• English
  • Login / Register

కమర్షియల్ వాహన కొనుగోలు వైపు చూస్తున్న TrucksDekho.com

డిసెంబర్ 31, 2015 05:23 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దేశీయంగా పెరిగిన వాణిజ్య వ్యవహారాలు, సులభంగా దొరికేటటువంటి ఫైనాన్స్ మరియు ఫైనాన్స్ కంపెనీ యొక్క ప్రోద్భలం, భారతీయ ప్రధాన రహదారులలో పెరిగిన కట్టడాలు మరియు వ్యవహారాలు, అభివృద్ధి చెందిన భారతీయ ట్రక్కుల వాణిజ్యం మరియు సుప్రీం కోర్ట్ ఆదేశాల అనుసారంగా ట్రక్కులపై పెరిగే అమ్మక అవకాశాలు ఇవన్నీ రవాణా విభాగంలో కొత్త వాణిజ్య వాహనాల అమ్మకాలకు దోహద పడుతున్నాయి.

పై విధంగా ట్రక్కు మార్కెట్టు కు దేశీయంగా ఎంతో డిమాండు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటివరకు ట్రక్కు వివరాలు,వినియోగదారుల అవసరాలు, ఈ రంగంలో వస్తున్న మార్పుల విశేషాలు ఈ విభాగాలలో సమగ్రమైన సమాచార విశేషాలు లేవు. చాలా వరకూ ఇటువంటి సందర్భాలలో వినియోగదారులు ఈ వివరాల కొరకు నగరాలకు వెళ్ళి బ్రోచర్లను వివిధ తయారీదారుల దగ్గర నుండి సేఖరించి ట్రక్కుల ఖరీదు ఎంపికల విశేషాలలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్లైన్ చానళ్ళలో కూడా అంతంతగానే వివరాలు అందుబాటులో ఉన్నాయి. అభయ్ దాఘా మహారాష్ట్రా మల్కా పూర్ కి చెందిన ఒక పత్తి వ్యాపారి ఈ విధంగా తన ట్రక్కు ఖరీదు విషయమై యాడ్లను, సోషల్ మీడియాను మరియు ఇతర పత్రికా ప్రకటణలను చూసి డీలర్లను సంప్రదించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కూడా చాలా వరకూ సమగ్రమైన వివరాలు నిజమైన సమాచారం ఇటువంటి వినియోగదారులకు లభించకపోవడం గమనార్హం.

దాఘా వంటి ఎందరో వినియోగదారులకు ట్రక్కులకు సంబంధించిన ఇటువంటి వివరాలను అందించడానికి భారతదేశం యొక్క ఉన్నత ఆటో పోర్టల్ అయిన కార్‌దేఖో, గాడీ.కాం, జిగ్‌వీల్ వారు ట్రక్కు దేఖో ని ప్రవేశపెట్టారు. పోయిన సంవత్సరం దాదాపుగా 6 లక్షల వాణిజ్య వాహనాల అమ్మకం భారతదేశంలో జరిగింది. ట్రక్కు దేఖో వినియోగదారులు భారతదేశంలోని నగరాలైన అవురంగాబాద్, అహమ్మద్ నగర్, సిరోహి మరియు మహా నగరాలైన ముంబయి, పూనే, బెంగుళూరు మరియు దిల్లీ లలో ఎక్కువగా ఉన్నారు. ఈ శ్రేణీలోని వినియోగదారులకు ట్రక్కు సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు కార్‌దేఖో వారు ఈ వెబ్‌సైట్ ను హిందీ మరియు ఇంగ్లీష్ బాషల్లో ఉంచారు.

" ట్రక్ దేఖో.కాం ద్వారా మేము వాహనాల నిర్ణయంలో మరియు అనేక ట్రక్ సంబంధిత సేవల సమాచార విషయాలను మా వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నాము." అని దాఘా తెలిపారు. ఇది తొలినాళ్ళే అయినప్పటికీ ఈ ఆరు నెలల క్రితం మొదలయిన ఈ వెబ్‌సైట్ గణనీయమైన ప్రజాధారణ పొందుతుంది. ఈ సంవత్సరపు నవంబర్ మాసంలో 75,000 విజిట్లను పొంది, డిసంబర్ నెలకు 85,000 విజిట్లను ఈ వెబ్‌సైట్ పొందింది. ఇందుకు అదనంగా ఫ్లీట్ ఆపరేటర్ల దగ్గర నుండి దేశం మొత్తం మీద 2,600 ప్రత్యేక అమ్మకపు అవకాశాలను పొందగలిగింది. ఈ సంఖ్య ఒక లక్ష ఫ్లీట్ ఆపరేటర్లు ఉన్న భారతదేశంలో ఒక మంచి స్పందన అని చెప్పవచ్చు.

