• English
  • Login / Register

డిల్లీలో వాహనాల ధరలు పెరిగాయి

నవంబర్ 16, 2015 05:55 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

నవంబర్ 5, 2015న నార్త్ డిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ యొక్క స్టాండింగ్ కమిటీ వారు ఒక ప్రతిపాదన ని మంజూరు చేశారు. అది ఏమనగా, వన్-టైం పార్కింగ్ చార్జీ, కార్లపై మోపి రిజిస్ట్రేషన్ ఫీలో కలపాలి అని. తద్వారా, వాహనాల ఖరీదు దాదాపుగా రూ.6 లక్షలు వరకు పెరగవచ్చును. ఆటో-రిక్షా, ఈ-రిక్షా, టూ-వీలర్స్ ఇంకా టాక్సీలను దీని నుండి మినహాయించారు. ఈ చార్జీలు ఇంతక మునుపు 2004 లో సవరించారు. ఇవి కాలుష్యం సంబంధిత ఇబ్బందులను తగ్గించడానికై తీసుకుంటున్న చర్య.

కమర్షియల్ వాహనాలు రూ.9500 నుండి రూ.36000 అధిక ఖరీదు ఉండి, అదే నాన్-కమర్షియల్ వాహనాలు రూ.6000 నుండి రూ.6 లక్షలు వరకు పెంపు జరిగాయి. సౌత్ డిల్లీ మునిసిపల్ కార్పరేషన్ కూడా ఈ ప్రతిపాదన ని మంజూరు చేసింది. ఈ-రిక్షా లు ఇంకా ఈ-కార్ట్ లు మాత్రం మినహాయింపు అని తెలిపారు. ఈస్ట్ డిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఇంకా ఈ నిర్ణయంపై తలకిందులు అవుతున్నారు.

ఇందులో 95% మునిసిపల్ కార్పరేషన్ వారు అందుకుంటారు. ఎన్ఎండీసీ స్టాండింగ్ కమిటీ కి చైర్మన్ అయిన మోహన్ భరద్వాజ్ గారు ఆదాయాన్ని పెంచడానికై ఈ అడుగు వేశాము అని పేర్కొన్నారు.  

ఎన్ఎండీసీ హౌస్ లో అపోజిషన్ పార్టీ లీడర్ ఇంకా పార్టీ కౌసిలర్ అయిన ముకేష్ గోయెల్ గారు," టాక్స్ బర్డెన్" అని అభిప్రాయపడ్డారు. "వన్ టైం పార్కింగ్ చార్జీలు పెంచాలి అన్న ప్రతిపాదన ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది సామాన్య ప్రజలపై భారం మోపుతుంది," అని అన్నారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience