మే 2015 లో అధికంగా విక్రయించబడ ి మొదటి ఐదు స్థానాలలో నిలిచిన కార్లు
జూన్ 11, 2015 02:21 pm saad ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: 2015 సంవత్సరం ఒక బ్లాస్ట్ తో ప్రారంభమైనది మరియు మనం చూస్తున్న ఆటో మొబైల్ పరిశ్రమ యొక్క పరిపూర్ణ చర్యలు కొత్త ప్రయోగాలతో మరియు ఫేస్ లిఫ్ట్ కార్లతో ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్ లోకి దూసుకొస్తున్నాయి. గత నెలలో ఇదే ప్రదర్శనను మనం అమ్మకాల పరంగా చూసినట్లయితే మరోసారి మారుతీ భారతదేశం లో టాప్ సెల్లింగ్ బ్రాండ్ గా నిలిచింది. విక్రయాలలో చూసినట్లయితే 20కి 9 కార్లు మారుతిబ్రాండ్ వి కావడం విశేషం, "బాస్ ఎవరు" అనే ప్రశ్నకి మేమే బాస్ అంటూ మారుతి మరోసారి తన సత్తా చాటుకుంది. చిన్నగా చెపాలంటే మేము ఇక్కడ మే 2015 టాప్ 5 కార్ల జాబితా ను పేర్కొన్నాము మరియు ఇక్కడ మారుతి విజయాన్ని అందుకుని ఎగిరే రంగులతో అగ్రవిభాగంలో 4 స్థానాలలో నిలిచింది.
1. మారుతి ఆల్టో
ప్రజల కారు అయిన ఈ మారుతి ఆల్టో మరోసారి మే నెల 22.595 యూనిట్ల అమ్మకాలతో ఒక శిఖర స్థాన్న్ని కైవసం చేసుకుంది. ప్రపంచంలో ప్రస్తుతం తక్కువ బడ్జెట్ లో ఉన్న కార్లలో ఈ ఆల్టో, మద్య తరగతి ప్రజలకి ఇష్టమైన మరియు నిస్సందేహంగా, అత్యధికంగా అమ్ముడైన కారుగా పేరు పొందింది. ఈ మారుతి ఆల్టో 800 ను INR 3.2 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) తక్కువ ధరను చెల్లించి ఈ కారు ను మన సొంతం చేసుకోవచ్చు. దీనిలో ఒక ఒక శక్తివంతమైన వెర్షన్ కూడా ఉంది. అది ఏమిటో కాదు ఆటో కె10.
2. మారుతి స్విఫ్ట్ డిజైర్
ఇది కాంపాక్ట్ సెడాన్ విభాగంలో కొత్తదనాన్ని ఇచ్చిన కారు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. స్విఫ్ట్ యొక్కకొన్ని పరికరాలను మార్చడం ద్వారా ప్రజలకు అదనపు సౌలభ్యం మరియు స్పేస్ కల్పించే ధ్యేయంతో దీనిని రూపొందించారు. ఇటీవల చేసిన నవీకరణ వలన తదుపరి స్థాయిలో సౌకర్యవంతమైన కారు రూపొందించబడింది. ఇప్పుడు ఇది తాజాగా అమర్చబడిన డ్యాష్బోర్డ్ తో మరియు గొప్ప మైలేజ్ ను కలిగి అమ్మకాలలో తయారీ సంస్థ పేరు మారుమ్రోగుతోంది. గత కొన్ని నెలల క్రింద మారుతి విక్రయాలు 18-19 వేల యూనిట్లు ఉండడంతో వీటి విక్రయాలు కొంచెం ఊపందుకున్నాయి. మేలో కూడా కాంపాక్ట్ సెడాన్ విక్రయాలు 19,663 యూనిట్లు ఉండడం తో మార్కెట్లోకి దూసుకెళ్లింది. స్విఫ్ట్ డిజైర్ ధర ఎక్స్-షోరూమ్ ఢిల్లీలో 5.1 లక్షల నుండి మొదలయింది.
3. మారుతి స్విఫ్ట్
ఈ మారుతి స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ ను పోలి ఉంటుంది. కాని ఈ రెండూ కూడా అమ్మకాల పరంగా అధిగమించి ఒక అద్భుతమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మారుతి స్విఫ్ట్ అత్యంత ప్రాచుర్యం కలిగిన హాచ్బాక్ లలో ఒకటిగా నిలచింది. ఏన్నో కార్లు వస్తున్నప్పటికి ఈ మారుతి స్విఫ్ట్ హాచ్బాక్ తన పేరు ను నిలబెట్టుకోగలిగింది. దేశంలో ఈ కారు కోసం 17,195 కొత్త వినియోగదారులు కలిసారు. ఎందుకంటే, అందమైన డిజైన్ ను కలిగి ఉండటమే కాకుండా, ఈ వాహనం యొక్క ప్రారంభ ధర కేవలం INR 4.6 లక్షల వద్ద (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందుబాటులో ఉంది.
4. మారుతి వ్యాగన్ ఆర్
మార్కెట్లో ప్రస్తుతం చాలా రకాల కార్లు ఉన్నప్పటికిని, వ్యాగన్ ఆర్ ఈ తేదీ వరకు దేశంలో ప్రజాదరణలో ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మారుతి సుజుకి బ్రాండ్, మన దేశంలో ఉన్న ప్రజలందరికి పరిపూర్ణ విశ్వాసాన్ని ఇస్తుంది. అమ్మకాల పరంగా గత నెలలో తయారీసంస్థ 12.467 యూనిట్లు రిటైలింగ్ కార్లను విక్రయించింది. అందుకే మారుతి యొక్క ఇతర మోడల్స్ కంటే కూడా ఇది విక్రయాల పరంగా మంచి స్పందనను అందుకుంది. కారు ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ ఢిల్లీలో రూ.3.7 లక్షలతో మొదలు పెట్టారు.
5. హ్యుందాయ్ ఎలైట్ ఐ 20
హ్యుందాయ్ ఐ 20 ఎలైట్ గురించి చెపాలంటే యూరోపియన్ వారిచే డిజైన్ చేయబడిన ఈ ప్రీమియం హాచ్బాక్ చూడడానికి ఆకర్షణీయంగా మరియు ఘనమైన అంతర్గత భాగాలతో డ్రైవింగ్ చేసే వారికి అద్భుతమైన భావాన్ని కలిగిస్తుంది. కారు గత సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుండి విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. దీని వలన కొరియన్ ఆటో మేకర్ కి మంచి బలం చేకూరింది. తరువాత అతను క్రాస్ ఓవర్ సెగ్మెంట్లో అడుగు పెట్టి హ్యుందాయ్ ఐ20 ఆక్టివ్ ని ప్రవేశపెట్టారు. ఈ హ్యుందాయ్ ఐ20 అసాధారణమైన ప్రదర్శన ను చూపించడమే కాకుండా దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న మోడల్ గా నిలచింది. గత నెల అమ్మకాల ప్రకారం, హ్యుందాయ్ లైట్ ఐ 20 యొక్క అమ్మకాలను చూసినట్లైతే, ఈ విధంగా ఉన్నాయి. మే నెలలో 10,334 యూనిట్ల ను విక్రయం చేసి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 INR 5.3 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఒక ప్రారంభ ధర ట్యాగ్ తో వినియోగదారులను ఆకర్షిస్తుంది.