• English
  • Login / Register

అక్టోబరు 2015 లో రాబోయే కార్లు [లోపల వీడియో]

అక్టోబర్ 01, 2015 11:30 am manish ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈ నెల పూర్తి అవుతుండగా, రాబోయే అక్టోబర్ నెల కోసం ఎదురు చూసేందుకు మేము కొన్ని కారణాలతో ముందుకు వచ్చాము. అక్టోబరు నెల  పండుగ కాలం అయినందున వచ్చే నెల అంతా విడుదలలు ఉండబోతున్నాయి. మారుతీ వారి రెండు అతి పెద్ద విడుదలలతో పాటుగా ఇతర కారు తయారీదారులు కూడా వరుసలో ఉన్నారు.

మారుతీ బలెనో

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్‌మెంట్ లోకి మారుతీ వారి రాక ఈ కారుతోనే జరుగుతుంది. ఇది మారుతీ వారి ప్రీమియం నెక్సా డీలర్షిప్ లలో అమ్మకానికి పెట్టబడతాయి. కారుకి 1.3-లీటర్ డీజిల్ ఇంజిను తో ముందుగా సియాజ్ లో దర్శనం ఇచ్చిన మారుతీ వారి మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది 88bhp మరియూ 200Nm టార్క్ ని విడుదల చేయగలదు. బలేనో అక్టోబరు 26న విడుదల అయ్యి, రూ. 5.5 లక్షల ధర పలకవచ్చు.

మారుతీ ఎర్టిగా 

మారుతీ వారు ఈ ఫేస్‌లిఫ్ట్ కి ఎన్నో నవీకరణలు చేశారు. ఇంజిను విషయం లో కలిగిన మార్పులు మైలేజీ కి దారి తీస్తాయి. డీజిల్ ఎర్టిగా అయితే 25.2 Kmpl మైలేజీ ని అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్స్ కూడా ఇదే దారిలో నడుస్తాయి. కారుకి స్మార్ట్‌ప్లే ఇంఫొటెయిన్మెంట్ సిస్టం ఉంటుంది. ఎర్టిగా విడుదల అక్టోబర్ 10న, దాదాపు రూ. 6 లక్షల వద్ద ఉండవచ్చును.

అబార్త్ పుంటో ఈవో

అబార్త్ పుంటో ఈవో ని 1.4-లీటర్ లీనియా ఇంజినుతో విడుదల చేసేందుకు ఫియట్ సిద్దం అయ్యింది. ఈ ఇంజిను 145bhp ని ఉత్పత్తి చేస్తుంది. అబార్త్ ట్రేడ్‌మార్క్ అయిన స్కార్పియన్ బ్యాడ్జ్ ని కలిగి మరియూ 16 అంగుళాల అల్లోయ్ వీల్స్ ఉంటాయి. ఈ హ్యాచ్ బ్యాక్ రూ. 8.5 లక్షలు ఉండవచ్చు.

షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్

ఆగస్టు మొదలులో మేము షెవ్రొలే వారి ట్రెయిల్‌బ్లేజర్ జైపూర్ లో తిరుగుతుండగా చూశాము. కారు యొక్క శక్తి 200bhp మరియూ గ్రౌండ్ క్లియరెన్స్ 241mm గా ఉంటుంది. పైగా, గరిష్టంగా 500Nm టార్క్ ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రీమియం ఎస్యూవీ అక్టోబరులో CBU పేరిట భారతదేశానికి రానుంది. దీని పోటీదారి అయిన జపనీస్ ఎస్యూవీ టొయోటా ఫార్చునర్ తో పోలిస్తే పొడవు విషయంలో ఎక్కువగా, ఎత్తు లో తక్కువగా ఉంది. ఇది కేవలం ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో 4x2 వెర్షన్ లో మాత్రమే లభిస్తుంది. దాదాపుగా రూ. 25 లక్షలు ఉండవచు.

ఆడీ Q7

ఆఖరున ఇక ఆడీ Q7 విడుదల ని చూద్దాము. కారుకి 3.0-లీటర్ V6 మోటరు తో 8-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ జత చేయబడి ఉంటుంది. ఇది 272bhp శక్తిని మరియూ 600Nm టార్క్ ని అందిస్తుంది. పైగా, ఆడీ యొక్క క్వాట్రో AWD సిస్టము ఉండి దదాపు రూ. 75 లక్షలు పలుకుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience