మొదటి డ్రైవ్: హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్
Published On మే 09, 2019 By aman for హ్యుందాయ్ క్రెటా 2015-2020
- 1 View
- Write a comment
ఇటీవల కాలంలో క్రెట్టా గురించి తగినంతగా చెప్పబడింది మరియు దాని పెరుగుతున్న విక్రయాల చార్ట్ భారతీయ SUV మార్కెట్ లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న విజయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. నా వరకూ, క్రెటా అనేది ఎల్లప్పుడూ ఒక 'సురక్షిత' కాంపాక్ట్ SUV గా ఉంది. ఎందుకు అంత సురక్షితం ఇది? ఎందుకంటే ఉదాహరణకు ఒక వ్యక్తి MNC లాంటి పెద్ద కంపెనీలో ఒక మంచి పొజిషన్ లో ఉంటే అతను ఎంత సురక్షితం అని చెప్పబడతాడో ఇది కూడా అందుకే చెప్పబడుతుంది. ఆ వ్యక్తి బాగా జీతం తీసుకోబడతాడు, బాగా డ్రెస్ వేసుకుంటాడు మరియు ఎల్లప్పుడూ కంపెనీ లో మంచి వ్యక్తిగా ఉంటాడు. కానీ అతను నిజంగా అనవసరమైన రిస్క్ తీసుకోవాలని గానీ లేదా సాయంత్రం కంపెనీ పార్టీ కోసం కేవలం ఉన్నతాధికారుల మెప్పు పొందడానికి ఒక విలాసవంతమైన దుస్తులు అలంకరించే ప్రయత్నం చేయడు. క్రెటా కొంతవరకు 'సురక్షితం' అనే ట్యాగ్ కి సమర్థిస్తుంది. ఇది హుండాయ్ యొక్క 'ఫ్లూయిడిక్ డిజైన్' ఫిలాసఫీ ని ఆలింగనం చేసుకుని చాలా బాగా ధరించింది మరియు లోపల భాగాలు చూస్తే ప్రజలచే ఈలలు మరియు అరుపులు పెట్టే విధంగా ఉంటాయి. ఇది ఏ కోణం నుండి చూసినా కుడా మచ్చ లేని విధంగా ఉంటుంది, అందువలనే భారతీయ కొనుగోలుదారులు దీనిని బాగా స్వీకరిస్తున్నారు.
క్రెటా దాని నిరాడంబరమైన అందంతో పోటీలో నిలబడడమే కాదు, అది పూర్తిగా మొట్టమొదటి ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ని పరిచయం చేయడం ద్వారా ఈ విభాగంలోని ఒక మార్గదర్శిగా నిలిచింది. ఈ డీజిల్ లో కూడా ఆటోమెటిక్ ప్రారంభించాలన్న ఆలోచన 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ తో పూర్తి కావడం అనేది ప్రశంసనీయం. ఈ క్రొత్తగా కనుగొనబడిన ఆటోమేటిక్, లేదా నేను క్లచ్-లెస్ అని అనొచ్చు, ప్రేమ (మార్కెట్లో AMT లను దృష్టిలో ఉంచుకొని) క్రమంగా మన ప్రపంచంలోని భాగంలో పైకి వస్తూ హుండాయ్ సంస్థ ఈ ఆటలో కొనసాగాలని కోరుకుంటుంది.
బాహ్యభాగాల స్టైలింగ్
హ్యుందాయ్ ఇప్పటికే ఉన్న క్రెటా కి ఎలాంటి మార్పులు చేయలేదు మరియు ఎందుకు వారు చేయలేదు? ఒకసారి దానిని చూడండి ఇది అన్ని కోణాల నుండి ఒక అద్భుతంలా ఉంటుంది. అది ప్రారంభించిన తరువాత మార్కెట్ లో కొంత సమయం గడిపినప్పటికీ, క్రెటా ఎక్కడా పాతబడిపోయినట్టు ఏమీ కనిపించలేదు. నేను ప్రారంభంలో చెప్పినట్టు క్రెటా అన్ని లక్షణాలతో బాగా ధరించబడింది.
హెక్సాగొనల్ ఫ్రంట్ గ్రిల్ వద్ద ఉన్న కొద్దిగా టిల్ట్ చేయబడి ఉన్న త్రీ-స్లాట్ క్రోం స్వెప్ట్‌బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ తో కలిసి ఉండడం ఈ ఫ్లుయిడిక్ డిజైన్ కి న్యాయం చేసింది. క్రెటా యొక్క రూపకల్పన లో ఉత్తమమైనది ఏమిటంటే దీని యొక్క డిజైన్ కర్వ్స్ మరియు షార్ప్ క్యారెక్టర్ లైన్స్ యొక్క కలయికతో చాలా అద్భుతంగా ఉంటుంది, దీని వలన క్రెటా కి SUV యొక్క హుందాతనం వచ్చింది. ఆ SUV లుక్ ఉన్నప్పటికీ ఇంకా అది సరిగ్గా కనిపించేలా చేయడానికి అదనపు సమూహాన్ని దూరంగా ఉంచడం ద్వారా దానిని ఇంకా ఫిట్ గా ఉండేలా చేస్తుంది. నిలువుగా అమర్చిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఈ మృదువైన-రహదారి కాంపాక్ట్ SUV ని మంచి నిష్పత్తిలో ఉంచుతుంది.
వెనక భాగానికి వెళితే టెయిల్‌ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ SUV ట్యాగ్ కి న్యాయం చేస్తున్నాయని అనుకోడం లేదు. నన్ను కొంచెం ఇంకా భరించండి ఇక్కడ ఇంకా కొంచెం వివరంగా చెప్పాల్సింది ఉంది, మీకు దాని మీద వేరొక అభిప్రాయం ఉండవచ్చు. మొత్తం సెటప్ గనుక చూసుకున్నట్లయితే వెనుక భాగంలో మాత్రం SUV లా కాకుండా సెడాన్ లా ఉండేలా చేసింది. నాకు ఇది ఒక నిరుత్సాహం కలిగించిన విషయం.
ఆ విషయం పక్కన పెడితే SX+ కాటగిరీలో ఉండే ఆటోమెటిక్ వేరియంట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మీద డే టైం రన్నింగ్ లైట్స్, స్పోర్టీ లుకింగ్ 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా ఇవన్నిటితో ఈ కారు పూర్తవుతుంది.
లోపలభాగాలు
మనకి ఇక్కడ ఒక ఫిలాసఫీ ఉంది, "విరగకుండా అతికించడం ఎందుకు?" హ్యుందాయి ఈ చంకీ ఆటోమెటిక్ గేర్ యూనిట్ ఏదైతే సెంట్రల్ కన్సోల్ క్రింద ఉంటుందో దానిని మినహాయించి ఇంటీరియర్స్ తో పెద్దగా మార్పులు అనేవి ఏమీ చేయలేదు. డాష్బోర్డ్ యొక్క లేఅవుట్ చాలా అధునాతనమైనది మరియు చక్కగా కలిసిపోతుంది. డాష్బోర్డ్ మీద ఉండే బీజ్ ఫినిషింగ్ సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ ఫ్రంట్ డోర్ మీద ఉండే గ్రాబ్ హ్యాండిల్స్ వరకూ వెళుతూ ఈ మొత్తం నల్లగా ఉండే క్యాబిన్ కి ఒక కొత్త వెలుగుని అందిస్తుంది. నాకు ఈ డాష్బోర్డ్ మీద ఉండే బ్లాక్ ప్లాస్టిక్ కేసింగ్ చాలా అందంగా అనిపించింది మరియు ఇది క్యాబిన్ ని రెండు భాగాల క్రింద విభజిస్తుంది.
సెంటర్ లో ఉండే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉపయోగించడానికి చాలా సులభం మరియు ఇది గొప్ప అభిప్రాయాన్ని అందిస్తుంది. నేను ఎదుర్కొన్న ఏకైక చిన్న సమస్య ఏమిటంటే, డే మోడ్ ఎంచుకున్నప్పటికీ సన్ లైట్ లో ఆ స్క్రీన్ తక్కువ విసిబిలిటీ అందిస్తుంది. వినోదం కోసం మీరు USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ అందించబడుతుంది. దాన్ని తనిఖీ చేయడానికి, నేను నా స్మార్ట్ఫోన్ పెయిర్ చేసి కొన్ని EDM ట్రాక్స్ ని వినడానికి ప్రయత్నం చేశాను. ఆడియో నాణ్యత పర్వాలేదు, కానీ పోటీదారుల యూనిట్స్ తో పోలిస్తే అంత ఉత్తమం ఏమీ కాదు(ఉదాహరణకు టాటా-టియాగోలో ఉండే హర్మాన్ యూనిట్ అనేది ఒక వరం). కానీ మళ్ళీ ఎవరైతే మ్యూజిక్ ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఎలాగో మార్కెట్ లో AMP మరియు బాస్ కిట్ లు లభిస్తాయి, అవి ఎలాంటి శబ్ధాలనైనా బాగా ఇష్టపడేలా చేస్తాయి.
సీటింగ్ రెండు వరుసల కొరకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఇది ముందు వరుసలో కూర్చొనే వారికి ప్రక్కభాగం నుండి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మొత్తంగా, ఈ ఆటోమెటిక్ పెట్రోల్ అవతార్ ఉపయోగకరమైన లక్షణాలను పొందుతుంది మరియు మీరు దీనిలో ఫిర్యాదు చేయడానికి చాలా తక్కువ అంశాలు ఉన్నాయి. కానీ అక్కడే ఒక అడ్డంకి లా ఉంటుంది.
మీకు గుర్తు ఉందా ఈ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ SX + ట్రిమ్ లో వస్తుంది, ఇది టాప్ లైన్ వేరియంట్ కాదు. దీని లోపల కొన్ని లక్షణాలు అందించబడలేదు, కొన్ని కాదు చాలా లేవు. మొట్టమొదటిగా దీనిలో లెథర్ సీట్లు లేవు, ఒక ఫాబ్రిక్ లేఅవుట్ ని దీనిలో పొందుతారు. మీరు దీనిలో క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ IRVM, ఆటో హెడ్ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ పొందడం లేదు. హ్యుందాయ్ భద్రతలోనే టాప్ వేరియంట్ లో 6 ఎయిర్‌బ్యాగ్లకు అందించి దీనిలో కేవలం రెండు ఎయిర్బాగ్స్ (డ్రైవర్ మరియు ప్యాసెంజర్) తో ఆపేసింది. అంతేకాకుండా, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు హిల్ స్టార్ అసిస్ట్ కంట్రోల్ (HAC) కూడా లేవు. రూ. 12.86 లక్షల (ఎగువ షోరూమ్ ఢిల్లీ) వద్ద కొద్దిగా ఎక్కువ ధరతో ఉన్నప్పటికీ, ఈ ఫీచర్లను పొందడం లేదు కాబట్టి ఆ ధరకు న్యాయం చేయదు అనే చెప్పాలి.
కానీ మరోవైపు ఈ పెట్రోల్ ఆటోమేటిక్ ట్రిమ్ కొన్ని అదనపు ఫీచర్లు తో అందించబడుతుంది. ఇది స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్ కోసం ఒక లెథర్ ప్యాకేజిని కూడా పొందుతుంది. 60:40 రేర్ స్ప్లిట్ సీటు ఎంపిక వెనుక భాగంలో మరింత విశాలంగా తయారు చేయడానికి మళ్ళీ స్వాగతించే లక్షణంగా చెప్పవచ్చు. ఇప్పటికే దీనిలో ఆకట్టుకునే 402 లీటరు బూట్‌స్పేస్ ఉంది, దీని కారణంగా ఈ లక్షణాన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు.
డ్రైవ్
ఈ 1.6 లీటర్ పెట్రోల్ మోటర్ 123PS శక్తిని మరియు 151Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది, ఈ సంఖ్యలు ఏమీ అంత అద్భుతమైనవి కావు, కానీ నిజం చెప్పాలంటే ఒక 1200kg వెయిట్ ఉన్న వాహనానికి ఇది బాగా బరువుని అందిస్తుంది. దాని యొక్క పవర్ టు వెయిట్ రేషియో 98Ps పర్ టన్, ఈ కాంపాక్ట్ SUV తో సునాయాసంగా ఏ సమయంలోనైనా దూసుకెళ్ళగలదు.
బిజీగా ఉన్న ఆఫీస్ సమయములో రద్దీగా ఉన్న NH8 (ఢిల్లీ రూట్ కు గుర్గాన్) పై నేను క్రెటా యొక్క ఆటో గేర్ బాక్స్ ను పూర్తిగా ఉపయోగించుకున్నాను. ఈ ఇంజిన్ ఒక 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జతకట్టింది, ఇది టార్క్ కన్వర్టర్ ని సరిగ్గా ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఒక కన్వర్టర్ నుండి కొంత మందగింపు ఆశిస్తాము, కానీ ఆశ్చర్యకరంగా అది సులభంగా గేర్లు మారుస్తుంది, కానీ అన్ని యాక్సిలేటర్ ఇన్పుట్ పై ఆధారపడి ఉంటుంది. మనం చిన్నగా ప్రజర్ ఇచ్చి డ్రైవింగ్ చేసినప్పుడు, గేర్ మార్పులు 2000rpm వద్ద మృదువుగా ఉంటూ మరియు బదులుగా మంచి సామర్థ్యాన్ని పెంచుతుంది. పరీక్ష సమయంలో, మేము 12.7Kmpl మొత్తం మైలేజ్ ని అందించడం చూసాము, ఇది ఈ సైజ్ ఉన్న ఒక ఆటోమేటిక్ వాహనంకి మంచి గణాంకం. కానీ, ఇది కేవలం ఆటోమేటిక్ సెటప్ మరియు ఒక AMT కాదు, దీని గేర్ మార్పులు బాగుంటాయి అందువలన నేను నిజంగా ఈ కాంపాక్ట్ SUV ను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
పవర్ డెలివరీ చాలా సరళంగా ఉంటుంది మరియు మీరు నెమ్మదిగా వెళుతున్నపుడు క్యాబిన్ అనేది చాలా ఇన్సులేటెడ్ గా ఉండి ఇంజిన్ శబ్దం లోపలకి రాకుండా ఉంటుంది. కాని, ఒకసారి మీరు యాక్సిలరేషన్ గనుక ఎక్కువ ఇచ్చినట్లయితే ఆ ఇంజిన్ యొక్క అరుపు మీకు లోపలకి వినిపిస్తుంది, ఎందుకంటే ఈ ట్రాన్స్మిషన్ సరైన గేర్ కనుక్కోడానికి తన కంటూ కొంత సమయం తీసుకుంటుంది. అవును, ఖచ్చితంగా ఒక లాగ్ అనేది ఉంది కానీ ఇదేదో మళ్ళీ పవర్ పొందడానికి చాలా సమయం అయితే పట్టదు (ఒక AMT సెటప్ లో ఉన్నట్టుగా). ఈ టార్క్ కన్వెర్టర్ యొక్క మంచి లక్షణం ఏమిటంటే అది మీ ఇన్‌పుట్ కి అనుగుణంగా నడుచుకుంటుంది మరియు దీని వలన ఎక్కువ RPM వద్ద కూడా ఒకే గేర్ లో వాహనాన్ని ఉంచగలదు. మీలో ఉన్న షుమేకర్ ని బయటకి తీసుకొని రావాలంటే ఇవన్నీ కూడా ఒక ప్రత్యేఖ ధరకి లభిస్తాయి. ఈ సమయ్సని ఎదుర్కోడానికి మరొక విధానం ఏదైనా ఉంది అంటే అది మాన్యువల్ మోడ్ కి మారడం మరియు మీ చేతుల్లోకి తీసుకొని కంట్రోల్ చేయడం. మాన్యువల్ షిఫ్ట్స్ వెన్నలాగ మృధువుగా ఉంటాయి మరియు ఆ ఇంజన్ యొక్క అరుపు నుండి మీరు విముక్తి చెందుతారు.
ఇది నేను ఖచ్చితంగా చెప్పాలి మరియు ఇది ఒక ఎక్స్-హ్యుందాయి ఓనర్ నుండి వచ్చిన మాట. స్టీరింగ్ అనేది ఇప్పటిదాక నేను చూసిన వాటిలో చాలా బాగుంది. సాధారణంగా చాలా తేలికగా ఉండే స్టీరింగ్ అందిస్తుందని విమర్శలను ఎదుర్కుంది, ఇది మటుకు మంచి బరువు ని మరియు డిల్లీ లాంటి రద్దీగా ఉండే రోడ్డులలో కూడా తేలికగా హ్యాండిల్ చేసేలా ఉంది. కార్నర్స్ లో టర్నింగ్ తిప్పేటపుడు బాడీ రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ కొంత ఇబ్బంది అయితే ఖచ్చితంగా మనం గమనించవచ్చు, ఎందుకంటే కార్నర్స్ నుండి లోపలికి మరియు బయటకి వెళ్ళడానికి అంత ఆహ్లాదకరంగా ఉండదు. మొత్తంగా చెప్పాలంటే దీని యొక్క మిగిలిన వేరియంట్లలో రైడ్ ఉన్నట్టుగానే దీనిలో కూడా ఉంటూ సస్పెన్షన్ సెటప్ ని కూడా మిగిలిన వాటిలానే ఉపయోగించుకుంటుంది. గతకల రోడ్స్ ని సునాయాసంగా దాటేస్తుంది, సస్పెన్షన్ విషయానికి వస్తే కొంచెం స్టిఫ్ గానే ఉంటుంది, కొన్ని జెర్క్స్ అనేవి మీరు అనుభూతి చెందుతారు, కానీ మొత్తంగా చెప్పాలంటే ఈ డ్రైవ్ చాలా స్థిరంగా ఉంటుంది.
కొనుగోలు చేసుకొనేందుకు సరైనదా?
దీనికి సమాధానం చెప్పలాంటే, దీనిని త్వరగా మొత్తం ఒకసారి చూసుకుందాము. ఇది ఒక బాగా అందంగా అమర్చబడిన SUV, బోనెట్ క్రింద ఒక మంచి మోటార్, ఆటోబాక్స్ బాగా ఆధునికత చెందినది, ఇంటీరియర్స్ అందంగా అమర్చబడ్డాయి మరియు దీనికి ఉండే లక్షణాల జాబితా బాగా ఆకర్షిస్తుంది. ఇవన్నీ మిమ్మల్ని ఉత్తేజపరచకపోతే ఇంక ఏది ఉత్తేజపరుస్తుందో తెలియదు. కానీ ఇక్కడ ఒక కానీ అనే అంశం ఉంది, అది ఏమిటంటే దీని యొక్క ధర రూ.12.86 లక్షల(ఎక్స్-షో రూం, డిల్లీ) వద్ద కొంచెం ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా ఇది టాప్ మోడల్ కాకపోవడం వలన కొన్ని లక్షణాలను కూడా కలిగి ఉండదు. ఇది చెప్తున్నప్పటికీ అవేమీ నిజంగా డీల్ బ్రేకర్స్ కావు. మేము చెప్పేదేమిటంటే ఒక్కసారి ఈ ఆటోబాక్స్ అధిక ట్రాఫిక్ లో మరియు ఓపెన్ రోడ్స్ లో ఇది అందించే సౌకర్యం గురించి ఊహించుకోండి. ఒక పూర్తి ప్యాకేజ్ లా,ఇది ఖచ్చితంగా మీ దృష్టిని పొందడానికి అర్హత కలిగి ఉన్నది. అయితే, మేము హోండా BRV CVT పెట్రోల్ రూ. 11.99 లక్షలు, ఫోర్డ్ ఎకోస్పోర్ పెట్రోల్ టైటానియం AT రూ.9.61 లక్షల వద్ద కూడా మీరు చూడమని మేము సిఫార్సు చేస్తున్నాము.