వారాంతపు విశేషాలు: బీటిల్ ప్రారంభం, భారీ డిస్కౌంట్ తో వస్తున్న suv లు మరియు క్రెటా కార్ ఆఫ్ ది ఇయర్ గా పేరుపొందింది
డిసెంబర్ 28, 2015 05:58 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూఢిల్లీ: ఇది ఆటోమేటివ్ పరిశ్రమ కోసం ఒక బిజీ వారంగా ఉంది. క్రిస్మస్ సీజన్ జరిగిన కారణంగా తయారీదారులు వారి వినియోగదారుల కొరకు సెలబ్రేట్ చేసుకోడానికి వారి నమూనాలలో డిస్కౌంట్ అందించారు. అయితే ఈ వారం వోక్స్వాగన్ యొక్క 21 వ శతాబ్దం బీటిల్ యొక్క ప్రారంభం మరియు మహీంద్రా KUV100 యొక్క బుకింగ్స్ రూ.10,000 వద్ద ప్రారంభం జరిగింది. J.D. పవర్ స్టడీ ప్రకారంఎలీట్ ఐ 20, వెంటో అండ్ XUV500అనే కంపనీలు చాలా బెస్ట్ డిజైన్స్ కలిగి ఉన్నాయి. త్వరలో ప్రారంభం కాబోయే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ ఆటోమేటిక్, రహస్యంగా పట్టుబడింది మరియు మహీంద్రా వెరిటో యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ ఫిబ్రవరి 2016 లో ప్రారంభించబడుతుంది.
వోక్స్వ్యాగన్ ఇండియా రూ. 28.73 లక్షల ధర వద్ద 21 వ శతాబ్దం బీటిల్ ని ప్రారంభించింది
వోక్స్వ్యాగన్ ఎంతగానో ఎదురుచూస్తున్న బీటిల్ ని దేశంలో రూ. 28.73 లక్షల ధర వద్ద (ఎక్స్-షోరూమ్, ముంబై) లో ప్రారంభించింది. 21 వ శతాబ్దం బీటిల్ కోసం బుకింగ్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల నిలిపివేత తరువాత జర్మన్ కార్ల తయారీసంస్థ కొత్త స్టైలింగ్, నవీకరించబడిన అంతర్భాగాలు మరియు శక్తివంతమైన ఇంజిన్ తో బీటిల్ ని తిరిగి ప్రారంభిస్తున్నారు.
మహీంద్రా KUV100 రూ. 10,000 వద్ద బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి
గత వారం, మహీంద్రా దాని రాబోయే కారు, KUV100 యొక్క చిత్రాలు మరియు వివరాలని వెల్లడించింది… గతంలో ఇది S101 అనే సంకేత పదం తో ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో మొదటి సూక్ష్మ SUV గా ఉంటుంది మరియు ఇది మారుతి సుజుకి ఇగ్నిస్ ని అనుసరించబడుతుంది. మహీంద్రా డీలర్షిప్ వారు ఇలా అన్నారు. కార్ దేకో లో KUV100 బుకింగ్స్ ధర 10,000లు ఉంటుందని, దీని డెలివరీ జనవరి 30, 2016 నుండి ప్రారంభం అవతుందని అన్నారు. మహీంద్రKUV100 వాహనం mFALCON అనే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లని పరిచయం చేసింది. ఈ ఇంజిన్లు 5- స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ సిస్టం తో వస్తాయి. సమీప భవిష్యత్తులో ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ని కుడా పరిచయం చేయవచ్చు. ఈ కారు ధర సుమారు 4-7 లక్షల వరకు ఉండవచ్చు. ఇది జనవరి 15,2016 న ప్రారంభం కానుంది.
ఎలక్ట్రిక్ వెరిటో వాహనాన్ని ఫిబ్రవరి 2016 లో విడుదల చేస్తున్న మహీంద్రా
మహీంద్రా, ఢిల్లీ లో జరిగిన డీజిల్ నిషేధం నుండి ఒక ఎదురుదెబ్బ కారణంగా, ఇప్పుడు ఆటో ప్రపంచంలోని విద్యుత్ విభాగంలో ఒక వాహనాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ2ఓ తో విజయం సాదించిన తరువాత, ఫార్ములా ఈ కార్యక్రమంలో మంచి ప్రదర్శన ఇవ్వడం కోసం మరియు ఆనంద్ మహీంద్రా ఫార్ములా ఈ స్థిరత్వం కమిటీ యొక్క సభ్యుడు అయ్యారు ఆ తరువాత, ఈ ఎలక్ట్రిక్ వాహనాల పై ఉన్న నమ్మకంతో మహీంద్రా, దేశంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి నిర్ణయించుకుంది. ఆటో ఎక్స్పో 2012 లో ప్రవేశపెట్టబడిన ఎలక్ట్రిక్ వెరిటో త్వరలోనే రోడ్ల పై కనిపించే అవకాశం ఉంది.
2016 లో రానున్న అత్యంత ఎదురుచూస్తున్న కార్లు
రానున్న ఫిబ్రవరిలో బహిర్గతం కానున్న మరియు త్వరలో 2018 ఆటో ఎక్స్పో వరకూ ప్రవేశపెట్టబడుతున్న కార్ల వివరాలు! వచ్చే సంవత్సరం అద్భుతమైన ప్రదర్శనలతో అనేకమైన కార్లు 2016 ఇండియన్ ఆటో ఎక్స్పో లో ఫిబ్రవరిలో ప్రదర్శింపబడబోతున్నాయి. అనేక వివరాల కొరకు, ప్రదర్శనల కొరకు మరియు రాబోతున్న కార్ల శ్రేణి గురించి తెలుసుకునేందుకు సంసిద్ధంగా ఉండండి.
భారతదేశంలో హోండా జనవరి 2016 నుండి రూ. 10,000 నుండి 16,000 ల వరకు ధరల పెంపు ఉంటుందని ప్రకటించింది.
భారతదేశంలో హోండా కార్స్ వారు వాటి అన్ని కార్ల ఉత్పత్తుల కి రూ.16,000. ల వరకు ధరల పెంపు ని ప్రకటించింది. జపనీస్ కార్ ఉత్పత్తిదారుడు కార్లని బ్రియో (ఎంట్రీ స్థాయి చిన్న కారు) ధర. రూ. రూ 4.25 లక్ష లు ,(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుండి , CR-V, ధర . రూ. 25.13 వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు విక్రయిస్తుంది. ఎప్పుడయితే తయారీ లో ఇన్ పుట్ ఖర్చులు పెరుగుతాయో అప్పుడు ధరల పెంపు ని ప్రకటిస్తామని తెలియజేసింది. ఈ ధరల పెంపు సుమారు రూ. 10,000 నుండి 16,000 ల వరకు కారు యొక్క మోడల్ ని బట్టి ఉంటుందని చెప్పారు.
త్వరలో ప్రారంభం కాబోయే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ ఆటోమేటిక్ , రహస్యంగా పట్టుబడింది
భారతదేశం లో అత్యుత్తమంగా విక్రయించబడిన సెడాన్,'మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్' ఇటీవల ఒక ఆటోమేటిక్ గేర్బాక్స్ తో రహస్యంగా పట్టుబడింది. కారుకి ఇరువైపులా DDiS sSబ్యాడ్జేస్ ఉండటం వలన దీనిని చుసిన వెంటనే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉన్నటువంటి మొట్ట మొదటి డీజిల్ కారు అని గుర్తించవచ్చు.
ఇంకా చదవండి http://telugu.cardekho.com/car-news/Spied: Maruti Swift Dzire Diesel Automatic Launching Soon-17307
యుటిలిటీ వాహనాలు ఇప్పుడు భారీ తగ్గింపులతో వస్తున్నాయి
యుటిలిటీ వాహనాలను ఇప్పుడు సొంతం చేసుకోవడం చాలా సులభం. భారీ డిస్కౌంట్లు అందించినందుకు వివిధ కార్ల తయారీ కంపెనీలకు కృతజ్ఞతలు. ఎవరితే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సహాయం చేసేందుకు డిస్కౌంట్స్ అందించబడుతున్న కార్ల జాబితాను మీ ముందు ఉంచాము.
J.D. Power Study ప్రకారంఎలీట్ ఐ 20, వెంటో అండ్ XUV50 అనే కంపనీలు చాలా బెస్ట్ డిసైన్స్ కలిగి ఉన్నాయి.
JD పవర్ 2015 భారతదేశం ఆటోమోటివ్ ప్రదర్శన, ఎగ్జిక్యూషన్ మరియు లేఅవుట్ ( APEAL ) స్టడీ ప్రకారం హ్యుందై ఇలైట్ ఐ20/ఐ20 ఆక్టివ్,ఇయోన్ మరియు ఐ10 హ్యాచ్‌బ్యాకులు మోడల్స్ 8 మోడల్ సెగ్మెంట్ అవార్ద్స్ ని గెలుచుకున్నారు. టయోటా కార్స్ ఇన్నోవా తో పాటూ ఇటియోస్ లివా/క్రాస్ మరియు ఇటియోస్ కూడా తమ తమ విభాగంలో విన్ అయ్యారు. SUV విభాగంలో xuv500 అత్యున్నత హోదా పొందితే మధ్యతరహా కార్ల సెగ్మెంట్ లో ఫోక్స్వ్యాగన్ వెంటో అత్యున్నత హోదా పొందింది. ఒక సర్వే ప్రకారం బారతదే శానికి సంబందించిన కస్టమర్స్ వెహికల్ లుక్ మరియు స్టయిలింగ్ ముఖ్యమైనవిగా భావిస్తున్నారని తెలిసింది.
ఫోర్డ్ డిసెంబర్ డిస్కౌంట్!
క్రిస్మస్ చివరికీ మరియు ఈ సంవత్సరం చివరికి వచ్చే సరికి, కారు తయారీదారులు వారి మోడళ్ళలో డిస్కౌంట్లను అందించడం ద్వారా ఈ వేడుక ను మరింత బలపరచడానికి తయారీదారులు ముందుకు చూస్తున్నారు. టాటా, రెనాల్ట్ మరియు ఇతర తయారీదారూలతో కలిపి ఫోర్డ్ కూడా, వాటి మోడళ్ళకు నగదు ప్రయోజనాల రూపంలో రూ 62,000 వరకు డిస్కౌంట్ లను అందించింది మరియు ఒక ప్రత్యేక వడ్డీ రేటును కూడా అందించింది. ఈ డిస్కౌంట్లు, ఈకోస్పోర్ట్, ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఫిగో అస్పైర్ వంటి వాహనాలకు మాత్రమే చెల్లుతాయి. ఈ ఆఫర్లు, డిసెంబర్ 01, 2015 నుండి డిసెంబర్ 31, 2015 ముందు బుకింగ్ లకు మాత్రమే చెల్లుతాయి మరియు డిసెంబర్ 31 లేదా అంత కంటే ముందు వాహనాలకు మాత్రమే ఈ ఆఫర్లు అందించబడతాయి. ఈ ఆఫర్లతో పాటు, మార్పిడి బోనస్ 25,000 వరకు అందించబడుతుంది. ఇది కూడా, ఫోర్డ్ కార్లకు మాత్రమే మరియు రూ 18,000 ఫోర్డ్ కాని వాహనాల మార్పిడి కి అందించబడుతుంది.