• English
  • Login / Register

2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబడిన ఎస్యువి లు

ఫిబ్రవరి 16, 2016 03:08 pm saad ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆటో ఎక్స్పో యొక్క 13 వ ఎడిషన్, ఉత్పత్తి ఆవిష్కరణ పరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి ని సాధించింది. హాచ్బాక్ ల నుండి సెడాన్ ల వరకు మరియు ఎస్యువి లు, వారి తేజస్సు తో ఈవెంట్ ను విజయవంతం చేసాయి. ముఖ్యంగా ఎస్యువి ల విషయానికి వస్తే, ఈ ఈవెంట్ లో అనేక కొత్త ఉత్పత్తులు ప్రదర్శించబడ్డాయి. ఈ కొత్త ఎస్యువి ల గురించి తెలుసుకోవడం లో వేచి ఉండవలసిన అవసరం లేదు మరియు ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబడిన ఎస్యువి ల జాబితా ఈ క్రింది ఇవ్వబడింది

మారుతి విటారా బ్రెజ్జా

విటారా బ్రెజ్జా, దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి నుండి మొదటి కాంపాక్ట్ ఎస్యూవి గా ఉండటం, ఆకర్షణ కేంద్రంగా ఉంది. ఈ వాహనం, స్టైలిష్ లుక్ తో మరియు ఖరీదైన అంతర్గత భాగాలతో అందుబాటులో ఉంది అలాగే ఈ వాహనం, 1.3 లీటర్ డి డి ఐ ఎస్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంది. అంతేకాకుండా ఈ వాహనం, మార్చి 2016 నాటికి ప్రారంభం కావచ్చునని భావిస్తున్నారు.

రెనాల్ట్ డస్టర్

కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో మార్గదర్శకుడు అయిన డస్టర్, ఒక కొత్త అవతార్ తో బహిర్గతమైంది. ఈ కారు, కాస్మటిక్ అంశాలలో ప్రదాన మార్పులతో అలాగే ఇంజన్ అంశాల విషయానికి వస్తే అవే ఇంజన్ లతో కొనసాగుతుంది. అయితే ఇదే విభాగంలో ఈ వాహనానికి పోటీగా ఉన్న హ్యుందాయ్ క్రెటా వాహనాన్ని ఎదుర్కోవడానికి ఈ వాహనం అదనంగా, కొత్త ఏ ఎం టి రూపంలో అందించబడుతుంది.

హ్యుందాయ్ టక్సన్

హ్యుందాయ్ క్రెటా యొక్క పెద్ద తోబుట్టువు అయిన ఈ హ్యుందాయ్ టక్సన్ వాహనం, భారత మార్కెట్ కోసం ప్రణాళిక చేయబడింది. అంతేకాకుండా ఈ వాహనం, వెర్నా డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా, బ్లాక్ కొత్త కిడ్ ద్వారా అత్యంత శక్తివంతమైన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనం అత్యధికంగా, 180 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 140 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఈ ఇంజన్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ హ్యుందాయ్ టక్సన్ యొక్క ప్రయోగం, ఈ సంవత్సరం మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు.

టాటా నెక్సాన్

టాటా సంస్థ వారు, 2016 వ సంవత్సరంలో కొత్త కార్ల ప్రయోగాలు పరంగా త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. స్వదేశ ఆటో సంస్థ అయిన ఈ టాటా, నెక్సాన్ వంటి ఆయుదంతో, విటారా బ్రెజ్జా నుండి ఒక ప్రధాన ముప్పు ఉంటుంది అయితే, ఇదే విభాగం లో ఉండే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు టియువి300 వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వబోతుంది. టాటా సంస్థ నుండి రాబోతున్న కొత్త కాంపాక్ట్ ఎస్యువి, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అలాగే 1.5 లీటర్ రెవ్ట్రాన్ డీజిల్ ఇంజన్ లతో అందుబాటులో ఉండబోతుంది. అంతేకాకుండా ఈ వాహనం, ఏ ఎం టి ఎంపికతో అందించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

వోక్స్వాగన్ టైగన్

జర్మన్ ఆటో సంస్థ కూడా టైగన్ వంటి ఎస్యూవి బహిర్గతం తో ఆటో ఎక్స్పో 2016 వద్ద దాని కళా నైపుణ్యాన్ని చూపించాడు. ఈ వాహనం, ప్రీమియం ఎస్యువి గా ఉంది మరియు ఇది, వోక్స్వాగన్ యొక్క ఎం క్యూ బి ప్లాట్ఫాం పై ఆధారపడి ఉంటుంది. మరోవైపు హుడ్ క్రింది భాగం విషయానికి వస్తే, ఈ వాహనం 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 148 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ టైగన్ వాహనం, ఇదే విభాగంలో ఉండే ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.

నిస్సాన్ ఎక్స్- ట్రైల్

నిస్సాన్ టెర్రినో వాహనం, జపనీస్ ఆటో సంస్థ కు అంచనా కంటే ఎక్కువ విజయాన్ని తెచ్చిపెట్టింది. భారతదేశం లో ఎస్యువి లకు పెరుగుతున్న ఆసక్తి తో, ఈ నిస్సాన్ సంస్థ, నిస్సాన్ టెర్రినో విజయం తర్వాత మరో ఎస్యూవి ను తీసుకు రానుంది. దాని పేరే, నిస్సాన్ ఎక్స్ ట్రైల్. ఈ వాహనం, ఇదే విభాగంలో ఉండే హోండా సి ఆర్ వి వంటి వాహనానికి గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది. ఈ వాహనం ఒక హైబ్రిడ్ కారు వంటిది మరియు ఇది, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 184.8 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 360 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ మోటార్ తో జత చేయబడినప్పుడు ఇది అత్యధికంగా, 40.8 పి ఎస్ గల పవర్ ను విడుదల చేస్తుంది. నిస్సాన్ బ్రాండ్ అంబాసిడర్ గా నటుడు జాన్ అబ్రహం నియమించబడ్డాదు, మరియు ఇతడు, ఈ యువ జనాభా కోసం లక్ష్యాన్ని సాదించడానికి కంపెనీ కి సహాయపడవచ్చు.

మారుతి ఇగ్నిస్

ఈ మారుతి ఇగ్నిస్ కారు, కొంత కాలం క్రితం సూక్షమ ఎస్యువి విభాగంలో రంగ ప్రేవేశం చేసిన మహీంద్రా కెయువి 100 ద్వారా ఈ వాహనం ఒక కొత్త విభాగంలో ప్రవేశపెట్టబడుతుంది. ఈ కారు ఇప్పటికే జపనీస్ మార్కెట్ లో ఆవిష్కరించబడింది మరియు భారతదేశం లో పరీక్ష లను కలిగి ఉంది. ఈ ఆటో ఎక్స్పో లో ఈ వాహనం యొక్క కాన్సెప్ట్ ప్రదర్శించబడింది కానీ, ఉత్పత్తి వెర్షన్ మునుపటి వెర్షన్ కు దాదాపు సమానంగా ఉంటుంది. యాంత్రిక పరంగా ఈ వాహనం, ఫియాట్ నుండి తీసుకోబడిన 1.3 లీటర్ డి డి ఐ ఎస్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

హోండా బిఆర్-వి

హోండా బిఆర్- వి వాహనం, చివరికి భారత తీరాలకు రాబోతుంది తర్వాత థాయిలాండ్ మరియు ఇండోనేషియా మార్కెట్ లకు ప్రవేశపెట్టబడుతుంది. ఈ వాహనం యొక్క క్యాబిన్ నాణ్యత మరియు లక్షణాల విషయానికి వస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అయితే ఈ కారు, బాహ్య భాగం పరంగా కుటుంబ స్టైలింగ్ ను కలిగి ఉంటుంది. ఈ ఎస్యువి / క్రాస్ ఓవర్ వాహనం, ఇదే విభాగం లో ఉండే హ్యుందాయ్ క్రెటా మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వడానికి రానుంది. యాంత్రిక విషయానికి వస్తే ఈ వాహనం, 1.5 లీటర్ ఐ -విటెక్ మరియు 1.5 లీటర్ ఐ డిటెక్ డీజిల్ ఇంజన్ లతో జత చేయబడి ఉంటుంది. ఈ రెండు ఇంజన్లు, 6- స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క ప్రారంభం, 2016 రెండవ త్రైమాసికంలో ఉంటుంది అని భావిస్తున్నారు.

టాటా హెక్సా

భారత మార్కెట్ లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి టాటా, 2014 నుండి రూపాంతర రహదారిని కలిగి ఉంది. కొత్త రూపకల్పన వ్యూహం తో బోల్ట్, జెస్ట్, జికా మరియు కైట్ 5 వంటి తాజా కార్లను కాపాడుతుంది మరియు ఈ పరివర్తన, కీలక భాగంగా ఉంది. అదే వ్యూహాలు తరువాత, స్వదేశ ఆటో సంస్థ అయిన ఈ టాటా, 2016 ఆటో ఎక్స్పోలో హెక్సా ఎస్యూవి ను ప్రదర్శించింది. ఈ కారు, ఏరియా ఎస్యువి ను భర్తీ చేయడానికి ప్రవేశ పెట్టడం జరిగింది మరియు ఇది యాంత్రిక పరంగా, వరికార్ 400 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ టాటా హెక్సా వాహనం, ఇదే విభాగంలో ఉండే టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది.

జీప్ గ్రాండ్ చెరోకీ మరియు చెరోకీ ఎస్ ఆర్ టి

జీప్ సంస్థ చివరకు దాని శక్తివంతమైన కార్లను భారత ఆటోమోటివ్ సన్నివేశంలో తన ఆగమనాన్ని తెలియజేసింది. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, మాతృ సంస్థ ఆటో ఎక్స్పో వద్ద, గ్రాండ్ చెరోకీ మరియు అత్యంత శక్తివంతమైన వెర్షన్ అయిన చెరోకీ ఎస్ ఆర్ టి వాహనాలను ఆవిష్కరించింది. అధికారికంగా కొంత పడుతుంది అయితే, ఈ కార్ల హుడ్ కింద అందించే ఇంజన్ లను కనుగొనడం జరిగింది. ఈ చెరోకీ వాహనానికి, 3.0 లీటర్ వి6 ఈకో డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 240 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు చెరోకీ ఎస్ ఆర్ టి వాహనం విషయానికి వస్తే, మోన్స్టర్ 6.4 లీటర్ హెచ్ ఈ ఎం ఐ వి8 ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 461 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

జీప్ రాంగ్లర్ అన్ లిమిటెడ్

జీప్ నుండి ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శింపబడిన మరొక వాహనం, జీప్ రాంగ్లర్ అన్ లిమిటెడ్ మరియు అందరు ఈ వాహనానికి ఆకర్షితులు అవుతున్నారు. రాంగ్లర్, కఠినమైన ఆఫ్ రోడర్ మరియు ఇది, ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన దాని వైఖరి తో జీప్ కార్లు లెగసీ తో కొనసాగుతుంది. యాంత్రిక విషయానికి వస్తే ఈ వాహనం, 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 200 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 460 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, అది భారత మార్కెట్ లో డీట్యూన్డ్ వెర్షన్ తో వస్తుంది అని భావిస్తున్నారు.

జాగ్వార్ ఎఫ్- పేస్

జాగ్వర్ కూడా, భారత మార్కెట్ కోసం ఎస్యూవీ ఎఫ్ -పేస్ వాహన బహిర్గతం తో ప్రణాళిక ను సమర్పించింది. ఈ కారు ఇప్పటికే విదేశీ మార్కెట్లో ప్రారంభం చెయ్యబడింది మరియు ఈ సంవత్సరం తరువాత సగం లో ప్రయోగించేందుకు ప్రణాళిక ఉంది. వాహనం క్రొత్త తేలికపాటి అల్యూమినియం నిర్మాణం నిర్మించబడింది మరియు ఈ వాహనం, భారత మార్కెట్ లో నాలుగు రకాలుగా అందించబడుతుంది. నిర్దేశాల విషయానికి వస్తే, జాగ్వార్ ఎఫ్ పేస్ వాహనం వేరియంట్ లు రకాలను బట్టి రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ముందుగా ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, 2.0 లీటర్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 178 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, 3.0 లీటర్ వి6 ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 296 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience