రెనాల్ట్, 2016 భారత ఆటో ఎక్స్పో లో ఎలాంటి హంగులతో రాబోతోంది?
డిసెంబర్ 31, 2015 03:45 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ ;
ఎన్నో రకాల కార్లు మరియు వాటి భావనలు రాబోయే భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించడానికి సిద్దంగా ఉన్నాయి. మనందరం కుడా వాటి కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచుస్తున్నాము. మారుతి, ఆడి, జీప్ మరియు ఇతర వాహన తయారీదారులు తాము తీసుకొస్తున్న వాహనం గురించి ఎంతో కొంత ప్రణాళికని వివరించారు. ఫ్రాన్స్ నుండి మనకు ఎంతో ప్రియమయిన రెనాల్ట్ తన KWID AMT మరియు 1.0 లీటర్ వెర్షన్ ని ప్రదర్శించబోతోందని భావిస్తున్నారు. బహుశా డస్టర్ ఫేస్లిఫ్ట్ కూడా ప్రదర్శించబడవచ్చు మరియు మనం దాని గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నాము . దీని యొక్క మరిన్ని వివరాలు తెలుసుకుందాము.
రెండు సంవత్సరాల క్రితం 2014 ఆటో ఎక్స్పోలో రెనాల్ట్,KWID కాన్సెప్ట్ ని మరియు డస్టర్ అడ్వెంచర్ వెర్షన్ ,మెగానే, స్కాలా మరియు పల్స్ లని ప్రదర్శించారు. గత రెండు ఉత్పత్తుల అమ్మకాలు అంతగా లేకపోవటం వలన బహుశా తయారీదారు వీటిని నిలిపివేసే అవకాశం ఉంది. మిగతా మూడింటిలో ఒక విభాగంలో చాంప్ అయిన డస్టర్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. క్విడ్ భావనని ప్రజలందరూ సాదరంగా స్వాగతించారు. మోత్హం మీద క్విడ్ దాని విభాగంలో ఎంతగానో రాణించింది. మరియు మేగానే ఇప్పటిదాకా ఇంకా తయారు చేయబడలేదు.
భారతీయుల అంచనాలు ఎక్కువగా ఉండటం తో వాటిని అందుకోవటానికి మరియు ఎత్తుగడలని అధిగమించడానికి రెనాల్ట్ చాలా వ్యూహత్మకంగా వ్యవహరించాలి. 1.0క్విడ్ మరియు డస్టర్ ల ఫేస్లిఫ్ట్ లు ఇదివరకు వచ్చాయి. ప్రజల ఆదరణ మేరకు మళ్ళీ దీనిని మన ముందుకు తీసుకురాబోతున్నారు.
ప్రారంభ సమయంలో ఎంత ధర ని నిర్ణయించాలో రెనాల్ట్ కి చాలా బాగా తెలుసు. దీనికి క్విడ్ మరియు డస్టర్ అతి పెద్ద ఉదాహరణలు. వీరు ఇంతకు ముందు ఇవి ఉత్పత్తి చేసారు .సిలియో మరియు మెగానే వంటి, వాహనాలు ఇప్పుడు రెనాల్ట్ మార్గాన్ని అనుసరించనున్నాయి. ఇది ఉత్కంతతో వేచి చూడాల్సిన సమయం .
ఇది కుడా చదవండి ;
శాంగ్యాంగ్ టివోలి అనధికారికంగా తొలిసారి భారతదేశంలో కనిపించింది.