దుబాయికి వెళుతున్న వైట్ గోల్డ్ మెక్లారెన్ 650 ఎస్ స్పైడర్
నవంబర్ 16, 2015 06:16 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టిపికల్ మిడిల్ ఈస్ట్ విపరీత మార్గంలో, మెక్లారెన్ 2015 దుబాయ్ మోటార్ షో కోసం ఒక ప్రత్యేక ఎడిషన్ అయిన 650 ఎస్ స్పైడర్ ను తెచ్చింది. 650 ఎస్ స్పైడర్ అల్ సహారా 79 కారు, మిడిల్ ఈస్ట్ కోసం ప్రత్యేకంగా మెక్లారెన్ స్పెషల్ ఆపరేషన్స్ ద్వారా తయారు చేయబడింది. ఈ అల్ సహారా 79, మిడిల్ ఈస్ట్ భూభాగం యొక్క బంగారు ఇసుకల స్ఫూర్తి తో పెర్ల్సెంట్ తెలుపు బంగారు లేపన రంగు అందించబడింది. ఈ 79 అను సంఖ్య, పెయింటింగ్ ను సూచిస్తుంది మరియు ఇది, 24 క్యారెట్ల బంగారం కణాలను ఉపయోగించి సాధించిన బంగారం యొక్క పరమాణు సంఖ్య ను సూచిస్తుంది. ఈ అల్ సహారా 79 వాహనం, 570 ఎస్ కూపే మరియు కస్టమైజెడ్ పి1 లతో కలిసి ప్రదర్శించబడుతుంది.
ఈ 650 ఎస్ స్పైడర్ అల్ సహారా 79 కారు కు, కన్వర్టబుల్ హార్డ్ టాప్, గ్లాస్ బ్లాక్ తేలికైన ఫొర్గ్డ్ అల్లాయ్ వీల్స్, సైడ్ భాగంలో ఉండే కార్బన్ ఫైబర్, ముందు స్ప్లిట్టర్ మరియు వెనుక డిఫ్యూజర్, పూర్తి పరిమాణం గల కార్బన్ ఫైబర్ ఎం ఎస్ ఓ బ్రాండెడ్ సైడ్ బ్లేడ్ లు వంటివి అందించబడ్డాయి. అంతర్భాగం పరంగా, విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే స్పోర్ట్ సీట్లకు నలుపు మరియు ఆల్మండ్ తెలుపు లెధర్ అపోలిస్ట్రీ తో పాటు విభిన్న కుట్టు, అల్ సహారా 79 పెయింట్ స్కీండ్ స్టీరింగ్ వీల్, సెంట్రల్ కన్సోల్ మరియు డోర్ ప్యానళ్ళ చుట్టూ హీటింగ్ మరియు వెంటిలేషన్ నియంత్రణలు, ముదరు బంగారు ముగింపు స్విచ్ గేర్ మరియు హీటింగ్ వెంట్లు వంటివి అందించబడతాయి.
ఈ 3.8 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్ ను, 650 ఎస్ కూపే లో మరియు 650 ఎస్ స్పైడర్ వాహనాలలో చూడవచ్చు. ఈ ఇంజన్ అత్యధికంగా, 7250 ఆర్ పి ఎం వద్ద 641 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 678 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంజన్ పనితీరు మాత్రం ఏ మార్పులను చోటు చేసుకోలేదు. ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 3 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే ఇంజన్, 329 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
25 శాతం కంటే ఎక్కువ వాహనాలు, ఎం ఎస్ ఓ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తూర్పు మధ్య ప్రాంతంలో కావలసిన విధంగా తయారు చేయబడ్డాయి. ఈ ఎంపికలు ఏకైక రంగులు, కుట్లు, ఏరోడైనమిక్ నవీకరణలు పరంగా లెధర్ వంటివి అందించబడతాయి.