• English
  • Login / Register

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్: సమీక్ష

Published On మే 11, 2019 By alan richard for హ్యుందాయ్ క్రెటా 2015-2020

  • 1 View
  • Write a comment

దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుండి, క్రెటా ముందుగా ఏ ఇతర క్రాసోవర్ కూడా చేయని విధంగా భారతీయ కొనుగోలుదారుల ఊహలను అందుకుంది. కొన్ని సమయాల్లో, దాని ప్రత్యర్థులందరినీ కూడా దాటి  అమ్మకాలను అధిగమించింది.

2018 Hyundai Creta

చివరకు కొత్త మరియు 2018 యొక్క అత్యంత ఎదురుచూస్తున్న మోడల్ నవీకరణ అయిన హ్యుందాయి క్రెటా ని మా చేతుల్లో కలిగి ఉన్నాము. టాప్-స్పెక్ వేరియంట్ ధరలు కొంచెం పెరిగాయి మరియు కొన్ని వేరియంట్స్ కొన్ని వాటిలో లేనటువంటి కొన్ని కొత్త లక్షణాలను కలిగి ఉన్నాయి, కొన్నిటికి జోడించబడలేదు. హ్యుందాయ్ సంస్థ అత్యంత ప్రాచుర్యం పొందిన లక్షణాలలో ఒకటి అయిన సన్రూఫ్ ని టాప్-స్పెక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వేరియంట్స్ లో జోడించింది. దీనిలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి మరియు లోపాలు కూడా ఉన్నాయి, అవి ఏమిటో తెలుసుకోడానికి ఇది చదవండి మరియు హ్యుందాయి క్రెటా దాని తిరుగులేని పాలన కొనసాగించడానికి తగినదా కాదా కనుక్కుందాం పదండి.

బాహ్య భాగాలు

2018 Hyundai Creta

ఈ 2018 క్రెటా లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే కొత్త ఫ్యామిలీ గ్రిల్, ఇది ఇప్పుడు దాని మీద ఒక పెద్ద క్రోం యాక్సెంట్ ని చుట్టూ కలిగి ఉంటూ మరియు టాప్ కార్నర్స్ లో ఉండే హెడ్‌ల్యాంప్స్ తో కూడా కలిసిపోతుంది. ఈ హెడ్ల్యాంప్లు కూడా ఒక సరికొత్త ఆకృతిలో ఉంటాయి, అయినప్పటికీ అవి ఖచ్చితంగా దాని మునుపు ఉన్న స్థానంలోనే ఉన్నాయి. ఈ DRLS కొద్దిగా క్రిందకు రీ డిజైన్ బంపర్ దగ్గరగా షిఫ్ట్ చేయబడడం జరిగింది మరియు అవి ఫాగ్ ల్యాంప్స్ లోపల కూర్చొని ఉన్నాయి. ప్రక్కభాగం నుండి గనుక చూస్తే మనకి ఈ 17-ఇంచ్ 5 స్పోక్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ మాత్రమే అందంగా కనిపిస్తాయి, అలాగే రూఫ్ మీద ఉండే రూఫ్ రెయిల్స్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వెనుక భాగంలో చిన్న చిన్న మార్పులు పునఃరూపకల్పన చేసిన టెయిల్ ల్యాంప్ యూనిట్లు మరియు రేర్ బంపర్ మునుపటిలాగా బాడీ కి స్ట్రైట్ లైన్ లో జాయిన్ అవ్వకుండా వెలుపల అంచులలో ఎక్కువ ప్లాస్టిక్ క్లాడింగ్ తో ఉంటుంది. హ్యుందాయ్ హెడ్ లాంప్స్ లేదా టెయిల్ ల్యాంప్స్ లో ఎలిమెంట్లను కలుపుకొని, డిజైన్ కు మరికొన్ని మార్పులు చేసి ఈ ఫేస్లిఫ్ట్ కి మరింత ఆకర్షణీయంతను  ఉపయోగించుకోవచ్చు. బాధాకరంగా ఈ మార్పు అనేది ఈ సారి లేదు.

2018 Hyundai Creta

లోపల భాగాలు

2018 Hyundai Creta

క్రెటా యొక్క అంతర్గత భాగంలో కూడా చాలా మార్పులు ఏమీ జరగలేదు. అయితే డిజైన్ ఇప్పటికీ ఆకట్టుకునే విధంగానే కనిపిస్తుంది మరియు ఈ విభాగంలో అత్యంత ఖరీదైనదిగా అనిపిస్తుంది. దీనిలో అధనంగా సన్‌రూఫ్ ని జోడించడం వలన మరి కొంచెం ఎక్కువ వెలుతురు వస్తూ చీకటిగా ఉండే అంతర్భాగాలలో వెలుగు నింపినట్టుగా అయ్యింది. ఈ లక్షణం దీనిలో ఈ కొత్తగా చేర్చబడిన లక్షణాలలో చాలా పాజిటివ్ గా ఉంది అని చెప్పవచ్చు.  

కొలతలు - ఫ్రంట్ సీట్

పారామీటర్

 

లెగ్రూమ్ (మిని-మాక్స్)

925-1120mm

మోకాలి గది (మిని-మాక్స్)

610-840mm

సీట్ బేస్ పొడవు

595mm

సీట్ బేస్ వెడల్పు

505mm

సీట్ బ్యాక్ హైట్

645mm

హెడ్ రూమ్ (మిని-మాక్స్)

920-980mm

క్యాబిన్ వెడల్పు

1400mm

స్పేస్ కోసం సంబంధించినంత వరకు క్రెటా కుటుంబం కోసం చాలా విశాలమైనదిగా ఉంటుందని చెప్పవచ్చు. దీని యొక్క సీట్లు చాలా వెడల్పుగా మద్దతు ఇచ్చే విధంగా ఉంటాయి మరియు స్టీరింగ్ కేవలం టిల్ట్ అడ్జస్ట్మెంట్ ని మాత్రమే కలిగి ఉంది, దీనిని తగినంత అడ్జస్ట్ చేసుకొని మీరు  డ్రైవర్ సీటులో సౌకర్యవంతమైన స్థానాన్ని పొందవచ్చు.

కొలతలు - వెనక సీట్

పారామీటర్

 

షోల్డర్ రూం

1250mm

హెడ్ రూమ్

980mm

సీట్ బేస్ పొడవు

450mm

సీట్ బేస్ వెడల్పు

1260mm

సీట్ బ్యాక్ హైట్

640mm

మోకాలి గది (మిని-మాక్స్)

615-920mm


వెనుకాతల భాగంలో షోల్డర్ రూం 1250mm వద్ద సబబుగానే ఉంటుంది, కానీ S- క్రాస్ తో పోలిస్తే క్రెటా కంటే కూడా S-క్రాస్ వెనుక బెంచ్ 1350mm వద్ద 100mm ఎక్కువగా ఉంటూ మరింత విశాలంగా ఉంటుంది. డ్యుయల్ టోన్ పెట్రోల్ మరియు డీజిల్ కార్లు ఆరెంజ్ ఇంటీరియర్ యాక్సెంట్స్ ని అందిస్తాయి, ఇవి చీకటి-రంగు ఇంటీరియర్స్ ని విచ్ఛిన్నం చేస్తాయి.

టెక్నాలజీ

2018 Hyundai Creta

హ్యుందాయ్ క్రెటా యొక్క మార్పులు చిన్నవే అయినప్పటికీ చాలా ముఖ్యమైన మార్పులను పొందింది. కొత్త నవీకరణలలో క్రూయిస్ కంట్రోల్, సన్రూఫ్, 6-వే అడ్జస్టబుల్ శక్తితో కూడిన డ్రైవర్ సీటు, వైర్లెస్ ఛార్జింగ్ మరియు ఆటో డిమ్మింగ్ IRVM లు ఉన్నాయి. ISOFIX చైల్డ్ సీట్లు అనేవి SX AT పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లకు మాత్రమే జోడించబడ్డాయి, ఇది కొంచెం వింతగా ఉంటుంది. ఎందుకంటే అందరు తయారీదారులు ఈ లక్షణాన్ని ప్రామాణికమైనదిగా అందిస్తారు.  మేము కొత్త క్రెటా కోసం మా కోరికల జాబితాలో ఉన్న కొన్ని లక్షణాలు అయిన వెంటిలేటెడ్ సీట్లు, ఆటో హెడ్ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటివి కావాలనుకుంటున్నాము. ఈ లక్షణాలు కొత్తగా చేర్చిన లక్షణాల జాబితాలో లేవు.

2018 Hyundai Creta

పనితీరు

2018 Hyundai Creta

హ్యుందాయి ఇంజన్ లో పెద్ద మార్పులు అనేవి ఏమీ చేయలేదు, కానీ ఇంధన సామర్ధ్యాన్ని మాత్రం 4 శాతం కి పెంచి 20.5 కిలోమీటర్లు (పాత కారు 19.67 కిలోమీటర్లు ఇచ్చేది)ఇచ్చేలా చేసింది. 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ యొక్క పనితీరు విషయానికి వస్తే అది ఇప్పటికీ మరింత శక్తివంతమైనది అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 4000rpm వద్ద 128Ps శక్తిని మరియు 1500-3000rpm వద్ద 260Nm టార్క్ ని అందిస్తుంది. అందువల్ల హ్యుందాయ్ దానిని మార్చడానికి అంత పెద్ద అవసరం ఏమీ లేదు.

పట్టణంలో అవసరమైతే సులభంగా వేగవంతం చేయడానికి ఈ ఇంజన్ 2 వ లేదా 3 వ గేర్ లో తగినంత శక్తితో ఆనందపరుస్తుంది. హైవే లో ఇంజిన్ స్పిన్నింగ్ 2000rpm మార్క్ వద్ద ఉంచడానికి ప్రయత్నించాలి, ఇది సంతోషకరమైనది, మరియు అవసరమైతే త్వరగా  ఓవర్‌టేక్ చేస్తూ దూసుకెళ్ళడానికి ఇప్పటికీ తగినంత శక్తిని కలిగి ఉంది.

ఆక్సిలరేషన్

0-100kmph - 10.83 సెకెండ్స్

30-80kmph (3 వ) - 7.93 సెకెండ్స్

40-100kmph (4 వ) - 13.58 సెకెండ్స్

రైడ్ మరియు నిర్వహణ

క్రెటాకు యాంత్రిక మార్పులు లేనందున, ఈ రైడ్ హ్యాండిలింగ్ అనేది మునుపటి లానే డ్రైవింగ్ డైనమిక్స్ ని ప్రదర్శిస్తుంది. పట్టణం లో సస్పెన్షన్ చిన్న మరియు కొద్దిగా పెద్ద గతకల నుండి లోపల కూర్చొనే వారికి ఆ అనుభూతిని కలిగించకుండా చక్కగా పనితీరుని ప్రదర్శిస్తుంది. మరీ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఈ సస్పెన్షన్ అనేది కొంచెం ఎక్కువగా పనిచేసి అంత శబ్ధం అది ఏమీ లేకుండా ముందుకు తీసుకెళుతుంది. ఇది చెప్తున్నప్పటికీ మనకి బాగా ఎక్కువ బంప్స్ వచ్చినపుడు మాత్రం లేదా లెవెల్ మారుతున్నప్పుడూ మరియు ఏదైనా గతకలు వచ్చినప్పుడు గానీ ఆ సస్పెన్షన్ అనేది కొంచెం గట్టిగా ఉంటూ లోపలికి ఆ అనుభూతి తెలిసేలా చేస్తుంది.  

2018 Hyundai Creta

స్టీరింగ్ మరియు క్లచ్ తేలికగా ఉండడం వలన ఈ హుండాయ్ కారు వలన మనం సులభంగా సిటీ లో తిరగవచ్చు. అయితే, క్లచ్ చర్యను ఉపయోగించటానికి కొంత సమయం అవసరం కావచ్చు. ఇది చాలా తేలికగా ఉంటుంది, కానీ మీరు దీనిని ఫీల్ అవ్వలేరు, ఎప్పుడు ఉపయోగించాలి అనేది అంత సరిగ్గా చెప్పలేరు.

బ్రేకింగ్

100-0kmph - 43.43 మీటర్స్

80-0kmph - 26.75 మీటర్స్

బ్రేక్లు స్థిరమైనవి మరియు ప్రగతిశీలమైనవి మరియు వేగవంతమైన కారును ఆపే ముందు కొంచెం దూరం వెళ్ళి ఆగేలా సమర్థవంతంగా చూస్తుంది, కాని పెడల్ కొద్దిగా కష్టపడుతుందనే చెప్పుకోవాలి అది మాత్రమే దీనిలో ఉండే పిర్యాదు.

భద్రత

డ్యుయల్ ఎయిర్ బాగ్స్ మరియు EBD తో ABS ఈ మొత్తం రేంజ్ లో ప్రామాణికంగా అందించబడతాయి, అయితే SX (O) వేరియంట్ మాత్రం ఆరు ఎయిర్బాగ్లను పొందుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికెల్ స్టెబిలిటీ మానేజ్మెంట్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ SX (O) లో మాత్రమే లభిస్తాయి.  ISOFIX చైల్డ్ సీటు మౌంట్స్ SX AT పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వేరియంట్స్

హ్యుందాయి క్రెటా లో E, E+, S, SX, SX (డ్యుయల్ టోన్) మరియు SX (O) తో కలిపి మొత్తం 6 వేరియంట్స్ ఉన్నాయి. S & SX డీజిల్ మరియు SX పెట్రోల్ లలో 6-స్పీడ్ కన్వెన్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అందుబాటులో ఉన్నాయి.  

తీర్పు

2018 Hyundai Creta

మొత్తంగా చెప్పాలంటే ఈ 2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ అనేది మిగిలిన మోడల్స్ యొక్క నవీకరణలతో పోల్చి చూస్తే సరైన సమయానికి రంగంలోనికి దిగింది. మనం చాలా కార్లు కొంచెం తక్కువ మార్పులతోనే అప్డేట్ అవ్వడం చూసాము, అలాగే కొన్ని ఎక్కువ మార్పులతో అడేట్ అవ్వడము కూడా చూసాము. హ్యుందాయి సంస్థ దీనికి లుక్స్ విషయంలో మరియు లక్షణాల పరంగా చాలా మార్పులు చేసింది అని చెప్పాలి, కానీ ఇంకా కొన్ని చేసి ఉంటే బాగుండేది. అది మనం అర్ధం చేసుకోవచ్చు అంత మార్చడానికి దీనిలో అంత అవసరం కూడా ఏమీ లేదు.

SX(O) డీజిల్ ధర రూ. 15.03 లక్షలు (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ధరతో ఉంది, ఇది దీని పాత మోడల్ కంటే రూ.51,000 అధనంగా ఉంది. ఇది ఒక సన్రూఫ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, క్రూయిజ్ నియంత్రణ మరియు ఆటో అస్పష్ట IRVM కోసం ఈ ధర పెరుగుదల అనేది న్యాయంగానే ఉంది. కానీ మాకు కావలసినది ఇది అయితే కాదు, కానీ ఈ నవీకరణతో హ్యుందాయి క్రెటా వినియోగదారుల యొక్క ప్రధాన జాబితాలో ముందంజలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

Published by
alan richard

తాజా ఎస్యూవి కార్లు

రాబోయే కార్లు

తాజా ఎస్యూవి కార్లు

×
We need your సిటీ to customize your experience