టాటా నెక్సాన్: వేరియంట్ల వివరాలు

టాటా నెక్సన్ 2017-2020 కోసం raunak ద్వారా ఏప్రిల్ 18, 2019 11:46 am ప్రచురించబడింది

Tata Nexon: Variants Explained

టాటా నెక్సాన్ యొక్క ధర పరిది రూ 6.16 నుండి 10.59 లక్షలు (ఎక్స్ షోరూం, న్యూ డిల్లీ). ఈ ధరతో, టాటా నెక్సన్ దాని ప్రత్యక్ష ప్రత్యర్థులకు గట్టి పోటీను ఇస్తుంది మరియు ఎక్కువ క్రాస్ హాచ్లను కూడా కలిగి ఉంది. పరిచయమయినప్పటికీ, టాటా నెక్సన్ ధరలు పెరుగుదలను కలిగి ఉన్నాయి! ఏ రకమైన వేరియంట్ మీకు ఉత్తమమైనదో చూద్దాం.

Tata Nexon

ముఖ్యాంశాలు

 • టాటా నెక్సాన్, ఉప 4 మీటర్ల ఎస్యువి మరియు ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.
 • టాటా నెక్సాన్, నాలుగు వేరియంట్ స్థాయిలలో అందుబాటులో ఉంది - అవి వరుసగా ఎక్స్ ఈ (దిగువ), ఎక్స్ఎం, ఎక్స్టి, ఎక్స్జెడ్, ఎక్స్జెడ్ + మరియు ఎక్స్జెడ్ ఏ + (అగ్ర శ్రేణి) వేరియంట్ లలో అందుబాటులో ఉంది. దాని ఎక్స్జెడ్ మరియు ఎక్స్జెడ్ + వేరియంట్లు, డ్యూయల్ టోన్ వేరియంట్ లతో అందుబాటులో ఉంది. అన్నీ కూడా, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో ఆరు రకాల వేరియంట్ లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి
 • నెక్సాన్, టర్బోఛార్జెడ్ ఇంజన్లతో మాత్రమే అందుబాటులో ఉంది - అవి వరుసగా 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజిన్లు ఉప- 4 మీటర్ల ఎస్యువి తో మొదటిసారిగా అందించబడ్డాయి.
 • ప్రామాణిక 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, అయితే ఆటోమేటిక్ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) దాని 6- స్పీడ్ మాన్యువల్ ఆధారంగా ఎక్స్జెడ్ ఏ + వేరియంట్లో అందించబడుతుంది.
 • టాటా నెక్సాన్ యొక్క పెట్రోలు ఇంజన్- 17 కెఎంపిఎల్ మైలేజ్ ను అలాగే డీజిల్ ఇంజన్ 21.5 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తాయి.

ప్రామాణిక భద్రతా ఫీచర్లు

ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్లు మరియు ఏబిఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) తో ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్- ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) 

రంగు ఎంపికలు

 • మొరాకోన్ బ్లూ
 • వెర్మోంట్ రెడ్
 • సీటెల్ సిల్వర్
 • గ్లాస్గో గ్రే
 • కాల్గరీ వైట్
 • ఎట్నా ఆరెంజ్

ఈ ఆరు రంగుల ఎంపికలలో- మొరాకో బ్లూ, ఎట్నా ఆరెంజ్ మరియు వెర్మోంట్ రెడ్లు మాత్రమే విరుద్ధమైన సిల్వర్ (సోనిక్ సిల్వర్) రూఫ్ ను కలిగి ఉంటాయి.

 Tata Nexon

టాటా నెక్సన్ ఎక్స్ ఈ

ధరలు (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

ఇంజిన్

ధర

పెట్రోల్ ఎక్స్ఈ

రూ 6.16 లక్షలు

డీజిల్ ఎక్స్ఈ

రూ 7.19 లక్షలు

లక్షణాలు

 • ఎల్ ఈ డి టైల్ లాంప్లు

 • టైర్లు: 195/60 ఆర్16

 • ముందు డోర్లకు గొడుగు హోల్డర్లు

 • మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ మరియు ఫ్రంట్ పవర్ విండోస్

 • డ్రైవింగ్ రీతులు: సిటీ, ఎకో అండ్ స్పోర్ట్

 • టిల్ట్ సర్దుబాటు పవర్ స్టీరింగ్

 

కొనుగోలుకు తగిన వాహనమా?

ఇది కట్త్రోత్ ధరతో భద్రతా కారకాలను కలిగి ఉన్నప్పటికీ, దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎక్స్ ఈ కేవలం ఉప- 4మీటర్ల ఎస్యువి మాత్రమే. ఈ వేరియంట్ లో అవసరమైన అంశాలు అందించబడటం లేదు. కనీసం, డే అండ్ నైట్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్ వంటి అంశం, ఆశ్చర్యకరంగా అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే  అందించబడుతుంది. టాటా సంస్థ, ఈ వేరియంట్ లో మ్యూజిక్ సిస్టం ను అందించడం లేదు, కానీ దానిని కొనుగోలు తరువాత అదనపు ఖర్చుతో ఈ వేరియంట్ లో అమర్చవచ్చు. మీరు ఈ వేరియంట్ ను వదిలివేసి, సాపేక్షంగా మరింత ప్రీమియంగా ఉండే ఎక్స్ ఎమ్ వేరియంట్ ను ఎంపిక చేసుకోమని మేము సూచిస్తున్నాము.

టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్

ధరలు (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

ఇంజిన్

ధర

పెట్రోల్ ఎక్స్ఎం

రూ 6.91 లక్షలు

డీజిల్ ఎక్స్ఎం

రూ 7.84 లక్షలు

బేస్ ఎక్స్ ఈ వేరియంట్ లో అందించబడిన అంశాలతో పాటు ఎక్స్ ఎమ్ లో అందించబడే అంశాలు:

నాలుగు- స్పీకర్ సిస్టమ్తో నాన్- టచ్ కనెక్స్ట్ ఇన్ఫోలేయిన్మెంట్ సిస్టమ్ (టియగో మాదిరిగానే). యుఎస్బి మరియు ఆక్స్- ఇన్ లతో పాటు బ్లూటూత్ మరియు ఐప్యాడ్ కనెక్టివిటీ. స్మార్ట్ఫోన్ యాప్ ను అనుమతిస్తుంది.

• స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు

• రేర్ పార్కింగ్ సెన్సార్లు

• రిమోట్ సెంట్రల్ లాకింగ్

• వెనుక పవర్ విండోలు

• ఫాస్ట్ యుఎస్బి ఛార్జింగ్

• ఎలక్ట్రానిక్ సర్దుబాటు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు

Tata Nexon

కొనుగోలుకు తగిన వాహనమా?

ఎక్స్ఈ పెట్రోల్ మరియు డీజిల్ ట్రిమ్లకు సుమారు రూ .75,000 మరియు రూ. 65,000 ను అదనంగా చెల్లించినట్లైతే, ఎక్స్ఎమ్ ప్రీమియం వేరియంట్ ను పొందవచ్చు. మీరు ఒక టియాగో నుండి అందించబడిన సంగీత వ్యవస్థను పొందుతారు, ఇది స్మార్ట్ఫోన్- ఆధారిత అనువర్తనాలకు అనుమతిస్తుంది. కానీ, ఇది కూడా ఎక్స్ఈ వలె, కారు రంగులో ఉండే డోర్ హ్యాండిళ్లు మరియు మిర్రర్లతో పాటు రూఫ్ రైల్స్ వంటి అంశాలను కూడా పొందలేదు. అన్నింటిలో, ఎక్స్ఎమ్ వేరియంట్ స్థాయి ఖచ్చితంగా చాలా కొనుగోలుదారులకు ఉత్తమ వేరియంట్ గా నిలుస్తుంది, అంతేకాకుండా ఇది- నెక్సాన్ యొక్క శ్రేణిలో అత్యధికంగా అమ్ముడుపోయే వాహనాలలో ఒకటిగా నిలిచింది.

టాటా నెక్సన్ ఎక్స్టి

ధరలు (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

ఇంజిన్

ధర

పెట్రోల్ ఎక్స్టి

రూ .7.53 లక్షలు

డీజిల్ ఎక్స్టి

రూ 8.40 లక్షలు

ఎక్స్ఎమ్ లో అందించబడిన అంశాలతో పాటు, ఎక్స్టి లో అందించబడే అంశాలు:

• వెలుపలి భాగం: కారు రంగులో ఉండే డోర్ హ్యాండిళ్లు మరియు ఓఆర్విఎమ్ లు, రూఫ్ రైల్స్ మరియు షార్క్- ఫిన్ యాంటెన్నా

Tata Nexon

• వెనుక ఏసి వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

Tata Nexon

 • ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్ లు
 •  వెనుక పవర్ అవుట్లెట్
 •  శీతలీకరణ మరియు ప్రకాశవంతమైన గ్లోవ్ బాక్స్

కొనుగోలుకు తగిన వాహనమా?

ఎక్స్టి పెట్రోల్ మరియు డీజిల్ కోసం రూ. 62,000 మరియు 56,000 రూపాయలను వారెంటీ కోసం చెల్లించాల్సి ఉంది, ఇది ఖచ్చితంగా ఎక్కువ వైపు ఉంటుంది. ఈ అదనపు ఖర్చుతో, మీరు ఒక ఆటో ఏసి మరియు ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్ లతో పాటు బయట భాగంలో మెరుగైన సౌందర్య నవీకరణలను పొందుతారు మరియు ఇది చాలా అందంగా ఉంది! ఇది ఇప్పటికీ అల్లాయ్ వీల్స్, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మరియు ఫాగ్ లాంప్లు వంటి వాటిని మిస్ అవుతుంది. అన్నింటిలో, నెక్సాన్ ఎక్స్టి ఎక్కువ ధరను కలిగిన వాహనంగా కనిపిస్తుంది!

టాటా నెక్సాన్ ఎక్స్జెడ్

ధరలు (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

ఇంజిన్

ధర

పెట్రోల్ ఎక్స్జెడ్

రూ 7.99 లక్షలు

డీజిల్ ఎక్స్జెడ్

రూ 8.99 లక్షలు

Tata Nexon

ఎక్స్టి వేరియంట్ లో అందించబడిన అన్ని అంశాలతో పాటు, ఎక్స్జెడ్ లో అందించబడే అంశాలు:

ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్

యాండ్రాయిడ్ ఆటో మరియు 8- స్పీకర్ సిస్టమ్ (4 స్పీకర్లు మరియు 4 ట్వీట్లతో) తో కూడిన 6.5- అంగుళాల టచ్స్క్రీన్ కనెక్ట్ నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఈ యూనిట్, వాయిస్ ఆదేశాలకు మద్దతు ఇస్తుంది, వీటిలో వాతావరణ నియంత్రణ కూడా అందించబడింది.

 • టాటా స్మార్ట్ రిమోట్ యాప్

 • డోర్ అజార్, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు తక్కువ ఇంధన కోసం వాయిస్ హెచ్చరికలు

​​​​​​​Tata Nexon

 • పార్కింగ్ సెన్సార్లతో పాటు ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ పై ప్రదర్శనతో కూడిన రేర్ వ్యూ కెమెరా

 • డ్రైవర్ యొక్క సీట్ ఎత్తు సర్దుబాటు, ఎత్తు సర్దుబాటు ముందు సీటు బెల్ట్లు

కొనుగోలుకు తగిన వాహనమా?

పెట్రోల్, డీజిల్ వేరియంట్లకు అదనంగా రూ 46,000 మరియు 59,000 రూపాయలను ఎక్కువగా చెల్లించినట్లైతే, మీరు టాటా యొక్క ఫ్లాగ్షిప్ టచ్స్క్రీన్ యూనిట్ను అందుకుంటారు, ఇది యాండ్రాయిడ్ ఆటోతో వస్తుంది, ఇది గూగుల్ మ్యాప్స్ ద్వారా నావిగేషన్ తో వస్తుంది. వీటితో పాటు వాయిస్ హెచ్చరికలు, రేర్ వ్యూ కెమెరా, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు ఇతర అంశాలు అందించబడతాయి. ఈ వేరియంట్, మీ డబ్బు కోసం అత్యంత విలువను అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాము, అందుచే ఇది మా సిఫార్సు వేరియంట్ అని చెబుతున్నాము.

టాటా నెక్సాన్ ఎక్స్జెడ్ + / ఎక్స్జెడ్ + (డ్యూయల్ -టోన్)

ధరలు (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

ఇంజిన్

ధర

పెట్రోల్ ఎక్స్జెడ్ +

రూ 8.81 లక్షలు

పెట్రోల్ ఎక్స్జెడ్ + (డ్యూయల్ టోన్)

రూ. 9.02 లక్షలు

డీజిల్ ఎక్స్జెడ్ +

రూ. 9.69 లక్షలు

డీజిల్ ఎక్స్జెడ్ + (డ్యూయల్ టోన్)

రూ. 9.89 లక్షలు

ఎక్స్జెడ్ లో అందించబడిన అన్ని అంశాలతో పాటు, ఎక్స్జెడ్ + లో అందించబడే అంశాలు:

 • డే టైం రన్నింగ్ ఎల్ఈడి లతో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్

​​​​​​​Tata Nexon

 • విస్తృత 215/60 క్రాస్ సెక్షన్ ఆర్16 అల్లాయ్ వీల్స్ కు 16 అంగుళాల క్రాస్ సెక్షన్ అల్లాయ్ వీల్స్

Tata Nexon

 • ముందు (కార్నరింగ్ ఫంక్షన్ తో) మరియు వెనుక ఫాగ్ లాంప్స్

 • ఫ్రంట్ సెంట్రల్ ఆర్మ్స్ట్రెస్ మరియు టాంబర్ డోర్

 • 60:40 వెనుక స్ప్లిట్ సీట్

Tata Nexon

 • వెనుక డిఫోగ్గర్ మరియు వైపర్

 • ఇంజిన్ పుష్- బటన్ స్టార్ట్ -స్టాప్ తో పాసివ్ కీ లెస్ ఎంట్రీ

​​​​​​​

కొనుగోలుకు తగిన వాహనమా?

ఎక్స్జెడ్ + అనేది మీకు అన్ని విధాలా సరిపడే అద్భుతమైన వేరియంట్ అని చెప్పవచ్చు. దీనిలో చాలా అంశాలను పొందవచ్చు, అవి వరుసగా, కేంద్ర కన్సోల్ పై టేంబోర్ డోర్, డిఆర్ఎల్ఎస్ లు, నిష్క్రియాత్మక కీ లెస్ ఎంట్రీ, పుష్- బటన్ స్టార్ట్ / స్టాప్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు మరిన్ని అంశాలు ఇక్కడ అందించబడ్డాయి. అంతేకాక, సుమారు రూ 20,000 అదనపు ఖర్చుతో, డ్యూయల్- టోన్ వెర్షన్ ను పొందవచ్చు, ఇది నెక్సాన్ యొక్క ఇతర నమూనాలతో పోల్చితే నిజంగా అద్భుతమైనదిగా నిలుస్తుంది. ఎక్స్జెడ్ + కోరుకుంతున్న వారిని ఎక్కువగా ప్రేరేపించింది, కాని దీని ధర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మొత్తంమీద, మీ బడ్జెట్ తగినట్టుగా ఉన్నట్లయితే ఈ ఉప- 4 మీటర్ల విభాగంలో, అత్యుత్తమ ప్యాకేజీలలో ఒకటిగా ఈ వేరియంట్ ను పరిగణించవచ్చు.

టాటా నెక్సాన్ ఎక్స్జెడ్ఏ +

ధరలు (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

ఇంజిన్

ధర

పెట్రోల్ ఎక్స్జెడ్ఏ + / ఎక్స్జెడ్ఏ + డ్యూయల్ టోన్

రూ 9.41 లక్షలు / రూ 9.62 లక్షలు

డీజిల్ ఎక్స్జెడ్ఏ + / ఎక్స్జెడ్ఏ + డ్యూయల్ టోన్

రూ 10.39 లక్షలు / రూ. 10.59 లక్షలు

ఎఎంటి ఎంపిక, ఎక్స్జెడ్ + యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లో మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది మాన్యువల్ అగ్ర శ్రేణి వెర్షన్ లను కూడా పొందుతుంది.

Tata Nexon

 • వేరియబుల్ పెప్స్ కీ లేదా యాక్టివిటీ కీ

 • మాన్యువల్ మోడ్

 • స్మార్ట్ హిల్ అసిస్ట్

 • క్రిఫ్ ఫంక్షన్ (ఫార్వర్డ్ & రివర్స్)

కొనుగోలుకు తగిన వాహనమా?

ఒక ఆటోమేటిక్ నెక్సాన్ కోసం చూస్తున్న కొనుగోలుదారులందరి కోసం, ఇది అనువైన వేరియంట్. అగ్ర శ్రేణి ఎక్స్జెడ్ఏ + వేరియంట్ తో మాత్రమే ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లభ్యమవుతుంది; నెక్సాన్ ఏఎంటి, నగర ట్రాఫిక్లో మరియు రహదారులపై కూడా అవాంతరం లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మాన్యువల్ మోడ్ లో గేర్లను నియంత్రించడానికి ఒక ఎంపికను ఇస్తుంది. అంతేకాకుండా, క్రీప్ ఫంక్షన్- మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఒక నిజమైన వరంగా ఉపయోగపడుతుంది. అయితే, ఏఎంటి దాని పెట్రోల్ మరియు డీజిల్ మాన్యువల్ ప్రత్యర్ధులపై రూ 60,000 మరియు రూ 70,000 అదనపు డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. కానీ అదనపు ఖర్చులో కూడా మీరు వేరియబుల్ యాక్టివిటీ కీ ను పొందవచ్చు - ఇకపై కీ మోసుకెళ్ళే చింత తగ్గుతుంది.

మరింత చదవండి: నెక్సాన్ ఆన్ రోడ్ ధర

 


 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా నెక్సన్ 2017-2020

1 వ్యాఖ్య
1
N
nirupam samant
Oct 18, 2019, 10:30:04 PM

They have nowhere mentioned about adjustable rear seat headrest in their new brochure

Read More...
  సమాధానం
  Write a Reply
  Read Full News

  కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

  ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  ×
  We need your సిటీ to customize your experience