మొదటి EVని అధికారికంగా ఆవిష్కరించిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి! షియోమి SU7 వివరాలు
జనవరి 02, 2024 03:08 pm rohit ద్వారా ప్రచురించబడింది
- 644 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
SU7తో షియోమి ఎలక్ట్రిక్ కార్ ప్రపంచంలోకి సగర్వంగా అడుగుపెట్టింది, టెస్లా మోడల్ 3 మరియు పోర్స్చే టేకాన్ వంటి దిగ్గజాలతో పోటీ పడుతుంది
-
వచ్చే దశాబ్ద కాలంలో 10 బిలియన్ USD పెట్టుబడులతో EV ప్రణాళికలను షియోమి మొదటగా 2021లో ప్రకటించింది.
-
SU7 ఎక్స్ؚటీరియర్ హైలైట్ؚలలో కనెక్టెడ్ టెయిల్ؚలైట్ؚలు, టియర్ డ్రాప్-ఆకారపు LED హెడ్ؚలైట్ؚలు మరియు 20-అంగుళాల వరకు ఉండే అలాయ్ వీల్స్ ఉన్నాయి.
-
క్యాబిన్ మినిమలిస్టిక్ అప్పీల్ؚను కలిగి ఉంటుంది, దీనిలో కేవలం 3-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ మరియు డిజిటల్ స్క్రీన్ؚలు మాత్రమే ఉంటాయి.
-
ఇందులో ఉండే ఫీచర్లలో 16.1-అంగుళాల టచ్ؚస్క్రీన్, 56-అంగుళాల హెడ్స్-అప్ డిస్ప్లే మరియు ADAS ఉన్నాయి.
-
రేర్-వీల్-డ్రైవ్ మరియు ఆల్ –వీల్ డ్రైవ్ ఎంపికలతో 73.6 kWh మరియు 101 kWh బ్యాటరీ ప్యాక్ؚలను పొందుతుంది.
-
2024లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని, అలాగే భవిష్యత్తులో భారతదేశంలో కూడా విడుదల కావచ్చని అంచనా.
షియోమి గురించి ఆలోచించినప్పుడు, మొదటగా గుర్తు వచ్చేది స్మార్ట్ؚఫోన్ؚలు. ఈ చైనీస్ టెక్ ప్రధానంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరాలలో దిగ్గజం అయినప్పటికీ, ప్రధానంగా తయారు చేసే జీవన శైలి మరియు గృహోపకరణాలకు పూర్తిగా భిన్నంగా కొత్త ఉత్పత్తులను తీసుకు వచ్చిన చరిత్ర దీనికి ఉంది. EVలకు సంబంధించి పెరుగుతున్న ట్రెండ్ؚకి అనుగుణంగా, తన పోర్ట్ؚఫోలియోని వైవిధ్యపరచడానికి, వచ్చే 10 సంవత్సరాలలో 10 బిలియన్ USDల పెట్టుబడి పెట్టే ప్రణాళికతో ఎలక్ట్రిక్ కార్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు షియోమి ప్రకటించింది. ఇది ఇప్పుడు షియోమి మొదటి ఎలక్ట్రిక్ కార్ SU7ను రూపొందించడానికి దారి తీసింది – ఈ EVని SU7 మరియు SU7 మాక్స్ అనే రెండు వేరియెంట్ؚలుగా అందిస్తారు.
SU7 డిజైన్
SUVలు మరియు క్రాస్ؚఓవర్ؚల ట్రెండ్ؚకు విభిన్నంగా, షియోమి SU7 ఒక ఎలక్ట్రానిక్ సెడాన్. దీని తక్కువ ఎత్తు డిజైన్, ఇప్పటికే ఉత్పత్తి చేయబడిన హ్యుందాయ్ అయానిక్ 6, పోర్స్చే టేకాన్, టెస్లా మోడల్ 3వంటి ఎలక్ట్రానిక్ సెడాన్ؚలను గుర్తు చేస్తుంది. ఎక్స్ؚటీరియర్ؚలో ఉన్న హైలైట్లలో టియర్ డ్రాప్-ఆకారపు LED హెడ్ؚలైట్ؚలు, పాప్-అప్ రేర్ స్పాయిలర్, 20-అంగుళాల అలాయ్ వీల్స్, కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు మరియు స్పోర్టీ బంపర్ؚలు ఉన్నాయి.
ఇంటీరియర్ మరియు ఫీచర్ వివరాలు
ఈ టెక్ బ్రాండ్ తమ ఎలక్ట్రిక్ కారు ఫిజికల్ క్యాబిన్ؚను ప్రదర్శించలేదు, అయితే మునుపటి అంతర్జాతీయ రహస్య చిత్రాలు, వర్ణనలు ఇందులో 3-స్పోక్ؚల స్టీరింగ్ సిస్టమ్ మరియు రెండు డిజిటల్ డిస్ప్లేలను కలిగి ఉండే మినిమలిస్ట్ క్యాబిన్, చిందరవందరగా లేని కంట్రోల్ ప్యానెల్ؚలు ఉండవచ్చని సూచిస్తున్నాయి. దీని క్యాబిన్, ఎంచుకున్న వేరియెంట్ ఆధారంగా విభిన్న థీమ్ؚలతో రావచ్చు (ఎరుపు మరియు తెలుపు మరియు నలుపు మరియు బూడిద రంగుల మధ్య).
SU7లో ఉన్న ఫీచర్లలో 16.1 అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ టచ్ؚస్క్రీన్ సిస్టమ్, 25-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, 56-అంగుళాల హెడ్స్-అప్ డిస్ప్లే ఉన్నాయి. షియోమి దీనిలో కనెక్టెడ్ కార్ టెక్, రేర్ ఎంటర్టైన్మెంట్ డిస్ప్లేలు, ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు, మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) కూడా అందిస్తుంది.
ఇది కూడా చదవండి: తన EV-తయారీ ప్రణాళికల కోసం భారతదేశం వైపు చూస్తున్న ఫాక్స్ؚకాన్
దీని ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ؚల సంగతి ఏమిటి?
షియోమి SU7ని రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందిస్తుంది. అవి: 73.6 kWh (SU6) మరియు 101 kWh (SU7 మాక్స్). SU7లో రేర్-వీల్-డ్రైవ్ؚతో (RWD) 299 PS సింగిల్-మోటార్ సెట్అప్ ఉంటుంది, రెండవదానిలో ఆల్-వీల్-డ్రైవ్ؚతో (AWD) 673 PS డ్యూయల్-మోటార్ సెట్అప్ ఉంటుంది. వీటి క్లెయిమ్ చేసిన పరిధి గణాంకాలు వరుసగా 668 మరియు 800 kmగా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: ట్రాఫిక్ؚలో చిక్కుకుపోయినప్పుడు మీ కార్ؚను రక్షించడానికి 7 చిట్కాలు
ప్రపంచవ్యాప్త విడుదల మరియు పోటీదారులు
షియోమి ఈ EVని తన స్వదేశీ మార్కెట్ లో 2024 లో మొదట విడుదల చేస్తుందని, అలాగే మన దేశంలో కూడా విడుదల చేయవచ్చని భావిస్తున్నాము. SU7, పోర్స్చే టేకాన్, టెస్లా మోడల్ 3 మరియు హ్యుందాయ్ అయానిక్ 5 వంటి వాటితో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful