ఫోర్డ్ ఎకోస్పోర్ట్ నిపుణుల సమీక్ష
Published On జూన్ 06, 2019 By rahul for ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021
- 0 Views
- Write a comment
స్మార్ట్ -వాహనం?
ప్రజలు వారి జీవితంలో అనేక పాత్రలు పోషిస్తుంటారు మరియు ఇప్పుడు వారికి ప్రతీదీ కూడా కొంచెం ఇంటిలిజెంట్ గా ఉండాలి అనుకుంటారు.
ఈ కారణంతోనే మనం ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు మరియు టెలివిజన్లలో చాలా అమ్మకాలను చూస్తున్నాము, ఇంటర్నెట్ లో ట్రాఫిక్ పెరుగుదల, హార్డ్ కాపీల విక్రయాలు తగ్గిపోవడం అనేది కూడా చూస్తున్నాము.
ఆటోమొబైల్స్ నుండి కూడా ఇదే విధమైన నిరీక్షణ ఉంది. వారికి ఇప్పుడు కారు ఎలా ఉండాలంటే బయట నుండి చిన్నదిగా కనిపించాలి, లోపల నుండి చూడడానికి చాలా విశాలంగా మంచి లక్షణాలతో, అదే విధంగా శక్తివంతమైన ఇంజన్ మరియు మంచి డ్రైవింగ్ లక్షణాలతో ఉండాలని కోరుకుంటున్నారు.
అందుచేతనే కాంపాక్ట్ SUV వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇటువంటి తయారీగల వాహనంలో ఒకటిగా ఉంది. ప్రారంభానికి ఒక నెల ముందు మేము వాహనాన్ని నడిపాము మరియు మా అభిప్రాయాన్ని పంచుకుంటాము. కాబట్టి, భారతీయ పరిస్థితుల్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎంత చక్కగా పనిచేస్తుంది? అది ఎలా మంచిదో తెలుసుకోవడానికి మరింత చదవండి.
డిజైన్:
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ దాని డిజైన్ తో పలువురు వ్యక్తులను ఆకట్టుకుంది మరియు ఇది మేము ఈ కాంపాక్ట్ SUV పై అనేక విచారణలు చేయడానికి కారణమం అయ్యింది. ఫోర్డ్ సంస్థ దీనిలో బాగా వ్యవహరిస్తుంది, ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవు మరియు ఇంజిన్ కూడా 1.2 లీటర్ కంటే చిన్నదిగా ఉంది. ఇది సంస్థను తీవ్రంగా ధరని నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఎకాస్పోర్ట్ ఫియస్టా వేదికను పంచుకుంటుంది మరియు అది కైనెటిక్ డిజైన్ 2.0 పై ఆధారపడి ఉంటుంది.
ఈ SUV కి ముందు భాగంలో ఒక చిన్న గ్రిల్ ఉంది, అయితే క్రింద గ్రిల్ ట్రెపిజోయిడల్ గా ఉంది. విస్తృతమైన హుడ్ బాడీలైన్స్ లోనికి చొచ్చుకొని ఉంటుంది, ఇది చలనంలో శక్తిని తెలియజేస్తుంది.
ఆధునిక, స్లిమ్ హెడ్లాంప్స్ మీద హై-మౌంటెడ్ ట్రాపెజెయిడల్ గ్రిల్ అనేది ఉంటుంది, ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కి గర్వాన్ని జోడిస్తూ మరియు ఫోర్డ్ తరహా లాంటి ముఖాన్ని దీనికి ఇస్తుంది. ఈ హెడ్‌ల్యాంప్ యొక్క లైన్స్ వెనుకవైపు వరకూ సాగి ఉంటాయి, దీని వలన గాలి అనేది సునాయాసంగా చుట్టూ తిరుగుతూ SUV యొక్క ఏరోడైనమిక్స్ ని మెరుగుపరుస్తుంది.
దీని యొక్క దేహం అనేది బాగా స్టైలిష్ గా మరియు భిన్నంగా ఉంటుంది. దీనికి విండోస్ మరియు డోర్ క్రీజ్లచే ఏర్పడిన కండరాల బెల్ట్లైన్ ని పొందుతుంది, ఇది కారు వెనుక భాగంలో వెళ్తున్న కొలదీ ఎత్తు పెరుగుతూ ఉండడం వలన వాహనంలో కదలిక భావనను జోడించడం జరుగుతుంది. వెనుకవైపు, పెద్ద విండో సైడ్స్ తో పాటుగా వాలుగా ఉండే టెయిల్ ల్యాంప్స్ ని చుట్టి ఉంటుంది. వెనుక ప్రొఫైల్ ని సన్నగా ఉంచడానికి, టెయిల్‌గేట్ యొక్క హ్యాండిల్ టెయిల్ ల్యాంప్ లోపల ఉన్నట్టు ఉండేలా నిర్మించడం జరిగింది. బూట్ అన్లాక్ చేయడానికి టెయిల్‌గేట్ హ్యాండిల్ పై ఒక చిన్న నలుపు బటన్ ఉంటుంది, దీనితో బూట్ ని అన్లాక్ చేయవచ్చు.
లోపల భాగాలు:
ప్రజలు బాగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన అంశాలలో కారు యొక్క అంతర్భాగాలు ఒకటి. లోపలకి అడుగు పెట్టగానే మీరు ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ని ఒక కాక్‌పిట్ లాగా అనేక బటన్లు మరియు సులువైన డయలింగ్ కోసం ఒక నంబర్ ప్యాడ్ ని కలిగి ఉండేలా డిజైన్ చేయడం జరిగింది.
ఈ డిజైన్ దాని తోబుట్టువు ఫియస్టా నుండి తీసుకోబడింది మరియు దీనిలో దాచడానికి ఏమీ లేదు.
ప్లాస్టిక్స్ యొక్క నాణ్యత బాగుంది, కానీ అది ఇంకా మెరుగైనదిగా ఉండి ఉంటే బాగుండేది అని మేము అనుకుంటున్నాము.
మేము ఫియస్టాలో చూసిన విధంగా ఎకోస్పోర్ట్ యొక్క లోపల భాగాలు ఎరుపు రంగు కాకుండా దానికి బదులుగా నీలిరంగు బ్యాక్లిట్ ని పొందుతున్నాయి.
అంతేకాకుండా, దీనిలో ఎబెట్టుగా ఉండే అంశం ఏమిటంటే బ్లాక్ ఆర్ట్ లెథర్ సీటు మీద ఎరుపు రంగు కుట్లు రావడం. మా దృష్టిలో, అది కూడా నీలి రంగులో ఉన్నట్లయితే సమపాళ్ళలో ఉన్నట్టుగా ఉండేది.
ముందు సీట్లు మంచి బ్యాక్ మరియు సర్దుబాటు లంబర్ తో బాగా రూపొందించబడ్డాయి, అయినప్పటికీ మేము ఫియస్టాలో చూసిన విధంగా దీనిలో అదనపు తొడ మద్దతు అనేది లభించదు.
వెనుక భాగంలో ముగ్గురు ఆరడుగుల మనుషుల కోసం తగినంత మోకాలి గది ఉంది. ఇది ఒక SUV కావడం వలన, ఇది సీటింగ్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. వెనుక సీట్లకు మూడు రకాల రిక్లైన్ పొజిషన్స్ ఉంటాయి మరియు 60:40 వ్యక్తిగత విభజన కలిగి ఉంటుంది.
ఎకోస్పోర్ట్ యొక్క బూట్ పరిమాణం పరంగా బాగానే ఉంటుంది, అయితే ఐదుగురికి సరిపడా వారాంతపు సామాను పెట్టాలంటే కొంచెం ఇబ్బందికరం.
ఎకోస్పోర్ట్ కారులో మరొక కొత్త లక్షణం ఏమిటంటే SYNC. ఫోర్డ్ కార్ల కోసం ఈ సాఫ్ట్వేర్ ని మైక్రోసాఫ్ట్ సంస్థ రూపొందించింది, ఈ ఎంపికను పొందిన మొట్టమొదటి భారతీయ ఫోర్డ్ ఇది.
ఇది ఓపెన్ సోర్స్ ఫైల్, డెవలపర్లు దాని కోసం ఏదైనా అప్లికేషన్ ని చేయవచ్చు. అటువంటి పరికరాలను పరిచయం చేయడానికి ఇతర కార్ల తయారీదారులు కూడా రాబోయే కాలంలో మొగ్గు చూపుతాయాని మేము భావిస్తున్నాము.
ఎకోస్పోర్ట్ కీలేస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ మరియు స్టాప్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లను కూడా పొందుతుంది. టాప్ వెర్షన్ టెలిఫోన్ మరియు మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది.
ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్:
ఫోర్డ్ సంస్థ ఎకోస్పోర్ట్ మూడు ఇంజిన్ వేరియంట్లను అందిస్తోంది, అవి విప్లవాత్మక 1.0 లీటర్ ఎకోబోస్ట్ ఇంజిన్, 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఎంపికలను కలిగి ఉంది. పైన చెప్పిన దానిలో చివరిది ఫియస్టా లో కూడా అందుబాటులో ఉంది. కేవలం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని పొందుతుంది, మిగిలినవి ఐదు స్పీడ్ మాన్యువల్ తో లభిస్తాయి. మేము 1.0 లీటర్ ఎకోబూస్ట్ ని డ్రైవ్ చేస్తున్నాము, ఇది భారతదేశంలో పెట్రోల్ కార్ల యొక్క భావనను మారుస్తుందని ఫోర్డ్ విశ్వసిస్తుంది. ఈ ఇంజన్ మూడు సిలిండర్ల ఇంజన్ ఇది 122bhp శక్తిని మరియు 170Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 97 కిలోల బరువు ఉంటుంది, మరియు 1.5 లీటర్ల కంటే 18 కిలోల తేలికైనది. ఇది తక్కువ స్థానభ్రంశం ఉన్నప్పటికీ, 1.5 లీటర్ కంటే ఎక్కువ శక్తిని మరియు టార్క్ ని ఇప్పటికీ ఉత్పత్తి చేస్తుంది. దీని అర్ధం ఎకోబోస్ట్ మంచి ఇంధన సామర్ధ్యం అందిస్తుందని.
పవర్ డెలివరీ సరళంగా ఉంటుంది మరియు 1600-1700rpm నుండి టర్బో అనేది పెరుగుతూ ఉంటుంది మరియు దాదాపు 4300rpm వద్ద ఫ్లాట్ గా ఉంటుంది. దీనిలో టర్బో లాగ్ అనుభూతి అయితే ఎవ్వరూ చెందరు మరియు అధిక గేర్స్ లోకి వెళుతున్నప్పుడు ఇంజిన్ ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు వెళుతుంది. స్టీరింగ్ వీల్ వెనక మీరు కూర్చున్నట్లయితే, ఇది ఏ విధంగానైనా 1-లీటర్ ఇంజిన్ అని మీరు అనుకోరు. టర్బోచార్జర్ ఈ ఆలోచనను మార్చడానికి సహాయపడుతుంది మరియు ఎకోస్పోర్ట్ నగరంలో మరియు బహిరంగ రహదారిలో నడపడానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ఇంజిన్ లో ఉండే మరొక మంచి విషయం NVH. ఇది త్రీ-పాట్ మిల్లులాగా పనిచేయదు మరియు దీనిలో ఇంజిన్ పరిమాణాన్ని సూచించగల వైబ్రేషన్ లేదా శబ్ధాలు అనేవి ఉండవు. ఈ ఇంజిన్ కి జతచేయబడిన ఐదు-స్పీడ్ మాన్యువల్ కొంచెం రబ్బరీగా ఉంటుంది, కానీ అదంతే అలాగే ఉంటుంది. షిఫ్ట్లు దాదాపు సానుకూలంగా ఉంటాయి, కానీ త్రోస్ అనేవి చిన్నవిగా ఉంటాయి.
డ్రైవింగ్ డైనమిక్స్:
ఫోర్డ్ వాహనాలు వారి డ్రైవింగ్ డైనమిక్స్ కి ప్రసిద్ధి చెందాయి మరియు ఇదే అంశం ఎకోస్పోర్ట్ లో కూడా బాగా కనిపిస్తుంది. ఈ వాహనం యొక్క రైడ్ అనేది చాలా బాగుంటుంది మరియు ఏ సమస్యలు లేకుండా గతకలని దాటి మంచి రైడ్ ని అందిస్తుంది. ఈ సస్పెన్షన్ చెడు రోడ్లు మరియు అసమాన ఉపరితలాలపై కూడా బంప్స్ ని మనకి తెలియకుండా చేసి మంచి పనితీరుని అందిస్తుంది.
200mm గ్రౌండ్ క్లియరెన్స్ తో ఈ వాహనం యొక్క హ్యాండిలింగ్ అనేది బాగుంటుంది. ఇది పట్టణ పరిస్థితులలో డ్రైవ్ చేయడానికి సులభతరంగా ఉంటుంది, ఇది SUV ల వంటి భారీ మరియు పెద్దదిగా అనిపించదు. ఒంపులు తిరిగి ఉండే రహదారుల చుట్టూ డ్రైవింగ్ చేయడం అనేది చాలా సరదాగా ఉంటుంది మరియు స్టీరింగ్ వీల్ నుండి కూడా ఫీడ్‌బ్యాక్ అనేది లభిస్తుంది. దీని యొక్క చిన్న టర్నింగ్ రేడియస్ మరియు తేలికపాటి స్టీరింగ్ దీనిని పార్క్ చేసేటప్పుడు చాలా సౌకర్యంగా ఉండేలా చేస్తుంది.
తీర్పు:
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎల్లప్పుడూ SUV యొక్క స్టైలింగ్ ని కలిగి ఉంది మరియు ఇది చాలామందిని ఆకర్షించింది. ఎకోస్పోర్ట్ ఖచ్చితంగా దాని స్టైలింగ్ లో అందాన్ని కలిగి ఉంటుంది మరియు సబ్ 4-మీటర్ వాహనం కోసం అది అందిస్తున్న స్పేస్ అనేది చాలా బాగుంటుంది. మేము సీటింగ్ మరియు నిల్వ స్థలం యొక్క వశ్యతతో బాగా ఆకర్షించబడ్డాము. ఎకోబూస్ట్ ఇంజిన్ కూడా బాగా శక్తిని అందిస్తుంది మరియు అది అందించే స్పీడ్ గానీ మరియు డ్రైవింగ్ సామర్ధ్యం గానీ మాకు ఎంతగానో నచ్చాయి. ఎకోస్పోర్ట్ ఖచ్చితంగా కావలసినంత గ్రేస్, స్థలం మరియు స్పీడ్ కలిగి ఉంది. ఇప్పుడు, ఇది కంపెనీ ఈ మోడల్ శ్రేణులను ఎంత ధరకి అమ్ముతుందో అనే దాని మీద మొత్తం ఆధారపడి ఉన్నాయి. మేము ఎకోబూస్ట్ ఇంజిన్ ఆధారిత మోడల్ కోసం రూ. 7-9 లక్షల మధ్య ధర ఉంటుందని భావిస్తున్నాము.
ఫోర్డ్ ఎకోస్పోర్ట్
వేరియంట్స్ |
* ఎక్స్ షోరూమ్ ధర న్యూఢిల్లీ |
1.5 డీజిల్ అమ్బిన్టే (డీజిల్) |
Rs. 8.43 లక్షలు |
1.5 డీజిల్ ట్రెండ్ (డీజిల్) |
రూ. 9.17 లక్షలు |
1.5 డీజిల్ ట్రెండ్ ప్లస్ (డీజిల్) |
రూ. 9.57 లక్షలు |
1.5 డీజిల్ టైటానియం (డీజిల్) |
రూ. 10.0 లక్షలు |
థండర్ ఎడిషన్ డీజిల్ (డీజిల్) |
రూ. 10.68 లక్షలు |
సిగ్నేచర్ ఎడిషన్ డీజిల్ (డీజిల్) |
రూ. 11.0 లక్షలు |
1.5 డీజిల్ టైటానియం ప్లస్ (డీజిల్) |
రూ. 11.05 లక్షలు |
S డీజిల్ (డీజిల్) |
రూ. 11.89 లక్షలు |
1.5 పెట్రోల్ ఆంబిన్టే (పెట్రోల్) |
రూ. 7.83 లక్షలు * |
1.5 పెట్రోల్ ట్రెండ్ (పెట్రోల్) |
రూ. 8.57 లక్షలు |
1.5 పెట్రోల్ టైటానియం (పెట్రోల్) |
రూ. 9.56 లక్షలు |
థండర్ ఎడిషన్ పెట్రోల్ (పెట్రోల్) |
రూ. 10.18 లక్షలు |
1.5 పెట్రోల్ ట్రెండ్ ప్లస్ AT (పెట్రోల్) |
రూ. 9.77 లక్షలు |
సిగ్నేచర్ ఎడిషన్ పెట్రోల్ (పెట్రోల్) |
రూ. 10.41 లక్షలు |
1.5 పెట్రోల్ టైటానియం ప్లస్ (పెట్రోల్) |
రూ. 10.53 లక్షలు |
S పెట్రోల్ (పెట్రోల్) |
రూ. 11.37 లక్షలు |
1.5 పెట్రోల్ టైటానియం ప్లస్ AT (పెట్రోల్) |
రూ. 11.37 లక్షలు |