ఆగస్ట్ నెలలో కాబోయే కారు విడుదలలు

ఆగష్టు 01, 2015 11:03 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: జులై నెలలో లగ్జరీ విభాగంలో మరియూ పెద్ద కార్ల విభాగంలో కూడా ఎన్నో విడుదలలు జరిగాయి. వీటన్నిటిలో, హ్యుండై క్రేటా మరియూ హోండా జాజ్ లు కొనుగోలుదారుల జాబితాలో అగ్ర స్థానంలో నిలవగా, మాసెరాట్టీ ఘిబ్లీ, క్వాట్రోపోర్టే, బీఎండబ్ల్యూ ఎక్స్3 ఇంకా ఎక్స్6 లు ప్రజల దృష్టిని చొరగొన్నాయి. అంతే కాకుండా, ప్రస్థుతం ఉన్న మోడల్స్ కి కూడా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. రాబోయే నెలలలో షెవీ యొక్క ట్రెయిల్బ్లేజర్ మరియూ స్పిన్ వటివి మరిన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

ఈ నెల లాగే, ఆగస్ట్ నెలలో కూడా సవరించిన కొత్త కార్ల కొనుగోలు జాబితా ఉంటుంది. ఇక్కడ ఈ నెలలో విడుదల కాబోయే నాలుగు కార్ల అందించడం జరిగింది.

ఫోర్డ్ ఫీగో ఆస్పైర్

ఫోర్డ్ యొక్క మొట్టమొదటి కాంపాక్ట్ సెడాన్ విభాగానికి ఫీగో ఆస్పై నాంది పలికింది. దీని బాహ్య సౌందర్యాన్ని దేశం పొగడ్తలతో ముంచెత్తింది. ఇది దాని లోపలి వైపు ధృఢత్వానికి ప్రతీక. ఈ సారి సంరక్షణకై రెండు ఎయిర్ బ్యాగ్స్ ని అందించడం ఒక తెలివైన అడుగు అనే చెప్పాలి. ఉన్నత శ్రేని టృఇం కి 1.5-లీటరు ఆటోమాటిక్ పెట్రోల్ తో పాటుగా 6-ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్పీ, టీసీఎస్ మరియూ హిల్ల్ లాంచ్ అస్సిస్ట్ ని అందించడం జరిగింది. మొనోకాక్ ఫ్రేం అనే దానిపై ఆధారపడి నిర్మించబడిన ఈ కారు లోపలి నుండి ఎంతో ధృఢమైనది.

ఈ కారు యొక్క బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి మరియూ విడుదల ఆగస్ట్ 10 తారీఖుకి అయ్యే అవకాశం ఉంది. ధర పరంగా, మేము అటూ ఇటుగా రూ.5.30 లక్షల నుండి రూ.7.50 లక్షల మధ్య ఉంటుంది అని అంచనా వేస్తున్నాము.

మారుతీ ఎస్-క్రాస్

ఎస్-క్రాస్ అని మారుతీ చే పిలవబడే ఈ ప్రీమియం క్రాస్ ఓవరు ఆగస్ట్ 5న విడుదల అవుతుంది. కానీ, అసలు అందరి నోటా దీని ఆకారం కన్నా, ఇందులో అమర్చిన ఫియట్ ఆధారిత, 320ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేసే దీని 1.6-లీటరు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది ఈ మొత్తం విభాగంలోనే ఉత్తమమైన శక్తి అని చెప్పవచ్చు. ఇందుకు గాను వేదికగా మారుతీ వారి ప్రీమియం డీలర్షిప్ అయిన నెక్సా షోరూంలు సిద్దంగా ఉన్నాయి. వీటిలో పర్సనల్ కారు కొనుగోలు మరియూ వాడకం యొక్క అనుభవాన్ని ప్రతి కస్టమరుకి అనిస్తారు అని మారుతీ వెల్లడిస్తోంది. ఈ కారు అంతర్ఘతంగా ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉంది అనీ, మరియూ బయటి వైపు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ఇంకా డీఆరెల్స్ ఉన్నాయి.

అబార్త్ 595 కాంపిటియోజోన్

కాపిటియోజోన్! ఈ మాట పలకకుండా ఉండలేము. దీని గురించి విన్నప్పటి నుండి దీని విడుదల ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూడటం జరుగుతోంది. అబార్త్ వారు దీని విడుదలను భారతీయ మార్కెట్లో 595 కాంపిటియోజోన్ పేరు మీదగా ఆగస్ట్ 4న ప్రవేశ పెట్టనున్నారు.

ఈ ఇటాలియన్ బ్రాండ్ పనితీరుకి పెట్టింది పేరు. ఈ 595 యొక్క సమర్ధత మరియూ శ్తైలు ని కలగలుపుకుని భారతీయ మార్కెట్ లోకి రాబోతుంది. దీని యొక్క రేసింగ్ వీల్స్, రెట్రో డిసైను, స్పోర్టీగా ఉండే అంతర్గతాలు, వృశ్చికము యొక్క ఇన్సిగ్నియాలు అన్ని కలిపి ఎంతో ఆకర్షించే విధంగ ఉంది. ఇందులో 158బీహెచ్పీ ఉత్పత్తి చేసే 1.4-లీటరు టీ-జెట్ మోటరు అమర్చబడి ఉంది మరియూ 1050 కేజీలను లాగే శతిని కలదు.

ఎర్టిగా ఫేస్లిఫ్ట్

మారుతీ వారు వారి ఫేస్లిఫ్టెడ్ వెర్షన్ అయిన ఎంపీవీ ఎర్టిగా ని ముందుకు తెస్తిన్నారు. ఈ కారు భారతీయ రోడ్లపై తిరుగుతూ కొన్ని సార్లు కంటపడింది. ఈ పరీక్ష వాహనంలోని మార్పులు ముందు గ్రిల్లుపై క్రోము పూతలతో మరియూ కొత్త బంపరు తో చేయబడ్డాయి. లోపలి భాగాన చిన్న చిన్న మార్పులే ఉండవచ్చు మరియూ ఇంజిను మాత్రము యథాతధంగా ఉండబోతొంది. ఆగస్ట్ 20న విడుదల కావొచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience