వారాంతపు వార్తా విశేషాలు: మారుతి బాలెనో విడుదల, కార్దేఖొ జిగ్వీల్స్ సేకరణ, హోండా బిఆర్-వి సమగ్ర వివరాలు

నవంబర్ 02, 2015 01:22 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఈ వారం మారుతి సుజికి దాని ప్రీమియం అంతర్జాతీయ కారు, బాలెనో ప్రారంభంతో ఊపందుకుంది. బాలెనో తో ఉత్సాహం ఆగిపోకుండా ! కార్దేఖో జిగ్వీల్స్ సేకరణ కూడా ఈ వారంలో జరిగింది. అంతేకాకుండా దేశంలో అందుబాటులో ఉన్న అన్ని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ల వివరాలను విశ్లేషించగలిగాము మరియు తదుపరి సంవత్సరం విడుదల కాబోయే  హోండా బీఅర్-వి ప్రత్యేక  చిత్రాలను వీక్షించగలిగాము.

ఈ వారం రాబోయే ప్రారంభాల గురించి మాట్లాడుకుంటే, రాబొయే టొయోటా ఇన్నోవా అనధికార బ్రోచర్ ను చూడగలిగాము మరియు విస్తృతంగా 2015 టోక్యో మోటార్ షో ని కవర్ చేయగలిగాము. ఈ వారంలో ఒకేఒక్క నిరుత్సాహకరమైన విషయం ఫియట్ అబర్త్ అవెంచురా యొక్క ధర స్వల్పంగా పెరగడం. ఫియాట్ వారు ఫియట్ పుంటో హ్యాచ్బ్యాక్ యొక్క స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ ని కూడా ప్రారంభించారు. అంతేకాకుండా, రాబొయే బీఅర్-వి యొక్క కొనుగోలుదారుల యొక్క ఇష్టతా, అయిష్టత వివరాలను తెలిసుకోగలిగాము.        

మారుతి సుజుకి బాలెనో రూ. 4.99 లక్షల ధర వద్ద ప్రారంభించబడినది

Maruti Suzuki Baleno

డిల్లీ: మారుతి సుజికి ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ ని నేడు భారత మార్కెట్లోనికి రూ. 4.99 లక్షల ధర వద్ద ప్రారంభించింది. ఇది ఎస్-క్రాస్ తరువాత భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అందిస్తున్న రెండవ వాహనం. అదే నెక్సా ప్రీమియం డీలర్షిప్ల ద్వారా ప్రత్యేకంగా అమ్మకం అవుతుంది. ఇంకా చదవండి:

కార్దేఖో.కాం వారు జిగ్‌వీల్స్.కాం ని కొనుగోలు చేశారు - టైంస్ ఇంటర్నెట్ వారు గిర్‌నార్ సాఫ్ట్‌వేర్ లో పెట్టుబడి పెట్టారు

న్యూ డిల్లీ: గిర్నార్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆటో పోర్టల్ కార్దేఖో.కాం & గాడీ దేఖో.కాం మరియు టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ యజమానులు ఈ రోజు జిగ్వీల్స్.కాం ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇది టైమ్స్ ఇంటర్నెట్ నుండి గిర్నార్ ద్వారా భారతదేశం యొక్క ప్రముఖ ఆటోమొబైల్ పోర్టల్ లో ఒకటి. ఈ నేపధ్యంలో టైమ్స్ ఇంటర్నెట్ గిర్నార్ సాఫ్ట్వేర్ తో పాటూ  సీక్వోయా కాపిటల్, హిల్ హౌస్, టైబోన్, రతన్ టాటా మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి  ఇప్పుడు పెట్టుబడిదారి. ఇంకా చదవండి:

సరిపోల్చుట: మారుతి సుజుకి బాలెనో Vs ఎలైట్ ఐ20 Vs జాజ్ Vs పోలో Vs పుంటో ఈవో

జైపూర్: హ్యాచ్బ్యాక్ లు ఎల్లప్పుడూ మారుతి సంస్థ కి ఒక గొప్ప బలాన్ని చేకూరుస్తాయి. ఈ విభాగంలో మూడు విప్లవాత్మకమైన మోడల్స్ ఉన్నాయి, అవి ఐకానిక్ మారుతి 800, ఆల్టో మరియు స్విఫ్ట్. కొత్త బాలెనో మొదటిగా అనేక అంశాలతో ఆశక్తికరంగా ఉంది. ఇప్పటి నుంచి ఇది స్విట్ నుండి బాద్యతలు తీసుకొని సంస్థ యొక్క ఫ్లాగ్షిప్ హ్యాచ్బ్యాక్ గా మారబోతున్నది మరియు ఇది మొత్తం ప్రపంచానికి భారతదేశం నుండి ఎగుమతి చేయబడుతుంది. ఇది స్థానికంగా తయారుచేయబడిన కారణంగా తక్కువ ధరకు అందించబడుతుంది. బాలెనో బేస్ మోడల్ నుండి ఏబిఎస్ మరియు ఇబిడి తో పాటూ ప్రామాణికంగా డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగియుండి దేశంలో అత్యంత అద్భుతమైన కారుగా ఉండడం మెచ్చుకోదగ్గ విషయం. ఇక్కడ బాలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్పేస్ నుండి దాని ప్రత్యర్థులతో ఏ విధంగా పోటీ పడుతుందో చూద్దాము. ఇంకా చదవండి:

హోండా బీఆర్-వీ వచ్చే ఏడాది రానుంది, అని సీఈఓ తెలిపారు

Honda BR-V

జైపూర్: హోండా బీఆర్-వీ యొక్క రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీ  మార్చ్ 2016 తరువాత వస్తుంది అని హోండా కార్ల ప్రెసిడెంట్ మరియూ సీఈఓ అయిన మిస్టర్. కత్సుషీ ఇనో గారు తెలిపారు. ఈ కారు బ్రయో వేదికగా నిర్మించబడింది మరియూ ఫోర్డ్ ఈకో స్పోర్ట్, మారుతి ఎస్-క్రాస్, హ్యుండై క్రేటా మరియూ రెనాల్ట్ డస్టర్ వంటి వాహనాలకు పోటీగా నిలవనుంది. ఇంకా చదవండి:

హోండా బీఆర్-వీ ఫోటో గ్యాలరీ - జపాన్ నుండి ప్రత్యేకం

Honda BR-V

జైపూర్: మేము హోండా ఇండియా యొక్క తదుపరి రాబోయే పెద్ద సమర్పణ బిఆర్-వి ని టోక్యో, జపాన్ లో నడిపాము. ఈ జపనీస్ వాహన తయారీసంస్థ రాబోయే నెలల్లో బీఅర్-వి తో పెరుగుతున్న కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో చేరబోతుంది. దీనిలో ఆశక్తికరమైన అంశం ఏమిటంటే బీఅర్-వి దాని పోటీదారుల వలే కాకుండా, ఏడు సీట్ల సౌకర్యంతో అందించబడుతున్నది. హ్యుందాయి ఇటీవలే దాని పోటీదారి అయిన క్రెటా ని దేశంలో ప్రారంభించింది. ఈ కొరియన్ తయారీసంస్థ అందించిన వాహనం నెలవారీ కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో దాదాపు 7K + యూనిట్లు అమ్మకాలు చేస్తూ అద్భుతంగా రాణిస్తుంది. ఆ వాహనం ప్రారంభించబడిన సమయానికి రెనాల్ట్ డస్టర్ కూడా యాంత్రిక నవీకరణలతో పాటు ఒక ఫేస్‌లిఫ్ట్ ని పొందింది. డస్టర్ మరియు నిస్సన్ టెరానో చూసేందుకు ఒకే విధంగా ఉన్నట్టు వూహిస్తున్నాము. ఇది ఏడు-సీట్లను కలిగియుండి మహీంద్రా స్కార్పియో ( ఈ సంవత్సరం ప్రారంభించబడిన రెండవ తరం వాహనం) మరియు నవీకరించబడిన 2015 టాటా సఫారి తో పోటీ  పడవచ్చు. ఇంకా చదవండి:

2016 టొయోటా ఇన్నొవా యొక్క చిత్రాలు అధికారిక బ్రోచర్ ద్వారా కంటపడ్డాయి

Toyota Innova

జైపూర్: వచ్చే నెల ఆవిష్కారానికి మునుపే ఈ రెండవ తరం 2016 ఇన్నొవా యొక్క చిత్రాలు బ్రోషర్ ద్వారా కంటపడటం జరిగింది.  టొయోటా వారు ఇన్నోవా ని పూర్తిగా పునరుద్దరించారు. రాబోయే ఫార్చునర్ లాగా ఈ ఇన్నోవా కి కొత్త ఇంజిను లభిస్తుంది.  ఈ బ్రోషర్ ఇండొనేషియా ప్రత్యేక రెండవ తరం ఇన్నోవా. టొయోటా వారు దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో బహిర్గతం చేయవలసి ఉంది. ఇంకా చదవండి:

# 2015TokyoMotorShowLive: టోక్యో మోటార్ షో వైపు దారి తీస్తున్న కార్లు

జైపూర్: 2015 టోక్యో మోటార్ షో ప్రారంభించబడిన సందర్భంలో చాలామంది ఉత్పత్తిదారులు వారి కార్లతో ముందుకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వాహనతయారీదారులు వారి ఉత్తమ సమర్పణలు మరియు ఉత్తేజకరమైన కాన్సెప్ట్ లతో మరోసారి ప్రపంచానికి ప్రదర్శించేందుకు ఆశక్తి చూపుతున్నారు. ఇక, ఇక్కడ 2015 టోక్యో మోటార్ షో లో అందించబడుతున్న వాహనాలను చూద్దాము. ఇంకా చదవండి:

ఫియాట్ అబార్త్ అవెంచురా ధర స్వల్పంగా పెరిగింది!

Fiat Abarth Avventura

జైపూర్: ఫియాట్ అబార్ పుంటో మరియు అవెంచురా ని ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ లో రూ.9.95 లక్షలు ధర వద్ద ప్రారంభించింది. కానీ ఆశ్చర్యకరంగా, తయారీదారుల యొక్క అధికారిక వెబ్సైట్ లో అవెంచురా యొక్క ధర 10 లక్షలకు పైగా పెరిగినట్టుగా చూపిస్తుంది. అయితే, అది ఒక పెద్ద ధర పెంపు కాదు, కానీ ఇప్పటి వరకు ఫియట్ ఈ పెరుగుదల గురించి ఎటువంటి ప్రకటనలు చేయలేదని తెలుస్తుంది. ఇంకా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience