Foxconn: EV తయారీ ప్రణాళికలో భాగంగా భారతదేశాన్ని పరిగణిస్తున్న ఫాక్స్ؚకాన్
ఆగష్టు 03, 2023 05:03 pm rohit ద్వారా ప్రచురించబడింది
- 365 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మొబిలిటీ ఇన్ హార్మనీ (MIH) అనే పేరుతో ఫాక్స్ؚకాన్‌కు EV అభివృద్ధి చేసే ప్లాట్ؚఫారం కలిగి ఉంది
ఇంటర్నల్ కంబూషన్ ఇంజన్ (ICE) మరియు ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) మధ్య ఉండే వ్యత్యాసం కారణంగా, ఆటోమోబైల్ పరిశ్రమ వెలుపల ఉండే అనేక బ్రాండ్‌లు ఈ పోటీలో చేరే వీలును కల్పిస్తోంది. అందువలన హువాయి, ఒప్పో, షియోమి వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్ؚలు మరియు స్మార్ట్ؚఫోన్ తయారీదారులు కూడా ఇందులో భాగస్వాములు కావాలని ప్రయత్నిస్తున్నారు. సాంకేతికతతో నిండిన కార్‌లలో అందిస్తున్న వెహిక్యులర్ సిస్టమ్స్ؚలో ఇలాంటి బ్రాండ్‌లు ఇప్పటికే భారీగా పాలుపంచుకుంటున్నాయని అనే విషయాన్ని పరిగణిస్తే, ఇది మరింత అర్ధవంతంగా ఉంటుంది.
కొన్ని సంవత్సరాల క్రితం, US సాంకేతిక దిగ్గజం యాపిల్ కోసం iPhoneను తయారుచేసే కంపెనీ – ఫాక్స్ؚకాన్ – EV పరిశ్రమలో పోటీకి ఆసక్తి చూపింది. ఈ స్మార్ట్ؚఫోన్ తయారీదారు ప్రస్తుతం తమ EVని భారతదేశంలో తయారుచేయడానికి గల సంభావ్యతలను అన్వేషిస్తోంది.
ఈ చర్చ దేని గురించి?
EVల కోసం ప్లాట్ؚఫారంను అభివృద్ధి చేయడానికి కృషి చేసే మొబిలిటీ ఇన్ హార్మనీ (MIH) కన్సార్టియమ్ؚను 2021లో ఫాక్స్ؚకాన్ ప్రారంభించింది. ఇటీవల రియుటర్స్ؚతో మాట్లాడుతూ, ఈ కంపెనీ CEO జాక్ చెంగ్ ఇలా అన్నాడు, “సంభావ్య మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ నిర్మించాలి...అది భారతదేశం అయిన లేదా ఆగ్నేయ ఆసియా అయిన సరే. ప్రస్తుతం ఇక్కడ అధిక పరిమాణంలో అవకాశాలు ఉన్నాయి,” భారతదేశం EV విభాగం “వచ్చే తరం కోసం అభివృద్ధి చెందుతున్న సంభావ్య శక్తి” అని కూడా అన్నారు.
ఇంకా మాట్లాడుతూ, “ఇది ఫాక్స్ؚؚకాన్ కర్మాగారం (భారతదేశంలో) అయితే, అద్భుతం, మాతృ సంస్థను మేము ఫాక్స్ؚకాన్ కర్మాగారంలో భాగంగా ఉంచుతాము. మరింత పోటీతత్వం కలిగి ఉండేలా ఇది స్థానిక భారతదేశ కర్మాగారం అయితే, భారతదేశం కర్మాగారానికి ఇస్తాము.” MIH దీర్ఘకాల అభివృద్ధికి భారతదేశం చాలా కీలకం అని ఆయన భావిస్తున్నాడు.
ఫాక్స్ؚకాన్ؚకు థాయిలాండ్ వంటి ఆగ్నేయ దేశాలలో కూడా EV ప్రణాళికలు ఉన్నాయి, ఇక్కడ ఇప్పటికే స్థానిక సంస్థలలో ఉమ్మడి వెంచర్ ఒప్పందాలు ఉన్నాయి.
EV ప్రణాళికల వివరణ
నవంబర్ 2022లో ఆవిష్కరించిన కొత్త 3-సీటర్ EVని తయారుచేయడానికి మాతృ సంస్థ లేదా ఏదైనా ఇతర సంస్థతో పని చేయడానికి MIH సిద్ధంగా ఉంది, దీనిని ప్రాజెక్ట్ X అని నామకరణం చేశారు. ఎంతో సాంకేతికత ఉన్నప్పటికీ, దీని ధర $20,000 (సుమారు రూ.16.5 లక్షలు) కంటే తక్కువగా ఉంది. దీని ప్రోటోటైప్ؚను అక్టోబర్ 2023లో జపాన్ ఆటో ట్రేడ్ షోలో ఆవిష్కరించాలనే ప్రణాళికతో ఉంది. 2024 మరియు 2025 నాటికి వరుసగా 6-సీటర్‌లు మరియు 9-సీటర్‌లను తయారుచేయాలనే ప్రణాళికను MIH కలిగి ఉంది.
ఇది కూడా చదవండి: తిరస్కరించబడిన BYD $1 బిలియన్ భారతదేశ పెట్టుబడి ప్రతిపాదన: అసలు ఏమి జరిగింది
సంక్షిప్తంగా ఫాక్స్ؚకాన్ EVలు
ఫాక్స్ؚకాన్ గ్రూప్ మరియు యూలోన్ గ్రూప్ జతకలిసి ఫాక్స్ؚట్రాన్ బ్రాండ్ؚను ఏర్పాటు చేశాయి, ఇందులో రెండవది ఆటోమోటివ్ డివిజన్. అక్టోబర్ 2022లో ఫాక్స్ؚట్రాన్, మోడల్ B (హ్యాచ్‌బ్యాక్), మోడల్ C (క్రాస్ؚఓవర్ SUV) మరియు మోడల్ V (పిక్అప్) అనే మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్‌లను ఆవిష్కరించింది. వీటి క్లెయిమ్ చేసిన పరిధి గణాంకాలు వరుసగా 450km మరియు 700kmగా ఉన్నాయి. ఈ మూడు EVల ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ؚలను ఫాక్స్ؚట్రాన్ ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఈ స్మార్ట్ؚఫోన్ తయారీదారు తన ప్లాట్ؚఫారం తయారీలో తన నైపుణ్యాన్ని EV-తయారీలో ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఆ విధంగా, భారీ తయారీ సౌలభ్యం కోసం తన సొంత ప్రత్యేక బేస్ ప్లాట్ؚఫారంలు మరియు కాంపొనెంట్ؚలను బహుళ మోడల్‌లలో ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: ఓషన్ ఎక్స్ؚట్రీమ్ విగ్యాన్ ఎడిషన్ؚను 2023 చివరి త్రైమాసికంలో భారతదేశంలో విడుదల చేయనున్న అమెరికన్ EV తయారీదారు ఫిస్కర్
0 out of 0 found this helpful