• English
  • Login / Register

# 2015TokyoMotorShowLive: టోక్యో మోటార్ షో వైపు దారి తీస్తున్న కార్లు

అక్టోబర్ 30, 2015 01:31 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2015 టోక్యో మోటార్ షో ప్రారంభించబడిన సందర్భంలో చాలామంది ఉత్పత్తిదారులు వారి కార్లతో ముందుకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వాహనతయారీదారులు వారి ఉత్తమ సమర్పణలు మరియు ఉత్తేజకరమైన కాన్సెప్ట్ లతో మరోసారి ప్రపంచానికి ప్రదర్శించేందుకు ఆశక్తి చూపుతున్నారు. ఇక, ఇక్కడ 2015 టోక్యో మోటార్ షో లో అందించబడుతున్న వాహనాలను చూద్దాము. 

సుజుకి ఇగ్నీస్:

Maruti Suzuki IGNIS

సుజికి యొక్క రాబోయే ఇగ్నీస్ ఒక కాంపాక్ట్ కారు మరియు ఇది ఖచ్చితంగా గమనించదగ్గ కారు. ఇది ఒక రెట్రో- ఆధునిక అంతర్భాగాన్ని కలిగి ఉంది మరియు ఒక హత్తుకొనే గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. దీని అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ వలన ఎత్తుపల్లాలు ఉన్న రోడ్ పైన సులభంగా నిర్వహణ చేయగలుగుతుంది. సుజికి ఈ వాహనాన్ని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు కూడా రూపొందించింది, దీనివలన కారు ప్రతికూల భూభాగాలు మరియు మంచు రోడ్లు మీద కూడా సులభంగా ప్రయాణించగలదు. ఇది కాంపాక్ట్ క్రాస్ఓవర్ విభాగంలో ఒక స్థిరమైన సమర్పణ.

సుజుకి ఇగ్నీస్-ట్రైల్ కాన్సెప్ట్:

Maruti Suzuki IGNIS

సుజికి జనరల్ ఆటో షో ప్రోటోకాల్ లో తన ఇగ్నీస్ కాన్సెప్ట్ వెర్షన్ ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. ఇగ్నీస్ ట్రెయిల్ కాన్సెప్ట్, బోల్డ్ వీల్ ఆర్చులతో అమర్చబడియున్న పెద్ద వీల్స్ తో మరింతగా విస్తరించి ఉంది. ఈ కారు విభిన్న రంగు స్కీం తో మరింత ఆకర్షణీయంగా మరియు కారు యొక్క మొత్తం లుక్ పెంచే విధంగా ఉంటుంది. 

మినీ కూపర్ ఎస్ కన్వర్టిబుల్స్:

MINI Cooper S Convertible

మినీ కూడా దాని మినీ కూపర్ కన్వర్టిబుల్స్ ని 2015 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. ఈ కారు వచ్చే ఏడాది మార్చిలో అమ్మకానికి వెళ్తుంది మరియు దాదాపు £ 18,475 ధరను కలిగి ఉండవచ్చు. అగ్ర శ్రేణి మోడల్ కూపర్ ఎస్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండి 189bhp శక్తిని అందిస్తుంది. ఈ కార్ల యొక్క ప్రధాన హైలైట్ ఏమిటంటే, ఇది మునుపటి వెర్షన్ నుండి మెరుగుపడి పూర్తిగా ఎలక్ట్రిక్ రూఫ్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, కారు 30Kmph వేగంతో వెళుతూ 18 సెకన్లలో కారు యొక్క రూఫ్ వెనక్కి ఉపసంహరించుకుంటుంది. దీనిలో కొత్త సెన్సార్ ఆధారిత రోలోవర్ ప్రొటక్షన్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది. 

బిఎండబ్లు ఎం4 జిటిఎస్ :

BMW M4 GTS

బిఎండబ్లు ఎం4 జిటిఎస్ 2015 టోక్యో మోటార్ షోలో ప్రదర్శింపబడినది. ఈ కారు బిఎండబ్లు ఎం డివిజన్ యొక్క అత్యంత పనితీరు ఆధారిత సమర్పణ మరియు 142,000 యూరోలు ఖరీదు కలిగియుండి ధర పరంగా బిఎండబ్లు ఐ8 తరువాత రెండవ స్థానంలో ఉంది. ఇది 493bhp శక్తిని అందిస్తుంది మరియు 0 నుండి 100 కిలోమీటర్లు 3.7 సెకెన్లలో చేరుకోగలుగుతుంది. ఈ వాహనం ఫ్రోజెన్ డార్క్ గ్రే మెటాలిక్, మినరల్ గ్రే మెటాలిక్, సప్ఫిరె బ్లాక్ మెటాలిక్ మరియు ఆల్పైన్ వైట్ అను మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు యొక్క 20-అంగుళాల అలాయ్ వీల్స్ యాసిడ్ ఆరెంజ్ రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి.

సివిక్ టైప్ ఆర్:

Honda CIVIC TYPE R

హోండా వేగంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉత్పత్తిని అందించాలని లక్ష్యంగా ఉంది మరియు సివిక్ టైప్ ఆర్ తో తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని కృషి చేస్తున్నారు. వాంఛనీయ ఏరోడైనమిక్ లక్షణాలు కొనసాగిస్తూ, ఒక స్పోర్ట్స్ కారు వలే కనిపించే సౌందర్య లక్షణాలు కలిగి ఉంది. ఈ కారు 2.0 లీటర్ వి-టర్బో ఇంజిన్ ని కలిగియుండి 300bhp శక్తిని మరియు 400Nm టార్క్ ని అందిస్తుంది. ఈ పవర్‌ప్లాంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంది. 

హోండా ఎన్ఎస్ఎక్స్:

Honda NSX

హోండా ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఎన్ఎస్ఎక్స్ స్పోర్ట్స్ కారుతో విరజిల్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ కారు మొదటి తరం ఎన్ఎస్ఎక్స్ నుండి తేలికైన శరీరం, మిడ్ షిప్ ఆకృతీకరణ లో అమర్చబడియున్న కొత్త ట్విన్- టర్బోచార్జెడ్ ఇన్లైన్ వి6 ఇంజన్ వంటి అదే లక్షణాలను కలిగియుంది. ఈ కారు త్రీ - మోటార్ స్పోర్ట్ హైబ్రిడ్ ఎస్‌హెచ్-ఎడబ్లుడి (సూపర్ ఆల్-వీల్ డ్రైవ్ హ్యాండ్లింగ్)పవర్ట్రెయిన్ ని కలిగి ఉంది. దీనివలన ఖచ్చితంగా డ్రైవర్ కి మంచి డ్రైవింగ్ అనుభవం అందించబడుతుంది. ఈ పవర్‌ప్లాంట్ 9-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్సిమిషన్ తో జతచేయబడి ఉంటుంది. ప్రతీ ముందరి వీల్ కూడా స్వతంత్రంగా జతచేయబడి సమర్థవంతమైన విద్యుత్ మోటార్ గా ఉంది. స్పోర్ట్ హైబ్రిడ్ ఎస్‌హెచ్-ఎడబ్లుడి ఆధునిక టార్క్ వెక్టరింగ్ ఉపయోగించుకొని శక్తిని నాలుగు వీల్స్ కి అందించబడుతుంది. 

ఎఫ్ - పేస్ :

Jaguar SUV F-Pace

 తెరంగేట్రం చేయబడియున్న జాగ్వార్ ఎఫ్-పేస్ కారు గట్టి మరియు ధృఢంగా ఉన్న తేలికైన అల్యూమినియం నిర్మాణం కలిగి సామర్థ్యం, చురుకుదనం మరియు శుద్ధీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఈ కారు ఒక శక్తివంతమైన డిజైన్, ఎఫ్-టైప్ ఉత్పన్న చాసిస్ టెక్నాలజీని, కట్టింగ్ ఎడ్జ్ డ్రైవర్ సహాయత మరియు భద్రత వ్యవస్థలని కలిగి ఉంది. సౌకర్యాల పరంగా, ఈ కారు ప్రపంచంలో అత్యంత అధునాతన సమాచార వ్యవస్థ ఇన్‌కంట్రోల్ టచ్ ప్రొ ని కలిగి ఉంది. 

స్విఫ్ట్ ఆర్ఎస్ :

Maruti Suzuki Swift RS

చివరిగా సుజుకి స్విఫ్ట్ దాని సుజుకి స్విఫ్ట్ ఆర్ఎస్ అవతారం ఎత్తింది. ఈ కారు ఎరుపు రంగు పథకం, ఒక కొత్త గ్రిల్, బ్లాక్డ్ ఔట్ కాస్టింగ్ లో కొత్త హెడ్ల్యాంప్ క్లస్టర్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫాగ్‌ల్యాంప్స్ చుట్టూ డీఅర్ఎల్ఎస్, సైడ్ స్కర్టింగ్స్, వెనుక స్పాయిలర్, కొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్ సెటప్ మరియు భిన్నమైన అలాయ్ వీల్స్ సమితిని కలిగి ఉంది. ఇంజిన్ పరంగా, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అమర్చబడి 6000rpm వద్ద 91ps శక్తిని మరియు 4400rpm వద్ద 118Nm టార్క్ ని అందిస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience