2015 గ్లోబల్ లెక్చర్ సిరీస్ ను నిర్వహించిన షెల్ లూబ్రికెంట్స్
ఆగష్టు 11, 2015 11:18 am konark ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: షెల్ లూబ్రికెంట్స్, ఫినిషెడ్ లూబ్రికెంట్స్ లో అంతర్జాతీయ లీడర్ అయినటువంటి ఈ సంస్థ ఐఐఎం బెంగుళూర్ వద్ద "ఇండస్ట్రీ & రవాణా లో భవిష్యత్ శక్తి మార్పు కోసం మీరు సిద్ధం " అనే నాల్గవ ఎడిషన్ ని ప్రారంభించింది.
ఈ షెల్ లూబ్రికెంట్స్ గ్లోబల్ లెక్చర్ సిరీస్ యొక్క మొదటిమూడు వెర్షన్లు ఇంపీరియల్ కాలేజ్, లండన్, సింఘా యూనివర్సిటీ, బీజింగ్ మరియు ఐ ఐటి మద్రాస్ లో జరిగాయి. ఈ పరీక్షలు మెకానికల్ జాయింట్ ఎఫర్ట్ యొక్క ఆవశ్యకత, కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి, కొత్త సమీక్ష ఆవిష్కరణలు మరియు గేర్ అభివృద్ది వైపు ఒక బలమైన పద్దతి సర్దుబాటు వంటి అంశాలను తలియజేస్తుంది.
షెల్ లూబ్రికెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ ప్రసాద్ మాట్లాడుతూ " "షెల్ లూబ్రికెంట్స్ నిర్వహిస్తున్న గ్లోబల్ లెక్చర్ సిరీస్, పరిశ్రమలకు మరియు విద్యాసంస్థలకు అంతటా సహకరించడానికి ఏర్పాటు చేసిన ఏకైక వేదిక; ఇది నూతన కల్పనతో మరియు సహకారంతో మా కోర్ ఫిలాసఫీ ద్వారా నడపబడే ఒక యత్నం. ఈ ప్రపంచ ఉపన్యాస సిరీస్ యొక్క ఎడిషన్ ను షెల్ లూబ్రికెంట్స్ ఇండియా యొక్క వార్షిక ఆదాయంగా ప్రారంభించాము. ఈ సంవత్సరం ప్రధానంగా గ్లోబల్ ఎనర్జీ సామర్థ్యం మరియు రోజువారీ ఇంధన సామర్థ్య పద్ధతుల స్వీకరణల మధ్య అనుసంధానాన్ని తెలియజేసే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహించాము. సరైన లూబ్రికెంట్స్ ఎప్పుడూ కూడా ఒక పారిశ్రామిక యూనిట్ కి సామర్థ్యాన్ని మాత్రమే తీసుకుని రావు కానీ మొత్తం పరిశ్రమలో సమయానికి ఉపయోగపడతాయి అని మేము నమ్ముతున్నాము. మా ప్రయత్నంపై పరిశ్రమల యొక్క నిపుణుల నుండి అలాగే విద్యాసంస్థల నుండి వచ్చిన సానుకూల స్పందన చూడటానికి చాలా సంతోషంగా ఉంది అని" ఆయన వాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆటోమోటివ్, పవర్, డెవలప్ మెంట్, మైనింగ్ మరియు భారతదేశం లో పరిశ్రామికవేత్తలయినటువంటి మిస్టర్ పి. పాండా, సీనియర్ విపి (ప్రోడక్ట్ డెవలప్ మెంట్), మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, మిస్టర్ కె.కె గాంధీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (టెక్నికల్), ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్), డాక్టర్ ఎస్ గోమతినాయగం, డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ( ఎన్ ఐ డబ్ల్యూ ఇ), హెడ్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ యొక్క మిస్టర్ రాజేంద్ర పెట్కర్, టాటా మోటార్స్ వంటి నిపుణులను కొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ఆహ్వానించారు.