వీడియో: మెక్లారెన్ MP4-X కాన్సెప్ట్ తో భవిష్యత్ ఫార్ములా వన్ కార్లలోనికి అడుగుపెడుతుంది

డిసెంబర్ 09, 2015 11:07 am akshit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ:

మెక్లారెన్ రేసింగ్ లిమిటెడ్ (మెక్లారెన్ హోండా)MP4-X కాన్సెప్ట్ ని వెళ్ళడించింది. ఈ కాన్సెప్ట్ ఫార్ములా వన్ కార్లు  భవిష్యత్తులో ఎలా ఉండబోతాయో తెలిపే విధంగా ఉంటుంది. క్లోజ్ కాక్పిట్  భవిష్యత్ రేస్ కారు ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల నియంత్రణపై రూపొందించబడింది మరియు చాసిస్ వివిధ ఏరోడైనమిక్ డిమాండ్ లను కలిగి ఉంది. అంతేకాకుండా కారు ఒక వైఫల్యం లేదా సమస్య వచ్చినప్పుడు అనేక మార్గాలు ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఒక సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంది.  

ఈ క్లోజెడ్ కాక్పిట్ హెడ్స్ అప్ డిస్ప్లే ని కలిగి ఉంది. ఇది డ్రైవర్ కి సమీప ప్రత్యర్థి, ఫ్లాగ్, కాషన్ డాటా మరియు ఏదైనా  ప్రమాదం జరిగి ఉంటే  ప్రమాదం జరిగిన స్థానం యొక్క సమాచారాన్ని డ్రైవర్ కి తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాదు కారు మెదడు సినాప్టిక్ నియంత్రణ వ్యవస్థను కలిగి ఉండి ఆ వాహనం యొక్క వ్యవస్థలు నియంత్రించడానికి డ్రైవర్ యొక్క మెదడు లో విద్యుత్ సంకేతాలు పర్యవేక్షిస్తుంది.

"భవిష్యకాల మెక్లారెన్ MP4-X కాన్సెప్ట్ రేసుకారు తో, మేము భవిష్యత్తులోనికి తొంగి చూద్దాం అనుకుంటున్నాము. మేము ఈ కారులో F1 యొక్క కీలక అంశాలైనటువంటి స్పీడ్, పనితీరు, భద్రత  మరియు క్లోజెడ్ కాక్పిట్ వంటి అంశాలతో డ్రైవర్ కి భద్రతను మరియు హైబ్రిడ్ పవర్ టెక్నాలజీ ని అందించగలుగుతాము." అని  మెక్లారెన్ బ్రాండ్ డైరెక్టర్ జాన్ అలర్ట్  ఒక ప్రకటనలో తెలిపారు.

MP4-X కోసం పవర్ట్రెయిన్ సింగిల్ యూనిట్ కి బదులుగా ఇండక్టివ్ కపులింగ్ యూనిట్ అమర్చబడి వాహనం యొక్క క్రాష్ నిర్మాణానికి ఉన్న 'సన్నని బ్యాటరీల' చార్జింగ్ కొరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సోలార్ సెల్స్ కూడా చాసిస్ తో అమర్చబడి ఉంటాయి.

మెక్లారెన్ వారు సాంకేతికంగా మరియు వారి నవీకరణల ద్వారా ఆరోగ్య,రవాణా మరియు ఇంధన పరిశ్రమలలో ఎన్నో కొత్త  ఆవిష్కరణలతో ముందుకు వచ్చారు. అదే క్రమంలో కారు తయారీ రంగంలో కూడా MP4-X కాన్సెప్ట్ ద్వారా అనువర్తిత సాంకేతిక నవీకరణలతో ప్రవేశించబోతున్నారు.    

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience