షెల్ హెలిక్స్ అల్ట్రా జీవి తకాల ఇంజిన్ వారంటీ ప్రోగ్రాం ప్రారంభించిన షెల్ లూబ్రికెంట్స్ ఇండియా
జూన్ 19, 2015 11:42 am arun ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: నేడు 'షెల్ హెలిక్స్ అల్ట్రా జీవితకాల ఇంజిన్ వారంటీ' ని షెల్ కందెనల సంస్థ ప్రారంభించింది. తయారీ సంస్థ వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ఇంజన్ వారంటీ కార్యక్రమం నిర్వహించడం మరియు దాని వారంటీ అప్ టు 15 సంవత్సరాలు/100,000కి.మీ లు ఉండడం విశేషం. గత ఏడాది భారతదేశం లో ప్రారంభించబడిన షెల్ హెలిక్స్ అల్ట్రా మొదటి మోటార్ ఆయిల్ దీనిని సహజ వాయువు నుంచి తయారు చేశారు.
ఈ జీవితకాల ఇంజిన్ వారంటీ -ఇండియన్ నమోదిత కార్లు కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉందిమరియు ఇది ప్యూర్ ప్లస్ టెక్నాలజీ తో షెల్ హెలిక్స్ అల్ట్రా ఉపయోగిస్తున్న వారికి ఇది వర్తిస్తుంది మరియు కందెన సంబంధిత ఇంజిన్ వైఫల్యాలను కవర్ చేస్తుంది. ఇది 5 సంవత్సరాల పరిమిత కాలం వారంటీ షెల్ హెలిక్స్ హెచ్ ఎక్స్7 తో అందిస్తున్నారు. షెల్ యొక్క వెబ్ సైట్లో నమోదు తర్వాత వారంటీ 30 రోజులు లేదా 1000 కి.మీ పరుగుల తరువాత మొదలవుతుంది. ఆయిల్ కొనుగోలు తేదీ నుండి మరియు ఇంజిన్ చమురు మార్పు తేదీ వరకు నమోదు 60 రోజుల లోపు జరుగుతుంది . జీవితకాల ఇంజిన్ వారంటీ 13 ఇంజన్ భాగాలను కవర్ చేస్తుంది.
ఈ ప్రారంభం లో, భారతదేశ షెల్ కందెనల మేనేజింగ్ డైరెక్టర్ అయిన నితిన్ ప్రసాద్ మాట్లాడుతూ, "మేము మా వినియోగదారుల కోసం ఒక జీవితకాల ఇంజిన్ వారంటీ ప్రారంభించటానికి, భారతదేశం లో మొదటి కందెన తయారీదారులు మేము మాత్రమే అని గర్వ పడుతున్నాము. ప్యూర్ ప్లెస్ టెక్నాలజీ తో రూపొందించిన ఈ అల్ట్రా షెల్ హెలిక్స్ ప్రారంభం తర్వాత, మోటార్ ఆయిల్-సంబంధిత ఇంజిన్ వైఫల్యాలను వ్యతిరేకంగా రక్షించేందుకు మా మోటార్ ఆయిల్ యొక్క పనితీరు చాలా విశ్వాసంతో కూడుకున్నదిగా ఉన్నాయి అని చెప్పారు. అంతేకాకుండా, మేము వినియోగదారుల కోసం ఈ వారంటీ ప్రతిపాదన అందిస్తాము. ఈ ప్రతిపాదన వలన మీకు సుఖమైన మరియు ఎలాంటి చింత లేని ప్రయాణం, ఏ అధనపు ఖర్చు లేకుండా అనుమతిస్తుంది. ఈ తదుపరి తరం మోటార్ నూనెలు ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలకు మరియు అభివృద్ధి కై గత 40 సంవత్సరాలుగా కొన్ని మిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. మా మోటార్ ఆయిల్, నేటి ఇంజిన్ల ను శుద్ధీకరణ మరియు రక్షణ ను ఇస్తూ అధిక స్థాయిలో సేవలను అందిస్తుంది. ఈ కార్యక్రమం తో అత్యధిక స్థాయిలో విశ్వసనీయమైన సేవలను అందిస్తూ , వినియోగదారుల సంతృప్తి కోసం అత్యంత విశ్వసనీయ కందెన సరఫరాదారులుగా ఉండటం మా ఉద్దేశం అని వారు వ్యాఖ్యానించారు.
ఫోటో శీర్షిక: షెల్ లూబ్రికెంట్స్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, మన్సి మదన్ త్రిపాఠీ (ఎడమ నుండి కుడికి) మరియు షెల్ లూబ్రికెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, నితిన్ ప్రసాద్ మరియు షెల్ హెలిక్స్ అసోసియేట్ గ్లోబల్ బ్రాండ్ మేనేజర్ షెరోన్ వాన్.