ఈ వెంచర్ వెనుక గల ఆలోచనలు గురించి వివరిస్తూ ట్రక్కు దేఖో యొక్క వైజ్ ప్రెసిడెంట్- బిజినెస్ డవలప్మెంట్ & స్ట్రాటజీ రాబిన్ గోబా ఈ విధంగా అన్నారు " భారతదేశ వాణిజ్య రంగం ఒక అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతుంది. ఈ తరుణంలో పెరుగుతున్న వాణిజ్య వ్యవహారాల అవసరాలకు మరియు రవాణా సేవలకు ఎంతగానో ఆవశ్యకత ఉంది. అందుకనే మేము ఈ ట్రక్ దేఖో.కాం ను ప్రవేశపెట్టడం జరిగింది. మేము ఈ వెబ్‌సైట్ ద్వారా ఒక అత్యున్నత సాంకేతిక వ్యవస్థను ప్రత్యేకంగా వినియోగదారులను వారి వాడుక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారుచేయడం జరిగింది. ఇది ట్రక్కు కొనుగోలుదారులకు మరియు అమ్మకపు దారులకు ట్రక్కులకు సంబంధించిన పూర్తి సమాచారన్ని ఆకట్టుకొనే విధంగా అందించగలుగుతుంది." అని వివరించారు.

ఈ వెబ్‌సైటు వినియోగర్దారులకు కొత్త తరం వాణిజ్య వాహనాల సమాచారన్ని అందిస్తుంది మరియు ఒకదానితో మరొకటి సరిచూసుకొనే అవకాశం కల్పిస్తుంది. వీడియోలు,సమాచారాలు మరియు వినియోగదారుల అభిప్రాయాలు ఇంకా ట్రక్కులకు సంబంధించిన బ్రోచర్లు మరియు సులువైన కొనుగోలు మార్గాలు వంటి వివరాలను ఈ వెబ్‌సైటు ద్వారా దొరుకుతాయి. ఇంతేకాకుండా వినియోగదారులు సమీపంలో ఉన్న డీలర్ల దగ్గర నుంచి ట్రక్కులకు సంబంధించిన ధర వివరాలను అడిగి పొందవచ్చు. దీనిద్వారా వినియోగదారులు సమీపంలోని ట్రక్కు సేవా సెంటర్లను కూడా తెలుసుకోవచ్చు.

ట్రక్కు దేఖో వారి ఈ వెబ్‌సైట్ ద్వారా నెలసరి ట్రక్కు ఖరీదు ఇ.ఎం.ఐ ని కూడా లెక్క వేసుకోగలిగే అవకాశం ఉంది. " చాలా వరకూ ట్రక్కుల అమ్మకాలు చిన్నపాటి ట్రక్కు వ్యాపారులు మరియు చిన్న వర్తకుల శ్రేణిలోనే జరుగుతున్నాయి, వీరు చాలా సందర్భాలలో అధికమైన ఖరీదు గల వడ్డీ ని చెల్లించి కొనుగోలును చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇందుచేత వీరు ఎక్కువగా నష్టపోవుచున్నారు మరియు అధిక వడ్డీలను చెల్లించే భారం భరిస్తున్నారు. ఇది దేశీయ వాణిజ్యానికి మంచి పరిణామం కాదు అని చెప్పవచ్చు. ఈ విధంగా పూర్తి సమాచారాన్ని అందించడం ద్వారా ఒక సమమైన వ్యాపార పరిస్తితులకు ట్రక్‌దేఖో సమాచారం దోహదపడగలదు అని నమ్ముతున్నాను." రాబిన్ తెలిపారు.

ఈ వెబ్సైట్ ద్వారా ఎమ్హెచ్ మరియు ఎస్.సి.వి విభాగలకు చెందిన పెద్ద వాహనాల యొక్క సంస్థలు అయిన టాటా, ఇసుజు, మహీంద్రా, ఫోర్స్, పజీయో, అషోక్ లైలాండ్ మరియు హిందుస్తాన్ మోటార్స్ వంటి 72 మోడళ్ళ పెద్ద వాహనాల యొక్క సమాచారం లభ్యంలో ఉంది. ట్రక్కు ఓనర్లు, ఫ్లీట్ ఆపరేటర్లు చిన్న మరియు పెద్ద వ్యాపారులు లోడ్ ను మోసే వారు వంటి వారికి ఈ ట్రక్‌దేఖో విభిన్నమైన రకాల సమాచారాలు అందిస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience