వారాంతపు విశేషాలు: ఇవోక్ ఫేస్‌లిఫ్ట్ మరియు హొరాకెన్ LP580-2 ప్రారంభం, సుజుకి విటారా రహస్యంగా పట్టుపడడం మరియు టాటా & నిస్సాన్ శిబిరాల నిర్వహణ

నవంబర్ 24, 2015 12:45 pm nabeel ద్వారా సవరించబడింది

  • 10 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఇది ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక ప్రశాంతమైన వారం. ప్రారంభాలు మరియు పండుగ సీజన్లలో డిస్కౌంట్ల మార్గంలో, ఈ వారం రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్లిఫ్ట్ మరియు లంబోర్ఘిని హోరాకెన్ LP580-2 ల రెండు వాహన ప్రారంభాలు మాత్రమేజరిగాయి. ఇంకా, టాటా మరియు నిస్సాన్ వారి సర్వీసింగ్ శిబిరాల ప్రకటన కూడా జరిగింది. కొత్త 2016 ఇన్నోవా మరియు టాటా కైట్ అతిపెద్ద ఆకర్షణల్లో ఉన్నాయి.సుజుకి విటారా భారతదేశంలో రహస్యంగా పట్టుబడడం మరియు భారతదేశంలో తయారుచేయబడిన వోక్స్వాగెన్ వెంటో మోడల్స్ రక్షణ కి ఎన్‌సీఏపీ వారు 5-స్టార్ రేటింగ్ ని అందించడం. అంతేకాకుండా పెట్రోల్ ధర 36పైసలు మరియూ డీజిల్ ధర 87పైసలుగా పెరిగడం. ఈ వారపు విశేషాలను మరింత వివరంగాఅందించడం జరిగింది. పదండి చూద్దాము.

లంబోర్ఘిని హొరెకెన్ LP580-2 RWD రూ. 2.99 కోట్లు ధరతో ప్రవేశపెట్టబడినది

జైపూర్: లంబోర్ఘిని 2015 అటో షో లాస్ ఏంజెల్స్ లో తమ RWD హోరాకెన్ LP580-2 ను ప్రదర్శించిన తరువాత భారతదేశంలో ఇప్పుడు ప్రవేశపెట్టబడింది. ఈ కారు రూ.2.99 కోట్ల ధర వద్ద(ఎక్స్-షో రూం డిల్లీ) అందించబడుతుంది. ప్రామాణికమైన AWD వ్యవస్థ పై వచ్చిన డ్రైవింగ్ ఏక్సలరేషన్ లోటు పాటులను సరి చేసుకుంటూ ఈ ఇటాలియన్ కారు తయారీదారులు గత రెండు రోజుల క్రితం ఈ కారుని భారతదేశంలో ప్రవేశపెట్టారు. మరింత చదవండి

నేడు ప్రారంభం కానున్న రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్ లిఫ్ట్

జైపూర్: ల్యాండ్ రోవర్ భారతదేశం లో రేంజ్ రోవర్ ఇవోక్ ని నేడు ప్రారంభించింది. 2016 రేంజ్ రోవర్ ఇవోక్ వాహనం, పెద్ద రేంజ్ రోవర్ లో ఉన్న అదే విధమైనటువంటిఆల్-టెర్రైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ సిస్టమ్ ని కలిగి ఉంది. యాంత్రికంగా, ఈ ఎస్యువి అల్యూమినియం ఇగ్నీషియం TD4 టర్బోడీజిల్ ఇంజిన్ ని కలిగి ఉండి మునుపటి దానితో పోలిస్తే 20-30Kg తేలికైనదిగా ఉంది. ఈ ఇంజిన్ 188bhp శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్ గరిష్టంగా 420Nm టార్క్ ని అందిస్తుంది మరియు 9-స్పీడ్ ZF ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. మరింత చదవండి

4 వ "నిస్సాన్ తో హ్యాపీ" అనే సేవ క్యాంప్ నిర్వహిస్తున్న నిస్సాన్ సంస్థ

జైపూర్: నిస్సాన్ ఇండియా తన కార్లకు దేశవ్యాప్తంగా ఉచిత చెక్-అప్ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ 4వ, 'హ్యాపీ విత్ నిస్సాన్' 2015 సంవత్సరం నవంబర్ 19 నుండి 28 వరకూ భారతదేశం అంతటా 140 స్థానాల్లో 120 నగరాలకు విస్తరించి 60 పాయింట్ల సమగ్ర కారు చెకప్ అందిస్తుంది. ఇది కాకుండా,అధనంగా ఉచిత వాషింగ్ కూడా అందించబడుతుంది మరియు వినియోగదారులు కార్మిక చార్జీలు మరియు నిస్సాన్ యొక్క యాక్సిసరీస్ లో డిస్కౌంట్ పొందగలరు. 20% డిస్కౌంట్ ముందు చెప్పిన ఆరోపణలు / ఉపకరణాల కొరకు అందించబడుతుంది. మరింత చదవండి

పెట్రోల్ ధర 36పైసలు మరియూ డీజిల్ ధర 87పైసలుగా పెరిగాయి

జైపూర్: భారత-యూఎస్ ఎక్స్‌చేంజ్ ధరలో మార్పు కారణంగా, ఇంధన ధరలపై ప్రభావం పడింది. ఈసారి, పెట్రోల్ ధర 36పైసలు మరియూ డీజిల్ ధర 87పైసలుగా పెరగటం జరిగింది. దీని పరిణామంగా, డిల్లీలో ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ.61.06 ఉండగా, లీటరు డీజిల్ ధర రూ.46.80 గా ఉంటుంది. అంతర్జాతీయ ఎక్స్‌చేంజ్ ధరలు ప్రత్యక్షంగా కస్టమర్లపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో యూఎస్‌డీ విలువ పెరుగుతోంది. ఈ ధరల పెంపునకు ఇదొక కారణం. మరింత చదవండి

భారతదేశం లో రహస్యంగా పట్టుబడిన సుజుకి విటారా

జైపూర్: సుజుకి విటారా, నోయిడా లో ఒక మారుతి సుజుకి ప్రాంగణం వద్ద రహస్యంగా పట్టుబడింది . కాంపాక్ట్ ఎస్యువిలు అయిన ఈ మూడు విటారాలు, యూరోపియన్ నిర్దేశ వాహనాల వలే కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ విటారాలను, రాబోయే 2016 సంవత్సరం భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు. మరింత చదవండి

డ్రైవర్ సీట్ లో లియోనెల్ మెస్సీ తో మళ్ళీ కైట్ ని టీజ్ చేసిన టాటా సంస్థ

జైపూర్: టాటా మోటార్స్ వారి కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఏస్ ఫుట్బాల్ - లియోనెల్ మెస్సీ తో తాజా కమర్షియల్ మేకింగ్ సంబంధించిన కొత్త వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో రాబోయే హాచ్బాక్ యొక్క సమగ్ర రూపం, కైట్ (కోడ్ నేం) ని బహిర్గతం చేసింది. ఈ కైట్ వాహనం బోల్ట్ కింద్ర ఉండే వాహనం. ఈ కారు రాబోయే వారాల్లో బహిరగతమవుతుంది మరియు కొన్ని రోజుల తరువాత ప్రారంభం అవుతుంది. కైట్ హాచ్ దాని అనుభంద కాంపాక్ట్ సెడాన్ ని అనుసరిస్తుంది. ఈ రెండు వాహనాలు ఇండికా eV2 మరియు ఇండిగో ECS ని తలపించే విధమైనటువంటి వాహనాలు. అయితే, సంస్థ ఈ రెండిటినీ నిలిపివేడం లేదు. ఈ రెండు మోడల్స్ కూడా వినియోగదారులకి సేవలను అందిస్తాయి. మరింత చదవండి

నవంబర్ 20 నుండి 26 వరకు మెగా సర్వీసు క్యాంప్ నిర్వహించబడుతుంది అని టాటా మోటర్స్ వారు ప్రకటించారు

జైపూర్: టాటా మోటర్స్ వారు దేశవ్యాప్తంగా వారం పొడవున నడిచే ఒక సర్వీసు క్యాంపు గా 'మెగా సర్వీసు క్యాంప్' ని నిర్వహించనున్నాము అని ప్రకటించారు. ఉచిత వాహన చెక్-అప్ క్యాంప్ అన్ని టాటా మోటర్స్ డీలర్‌షిప్‌ల వద్ద మరియూ ఆథొరైసడ్ సర్వీసు సెంటర్ల వద్ద దాదాపుగా 287 నగరాలలో అందిస్తాము అని తెలిపారు. ఇది నవంబరు 20 నుండి 26 వరకు జరుగుతుంది. పైగా, ఈ కంపెనీ వారు 1000 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో కలగలిపి ఈ సదుపాయాలు అందిస్తున్నారు. ఈ ఏడాదిలో ఈ కంపెనీ వారు విజయవంతంగ నిర్వహించిన మూడవ క్యాంప్. మరింత చదవండి

భారతదేశంలో తయారుచేయబడిన వోక్స్వాగెన్ వెంటో మోడల్స్ కి రక్షణ కి ఎన్‌సీఏపీ వారు 5-స్టార్ రేటింగ్ ఇచ్చారు

జైపూర్:తాజా డీజిల్ గేట్ కుంభకోణంలో జర్మన్ తయారీదారి అయిన వోక్స్వాగెన్ ఆఖరికి కొంత మంచి పేరు సంపాదించారు. భారతదేశంలో తయారు చేయబడిన వోక్స్వాగెన్ వెంటో లాటిన్ దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. వీటికి ఎన్‌సీఏపీ లాటిన్ వారు 5-స్టార్ రేటింగ్ ని అందించారు. ఈ సంస్థ కార్ల రక్షణ ఇంకా క్రాష్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఆ పరీక్షలలో 1 నుండి 5 వరకు రేటింగ్ ని అందిస్తుంది(1 అంటే అతి తక్కువ అని). రక్షణ పరంగా, కారుకి డ్యువల్ ఫ్రంట్ ఎయిర్-బ్యాగ్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్, ఏబీఎస్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ మరియూ సీటు బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి. మరింత చదవండి

కొత్త టొయోటా వీడియోలో సరికొత్త ఇన్నోవా ప్రదర్శితమయ్యింది

జైపూర్: ఈ సరికొత్త ఇన్నోవాకై అంతటా ఆసక్తి నెలకొంది. రకరకాల వీడియోలలో చిత్రాలను చూపెడుతూ టొయోటా వారు కూడా కస్టమర్లను కనువిందు చేస్తున్నారు. తాజాగా టొయోటా ఇండొనేషియా వారి వీడియోలో 2016 ఇన్నోవా కూడా దర్శనమిచ్చింది. ఇదే మొదటి సారి ఈ కారు నడపబడుతూ కనపడింది. మరింత చదవండి

న్యూ బీటిల్ వివరాల బుకింగ్ ను ప్రారంభించిన వోక్స్వాగన్ ఇండియా

జైపూర్: వోక్స్వాగన్ ఇండియా, కొత్త బీటిల్ యొక్క బుకింగ్ వివరాలను తీసుకోవడం మొదలుపెట్టింది. జర్మన్ తయారీదారుడు, కొన్ని సంవత్సరాల క్రితం మునుపటి వెర్షన్ ను ఉపసంహరించడం తో ప్రస్తుతం ఒక కొత్త బీటిల్ ను దేశం లో తిరిగి ప్రవేశపెడుతున్నాడు మరియు ఇది మునుపటి వెర్షన్ వలే సిబియూ మార్గం ద్వారానే ప్రవేశపెట్టబడుతుంది. ఇది, సుమారు 30 లక్షలు ఉంటుంది అని అంచనా. ఈ వాహనాన్ని, కేవలం ఒక లక్ష రూపాయలతో బుక్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వాహనం, మిని కూపర్ ఎస్ మరియు ఫియాట్ అబార్త్ 595 కాంపిటిజన్ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇస్తుంది. మరింత చదవండి

మరింత శక్తివంతమైన ఇంజిన్ తో ప్రారంభం కానున్న టాటా సఫారీ స్ట్రోం

జైపూర్: భారత వాహనతయారి సంస్థ ఆరోపించిన నివేదికల ప్రకారం, టాటా సంస్థ దాని ఫ్లాగ్‌షిప్ సఫారి స్ట్రోం ఎస్యువి కొరకు మరింత శక్తివంతమైన వేరియంట్ ప్రారంభించబోతుంది. కారు ఈ సంవత్సరం జూన్ నెలలో ఇటీవల నవీకరణను పొందింది. ప్రోటోటైప్స్ VARICOR 400 ని కలిగి ఉంది. ఇది ఇప్పటికే భారత వీధుల్లో రోడ్ పరీక్షల సమయంలో రహస్యంగా కనిపించింది. రాబోయే సఫారి స్ట్రోం 2.2 లీటర్ VARICOR 400 డీజిల్ ని కలిగి ఉండి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ పవర్‌ప్లాంట్ ప్రస్తుత యూనిట్ కంటే 7bhp శక్తిని మరియు 80Nm టార్క్ ని అధనంగా అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న సఫారి స్ట్రోం 4000rpm వద్ద 150ps శక్తిని అందించేది. మరింత చదవండి

భారతదేశంలో ఉత్పత్తిని పెంచనున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్

జైపూర్: ఇవోక్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభం తరువాత జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశం లో స్థానికంగా తయారు చేయబడుతున్న నమూనాల సంఖ్య పెంచడం ద్వారా మరింత దేశంలో దాని పునాదిని విస్తరించేందుకు యోచిస్తోంది. ఇది కాకుండా, జెఎల్ఆర్ ఇతర ప్రవేశ స్థాయి ఉత్పత్తులు అయిన మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు బిఎండబ్లు వంటి వాటికి పోటీగా XE సెడాన్ ని పరిచయం చేయాలని యోచిస్తోంది. ఇవోక్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ సమయంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా అధ్యక్షుడు రోహిత్ సూరి మాట్లాడుతూ " జెఎల్ఆర్ స్థానికీకరణ ద్వారా మరింత పోటీ అవ్వటానికి మార్గాలు అన్వేషిస్తుంది, కానీ సమయం పడుతుంది. స్థానిక తయారీదారులు మా వ్యూహం నడిపించటానికి ఉన్నారు. భారతదేశం లో పోటీ పద్దతులలో తక్కువ ధర కలిగిన ఉత్పత్తులు తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తాము. మేము ఇంకా రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు రేంజ్ రోవర్ వంటి అద్భుతమైన ఉత్పత్తులు కలిగి ఉన్నాము. ఆ విధంగా ఉంది కనుక, ధర ప్రకారం ఇప్పటికీ మేము అంత పోటీ కాదు కాబట్టి, ఒక భారీ అవకాశం వేచి ఉంది." అని వివరించారు. మరింత చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience