను కలిగి ఉండదు. ఇది చెబుతున్నప్పటికీ మేము పగటి సమయంలో బాగా ఎండలో గోవాలో వెళుతున్నప్పుడు మాకు అంత పెద్ద పిర్యాదు చేసే విధంగా అయితే వెనుక కూర్చున్న ప్రయాణికులకు అంత ఇబ్బంది కలగలేదు. ఫోర్డ్ ఇంకా ఏం చెబుతుందంటే ఈ ఎయిర్ కాన్ క్యాబిన్ ని 50 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకు 15 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే కూల్ చేస్తుందని చెబుతుంది మరియు వాటిని సందేహించటానికి ఎటువంటి కారణం కూడా మాకు కనిపించలేదు.

Ford EcoSport Facelift

టాప్-ఎండ్ వేరియంట్ లో ఇంకొక మంచి లక్షణం కీలెజ్ ఎంట్రీ సిస్టం, ఇది డ్రైవర్ మరియు ప్రయాణీకుల డోర్ హ్యాండిల్స్ లో ఒక సెన్సార్ ని కలిగి ఉంటుంది. మీరు మీ జేబులో కీ కలిగి ఉంటే, తలుపు హ్యాండిల్ ని పట్టుకోవడం వలన డోర్ అన్లాక్ అవుతుంది. మీరు వదిలిపెట్టినప్పుడు, హ్యాండిల్ ని నొక్కండి! కారు లాక్ చేయబడింది.  

Ford EcoSport Facelift

ఇంజిన్ మరియు పనితీరు

ఎకోస్పోర్ట్ ఇప్పుడు రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది, అవి వరుసగా 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు. పెట్రోల్ ఇంజిన్ అనేది కొత్త 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్. ఇది ఒక శక్తివంతమైన 123Ps శక్తిని మరియు 150Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మరింత కాంపాక్ట్, తేలికైనది మరియు ఇది భర్తీ చేయబడిన ఇంజిన్ కంటే మరింత సమర్థవంతమైనదిగా పేర్కొనబడింది. ఫోర్డ్ ఈ 3-సిలెండర్ నుండి వచ్చే శబ్ధం ఏదైతే ఉందో దానిని బాగా తగ్గించిందని ఫోర్డ్ చెబుతుంది. అక్కడ కంపనాలు తగ్గించడానికి ఒక బాలెన్సర్ ని కలిగి ఉంది మరియు దీనిలో  టైమింగ్ బెల్ట్ కూడా అందుబాటులో ఉంది, ఇది ఆయిల్ లో మునిగి ఉండే మూలకాల కోసం ఓపెన్ అవుతుంది. నిష్క్రియాత్మకంగా మరియు ప్రారంభించేటప్పుడు, ఇది ఇప్పటికీ ఒక సాధారణ 3-సిలిండర్ లాగా శబ్ధాన్ని కలిగి ఉంటుంది, కానీ వెంటనే మీరు కదిలిపోతున్నప్పుడు, అది ప్రశాంతంగా ఉంటుంది. ఇది సిటీ స్పీడ్స్ లో ఉన్నప్పుడు డ్రైవ్ చేయడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ మొత్తం పవర్ తక్కువ- మధ్య శ్రేణి Rpm చుట్టూ దృష్టి సారించి, అధిక రివర్స్ వద్ద కొంచెం వెనకబడుతుంది.

Ford EcoSport Facelift

1.5 లీటర్ డీజిల్ ముందు అదే 100Ps శక్తిని మరియు 205Nm టార్క్ ని మునుపటి లానే అందిస్తుంది, కానీ దీని యొక్క ధ్వని అనేది కొంచెం మారింది. అయితే వ్యత్యాసం అనేది అంత గమనించదగ్గది కాదు, మరియు డీజిల్ ఇప్పటికీ చాలా సరళమైన మోటారు, ఇది చాలా సరళమైన టార్క్ వక్రరేఖతో మరియు యాక్సిలరేషన్ పెరుగుతున్న కొలదీ టర్బో కిక్స్ కూడా పెరిగి మనకి మంచి పవర్ అందిస్తుంది. ఈ కొత్త ట్యూన్ తో, ఏమిటి పెరిగింది అంటే, ఇప్పుడు ఇది 23Kmpl వద్ద మైలేజ్ ని అందిస్తుంది ఇది పేర్కొన్న మైలేజ్, ముందు కంటే ఒక మంచి 3Kmpl పెరిగిందని చెప్పవచ్చు. పెట్రోల్ కూడా మనకి ఒక కిలోమీటర్ పెంచి 17Kmpl వద్ద మైలేజ్ ప్రకటించింది.

ఎకోస్పోర్ట్ ప్యాకేజికి మరో కొత్త మరియు ముఖ్యమైన మార్పు ఏమిటంటే మునుపటి 1.5 లీటర్ పెట్రోల్ పవర్ ప్లాంట్ ముందు అందించిన మరింత ఆధునిక డ్యుయల్ క్లచ్ బదిలీని భర్తీ చేసే కొత్త కన్వెన్ష్నల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఈ కొత్త ట్రాన్స్మిషన్ పాత దాని నుండే వస్తున్నప్పటికీ, కానీ అది ప్రవర్తించే పద్ధతి ఎకోస్పోర్ట్ కు చాలా బాగా సరిపోతుంది. ఇది భర్తీ చేయబడిన గేర్బాక్స్ కంటే బాగా మెరుగైనది మరియు సిటీ డ్యూటీ లలో మెరుగ్గా ఉంది, బాగా వేగంగా వెళ్ళినట్టు భావిస్తారు. షిఫ్ట్లు అనేవి వెన్న లాగా నునుపుగా ఉంటాయి మరియు అవి కొద్దిగా నెమ్మదిగా ఉన్నప్పటికీ, అవి మరింత ఊహించదగినవి మరియు మీరు త్రోటిల్ ని పంచ్ చేసినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. ఇది డ్రైవ్ ని బాగా అనుభవించవచ్చు మరియు అప్రమత్తమైన నగర ప్రయాణాలకు ఉపయోగపడుతుంది.    

రైడ్ మరియు హ్యాండిలింగ్

Ford EcoSport Facelift

ఫోర్డ్ ఏం చెబుతుందంటే సస్పెన్షన్ కి ఈ మార్పులు ఏవైతే చేసామో అవి చాలా బాగున్నాయి, కానీ ఇది ఒక మంచి తేడాని అయితే అందించింది, కారు వెళ్ళే విధానం మారిందని చెప్పవచ్చు. బంప్స్ మీద స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళినప్పుడు చాలా కంపోసెడ్ గా వెళుతుంది, సస్పెన్షన్ కూడా బాగుంది గట్టిగా ఉంది అని చెబుతుంది మరియు క్యాబిన్ లోనికి శబ్ధం కూడా అంతగా రాదు. బాగా ఎక్కువ బంప్స్, లెవెల్ మార్పులు మరియు బాగా చెడు రహదారులు అయితేనే క్యాబిన్ లోనికి తెలుస్తాయి. ఇవన్నీ కాకుండా ఎకోస్పోర్ట్ అనేది మనం రైడ్ చేయడానికి మంచి వాహనం అని చెప్పవచ్చు. రోడ్ మరియు సిటీ స్పీడ్స్ లో బాగా కంట్రోల్ చేసారని చెప్పవచ్చు, దీని వలన ఈ రైడ్ మరింత సౌకర్యవంతమైనదిగా ఉంది.

Ford EcoSport Facelift

అన్ని ఫోర్డ్స్ మాదిరిగానే, స్టీరింగ్ అనుభూతి అద్భుతమైనదిగా ఉంటుంది మరియు స్పోర్టి సస్పెన్షన్ సెటప్ తో ఉండడం వలన కార్నర్స్ లో బాగా తిరుగుతుందని చెప్పవచ్చు. పొడవాటి వైఖరి మరియు చిన్న వీల్ బేస్ నుండి కొంత బాడీ రోల్ ఉన్నప్పటికీ అది కంట్రోల్ చేసుకొనే విధంగానే ఉంటుందని చెప్పవచ్చు. కలిపి చెప్పాలంటే ఈ స్టీరింగ్ వీల్ మరియు సస్పెన్షన్ కలిసి చూసుకున్నట్లయితే ఎకోస్పోర్ట్ కి ఏదైతే స్పోర్టీ ఎడ్జ్ అది ఇప్పటికీ అలానే ఉండేలా చేస్తుంది. కొంచెం ఏమైనా మెరుగు పరచాల్సింది ఉంది అది ఏమిటంటే, బ్రిడ్జ్స్టోన్ ఎకోపియా 205 / 50R 17 టైర్లు, ఇది చాసిస్ హ్యాండిల్ చేసేలా మంచి గ్రిప్ ని అయితే అందించడం లేదని భావిస్తున్నాము.

తీర్పు

Ford EcoSport Facelift

ఉపరితలంపై ఉన్నప్పుడు, మార్పులు చిన్నవిగా కనిపిస్తాయి, కొత్త ఎకోస్పోర్ట్ డ్రైవ్లు మరియు భావాలను బాగా మార్చింది అని చెప్పవచ్చు. ఈ సరికొత్త పెట్రోల్ ఇంజన్ ఆటోమేషన్ ట్రాన్స్మిషన్ ద్వారా కొత్త లైనప్ లో మంచి జోడింపుగా వచ్చాయి అని చెప్పవచ్చు.  టెక్నాలజీ ప్యాకేజీ కూడా పోటీతో సమానంగా తీసుకువచ్చింది. కార్డులో స్థానికీకరణ స్థాయిని 60-65 శాతం నుండి దాదాపు 85 శాతానికి పెంచిందని కూడా ఫోర్డ్ పేర్కొంది, ఇది నిజంగా పోటీతత్వంగా ధర నిర్ణయించడంలో సహాయపడాలి. ఇది అన్నింటికీ, సంస్థ కూడా మారుతి విటారా బ్రెజ్జా కంటే కూడా 7 నుండి 10 శాతం తక్కువని నిర్వహించగలదని కంపెనీ వాగ్దానం చేసింది. ఇవన్నీ గనుక మనం చూసుకున్నట్లయితే ఎకోస్పోర్ట్ కి అది 2013 లో ప్రారంభించినప్పుడు ఎలాంటి ప్రాముఖ్యత ఉండేదో అలానే తిరిగి వస్తుందని భావిస్తున్నాము. 

తాజా ఎస్యూవి కార్లు

రాబోయే కార్లు

తాజా ఎస్యూవి కార్లు

×
We need your సిటీ to customize your experience